STORYMIRROR

Akhil Chand

Drama Tragedy Action

4  

Akhil Chand

Drama Tragedy Action

Toddy Friends (కథ)

Toddy Friends (కథ)

7 mins
65

........................................................................

పాత్రలు

1. లియో

2. మాక్స్

3. జాక్

4. టింకూ

5. డిట్టో

6. బాలు

7. బొమ్మ

8. రామ్

9. రాకీ

10. శాండీ

11. అఖిల్

........................................................................


Introduction

సమయం అర్ధరాత్రి 12 గంటలు, మునుపెన్నడూ చూడని విధంగా ఆకాశంతా నిండు వెన్నెలతోో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అప్పుడు, దూరంగా ఎక్కడి నుంచో పాటలు వినిపిస్తుంది. ఎంటా అని చూసే కొద్ది పాటలు యొక్క శబ్దం పెరగ తు పోతుంది. కాస్త దూరం వెళ్ళి ఎంటి అని చూస్తే కాలేజీ హాస్టల్ పైన ఏడుగురు స్నేహితులు పాటలు వింటు మద్యం తాగుతూ ఎంతో సరదాగా ఆనందిస్తున్నారు. ఆ నిండు వెన్నెల ఎలైతే ప్రకాశిస్తుంది వారి స్నేహం కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కొద్ది సేపటికి ఆ నిండు వెన్నెలలో కారు మేఘాలు వచ్చి కమ్ముకున్నాయి. అంతటి చంద్రడుకే చికటి క్షణాలు ఉంటే మరి వీరి స్నేహానికి చికటి రోజులు ఉండకుండ ఉంటాయ? సరే చూద్ధం కాలం చెబుతుంది దినికి సమాధానం.

Den Introduction 

ఆ తర్వాతి రోజు 23-October-2023, ఖరగ్‌పూర్. ఉదయం 7 గంటల అవ్వతు ఉంది. ఆకాశంతా నల్లటి మేఘాలతో కమ్మేసి ఉన్నాయి, తూర్పున ఉన్న బంగాళఖాతం నుండి వర్షప గాలలు విస్తున్నాయి. అప్పుడే హౌరాహ్ నుండి మూడు లారీల మద్యం సరకు వచ్చి సూప్ - డూప్ లో ఉన్న సేతు బార్ షాప్ దగ్గర ఆగాయి. సూప్-డూప్ ఇది ఆ ఊరిలోనే బాగా పేరొందిని అడ్డా. ఇక్కడ సిగెరట్ నుంచి మద్యం  వరకు ఎదైన దొరకుతుంది. ఇక్కడకి స్టూడెంట్స్ తరచుగా వారి అవసరాన్ని బట్టి వస్తుంటారు. సేతు ఆ రోజు చాలా ఉషారుగా వచ్చిన సరకును లోడ చేసుకుంటుంటాడు, అప్పుడు ఒక కస్టమర్ అడగుతాడు ఎంటి సేతు ఈరోజు ఇంత ఉషారుగా ఉన్నావుని. సేతు చెప్పేలోపే పక్కనే ఉన్న TV లో, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కకంటే జరిగే Ind vs Pak మ్యాచ్ నేడే విక్షంచండి అనే ప్రకటన వస్తుంది. అతను అది చూసి సేతు యొక్క ఆనందాన్ని అర్ధం చేసుకుంటాడు. సేతుకి క్రికెట్ అంటే చాలా అసక్తి మరియు ఈ రోజు జరగబోయి మ్యాచ్ వల్ల తన సరకును అమ్మి ఎక్కువ లాభాలు వస్తాయి అని చాలా ఉషారుగా పనిచేస్తుంటాడు.

Characters Introduction 

సమయం ఉదయం 8:00 అవ్వతుంది. నిన్న రాత్రి ఎడుగురు స్నేహితులు మందు కొట్టి అలసిపోయి, ఇంకా నిద్రపోతుంటారు. కొద్ది సేపటికి బొమ్మ లేచి జాగింగ్ బయలుదేరడానికి సిద్ధం అవుతాడు. రామ్ స్నానం చేసి దేవుడుకి పూజ చేసుకుంటుంటాడు. బాలు మరియు టింకు క్లాస్ కి వెళ్ళడానికి రెడి అవ్వుతుంటారు. డిట్టో నేమో లేచి కంప్యూటర్ గేమ్స్ అడతుంటాడు. మాక్స్ మరియు జాక్, ఆ రోజు మ్యాచ్ కొసం మద్యం కొంటానికి సూప్-డూప్ కి బయలు దేరతారు. ఇంతలో ఒక పనిబడి వారు వేరే చోటకి వెళ్ళాసివస్తది. కొన్న సరకుని టింకుకి ఇచ్చి పంపిస్తరు. టింకు ఆ సరకును బ్యాగ్ లో వేసికొని కాలేజంతా షికారు కొట్టి సాయత్రంనికి హాస్టలకు వస్తాడు. అందరు రెడి అయి మ్యాట్చ్ చూస్తూంటార. మ్యాట్చ్ ఎంతో ఉత్కటంగా జరుగుతుంది. చివరకి India చరిత్రలో నిలిచిపోయి విజయంని నమోదు చేస్తుంది. ఆ ఆనందంలో స్నేహతులు అందరు మద్యం తాగి డ్యాన్స్ చేసి అపస్మారక స్థితి లోకి వెళ్ళతారు.

Friends Happy Moments 

ఈ ఏడుగురుల స్నేహం చాలా బలంగా ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చిన వారికి వారే కూర్చొని చర్చంచుకొని పరిష్కరించుకుంటారు. కానీ వీళ్ళకి ఒక చేడు ఆలవాటు ఉంది. ఎంటంటే అది ఛిన్న కష్టం వచ్చిన చిన్న ఆనందం వచ్చిన తాగటం వీళ్ళ అలవాటు. ఆతర్వాత రోజు సాయిత్రం అందరు కలసి సమయంతో సంబంధం లేకుండ అలసి పోయాదాక క్రికెట్ ఆడతారు. బాగా అలసిపోయిన బాలు చాలా ఆకలితో ఉంటాడు. ఇంతలో మాక్స్ ఈ రోజు మనం మంచి చికెన్ తో బగారా అన్నం వండుకొని తిన్నదం అని అంటాడు. బొమ్మ మార్కెట్ కి పోయి కావలసిన కూరగాయిల తీసికొని వస్తాడు. మాక్స్ వెళ్ళి చికిన్ తీసుకొని వస్తాడు. డిట్టో బియ్యం కడిగి వండండం మొదల పెడతాడు. రామ్ మరియు టింకు తెచ్చిన కూరగాయలను కడిగి, వాటిని కట్ చేస్తూ ఉంటారు. బాలు కంగారు కంగారుగా కర్రి వండుతు ఉంటాడు. మధ్యలో కొంచం సరదా సరదాగా మాట్లాడుకుంటు, మొత్తానికి వండటం పూర్తి చేస్తారు. అందరు కలసి కూర్చొని కడుపు నిండ తింటారు.

Friends Conflict 

సమయం రాత్రి 12 గంటలు అవ్వతుంటది. అందరు తినేసి వారి రూమ్ లో పడుకొని ఉంటారు. కాని మాక్స్ మాత్రం నిద్ర పొకుండ అలా గాల్లో చూస్తూ ఆలోచిస్తూ ఉరిటాడు. అలా చూస్తూ ఉండగా ఒక విషయన్ని గమనిస్తాడు. ఎంటంటే అది, తన రూమ్ లో స్నేహితులు అందరు కలసి ఒక విలువైన వస్తువుని దాస్తారు. అది అక్కడ లేదని గుర్తించి దాన్ని ఎవ్వరో దొంగలించారని బావిస్తాడు. అది అక్కడ పెట్టిన విషయం తనకి మరియు తన స్నేహితులకి తప్ప వేరే ఎవ్వరకి తెలిసే అవకాశం లేదని మాక్స్ బావిస్తాడు. కాబట్టి దొంగలించిన వ్యక్తి వారి ఏడుగురులో ఒక్కరని నిర్ధాంచుకుంటాడు. జరిగిన సంఘటన తన స్నేహితులతో వివరిస్తాడు. ఇది విన్న స్నేహితులు ఆశ్చర్యంతో ఏం జరిగిందో మాక్స్ ని అడుగుతారు. మ్యాక్స్ జరిగిన విషయం అంతా తన స్నేహితులతో చెప్తాడు. అది విన్న స్నేహితులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. ఆ నిందలు బలపడి ఒకరు మీద ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇది చూసిన రామ్ మరియు జాక్ గొడవను ఆపటానికి ప్రయత్నిస్తారు. చివరికి మ్యాక్స్ ఈ విధంగా అంటాడు. ఏమని అంటే రేపటి నుండి నేను మీ అందరిని ఒక కంట కనిపెడుతూ ఆ వస్తువుని బయటకు తీసుకొని వస్తా అని గట్టిగా అరిచి సిగరెట్ కాలుస్తూ ఒంటరిగా కూర్చొని అలా ఆకాశం వైపు చూస్తుండగా అప్పుడే కారమెగాలు నుంచి నెలవంక చంద్రుడు బయటికి వస్తాడు. ఎలా అయితే చంద్రుడు తన పూర్తి స్వరూపాన్ని కోల్పోయాడు అలానే వీళ్ళు కోడా వీరి స్నేహ బలంని కోలపోతారు.

Searching for valuable thing 

ఆ తర్వాతి రోజు, మళ్ళి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటు గొడవపడతు ఉంటారు. వాళ్ళలోనే వాళ్ళు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరి చాడీలు చెప్పుకుంటు ఉంటారు. ఇది గమనించిన మాక్స్ దీనికి ఒక పరిష్కారం తెవాలి అనుకుంటాడు. అందరిని పిలిచి తన దగ్గర ఒక పరిష్కారం ఉంది అని చెప్పి ఈ విధంగా చెప్పతాడు. ఆ విలువైన వస్తువుని కచ్చితంగా మనలోనే ఒకడు తీసి ఉంటాడు అని బలంగా నమ్ముతున్న అంటాడు. అది తీసేటప్పుడు మనందరం మద్యం తీసుకొని అపస్మారక స్థితిలో ఉన్నాం కాబట్టి తీసినోడు కూడ తాగిన మత్తులో తెలిసో తెలియక తీసి ఉంటాడు. లేకుంటే వాడికి ఎప్పుడు నుండో దాన్ని దొంగలించాలని దురాశ ఉందేమో తాగిన మత్తులో వాడు నిజ స్వరూపన్ని ఈ రకంగా బయట పెట్టింటాడు అని బావిస్తున్న అంటాడు. ఇప్పుడు తీసింది ఎవరు అని ఎలా కనిపెడతావు అని జాక్ అడుగుతాడు. డిట్టో అంటాడు ముందు మన రూమ్స్ వెతికితే ఎదోకటి దొరుకుతుంది అంటాడు. ఎందుకంటే ఆ రాత్రి తాగిన మత్తులో ఇక్కడే ఎక్కడో దాచి ఉంటాడు. సరే అని చెప్పి ముందు బాలు రూమ్ వెతుకుతారు. ఎంత వెతికినా ఏమి దొరకదు. ఆ తర్వత డిట్టో రూమ్ ని వెతుకుతు ఉండగా ఒక విలువైన వస్తువు ఆ రూమ్ లో ఉంటది అది Toddy మాత్రం కాదు అది మరొక వస్తువు. ఇది చూసిన స్నేహితులందురు డిట్టోని కోడతుంటారు. ఇంతలో బాలు వచ్చి టింకు మరియు బొమ్మ రూమ్ లో కూడ మరికొన్ని విలువైన వస్తువుల దొరికాయి అని చెప్పుతాడు. ఇది చూసిన స్నేహలందరు కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమి అర్థం అవ్వదు. ఇది చూసిన మాక్స్, మాడ్ మాక్స్ గా మారి టింకుని, బొమ్మని మరియు డిట్టో మీద నిందలేసి తిడుతుంటాడు. మళ్ళీ కథ మొదటికి వస్తది మళ్ళీ ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటారు. ఇక చివరికి ఇదింతా చూసిన మాక్స్ తట్టుకోలేక లియోకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి ని సహయం కావలని అడిగి, వెంటనే తన దగ్గరకి రావలని కొరతాడు. తన స్నేహతుడు ఇలా అడగగానే లియో వెంటనే బయలుదేరతాడు.

Leo Entry 

లియో ఆ కాలేజీలోనే చాలా ఫేమస్ డిటెక్టివ్. తని ఇలాంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంటాడు. తన దగ్గర ఎన్నో అధునాతన గాడ్జెట్లు ఉన్నాయి. వాటిని తన తెలివితేటలతో సమస్యలను పరిష్కరిస్తుంటాడు. తను ఇప్పుడు వరకు ఎప్పుడు ఒడిపోలేదు, సమస్యలను పరిష్కరించడంలో. ఇది తెలిసిన స్నేహితులకి కంగారు పట్టుకుంది. ఎందుకని అంటే వారి మీద వారికే నమ్మకం ఉండదు. మద్యం మత్తులో ఎవరు తీసారో తెలియక.

The valuable thing is Toddy 

లియో వాళ్ళు ఉంటున్న B-3XX Floor కి వస్తాడు. మాక్స్ వెళ్ళి పరిచయం చేసుకొని అందరని పరిచయం చేస్తాడు. మాక్స్ వాళ్ళ రహస్యాల గురించి మరియు పోయిన విలువైన వస్తువుయిన Toddy గురించి చెప్పుతాడు. వాళ్లంత చాలా రోజులగా ఒక ఖరీదైన మద్యం అయిన Toddy మరియు ఎనో ఖరీదుగల మద్యాన్ని సేకరిస్తుంటాం అని చెప్పుతాడు. ఇది విన్న లియో మాక్స్‌కి మాట ఇస్తాడు ఉదయం అయే సరికే Toddy ఎక్కడ ఉందో వెతికి పెట్టే బాధ్యత నాది అంటాడు.

Leo interrogation and revealing of truth 

లియో ఒక్కొక్కరుని రూమ్ లోపలికి పిలిచి వారి చేత మద్యం తాగ్పించి వారిని ప్రశ్నించడం మొదలు పెడతాడు. తాగిన మత్తులో అన్ని సమాదానాలు చాలా ఓపెన్నగా చెప్పతుంటారు. కానీ ఎంత సేపటికి తనకు కావలిసిన సమాధానం బయటకు రాదు. చివరిగా అందరిని ఈ విధమైన ప్రశ్న అడుగుతాడు. నువ్వు మీ రహస్యాలను బయట వ్యక్తులకు చెప్పావా? అప్పుడు అందరూ చెప్పలేదు అని జవాబు ఇస్తుంటుంటారు, కాని బాలు మాత్రం చెప్పాను అంటాడు. ఇప్పటివరకు ఇలాంటి ప్రశ్న వాళ్ళకి తట్టకి పోవటానికి కారణం ఎంటంటే ముందునుండి వాళ్ళు నమ్మింది ఈ రహస్యం వీరికి మాత్రమే తెలసు బయట వారికే తెలిసే అవకాశమే లేదు అని, కాని లియో బయట వ్యక్తి కాబట్టి Out of the Box ప్రశ్న అడగాలసి వస్తది.

లియో బాలుని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. అప్పుడు బాలు చెప్తాడు కొన్ని నెలలు క్రితం రాకీ, శాండీ మరియు అఖిల్ తో Truth or Dare Game ఆడాను అని చెప్పుతాడు. వాళ్లతో మద్యం తాగుతు, ఆట చాలా తీవ్రంగా ఆడుతుండగా బాలుకి Truth వస్తుంది. తాగిన మత్తులో వాళ్ళ దగ్గర ఉన్న విలువైన Toddy గురించి చెప్పును అంటాడు. ఈ విషయం తెలిసాన లియో వెంటనే వాళ్ళ రూమ్స్ కి వెళ్ళతాడు. కాని రూమ్ లో శాండీ మాత్రమే ఉంటాడు. లియో అడుగుతాడు శాండీని, నీకు Toddy గురించి ఎమైన తెలుసాని అడుగుతాడు, శాండీ చాలా సింపుల్ గా తెలియదు అని చెప్పుతాడు. ఎంతసేపు Toddy గురించి అడిగినా నోరువిప్పుడు. లియో వెళ్లిపోయిన కొద్ది సేపటికి రాకీ కాల్ చేసి మనల్ని వెతుకుంటు లియో వచ్చాడు. మన మీద అనుమానం వచ్చినట్టుంది బహుశ తెలిసిపోయింది అనుకుంటూ. అప్పుడే అల్మిరా లో నుంచి ఎరుపు రంగులో వెలుగుతుంటది, ఏంటని చూస్తే వాయిస్ రికార్డర్, లియో మొత్తం వినేస్తుంటాడు వాయిస్ రికార్డర్ నుంచి. దీంతో తీసింది ఎవరో నిర్ధారించుకుంటాడు లియో. ఎలా తీసారో ఉహించుకుంటాడు. ఎలాయితే Toddy తో పాటు మరికొన్ని వస్తువులను వాళ్ల రూమ్ లో పెట్టి వాళ్ళ మీదే వాళ్లే అనుమానం పడేలా చేశారో, వాళ్ళ పదకంని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాడు. అప్పటికే సమయం ఉదయం 6 గంటలు అవ్వుతుంటది. మాక్స్ కి కాల్ చేసి జరిగింది అంత చెప్పుతాడు. వాళ్ళు స్టేడియం లో ఉన్న విషయం కూడా చెప్పేస్తాడు.

Revenge taken by the Friends

ఈ విషయం తెలియగానే మాక్స్ చాల కోపం తో ఒక సిగరెట్ తాగి రూమ్ లో ఉన్న హాకీ బ్యాట్ ని మరియు తనతో పాటు బొమ్మ మరియు టింకుని తీసుకొని స్టేడియంకి బయలు దేరతాడు. అప్పటికే రాత్రి నుంచి వాళ్ళ శత్రువులు కంగారుతో నిద్రపోకుండ ఉండటం వల్లనా బాగా అలసిపోయి ఉంటారు. మాక్స్ వచ్చి ఎందుకు తీశారుని అడుగుతాడు. రాకీ అంటాడు మీకు ఎలాయితే దాని మీద మీకు ఆశ ఉందో మాకు అంతే దాన్ని దొంగలించాలని దురాశ వేసింది అని అంటాడు. ఇన్ని రోజులుగా సరైన సమయం కోసం వేచి చుస్తున్నాం అని చెప్పుతాడు. ఇది విన్నా మాక్స్ కోపంతో బ్యాట్ తీసుకొని వాళ్ళని కొడుతాడు. ఎలా కొడతాడు అంటే ఇన్ని రోజులు వాళ్ళని ఎంత కష్టపెట్టిరో ఆ పగంత చూపిస్తాడు. అప్పటికి రక్తం వచ్చేల కొడతాడు అది చూసి వారి దెగ్గరకి వెళ్ళి క్షమాపణ చెప్పమంటాడు. వాళ్ళు చేసిన తప్పును అంగికరించి క్షమాపణ కోరతారు. Toddy ని తిరిగి ఇచ్చేస్తారు. మరియు వారు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇన్ని రోజుల ఈ Toddy కోసమేగా ఈ గొడవ అని చెప్పి ఆ మరసటి రోజు జరుగబోయి పార్టీకి వాళ్ళని కూడ ఆహ్వానిస్తాడు. ఆ తర్వాతి రోజు అందరి కలసి ఎంతో సంతోషంతో డ్యాన్స్ వేస్తు ఉంటారు. ముందు ఎలైయితే సంతోషంగా ఉన్నారో మళ్ళ ఆ రోజులు తిరిగి వస్తాయి. అలాగే ఆకాశం వైపు చూస్తే నిండు వెన్నెలతో చంద్రుడు తన పూర్వ రూపన్ని పెందుతాడు. దీంతో ఈ Toddy Friends కథ ముగుస్తుంది.

ధన్యవాదాలు


........................................................................

ఇతర మూలాధారాలు

https://youtube.com/playlist?list=PL1x__jEejwefZqQxOlEjiRAljG3muMnva&si=WCi5DdJBFyzbDu7Z

........................................................................


Rate this content
Log in

More telugu story from Akhil Chand

Similar telugu story from Drama