జీవితం
జీవితం
సంపదలే కావాలని కోరికుంటె శ్రమించు
కొత్తకొత్త పోకడలను భిన్నంగా సృజించు
మనసేమో మృగవైనం చేష్టల్లో కృూరం
మనుషుల్లో మనిషిలాగ పదిమందిలొ చరించు
మనసేమో చంచలమూ నిగ్రహించుకోవాలి
ముక్తిమార్గమనుసరిస్తె ముక్కుమూసి జపించు
అవసరార్ధ మొక్కుబడులు మానాలొయ్
పరలోకప్రాప్తికొరకు అనునిత్యం తపించు
జీవితమే నాటకమను ఆర్యోక్తిని విన్నావ
భువనమనే వేదికపై జీవుడిగా నటించు
