parimala seshu

Drama Romance Fantasy

4  

parimala seshu

Drama Romance Fantasy

ఆమ్రపాలి పార్ట్ 2.

ఆమ్రపాలి పార్ట్ 2.

4 mins
259


        ముందు భాగాలు చదవండి


   (గతం తులసి మాటల్లో ).


"ఇంట్లోకి వచ్చిన ఆ అమ్మాయి అమ్మ బాబోయ్ వీడుఎవడు ఇలా తగిలాడు.నాకెందుకులే పిచ్చి వాగుడు.నాన్నకి పనికి టైం అవుతుంది."


"గబగబా గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చి స్నానం చేసిపూజ చేసి టిఫిన్ రెడీ చేసేటప్పటికి సమయం 6.30.నాన్నను లేపించాలి కదా."


"వంటింట్లోనుండే అరుస్తూ నాన్న నాన్న పనికి పోవాలిలెగావా."


"ఏటే ఎదవ గోల పొద్దున్నే సీ బతుక్కి సుఖం నేకుండాపోయినాది.ఆడేమో రాత్రి డ్యూటీ సెయ్యాలి.నిద్రఉండదు. ఇక్కడ పొద్దుగాల డ్యూటీ ఎదవ బతుకు.ఆ ఆ వత్తున్న తల్లి బేగా తానం సేసి వచ్చేత్తా."

****-*****


"మొబైల్ రింగ్ అవ్వడంతో గతం నుండి ప్రస్తుతంలోకివచ్చింది తులసి."హలో ఎవరు.


"అమ్మా తులసి నేనే మందులు ఏసుకున్నావా జాగ్రత్తగా పడుకో ఏటి ఆలోసించకు సంటిదాన్ని సూసిడబ్బులు ఏటైనా కావాలేమో అడిగి బేగా వత్తాను."


"సరే అక్కా వేసుకున్న చంటిది జాగ్రత్త.ఎలా ఉందో

ఎప్పుడు వస్తుందో కనుక్కో అడిగానని చెప్పు. నువ్వుత్వరగా వచ్చేయి'


"హ హ పాపని సుసేసి వచ్చేత ఉంటా తులసి. ఫోన్ పెట్టేసి బస్సు కుదుపులకు పడుకుంది పారిజాతం."


"తులసి దిండు కిందన దాచిన ఫోటో తీసి ఏడుస్తూముద్దాడి అలాగే పడుకుంది.


తెల్లవారుజామున బస్సు ఆర్టీసి కాంప్లెక్స్ చేరుకుని.వైజాగ్ వచ్చేసింది ఇదే ఆఖరి స్టాప్ దిగాలి దిగాలి.బస్సు కండక్టర్ అరుస్తూ.


ఆ అరుపులకి పారిజాతంకి మెలకువ వచ్చి చీర

సవరించుకునిబ్యాగ్ తోదిగింది.నేరుగా ఆటోస్టాండ్ కి వెళ్లి **** కాలేజీ కి పోనీ బాబు.


అరగంట లో కాలేజీ ఎదురుగా ఆటో దిగి డబ్బులు.ఇచ్చేసి లోనికి వెళ్తూ అబ్బా పెద్ద కాలేజీ నా సిట్టి తల్లిఏడ ఉందో సూడాల.


అటుగా వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలని పిలిచి ఇదుగోపాప తృష్ణ ఏడ ఉంటాదో సెప్పవా.


మీరు ఎవరు ప్రశ్నిస్తూ ఓ అమ్మాయి. వాటం చూస్తే

పల్లెటూరు ఆవిడాలాగా ఉందే.ఈ కాలేజీ లో నీకేం

పని.


ఆ పల్లెటూరు అయితే కాలేజీ కి రాకూడదా పట్నం.

వోళ్ళు తీర్మానించారా.నా కూతురు సదువుతుంది.

ఇక్కడ.


తలమీద ఒక్కటి కొడుతూ ప్రత్యక్షం అయ్యిందో ఓ అమ్మాయి.ఏమే పేరు చెప్పి అడ్రెస్స్ అడిగితే తెలుసాతెలియదా అని చెప్పాలి అంతేగాని రోడ్ మీదనే నీపంచాయతీ ఏంటే.


అడుగు సంటితల్లి అట్టా అడుగు పట్నం పిల్ల గిల గిలలాడాలా ఏటి సంచి ఒట్టుకో.


పెద్దమ్మ నువ్వు కూడానునాకోసారి ఫోన్ చేసి రావచ్చుకదా.దిగాక అయినా చేయాల్సింది పద రూంలోకివెళ్లిమాట్లాడుదాం.


ఏయ్ పట్నం పిల్ల ఎట్టుంది నా పాప జవాబు ఇన్నావు గా పో పో సుసావు గాని.


ఇప్పుడు చెప్పు పెద్దమ్మ సడన్ గా వచ్చావేంటి .నేనేంచిన్న పిల్లనా చెప్పు అమ్మ ఎలా ఉంది.


సిన్న పిల్లవే నువ్వు పెద్ద పెద్ద సదువులు సదివేత్తే

కూతురు పెద్దదై పోద్దెటి.


కాఫీ కలుపుతూ అలా కాదు ఈ ఏడాదితో చదువు

అయిపోతోందిగా.కొన్నిరోజులులో సెలవులు వస్తాయినేనే వద్దును కదా.పూర్తిగా మీ దగ్గరే ఉండచ్చు.ఎంచక్కా చేతిని గట్టిగా పట్టుకుంటూ.


తాగుతున్న కాఫీ వదిలేసి ఏటి సదువు అయిపోద్దా.ఇంకా సానా సదువు ఉంది కదమ్మి. అయ్యేటో డిగిరిలు బొగిరిలు సేస్తారు కదేటి. పాప అప్పుడే అయిపోనాది అంతావేటి. కాస్త కంగారుగా.ఇంటికివచ్చేత్తనంటా వేటి.


అయ్యో పెద్దమ్మ ఇప్పుడు నేను చదివేది పీజీ రెండోసంవత్సరం ఎంచుకున్న చదువు అయిపోయినట్టే.చిన్నపుడు నుండి హాస్టల్ లోనే చదివాను. ఎప్పుడూఇంటికి తీసుకొని పోలేదు. అమ్మ నువ్వు వచ్చేవారు.కంగారు ఎందుకు వేడి చల్లారిపోతుంది తాగు.


మనసులోఅక్కడ కోచ్చేత్తే ఇంకేటైనా ఉందా నా గుట్టుబండారం బయట పడిపోద్ధి అమ్మో ఎమ్మటనే ఏదోసెప్పి ఆపించేయాలా.అది కాదు పాప ఇంత సదువు 

సదివాకా ఉద్యోగం సెయ్యవేటి సెప్పు.


అబ్బా చేస్తాలే అయినా నీ దగ్గర అమ్మ దగ్గర ఉండాలి.ఎప్పుడూ తీసుకొని వెళ్లేవారు కాదు.పిన్ని ఎలా ఉంది.నాకేం తెచ్చావు సంచి సవరిస్తూ.


ఇదేటి పట్టిన పట్టు ఇడవకుండా ఉంది పాప.. ఇప్పుడుఏటైనా సెప్తే ఎందుకు ఏటి పశ్నలు వేత్తాది.నవ్వుతూఅట్టాగే పాప. బొడ్లో దోపిన చిక్కంలో డబ్బులు తీసితీసుకో పీజు కట్టాల కదా.


వద్దు పెద్దమ్మ ఉన్నాయిలే.ఎక్కువ ఖర్చులు ఉండవు.అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది మందులు వేసుకుంటోన్దాసమయానికి.అమ్మకి ఏదైనా అయితే నా పరిస్థితి.


బాగుంది పాప బెంగయితోందా అమ్మ మీద.ఏటి కాదుఅమ్మకి మేమంతా లేమా ఏటి.సిన్న పిల్లవి పెద్ద పెద్ద మాటలు ఆడకు సెప్తున్నా ఏటైతది అమ్మకి ఇగో.డబ్బులు ఉంచుకో సిన్న పనుంది బజార్ దాకా వెళ్తా.


స్నానం చేసి పరసులో అడ్రెస్స్ కాగితం ప్రకారం ఆటోబేరమాడుకుని గంటలో చేరింది. ఫోన్ తీసి మిమ్మల్నికలవాలి ఒక్కటే మాట.


అటునుండి ఎప్పుడు వచ్చావు ఒక్క పది నిముషాలు ఎప్పుడూ కలిసే చోటు ఇంటి వెనక్కి వేచి ఉండు.

కాల్ మాట్లాడి కార్ తీసుకొని గాబరాగా వెళ్లాడా వ్యక్తి.


విశాఖపట్నంకి కొంచం దూరంగా గంగవరం పోర్ట్ కి

దగ్గరగా ఆగిందో కార్.దిగి చేతికర్రను పట్టుకొని దిగాడు ఓ 50 ఏళ్ళవ్యక్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ.


ఆటో దిగి వ్యక్తి కోసమే ఎదురు చూస్తూ రాడంతోనే

బాబుగారు ఎలా ఉన్నారు.ఆరోగ్యం ఎలా ఉంది.


చెప్పు ఇంత అర్జెంటు గా వచ్చావేంటి పారిజాతం.

పర్వాలేదు బానే ఉన్నాడు చెల్లమ్మ ఎలా ఉంది.

ఆరోగ్యం ఏమైనా కుదుటపడిందా.


దాచేది ఏటి నేదు మీ కాడ పవిట కప్పుకుంటూ. అటుగా తిరిగి ఒళ్ళు అమ్ముకునే వెధవ బతుకలు మావి.పక్కలో పడుకోడం సంపాదించే డబ్బుతోనే

మా జీవితం గడుస్తుంది.


చురుక్కుమని కళ్ళజోడుసవరించుకుంటూ చూసాడు.జేబులోడబ్బులు తీసి ఇస్తూ సరిపోతుందా కావాలంటేఇంకా అడుగు ఇస్తాను.


అస్తమాను డబ్బుకి దేవుళ్లాడ్డం మిమ్మల్ని అడగడం.నాకేటో బానేదు సారు కానీ తప్పటం నేదు. ఏటోతులసి ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంది.దిగలుగాఉంటది బ్రతుకు మీద ఆశ నేదు బాబు కూతురు.కోసమే బాబు గారి కోసమే పేనాలు ఎట్టుకుంది.డబ్బులు తీసుకుంటూ చిక్కంలో దోపుకుని.


పాప ఎలా ఉంది బాగా చదువుతోందా.బహుశా ఇదేఆఖరి ఏడాది కదా చదువుకి.


బుర్ర గోక్కుంటూ ఆ ఆ అదే సెప్పినాది బాబు.ఒకటేగోల ఎడతాంది ఇంటికి వచ్చేత్తా నని. ఇప్పడికి ఏదోసెప్పినాను అయ్యేటి వినటం నేదు.


మరేంఆలోచించావ్ పారిజాతం మరోఉపాయం కూడాలేదేమో ఏది ఏమైనా పాపను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఒప్పుకోను నేను ఏమంటావు సూటిగా.


అయ్యో అయ్యగారు నేనెలా తీసుకొని ఎలతాను.

ఏదో సిన్న కొంప అది వచ్చే పోయే మగాళ్లతో ఉంటది.తులసి ఒక్కతే ఏరే గదిలో ఉంచినాను మీకు ఎరికేకదా.


నేను ఆలోచించి కబురు పెడతానునన్ను అడగకుండానిర్ణయం తీసుకోకు.


అయ్యా ఎంత మాట ఇప్పటి దాకా మీరు సెప్పినదే

సేసిన.తులసి ని పెద్ద డాక్టర్ గోరు దగ్గరికి తీసుకొని

పోవాలా సూడ్డానికి వత్తారా బాబు.


అప్పుడు ఫోన్ చెయ్యి వీలుంటే తప్పకుండా వస్తా.

పాప ని చూడాలి ఒక్కసారి కాలేజీ కి వెళ్తాను. కార్

లో నేరుగా కాలేజీ కి వెళ్తూ.


అదే ఆటోలో కాలేజీ కి వెళ్లి అలసిపోవడంతో నిద్ర

పోయింది పారిజాతం.తృష్ణ రూంలోనే చదువుతూ

మధ్యాహ్నం అవడంతో పెద్దమ్మ పెద్దమ్మ లే భోజనంచేద్దువు.


ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ముగించి. ఆ పెద్దమ్మఎప్పుడూ ఎందుకు మనం ఒకే ఊరిలో ఉండము.వేరే వేరే ఊర్లలో తిరుగుతాం ఎందుకని.


గతుక్కుమని అమ్మో ఏటి సెప్పాలా ఆ ఆ అదా పనిఏ ఊర్లో ఉంటే ఆడికి పోతాము. కూలి పని ఏడదొరికితే ఆడికి పోవాలి.పాప ఇయన్ని ఆలోసించకు.బాగా సదువుకోవాలా పెద్ద ఉద్యోగం సెయ్యాలా.


సరే పెద్దమ్మ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తా. నిన్ను అమ్మని పిన్నిని బాగా చూసుకుంటా.


అట్టా ఉండాలా నా పాప పోయి రేతిరికి మనూరుకి

బస్సు కనుక్కో పోయి అమ్మ ఒక్కతే ఉంది ఎల్లాల.


వెళ్లడం ఎందుకు ఫోన్ లోనే బుక్ చేసేస్తా పెద్దాపురం.


పంకజాక్షి అలసిన శరీరంతో కనులు భారమై ఇంటికిచేరుతు వరాలు ఉరేయ్ వరాలు వేడి నీళ్లు పెట్టరా.ఒళ్ళు హునం అయిపోయింది.

{ఇంకా ఉంది}.

చదివి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ 🙏🏻.




Rate this content
Log in

Similar telugu story from Drama