అవనీతిని ఆపడమెలా
అవనీతిని ఆపడమెలా


దేశాభివృధ్ధిని కుంటుపరిచే
భయంకరమైన కలుపుమొక్క అవినీతి...
దీని కున్న ఆకర్షణ చూస్తుంటే
నిజాయితీకి నిలువుటద్దాలు
కూడ తమ లక్షణాలను
మార్చుకుని మరీ పరుగులు
తీస్తున్నారు దీని వెంట,,
అది కలియుగ ఆరంభములోనే
ఏ మూర్ఖుడు నాటేడో గాని
అది వట వృక్ష వేళ్ళు కన్నా
హృదయ కండరాలలో చొచ్చుకుపోయి..
మనసులో జనించే బుద్దిని
సరస్సుని పాడు చేసే గుర్రపు డెక్కాలా హరింపజేస్తుంది,,
అవనీతి పోరాడితే భయపడేది కాదు..నేటి దాని బలం చూస్తుంటే..
అది ఏ ఒక్కరో ఆపితే ఆగేదీ కాదు...ఎందుకంటే దాని రుచి చూసి ఊర మనుషులుకి ప్రతి రూపాలుగా మారి..ఆ పై వాడు ఒకడున్నాడు అన్న మాటనే పెడచెవిని పెడుతున్నారు.. విలాసాలకి బానిసులై..
అవనీతిని ఆపాలి..
దాని కూకటి వేళ్ళనే పీకి పారేయాలి...
మరి దాని జాడలు కూడ లేకుండా...
ఎలా..ఎలా..ఎలా..
అని చేతులు ముడుచుకుంటే
నయం చేయగల జబ్బు కాదు
అది..
దీక్ష బూనాలి అందరూ
..ఆ చెడు నీటిని నా చేతికి త్రాకనివ్వనూ..ఎన్నడూ అని..