ప్రేమతో నీ చెల్లి
ప్రేమతో నీ చెల్లి
నేను ఏడుస్తూ ఈ భూమి మీద అడుగుపెట్టాను నీ కడ వరకు తోడై ఉంటాను అన్నట్లు నా కన్నీటిని తుడిచి ఆనందంతో గంతులు వేసావ్
తప్పటి అడుగులు వేస్తున్న నాకు అమ్మలా ప్రేమతో, నాన్నలా బాద్యతగా కంటికి రెప్పలా చూసుకున్నావ్
మనం ఎన్ని సార్లు గొడవ పడిన, మన మధ్యలో మూడో వ్యక్తి వస్తే వాళ్లకి చుక్కలు చూపిస్తావ్
నేను ఇది చేయలేనెమో, అని వెనకడుగు వేయబోతున్న నాకు అడుగడుగునా దైర్యం చెప్పి ముందుకు నడిపించావ్
జీవితంలో ఎటువంటి కష్టం వచ్చిన నువ్వు ఈ చెల్లిని ఒంటరిగా వదిలేయవనే నమ్మకాన్ని ఇచ్చావ్
ఇంకేం కావలి ఈ జన్మకి.... మరో జన్మంటూ ఉంటే నీకు చెల్లిగా మళ్ళి జాన్మించాలి అని కోరుకోవడం తప్ప
ప్రేమతో నీ చెల్లి