ఆనంద్
ఆనంద్
పందిరి మంచం మల్లెపూవు లతొ అలంకరించి వున్న ది. అక్కడ పంచదార చిలకలు నుంచి సిల్క్ చకొలెట్స్ వరకు అమర్చి వున్నయీ...కానీ వరుడు ముఖం లొ ఉండాల్సిన ఆనందము లేదు.. నిన్నటి మరదలు నేటి తన భార్య అయిన అమృత తనను వదిలి వెళ్ళింది..దానికి కారణం గురించి గతంలో వెళ్ళేడు...అందమైన అమృత ముఖం లో తొలి రాత్రి అమ్మాయి లో ఉండే సిగ్గు లేదు.. ఒక విధమైన అసహనం కనిపించాయి . గది లో ఉన్న వరుడు ఆనంద్ ను చూసి ఒక నిట్టూర్పు విడిచి ...
బావ "నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు.చివరి క్షణం లలో ఉన్న నాన్నా గారి కోరిక మేరకే నేను ఈ పెళ్ళి లో తప్పనిసరి అయి నువు తాళి బొట్టు కడుతుంటే ఏమి చేయాలో నాకు తెలియని పరిస్థితిలో ఉన్నను"...హాస్పిటల్ లలో జరిగిన ఈ పెళ్ళి కి నేను ఎటువంటి విలువ ఇవ్వను...
ఆనంద్...మనసు లోపల బాధ పడుతున్న ఆ విషయం కనిపించకూండా...అమృత.. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నాకు తెలుసు కానీ.. దానికి కారణం తెలుసుకోవలని ఉంది.. నన్ను వద్దు అనడానికి నా మీద నీ అభిప్రాయం ఏమిటి... అని అడిగాడు.
బావ... " నా దృష్టిలో నువ్వు ఒక మామూలు మనిషి వి కానీ నాకు నా జీవిత భాగస్వామి పై ఒక అభిప్రాయం ఉంది ...దానికి నువ్వు ఏ విధంగానూ సరిపోవు.."నాకు నీ రూపం, నీ వృత్తి అన్న ఇష్టం లేదు. నువ్వు ఈ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ స్థిరపడాలని అనుకుంటునావు...నా అందం నికి, చదువు కి...నువ్వు సరి తగువు.. నాకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. నేను అమెరికా వెల్లడం నా కెరీర్ కి అవసరం.
పైగా నాకు ఈ పెళ్ళి అన్న, ఈ తాళి అన్న ఇష్టం లేదు..పైగా ఇది నువ్వు కట్టి నందున ఇంకా అసహ్యం
గా ఉంది... అని తాళి నీ తీసి మంచం మీద కి విసిరి వెళ్ళి పోయింది.. పెళ్లి కూతురు అమృత.
బయట నుండి వినబడే మాటలు కి గది నుండి బయటకు వచ్చడు ఆనంద్.
అక్కడ హాల్ లో బ్యాగ్ తీసుకుని వెళ్లూతున్న
అమృత ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న కస్తూరి గారి ను చూసి తాళి ని తీసుకుని నిశ్శబ్దం గా బయట కి వెళ్ళిపోయాడు ఆనంద్.
అమృత ..అని గట్టిగా అరిచింది కస్తూరి గారు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా, మీ నాన్నగారు నిర్ణయానికి విలువ లేదా...
అమ్మ మీరు చెప్పింది నేను విన్నది ఇంక చాలు నా జీవితాన్ని నేను చూసుకుంటాను ,బావ ని పెళ్లి చేసుకుని ఈ ఊర్లో ఉండాలని అనుకోవట్లేదు నేను....నాకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది అది నేను కోల్పోవాలి అనుకోవట్లేదు... అయినా బావ ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను నన్ను బలవంతం చేసి పెళ్లి చేశారు.
అమెరికా వెళ్లడం నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమృత.
అక్కడ హాల్ లో తగిలించి ఉన్న ఫోటో లో ఉన్న చక్రధర్ గారిని చూసి బాధ పడుతూ, కన్నీటి కారుస్తూ
అలా నేల పై కూర్చుండిపోయింది. ఏడుస్తూన్న తల్లి ని , వేళ్లుతున్న అక్క ని అల చూస్తుండిపోయారు అరుణ్ మరియు అన్విత.
గది నుంచి బయటకు వచ్చిన ఆనంద్ తిన్నగా తన పొలములో ని తన పొదరింటి కి చేరుకున్నాడు.
