STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

హృదయ విహారి

హృదయ విహారి

1 min
393


ఆట వెలది

పలకరింపు తోనె పులకరించె మనసు

యెదను రగులుతున్న రొదలు దెలిసె

ఎడద లోతు లోన యెడబాటు నోర్చినా

లోటు వెక్కి రించె పోటు వోలె

ఆట వెలది

తరిగి పోని ప్రేమ దైవ ప్రేరణ యగు

ఒకరి కోస మొకరు వొదిగి వుంటు

మదిని దాచు కొన్న మమతాను రాగాలు

కలుసు కొన్న క్షణము కలత దీరు

ఆట వెలది

హృదయ సీమ లోన మదనుని శరమోలె

చెరిగి పోని రూపు చిత్ర మాయె

తన వొడి శయ నించు తరుణంబు యెన్నడో..!

తను వణువణు వంత తమక మాయె..!

ఆట వెలది

గడియు రోజు లన్ని గహన సదృశ్యంబు

వేరు వేరు గున్న వెతలు బెరుగు

కలసి పోవు దినము కమనీయ కలబోత

ఆంక్ష లన్ని బోయి కాంక్ష దీరు...


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance