STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నిన్నే ప్రేమిస్తున్నాను

నిన్నే ప్రేమిస్తున్నాను

1 min
288

నిన్ను చూసిన ప్రతి సారీ.. 


నా మది నా అదుపు జారీ.. 


తన వలపును నీకు తెలుపుతానంది..


బుద్ధి వద్దన్నా.. మనసు విననంటే.. 


నన్ను నీ నుండి దాచలేక, 


నిన్ను చూడక నేను ఉండలేక..


నాలో నేను తల్లడిల్లిపోయా.. 


నీ ఉనికి కోసం తపించిపోయా..


నా నాయనాల కాంక్ష తీర, 


నీ వదనాన్ని దర్శించ కోరా.. 


నా శ్రవణాల శాంతి కోరి, 


నీ కంఠం విన, నీ చెంత చేరి.


ఇదిగో వినిపిస్తున్న నా గుండె సవ్వడి.. 


నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా అన్నదే దాని సడి..


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance