STORYMIRROR

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

తెలుసటలే

తెలుసటలే

1 min
4



కలలు ఎలా అల్లాలో..వాలుజడకు తెలుసటలే !

 కథలు ఎలా చెప్పాలో..కాటుకలకు తెలుసటలే.!


చిరునవ్వుల చిరునామా దాచుకున్న మోవి ఏది..!?

సిగ్గులెలా పూయాలో చెక్కిళ్ళకు తెలుసటలే..!


కడలి గొంతు వినిపించే చెలియ విరహ మెంతటిదో..!?

వ్యథలు ఎలా మ్రింగాలో ఎద లయలకు తెలుసటలే..! 


ఏకాంతపు గగనసీమ ఏమనునో ఓ చెలియా..!?

మరులు ఎలా రువ్వాలో వలపులతకు తెలుసటలే..!


మెరుపుతోట మౌనాలకు స్వరములనే కూర్చేవా..!?

సిరులు ఎలా పంచాలో..చెలిమికళకు తెలుసటలే..!



Rate this content
Log in

Similar telugu poem from Classics