parimala seshu

Drama Romance Fantasy

4  

parimala seshu

Drama Romance Fantasy

ఆమ్రపాలి పార్ట్ 1

ఆమ్రపాలి పార్ట్ 1

4 mins
234


కథ కల్పితం పాత్రలు కల్పించి రాస్తున్నాను దయచేసి

గమనించగలరు 🙏🏻).


ఊరంతా మాటు మణిగి నిదురించేవేళ.నగరం అంతాస్తంభించిజనాలు కనుమరుగయ్యే.

నిశిరాత్రిలో తలుపులు తెరుచుకుంటాయి.


ఆ ఇంటిగుమ్మంలో అడుగు పెట్టినంతనే నాసికా పుటాలు గుమ్మనిపించే గులాబీ మల్లే సంపెంగ కలగలిపిన అత్తరు సువాసన లేత రంగుల కర్టెన్లు చల్లగా హాయిగా సాగిపోయే సాఖీ పాటలు రారమ్మని పిలుస్తాయి.


నూనుగుమీసాలు వయసున్నకుర్రాడునుండి నుండి.పళ్ళుఊడిపోయే ముసలాడినైనా కంటి చూపులు నుండి తిప్పుకోనియకుండా కట్టిపడేసే ఒడుపు నేర్పు. కలబోసిన జానతనం అతివలు విరిసిన పూతోట..


తాగుతూ ఊగుతూ చేతిలో సీసాను పట్టుకొని. పట్టులాల్చి తొడుక్కుని మరోచేతికి మల్లెలు దండిగా కట్టుకుని వడి వడిగా నడుచుకొస్తున్న.

ఆసామిని మొరటుగా ఆపేసాడు వరాలయ్య.


ఏందిబే లా... కొడకా నన్నే ఆపుతావా నేనెవరో ఎవరో తెలుసానీకు.సీసాలో మందు తాగుతూ జేబులోగోల్డ్ ఫ్లేక్ సిగరెట్ తీసి కాలస్తూ గుప్పుమని పొగను ఊదాడు మొహం మీద.


జబ్బల బనీను గళ్ళలుంగీ కట్టుకొని చేతిలో గంటల కర్ర ఒకదాన్ని పట్టుకొని నిల్చున్న వరాలు తెలుసు.ఇప్పుడే పోయందుకు అనుమతి లేదు.ఆడ పోయి నిల్సో.


ఏందిరా నిల్సోవాలా నేనిచ్చే డబ్బు లేకుంటే నీకు.

ఆ సానిము..... డకు తిండి ఉండదు.నన్నే నిల్చో

అంటావా.


లోపల నుండి వరాలయ్య ఎవర్రా అది కేకలు ఏంటి.అంటూ బయట కొచ్చింది పారిజాతం ఎదురుగా.చూసి అయ్యా అయ్యా మీరా రండి రండి.


ఉరేయ్ గుడ్డి వెధవ ఎవరనుకున్నావురా మనకింత తిండి పెట్టే నర్సాపురం నర్సయ్య నాయుడు గారు.


అయ్యా అయ్యా రండి లోనికి జవ్వాజి కలిపిన అత్తరుచల్లి చేతికి పక్కనే వెండి గిన్నెలో ఉన్న మంచి గంధం.రాస్తే చల్లబడతారు.ఏంటి బావగారు కోపం ఎందుకు.ఆడికి తెలియదు నాకోసం వగ్గేయకూడదా కన్ను.గీటుతూ.మల్లెల్లు పరచిన మంచంపై కూర్చో పెడుతూతినండి ఆత్రేయపురం పూతరేకులు మీకోసమే.


అబ్బా నీ పెదాలే పూతరేకులు లాగా ఉంటాయే.

ఒడుపుగా లాగి కాళ్ళతో తలుపులు వేసేసి పవిట

లాగేసి ఆక్రమించుకుని ఆడతనంతో సయ్యాటాడి.

మగతనాన్ని చూపిస్తూ గంట తర్వాత జాకెట్లో నోట్ల కట్టలు కుక్కేసి వెళ్ళిపోతూ.ఏమే పారిజాతం.

సుఖాలకు సిరునామా నువ్వేనే ఎంతయిచ్చిన ఏటి తక్కువే వెళ్తా మరి.


బట్టలు సద్దుకుంటూ అబ్బా ఒళ్ళు హూనం చేసాడు.మొరటు సరసం రసికత తెలియని మొరటోడు.


వరాలు వరాలు ఎక్కడ ఉన్నవురా.ఇదిగో డబ్బులు తీసుకొని మందులు బేగా పట్టుకునిరా సానా ఖరీదు.బేగా వచ్చేయ్.


అమ్మ సిటీ ఇవ్వేనేదు ఎట్టా తెచ్చేది.సుట్టముక్క కోసండబ్బులు నశిగాడు.


ఓరి వెధవ కొత్తగా అడుగుతావేంట్రా ఎప్పుడూ

తీసుకుంటావుగా బేగా వచ్చేయాలి.తలుపులు వేసివెళ్ళు.


గబ గబ లోనికి వెళ్లి స్నానము చేసి వేరే చీర మార్చుకువచ్చి వంట గదిలోకి వెళ్లి పళ్ళ రసం పిండి తీసుకొనివచ్చింది.


పక్కన బల్ల మీద గ్లాస్ పెట్టి వేరొక గది తలుపు తీసి.పళ్ళ రసం గ్లాస్ ఒక చేత్తో పట్టుకొని.తులసి తులసి లేమ్మా కొంచం తాగు నీరసం తగ్గుతుంది.


జబ్బు ఒళ్ళు కళ్ల కింద చారాలు ఖళ్ళు ఖళ్ళు దగ్గుతూపాలిపోయిన మోహం నీరస స్వరంతో. హు ఎందుకుఅక్క.నా పై ఇంత ప్రేమ నీకేం ఏమవుతానని.జబ్బు దాన్నిబతికిస్తున్నావు.నేడో రేపో ఆరిపోయే దీపాన్ని.నీకు ఎందుకు ప్రయాస చెప్పు.మెల్లగా మంచం మీద లేచి కూర్చుంటూ వీపు గోడకు ఆనుకొని.


కోపంతో పారిజాతం అయ్యిందా మిట్ట యేదాంతం ఇంకేం మాట్లాడకుండాతాగేసి యేదాంతాలు.

వల్లే యేసుకో.అయ్యి ఇనేందుకు సమయం లేదులేనా కాడ.పోయినే పోయి సంటిదాన్ని సూడాల.ఎట్టాఉన్నదో తింటాందో నేదో.సూసి వచ్చేత జాగ్రత్త తలనిమురుతూ.


అక్కా ఏడుస్తూ నేనంటే ఇంత అభిమానం ఎందుకు.కొడిగట్టి పోయే దీపానికి ఆరోగ్యం అనే ఒత్తువేస్తేబ్రతుకుతానా చెప్పు.చచ్చిపోవాల్సిందేగా నా జబ్బుకి.


చివ్వున కళ్ళలో నీళ్లు తిరిగి నోరుమూసుకుని ఉండు.తులసిఎక్కువ మాట్లాడకు.నా సాయ శక్తుల నినుబ్రతికించుతుంటాను.మొహనికి పౌడర్ బాగా పట్టించి కళ్ళకు ఎక్కువగా కాటుక పెట్టి రిబ్బన్ తోజడని.అరటిపండులా కట్టి పల్లెటూరు చీర కట్టులా కట్టింది.


వరాలయ్య మందులు తీసుకొని వస్తాడు వేసుకొని

పడుకో.భోజనం సిద్ధంగా ఉంచాను. రాత్రి బస్సు కి

వెళ్లి రేపు రాత్రి బస్సు కి వచ్చేస్తాను.


విరక్తి గా నవ్వుతూ ఘడియో క్షణమో అని బతికే

దానికి జాగ్రత్త చెప్తున్నావాఅయినా పల్లెటూరు దానిలాఎందుకా బాష ఎందుకు అక్కా తులసి అడుగుతూ.


నేనెవరో తెలియకుండా ఉండేందుకు.తులసి ఒకవేళ తెలిసినా నేను ఏదో రకంగా చూసుకోగలనులే.పల్లెల్లో ఉండేవాళ్ళు ఇలాగే ముస్తాబు అవుతారుగా.


వరాలు ఇంకా రాలేదు.ఉండు పంకజాక్షి ఫోన్ చేస్తా. అయ్యో మర్చేపోయానే రాత్రంతా బుక్ చేసుకున్నారే దానిని.


తలుపులు తెరుచుకుని లోనికి ఎవరో వచ్చిన శబ్దంచూస్తే వరాలు.


అమ్మ అమ్మ తీసుకోండి మందులు నెలకు సరపడ

తెచ్చాను. చుట్ట ముట్టించుకుని వెళ్ళిపోయాడు.


తులసి తులసి ఇదుగో వేసుకో వెంటనే నీళ్లు కుడా.

ఇచ్చి.


మాత్ర చింపి వేసుకొని మంచం మీద పడుకుంది.

ఏడుస్తూ.


తులసి జాగ్రత్తగాఉండు.ఏదికావాలన్న వరాలు ని.

అడుగు బేగా వచ్చేత.గబ గబ విశాఖపట్నం వెళ్లే

చివరి బస్సు ఎక్కింది.


తులసి గతం తాలూకా జ్ఞాపకాలు పద్దెనిమిది సంవత్సరాలు గతంలోకి తీసుకొని వెళ్లాయి.


" సమయం తెల్లవారుజామున 4.30 అవుతోంది.

అమ్మో పొద్దున్న అయ్యింది.లేవగానే తనకేంతో

ఇష్టమైన కృష్ణ భగవానుడు కి నమస్కారం చేసి.

స్వామి అందరిని చల్లగా చూడు స్వామి.


లేచి ఇంటి ముందు పేడ కలిపిన నీళ్లు జల్లి చుక్కల ముగ్గు పెట్టి. లోనికి వెళ్తుండగా.

******-********


అరేయ్ ఆగరా నీతో పరిగెత్తలేనురా బావా. అబ్బా

ఓడిపోయాను బాబోయ్.అబ్బా అమ్మా అదేం

పరుగురాబాబు ఆయాసంతో రొప్పుతూ కులబడ్డాడు.సుధామ్.


హ హ ఏమనుకున్నావురా స్టేట్ ఛాంపియన్ నేను.

పరిగెత్తి పరిగెత్తి ఒక దగ్గర ఆగిపోయాడు.ఛీ షూస్

కి పేడ అంటుకుంది ఇప్పుడు ఎలారా సుధా.


ఏయ్ తొక్కేసావా ముగ్గుంతా చచ్చి ఈ చలిలో వేసా.పాడు చేసావు కనిపించవా కళ్ళు నీకు.


సన్నని మంచు తెరలు కురుస్తుండగా వీధి దీపాల

వెలుగులో నీలం రంగు లంగా తెల్లని ఓణిలో బొడ్లో.

దోపుకుని.


మీ పరుగులకి మా ఇంటిముందే జాగా దొరికిందా వేరే చోటు లేదా మీకు.గొడవలు ఆడటంలో ఆరితేరిన మనిషి గొంతు లోనే తెలుస్తోంది.


దగ్గరగా సుధామ్ వచ్చి అరేయ్ రారబాబు కొట్టేసేలాఉంది భయం భయంగా చూస్తూ.


అలా చూస్తుండిపోయాడు ఆ అబ్బాయి. మాటలు

వినిపించట్లేదు తనకి.


నిన్నే గుడ్లు వేసుకొని చూస్తావేంటి ముగ్గు నువ్వే స్తావా చెప్పుకసురుగా మీద మీదకు చేతిని చాపి అడుగుతా.తన్మయంగా....


నేలకొచ్చిన చందమామలా ఉన్నావు.

కురిసేమంచు వానలో తడిసే ముద్దుగుమ్మ ఎవరే నీవు గుండెల్లో గుచ్చిందే నీ చూపు గుండె గాయానికి ప్రేమనే మందు రాసి చిరునవ్వు వరమీయవే

చేతిని పట్టుకుంటూ నా జీవితన్నే కానుకగా ఇచ్చేస్తా.నీ ప్రేమతో ముడి వేయవే ప్రియా.


చేతిని వదిలించుకుని బెరుకుగా చూస్తూ తుర్రుమనిలోపలకి వెళ్ళిపోయింది.


అరేయ్ పిచ్చా నీకు ఏంటా మాటలు ఎవరైనా చూస్తేవీపు విమానం మోత మోగిపోద్ది. వెధవ వేషాలువెయ్యకుండా పద ఇక్కడ నుండి.లాక్కుని తీసుకెళ్తూ.


ఆ ఇంటి వైపే చూస్తూ మళ్ళీ కనపడవే వన్నెలొలికే 

వయ్యారి వలపుల మిఠారి గుండెను చేత్తో తడుతూ రాసుకుంటూ.


సుధామ్ బాబు నవయుగ కవితా నాయక కొంచం.

సరిగ్గా ఉండమ్మా ఇల్లు వచ్చేసింది. తెలుసుగా ఎలానడవలో ఇక్కడ.


జాగ్రత్తగా ఉండు ఇట్టే పసిగట్టేసే మందరలాటిది మీ.మేనత్త మా అమ్మ.వెయ్యి కళ్ళు అసలే. పిల్లిలాగాఇద్దరూ లోనికి వెళ్లారు.


ఆగండ్రా అక్కడే పిలుపు కాదు కాదది అరుపు.

నాకు తెలియదు అనుకున్నారా ఎక్కడికి వెళ్లారో.

పిల్లిలాగా గదిలో దూరితే పట్టుకోలేనా చెవులను

మెలేస్తూ.


అబ్బా నొప్పోస్తోంది అత్తా వదిలేయండి ప్లీజ్.వీడే

పట్టుకెళ్లాడు ఊరు బాగుంటుందిరా బావా చూద్దామనిచెవి విడిపించుకుంటూ.


ఆ ఆ వెధవ వీడింతే అల్లరిగాడు.నిన్నరాత్రి వచ్చావుతిరుగుళ్ళు ఎందుకు. పోయి పడుకోండి ఇద్దరూ.అన్నయ్య గారు చూస్తే అంతే.

{ఇంకా ఉంది}.



Rate this content
Log in

Similar telugu story from Drama