కన్నీళ్ళకు నేస్తం
కన్నీళ్ళకు నేస్తం
కన్నీళ్ళకు నేస్తం..
మనసు వేదనకు ప్రతిబింబం..
అవమానానికి ఆయుధం..
కదలాడే జ్ఞాపకాలకి నిలువెత్తు సాక్ష్యం..
నీ రూపం.. కనిపించని ఆశల చిహ్నం..
కొందరికి నీవే సమాధానం..
మరికొందరికి నీవే ప్రశ్న..
కొన్నిసార్లు నీవే అంగీకార మంత్రం..
మరికొన్నిసార్లు నీవే తిరస్కార తంత్రం..
నీ మార్గం.. శాంతి శోధన పయనం..
ఎంత ఆనందాన్ని అయినా మోయగలవు..
ఎంత భాధనైనా భరించగలవు..
కాలం పెట్టే పరీక్షకి నిన్ను నువ్వే ఎక్కుపెట్టే బాణంవి..
అలసిపోని నిరంతర వేదన.. నీ రూపపు ఆవేదన..
ఓ మౌనమా.. నీవే నా మార్గం..
నీ భాష మరిపించే సుందర శ్వాస..
నువ్వే నా అంతరాత్మ..
నా మౌనం..అవ్వదు చేతకానితనం..
ఈ మౌనం.. ఎక్కుపెట్టి దూసుకెళ్ళే ఆయుధం..
విజయ సోపానం
... సిరి ✍️❤️

