Sri Vijaya

Drama

2.6  

Sri Vijaya

Drama

తండ్రి కో లేఖ

తండ్రి కో లేఖ

2 mins
606


చూస్తుండగానే చీకటి పడిపోయింది ..ఈ శీతాకాలం అంతేగా...చివరి బస్ కూడా వెళ్ళిపోయింది ...ఇప్పుడెలా పది కిలో మీటర్లు నడవాలిగా...నడక ఏమన్నా కొత్త నాకు చేతిలో ఉన్న బట్టల సంచి తప్ప ఇంకేమి ఉన్నాయి .సరుకులు జాలయ్య ఆటో లో వేసేసా గా ఈపాటికి ఇంట్లో చేరవేసేవుంటాడు...కానీ సమస్య అది కాదు....ఈ దారిలో తాచు పాము తిరుగుతుంది....ఇప్పటికే నలుగురిని కరిచి తప్పించుకుంది....రక్తం రుచి మరిగింది అని చెప్పుకుంటున్నారు....అయిన పాము కి రక్తం రుచి తెలుస్తుందా ?ఏమో ఏమన్నా అంటే దేముడు ...కోపం తో కరిచి నా కరుస్తాడు..


ఒక కర్ర దొరికింది దాన్ని నేల కేసి కొట్టుకుంటూ నడిచా ఈ అలికిడి కి నా జోలికి రాదు అనే ధీమా....ఊరు మిణుకు మిణుకు మంటూ కనిపిస్తుంది...హమ్మయ్య కొంచం సేపు అయితే ఇంట్లో పడతా.... ఇంటికి వెళితే బయట పడదము అనిపిస్తుంది....బయటకి వస్తే ఇంటి ధ్యాసే.....

తడికే తలుపు జరిపి ఇంట్లో కి వెళ్తుంటే చెల్లి ఎదురు వచ్చి చేతిలో సంచి లాక్కుంది....అమ్మ బయటకి వచ్చి బయట నుండి వచ్చినోళ్ళకి ఎదురు వెళ్లకూడదు అని ఎన్ని సార్లు చెప్పాలి అని చిరుకోపం చూపించి నా దిక్కు చూసి స్నానానికి నీళ్లు పెట్ట స్నానం చెయ్యి అనేసి ...లోపలికి వెళ్ళి అన్నం కూర వేసుకొచ్చి అక్కడ నేల మీద పెట్టేసింది..


ఆమెకి ఆమె పనులు ఐపోవాలి అంతే ...ఇంకో పనిలోకి దుకేయ్యాలి ఇదే ఆమెకి తెలిసింది...ఆ తిండి పని కానిచ్చి ఇంటి వెనక సావిట్లో మంచం వేసుకొని పడుకున్న ...ఇంట్లో చెల్లి,అమ్మ...


ఇదే జీవితం నాన చిన్నప్పుడే వదిలేసాడు...ఎందుకు వదిలేసాడో అయితే తెలియదు...ఇంకో మనువు చేసుకున్నాడు....సంత లో మామ చూపించాడు అదిగో వాడే మీ నాన్న అని ...చూసి తల తిప్పుకోటం ఇద్దరం....ఏరోజు దగ్గరకి రాలేదు.అమ్మ రోజంతా పంట పొలాలు చూసుకోటం ...ఇది తప్ప ఇంకో ధ్యాస లేదు.....

నాన ని కలవాలి మాట్లాడాలి...ఎలా???ఎదురు మాట్లాడలేను...మరేలా లేఖ రాస్తే....ఆయన పేరు తెలుసు రామ చంద్రయ్య.....ఇంటిపేరు జొన్నల.... ఇంటి నెంబర్ తెలియదు....అయితే ఏమి ఆ చిన్న ఊరిలో ఎప్పటికైనా చేరుతుందిలే....అనుకున్నదే తడవు ...లోపలికి వెళ్ళి చెల్లి బ్యాగ్ లో పెన్ ,ఒక బుక్ తీసుకొని మళ్ళీ నులక మంచం మీద చేరి రాయటం మొదలెట్టాను..

అయ్యా....అనాలా

లేక నాన అనాలా.....ఏమో !!!ఎప్పుడు పిలవలేదు


అయ్యా.....మమ్మల్ని వదిలేసావు వేరే పెళ్లి చేసుకున్నావ్....యేరోజు.. ఇటు వైపు చూడలేదు...ఎందుకు అయ్యా వదిలేసావు...నా స్నేహితుల తల్లి,తండ్రి ఎప్పుడు కొట్టుకుంటారు ,తిట్టుకుంటారు....వాళ్లెప్పుడు విడిపోలేదు...


ఇన్నిరోజులకి గుర్తొచ్చానా అని నువ్వు అనుకోవచ్చు..నీ అవసరం ఈరోజు పడింది...ఇప్పుడు నువ్వు కావాలి నీ పెద్దరికం కావాలి....తప్పదు....మనసు పడిన సుజాత తండ్రి...ఏమన్నాడు ..మీ నాన్న ని తీసుకురా సంబంధం కాయం చేసుకోటనికి అని...మా అమ్మ ,నా ఇద్దరి మేనమామ ల జోక్యం వద్దు అంటా.


సుజాత మొహం చూసి ఊరుకున్న ....నిన్ను కోరుకుంటున్న.....ఒక పాలి మనూరు రా సంబంధం మాట్లాడిపో ..ఇంకేమి వద్దు ....నీ భూములు వద్దు...నువ్వు వద్దు.....ఎలాగో ఒక లేఖ రాసాను...ఎవరికి ఇప్పటికి రాయలేదు...ఆ అవసరం రాలేదు....


కంటి మీద కునుకు లేదు...తెల్లారి లేచి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ చేసాను....పండగ ...పండగల జరిగింది...వేట పోతుల భలి... పొంగళ్లు....జాతర్లు...


పొలానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో పది మంది దాకా వచ్చి వున్నారు..వారిలో ఈయన కూడా ఉన్నాడు అయితే లేఖ అందింది...గొడవ చెయ్యడు కదా...అమ్మ ఒక మూలన నిలబడి ఉంది...చెల్లి తలుపు సందు నుండి ఆయన్ని చూస్తుంది...కొంచం సేపు కూర్చొని వెళ్లిపోయారు....ఎందుకొచ్చాడు అని అమ్మని అడిగా ....ఏమో అనేసి తొందరగా నిద్ర పోయింది హమ్మయ్య నా లేఖ గురించి తెలియదు అన్న మాట.....


సుజాత నాన కబురం పాడు ..మాఘ మాసం లో పెళ్లి అని ...నా ఆనందానికి అంతే లేదు...సుజాత ని కలవడానికి గుడికి వెళ్ళాను....పెళ్లి కళ వచ్చేసి ముద్ద బంతి లా మెరిసిపోతోంది....కాలవ గట్టు మీద కూర్చోపెట్టి చేతిలో చెయ్యి వేసి ...ఎలా అయినా పెళ్లి జరుగుతుంది అని చెప్పగా...అని గర్వం తో అంటుంటే...మెరిసే కళ్ళతో ఆశ్చర్యంగా ఎలా అన్నట్టు చూసింది...నాన కి రాసిన లేఖ గురించి చెప్పా... మౌనం గా వినింది...

లేచి నించొని....మీ నాన్న ని అమ్మ ని కలపాలి అని నీకు ఎప్పుడు అనిపించ లేదా....ఈ లేఖ వాళ్ళని కలపడానికి ఎప్పుడో రాసి ఉంటే....మనకి ఈ బాధలు ఉండేవి కావుగా అని అంటుంటే ....నాకు నోట మాట రాలేదు !!!!!!!



Rate this content
Log in

Similar telugu story from Drama