STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తీయని కలలు

తీయని కలలు

1 min
364

ఏవో అందమైన ఊహలు మనసును 

మరో లోకంలో విహరింప చేస్తుంటే... 


ఏవో తీయని కలలు కనురెప్పలు దాటి 

మరీ నను రా రమ్మని పిలుస్తుంటే..... 


ఏవో మదిలో దాగివున్న తలపులు

గిలిగింతలు రేపుతుంటే..... 


పెదవులలో దాగిన నగవులు 

పెదాలపై చిరునవ్వు పూయిస్తుంటే.... 


శీతల పవనమేదో సొగసును 

మెల్లగా తడుముతుంటే... 


తుంటరి గాలి ఏవో ఊసులు 

ఏదో హాయి వింతగా సోకిన వేళ

చెప్పకనే చెబుతుంటే...... 


నాలో నేలేనా ఏమో ఈ హాయి బాగుంది 

ఏమైనా ఈ మాయలో తేలిపోవాలనుంది.


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance