STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సాగిపో ముందుకు

సాగిపో ముందుకు

1 min
287

సాగిపో..... ముందుకు సాగిపో..

ముళ్ళలో అడుగులు తడబడినా

కాలనాగులే ఎదురుగా కనబడినా

కొండలే అడ్డుగా నిలబడినా

ఆబోతులే నీతో కలబడినా

నిరాశలే నీలో చొరబడినా

నిస్పృహలతో తనువే కూలబడినా

నడపరా నీ ఆశయం మునుముందుకు

నడవరా విజయంపై అనుమానమెందుకు

మట్టి తొలుచుకు వచ్చే బీజమవ్వరా.

నీ సంకల్పానికి నీరు పోయరా

చివురులేసే మొలక ఆశ ఎదగనీయరా

మహావృక్షమై జగతికంతటికి నీడనివ్వరా

అనుకుంటే కాదు అసాధ్యం

నీ చరిత రేపు ఒక గద్యం

కష్టం ఓడిపోయిన కథ విధి ఏనాడూ రాయలేదురా

నీకై వేచే ఉదయాన్నిలా స్వాగతించరా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance