మంత్రాక్షరి
మంత్రాక్షరి
మంత్రాక్షరి
ఎరిగిన పెన్నిధి వైతివె
తరుగని నిధి వోలె నీవు తారా మణివై
మరుగున దాచిన కాంక్షలు
తరుణీ కదిలించి తీవు తార్కాణమువై
దాచిన పుష్ప పరిమళము
వేచిన భ్రమరంబు నోట పీయూషంబౌ
నీచుట్టే నా భ్రమణము
దోచుటకే యధర మధువు దోరగ కుడువన్
కాంతా నీవే నా మన
సంతా,ఆక్రమణ జేసి సర్వస్వమువై
మంత్రాక్షరిలా ఆంక్షల
చింతనలో ముంచి తీవు చేష్టలు వుడకన్..
.. సిరి ✍️❤️