అమృత ఆ ఇంటి నుంచి అన్ని బంధంలు,భాధ్యత లను వదులకుని తన జీవితాన్ని సరికొత్త గా అస్వాదించడానికి, , భూతల స్వర్గాన్ని కోరుకుంటూ బయలుదేరింది
**************
అది ఒక చిన్న టౌన్ కి పల్లెటూరి కి మధ్యస్థంగా ఉండే ఊరు, ఊరి పేరు రాఘవాపురం ఆ ఊరిలో గౌరవమైన వ్యక్తి చక్రధర్ గారు, ఆయన భార్య కస్తూరి గారు, వాళ్ళకి ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి పేరు అమృత తర్వాత ఇద్దరూ ట్విన్స్ పాప ,బాబు అరుణ్ మరియు అన్విత.
చక్రధర్ గారి అక్క కళ్యాణి గారు. కళ్యాణి గారి కొడుకే ఆనంద్, ఆనంద్ తల్లిదండ్రులు ఆనంద్కి 15 సంవత్సరాల వయసులోనే ఒక ప్రమాదంలో మరణించడం వలన చక్రధర్ గారు ఆనంద్ నీ ఇంటికి తీసుకొస్తారు. కళ్యాణి గారిది ప్రేమ వివాహం కావడం వలన అత్తింటి వారు సహాయం లేకపోవడం వలన ఆనంద్ బాధ్యత చక్రధర్ గారు తీసుకుంటారు .ఆనంద్ నాన్న గారైన చక్రవర్తి గారు కొన్ని ఆస్తులు సంపాదించడం వలన అవన్నీ ఆ ఊర్లో నే అమ్మేసి రాఘవాపురం చుట్టుపక్కల పొలం కొన్నారు ఆనంద్ పేరు మీద.
అలా చక్రధర్ గారింట్లో ఆనంద్ , అమృత అరుణ్ మరియు అన్విత కలిసి ఉండేవారు .ఆనంద్ కి అమృత కి రెండు సంవత్సరాలు తేడా, అలాగే అమృత కి, ట్విన్స్ కి ఆరు సంవత్సరాల తేడా......
ఆనంద్ తల్లిదండ్రులకి జరిగిన ప్రమాదంలో ఆనంద్ కూడా గాయపడ్డారు, ముఖం పై చిన్న గాయం ఏర్పడి అక్కడ నల్లగా మచ్చగా ఏర్పడింది.కాని ఆ చందమామ కి మచ్చ కూడా ఒక అందమే....
అమృతా కి చిన్నప్పటినుంచి అందగత్తెనని తెలివైన దానిని అని ఒక నమ్మకం.
***************
ఆనంద్ కి చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే ఇష్టం , దానికి తగినట్టు గా M.sc Agriculture చేసాడు .ఇంకా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మరియు సేంద్రియ వ్యవసాయం గూర్చి రీసెర్చ్ చేస్తున్నాడు.
అమృత బిటెక్ కంప్లీట్ చేసి బెంగళూరులో లో జాబ్ చేస్తుంది, ఇంకా అరుణ్ మరియు అన్విత ఇంటర్ కంప్లీట్ చేశారు. అనుకోకుండా ఒక రోజు చక్రధర్ గారికి గుండెపోటు రావడం వల్ల హాస్పిటల్లో " " రేయ్ ఆనందు నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో మీ అత్తకి ఏమీ తెలియదు ,అమృతా ని పెళ్లి చేసుకుని నా కుటుంబానికి తోడుగా ఉండు" అని మాట తీసుకున్నాడు. అలా అందరి సమక్షంలో హాస్పిటల్లో ఆనంద్ చేత తాళి కట్టించారు.. ఆ సమయంలో ఆ విషయంలో కాదు, వద్దు అని గట్టిగా అరిచి చెప్పలేక ఇష్టం లేక పోయినా మౌనంగా ఉండి పోయింది అమృత....
చక్రధర్ గారు చనిపోయాక ,వెంటనే బెంగళూరు వెళ్ళిపోయిన అమృత మర్ల మూడు నెలల తర్వాత కొన్ని సర్టిఫికెట్స్ అవసరమయ్యే తిరిగి రాఘవాపురం వచ్చింది మళ్లీ తిరిగి ఈ సంబంధాల అన్నీ వదులుకొని వెళ్ళిపోయింది .
మూడు నెలల తర్వాత
ఆనంద్ అప్పటి నుంచి పొలంలోనే ఉండిపోయాడు. చక్రధర్ గారు గారు ఉన్నప్పుడే అక్కడ ఒక చిన్న పొదరింటి ని కట్టుకున్నాడు. ఒక పనిమీద స్నేహితుడి ని కలవడానికి స్కూల్ కి వచ్చిన ఆనంద్ కి అక్కడ అరుణ్ మరియు అన్విత నడుచుకుంటూ వస్తూ కనిపించారు.
ఓయ్ ! అరుణ్ మీరేంటి ఇక్కడ అని కంగారు గా వెళ్ళి అడుగుబొతుండ ,అన్విత , అరుణ్ చేయి పట్టుకుని తొందరగా స్కూలు నుంచి బయటకు వెళ్లిపొతారు . అంతలో ఆనంద్ స్నేహితుడైన వేణు అక్కడికి రాగానే.. ఆనంద్ ఇలా అడుగుతాడు, ఒరేయ్ వేణు ,ఇక్కడ స్కూల్ లో అరుణ్ ,అన్వితా ఉన్నారు ఏమిటి ?? ఇక్కడ ఎందుకు ఉన్నారు ! వేణు ఈ స్కూల్లో అరుణ్ కి పనేమిటి ..??ఏమైనా పని మీద వచ్చారా అని అడగగా లేదురా
ఈ విషయం నీకు చెప్పాలనే పిలిపించాను అన్విత ఇక్కడ కరాటే టీచర్ కింద పనిచేస్తుంది ,మరియు అరుణ్ ప్లే స్కూల్ టీచర్ గా చేస్తున్నాడు. వేణు ఆ స్కూల్లో నే టీచర్ గా వర్క్ చేస్తున్నడు.ఈ విషయాం తెలియగనే బాధ పడుతూ ఆనంద్ అక్కడ నుంచి తిరిగి పొలానికి వెళ్లి పోయాడు.
వెనకాలే వేణు కూడా పొలానికి చేరుకుని ఆనంద్ ని ఓదార్చి, జరిగిందేదో జరిగిపోయింది ,ఇప్పుడు బాధపడితే ఏం లాభం అరుణ్ మరియు అన్విత కి మంచి భవిష్యత్తు ఉన్నది ,చక్రధర్ అంకుల్ నిన్ను నమ్మి తను తన కుటుంబ బాధ్యత నీకు అప్పజెప్పారు అని గుర్తుచేశాడు.
ఆనంద్ కి తన కళ్ళ ముందు ఒక్కసారిగా వల మావయ్య అయినా చక్రధర్ గారికి ఇచ్చిన మాట గుర్తొచ్చి మనసంతా బాధ తో నిండిపోయింది .ఒక్కసారిగా తల విదుల్చుకొని అమృత నన్ను వదిలి వెళ్లిందని , నన్ను చాత కాని వాడు ,దద్దమ్మ, తొలి రాత్రె భార్య వదిలి వెళ్లిపోయిందని అందరూ అనుకుంటుంటే నేను ఇక్కడే ఉండి పోయాను .... అంతేగాని నేను మావయ్య కి ఇచ్చిన మాట తప్పు తానని ఎలా అనుకున్నావ్ రా , ఇప్పుడే నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను, అని ఫ్రెష్ అయ్యి తన బుల్లెట్ మీద ,వేణు తో కలసి అత్తయ్య ఇంటికి చేరుకున్నాడు.
ఇంటి లోపల హాల్లో బాధపడతా కూర్చున్నారు కస్తూరి గారు ,చక్రధర్ గారు చనిపోయీ ఆరు నెలలు అయింది, అమృత వెళ్లి మూడు నెలలు అయింది ,కాలం గడుస్తున్న ఆ ఇంట్లో నిశ్శబ్దం, బాధ మాత్రం పోవడం లేదు ...
అరుణ్ అరుణ్ అని పిలుస్తూండగా అన్విత వచ్చి "ఏంటి బావా దారితప్పి వచ్చావు మా నాన్న మమ్మలని వదిలి వెళ్ళిపోయారు ,అలాగే అక్క కూడా అని, నువ్వు కూడా ఇక రావేమో అనుకున్నా" అని అనగా ఆ ఇంట్లో లో తన గదికి వెళ్ళిపోయాడు ఆనంద్. ఇంతలో వేణు ఎందుకు అన్విత అల మాట్లాడుతున్నావ్ వాడు బాధలో ఉన్నాడు అని నీకు తెలుసు కదా అనగ ఓహో ! మా బావకి నేమో బాధ మాకు ఉండదు ,మా అమ్మకు ఉండదు అని గదిలోకి వెళ్ళిపోయింది అన్విత.
వేణు ..అరుణ్ ని పిలిచి
అరుణ్ నీకు ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది కదా మరియు అన్వితా కి నీట్లో (neet) లో వచ్చిన ర్యాంకు కి ఇక్కడ దగ్గర లోని యూనివర్సిటీ లో
సీటు వస్తుతుంది కదా అని ప్రశ్నించగా అందుకుగాను అరుణ్ ఫ్రీ సీట్ వస్తుందా! అని కాదు ,మా ఇద్దరికీ ఫ్రీ సీట్ వచ్చింది కానీ ఫ్రీ సీట్ వస్తే సరిపోదు దానికి ఫీజు పే చేయాలి నాది మరియు అన్వితా ది కాలేజీ అడ్మిషన్ ఫీజ్ మరియు బుక్స్ కి ఇంకా యాన్యువల్ ఫీజు కాను ను 10 లక్షలు కట్టాలి ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు కి ఎంత ఖర్చవుతుంది చెప్పలేం ప్రస్తుతం ఇప్పుడు అంతా ఎందుకని స్కూల్లో నేను చిన్న టీచర్ గా, అన్విత కరాటే టీచర్ గా వర్క్ చేస్తున్నాము.ఇలా మాటలు కొనసాగుతుండగా
కస్తూరి గారు అలా నిర్లిప్తంగా కూర్చున్నారే గాని నోట్లోంచి ఒక్క మాట అయినా రావడం లేదు, అమృత వెళ్లినప్పటి నుంచి అలా మౌనంగానే ఉండిపోయారు .ఇదంతా గది నుంచి విన్న ఆనంద్ ఒక నిర్ణయానికి వచ్చాడు. తర్వాత రోజు ఆనంద్.. అన్విత ని మరియు అరుణ్ ని ఫ్రెష్ గా తయారవమని చెప్పి తమ జీపులో అక్కడికి ఒక 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న యూనివర్సిటీ కి తీసుకెళ్లి ఇంజనీరింగ్ విభాగంలో అరుణ్ కి మరియు మెడికల్ విభాగంలో అన్విత కి అడ్మిషన్ తీసుకొని ఫీజు వివరాలు కనుక్కుని తీసుకుని ఫీజు కట్టడానికి వారం రోజులు గడువు తీసుకుని వాళ్ల ని తీసుకుని పక్కనే ఉన్న షాపింగ్ కి వెళ్లి వాళ్లకు కావాల్సింది కొని సూపర్ యమ్మీ లంచ్ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు.
ఒక వారం తర్వాత ఆనంద్ తన పొలం తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి అరుణ్ మరియు అన్విత కి ఫీజు కట్టి జాయిన్ చేశాడు. ఇద్దరు రోజు అప్ అండ్ డౌన్ చేస్తామన్న , వాళ్ల చదువు డిస్టృబ్
అవుతంది అని అక్కడ హాస్టల్ లో ఇద్దర్నీ జాయిన్ చేశాడు .
ఇక్కడ రాఘవాపురం లో కస్తూరి గారి కి తోడుగా ఒక ఆమే ను నుంచి తను కూడా కస్తూరి గారి తోపాటు అక్కడే ఉండి వ్యవసాయం చూసుకొసాగడు.
నాలుగు సంవత్సరాల తర్వాత
కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నయి , చిన్న పిల్లలుని చిన్ని కృష్ణుయ్యల, బుల్లి రాధ లా, తయారు చేయడం వలన ఆ వేడుకలు మరింత కన్నులపండుగ గా వున్నయి.
అన్విత... అన్విత ...అనే అరుపులు ఆ కేరింతలు మధ్య అతని చెవులు కు చేరి అటూ వైపు తన దృష్టి ని సారించాడు.
కృష్ణాష్టమి సందర్భంగా అక్కడ ఉట్టి ని ఏర్పాటు చేశారు, ఉట్టి ని అందుకోవడానికి అన్విత అప్పటికే రెండు సార్లు ప్రయత్నించిన అందకపోవడం వల్ల ...అక్కడ దూరంగా కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటులు ను ప్రెసిడెంట్ హోదా లో చూస్తూన్న ఉన్న తన బావ ఆనంద్ ను చూసి ఒక చిరునవ్వుతో మరింత ఏకాగ్రతతో ఈసారి గురి తప్పకుండా ఉట్టి ని కొట్టింది అన్విత.
(ఇంకా వుంది)
*****************
..

