STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవే నాతో రా‌ 💗💗

నీవే నాతో రా‌ 💗💗

1 min
335


కలల సిరి వాగు ఆన దాటి ఏరులా విధిగా జేరాలి సాగరాన్నిలా


మాలిని తీర లాలనింకా చాలిక కొమ్మలను దాటి రావే కోకిలా


ఎల్లల్లేని యవ్వనవలోకం మనకై వేచి ఉందిగా


కల్లల్ లేని కొత్త నవనీతం మననే స్వాగతించగా


అడవిన్ గాయు వెన్నెలా రావే రాజ్యాన్నేలు రాణివై నీవే


నీవే… నేనై రా, ఋషివనంలోనా స్వర్గధామం


హిమవనంలోనా అగ్నివర్షం ప్రణయకావ్యానా


ప్రథమ పర్వంలా మనువు కార్యానా వనము సాక్ష్యంలా


స్వయంవరమేది జరుగలేదే స్వయంగా తానే వలచినాడు


చెఱుకు శరమే విసిరినాడే చిగురు ఎదనే గెలిచినాడే


వనములో నేను పూలకోసమే అలా వలపు విరిసింది… 


నిన్ను చూసిలా అడవిలో నేను వేటగాడినై ఇలా


వరుడు వేటాడినాడు నన్నిలా చుక్కల్ కొక చిలుకలే అలిగే


చుక్కందాలు మావని కత్తుల్ తోటి తుమ్మేదే దూకే

 

పువ్వుల్ తేనె తమదని చిక్కెన్ గాంత దక్కేనని నాకే


చక్కంగానే తగవులాడే నీవే… నాతో రా


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance