నా కలలు
నా కలలు
అనుక్షణం పలకరిస్తూనేవుంటాయి..
నీతలపులు...
ప్రతీనిమిషం తడుముతుంటాయి...
నీచూపులు...
ఘడియఘడియకూ వినిపిస్తూనే ఉంటాయి... నీపిలుపులు...
పూటపూటా అలరిస్తున్నాయి...
నీ చిరునవ్వులు...
రోజురోజుకీ దగ్గరవుతున్నాయి...
మన మనసులు...
ప్రతిరేయీ నిను చూపుతూనేవున్నాయి...
నా కలలు...

