ఓ వాస్తవం
ఓ వాస్తవం


నిన్న నేడు మనది
రేపు అన్నది తెలియనిది
మనలోని ఆశే రేపటికి పునాది
రేపు అనేదానికి నాంది..
పద పద మంటూ పరుగులు ఎందుకు
నిలకడగా సాగు ముందుకు
త్వరపడి సమస్యలలో చిక్కేదేందుకు
శాంతిస్వభావుడవై సాగు ముందుకు
ఎగిసే అలలతో పోరాడే చంద్రుడివలె
ఆశల వెనుక పరుగుని వదిలి
నేటిలోని ఆనందాన్ని ఆస్వాదించు
జరిగేది జరగక మానదు
ఆగేది ఆగక తీరదు
ఉక్కిరి బిక్కిరి చేసే ఊహలు ఎందుకు
వాస్తవాన్ని చూసి సాగు ముందుకు....