Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ఆలోచనలతో

నీ ఆలోచనలతో

1 min
366

ఆగిపోదు సాగిపోదు..నినుగూర్చిన ఆలోచన..!

ఉండనీదు కదలనీదు..చుట్టేసిన ఆలోచన..!

చెప్పలేను ఒక్కమాట..ఎంతవింత అలజడోయి..

ఊరుకోదు మరివీడదు..పట్టేసిన ఆలోచన..!

నవసరిగమ స్వరాలేవొ..పొంగేనా ఎదలోయల..

కవ్వించదు ఊరించదు..చిగురించిన ఆలోచన..! 

మనిషివిలువ తెలిసిందా..నిదానమే జాలువారు..

ఎదిరించదు బెదిరించదు..వికసించిన ఆలోచన..!

ఎవరికెవరు తోడంటే..వివేకమే ఓ నేస్తం..

వాదించు వేదించదు..ఒకపండిన ఆలోచన..!

సమరవాంఛ కన్న అసలు..అవివేకం లేదంటా..

సాధించదు బంధించదు..ఒకనవ్విన ఆలోచన..!

Rate this content
Log in

Similar telugu poem from Romance