STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ రేయి

ఓ రేయి

1 min
209

ఊహపుట్టింది తలనుతట్టింది

భావమయ్యింది కాగితమెక్కింది


కోరికొకటి కలిగింది రంగంలోకి దింపింది

సాధన చేయించింది‌ విజయం చేకూర్చింది


అందము అగుపించింది కళ్ళను కట్టిపడవేసింది

అనందము నిచ్చింది మనసును దోచింది


పువ్వులు కనబడ్డాయి పరిమళాలు చల్లాయి

పొంకాలు చూపాయి పసందు నిచ్చాయి


జాబిలి ఉదయించాడు వెన్నెలను కురిపించాడు

ప్రేమను వెదజల్లాడు ప్రేమికులను రెచ్చగొట్టాడు


తారకలు వచ్చాయి తళతళ వెలిగాయి

మేఘాలు లేచాయి చినుకులు చల్లాయి


సూరీడు ఉదయించాడు కాంతులు కుమ్మరించాడు

చీకటిని పారదోలాడు జనాన్ని జాగృతంచేశాడు


అక్షరాలు అందాయి పదాలు పేరుకున్నాయి

పంక్తులు పొసగాయి కవితలు కూరాయి


పక్షులు లేచాయి రెక్కలు విప్పాయి

కిలకిల లాడాయి గాలిలో ఎగిరాయి


కవులు చూచారు సంబర పడ్డారు

కలమును పట్టారు కవితలు కూర్చారు



Rate this content
Log in

Similar telugu poem from Romance