STORYMIRROR

Aswini " sanketh "

Drama Inspirational

4.2  

Aswini " sanketh "

Drama Inspirational

సంసార - సాగరం

సంసార - సాగరం

4 mins
649


సరయు: సాగర్!! సాగర్!! లే ..ఆఫీస్ కి టైమ్ అవుతుంది..ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఈ సరుకులు కొనడం మరచి పోకు..

సాగర్: అబ్బా!! ఏంటి,సరయు.. ఎప్పుడూ చూసిన సరకులు గొడవెనా..కొంచం సరసం గురించి కూడా ఆలోచించవే..

నన్ను వారం నుండి పస్తులుంచుతున్నావు..అంటాడు దగ్గరికి వచ్చిన భార్యని చేరదీస్తు..

సరయు: సరసం..సరసం..అంటూనే..మన ఇంటి సరుకుల లిస్ట్ సంవత్సరానికి ఒక సారి పెంచుతున్నావూ..అంటుంది భర్తనీ ముద్దుగా ముద్దు పెట్టుకొంటూ లేపుతూ..

సాగర్: దగ్గరికి వచ్చిన భార్యని తాకే లోపే,దూరంగా జరిగే సరికి..రాక్షసి !! ఆశ పెట్టీ ఆవిరి చేసే రకం నువ్వు అంటూ.. పెళ్ళాన్ని ముద్దుగా తిడుతూ బాత్ రూమ్ లోకి వెళ్తాడు..

ఫ్రెష్ అప్ అయిన సాగర్: సరయు ..టిఫిన్...అంటాడు..

సరయు: అక్కడే పెట్టా కదా!! అంటుంది వంట గదిలోంచి..

సాగర్: ఇక్కడే పెడితే నిన్నెందుకు అడుగుతా!! అంటాడు..

సరయు వచ్చి చూసే సరికి,సాగర్ టిఫిన్ తింటూ వుంటాడు..

సరయు: ప్లేట్ లో ఒక దోశ వేస్తూ..సాగర్ వీపు పై ఒక దోశ వేస్తూ..ఏంటి ఈ పరాచికాలు అంటుంది..

సాగర్: వీపు రుద్దుకుంటూ అబ్బా..నీకు దోశలు వేయడం బాగా వచ్చింది అంటాడు..

సరయు: ఆహా..సంతోషించాను గాని..ఈవెనింగ్ వచ్చేటప్పుడు సరకులు మరచి పోకు అంటుంది..

సాగర్: మల్లె పూలు కూడా మరచి పోను అంటాడు కన్ను కొడుతూ..

సరయు: అవి చెప్పక పోయినా తేస్తావుగా అంటుంది..చంక లోని బాబుని నేల మీదకి దించుతూ..

సాగర్: ఆఫీస్ కి వెళ్తాడు..

ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ..ఇంటి కర్చులు పెరుగుతూ వున్నాయి..సాగర్ జీతం నెల అయ్యే లోపే తరుగుతూ వుంటుంది..

పిల్లలు పెద్ద వాళ్ళు అవుతూ వున్న కొద్ది..వాళ్ళ కర్చులు,ఇంటి కర్చులతో..తెచ్చిన డబ్బు నిముషాల్లో ఆవిరి అయి పోయి..

సాగర్ జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా అవుతుంది..

సాగర్ కి రాను రాను చిరాకు వస్తుంది.. ఈ సంసారాన్ని నెట్టుకు రావడం కష్టంగా వుంటుంది..

ఒక్కోసారి ఏటైన వెళ్లి పోవాలి అనిపిస్తుంది..కానీ బార్య,బిడ్డలు అనే బంధం ఆపుతుంది..

దాని వలన అప్పులు చేయడం కూడా చేస్తున్నాడు..వాటికి, నెల నెల వడ్డీ కట్టలేక నరక యాతన అనుభవిస్తూ.. అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను అని బాధ పడుతున్నాడు..

ఇంతలో..

అమ్మ: సాగర్!! సాగర్!! లేరా!! ఆఫీస్ కి టైమ్ అవుతుంది..

సాగర్: మంచం మీద నుండి దిగ్గున లేచి,అమ్మని చూసి..చుట్టూతా చూసి..అబ్బా!! ఇధి కల ..కల లోనే సంసార జీవితం ఇంత భయంకరంగా వుందే..ఇక నిజ జీవితం అయితే..బాబోయి నాకు వద్దు అనుకుంటాడు.

అమ్మ: ఏం వద్దు రా??

సాగర్: అదీ.. ఏం..లేదు..

అమ్మ: ఏంటో!! పిచ్చి సన్నాసి ,రాత్రి అంతా సినిమాలు చూడడం ..తెల్లవార్లూ కలలు కనడం అనుకుంటూ వంట గదిలోకి వెళ్తుంది..

సాగర్: బాబోయి హెడ్ బాత్ చేస్తే గాని.. ఈ హెడ్ పెయిన్ తగ్గేలా లేదు అనుకుని బాత్ రూం లోకి వెళ్తాడు..

(ఇంతకీ అసలు ఈ కల ఏంటి అంటారా!! మన వాడికి అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది..

ఇంతలో రాత్రి "అమ్మో!! ఒకటో తారీఖు మూవీ "చూసి మనోడు పడుకున్నాడు.. అందుకు ఇలాంటి కల వచ్చింది బాబు గారికి..)

అమ్మ: రేయ్ సాగర్,ఈవెనింగ్ త్వరగా రా..పెళ్లి చూపులకి వెళ్లాలి..

సాగర్: నిన్ననే గా, పెళ్లి సంబంధాలు చూస్తాను అన్నావు.. ఈ లోగా పెళ్లి చూపులా?? అంటాడు..

అమ్మ: అదెంత సేపు రా..రాత్రి శర్మ గారు అమ్మాయిల ఫొటోస్ వాట్స్ ఏప్ లో పంపించారు..అందులో నాకు, నచ్చిన అమ్మాయిని ఈ రోజు చూడడానికి వెళ్దాం అం

టూ..నీ ఫోన్ కి అమ్మాయి ఫోటో పెట్టా..చూసి చెప్పు ఎలా వుందో అంటుంది..

సాగర్: అమ్మా!! ఈ పెళ్లి చూపులు అవీ వద్దే అంటాడు..

అమ్మ: రేయ్ సాగర్!! నిజం చెప్పారా?? నీకు అసలు పెళ్లి చేసుకోవాలి అని వుందా?? లేదా??

సాగర్: పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టముండదు అమ్మ!! కానీ,దాని తర్వాత వచ్చే కష్టాలు అంటేనే బయం..అందుకే అప్పుడే వద్దు అంటున్నా అంటాడు..షూస్ కి లేస్ కట్టుకుంటూ..

అమ్మ: రేయ్ మునిగి పోతాం కదా!! అని, నీటి లోకి వెళ్ళక పోతే ఈత ఎలా నేర్చుకుంటాం రా??

సాగర్: అంటే ఈత నేర్చుకోవటం కోసం మునిగి పోవాలా?? దాని కన్నా ఈత మానేయడం నయం అంటాడు..

అమ్మ: ఏడ్చి నట్టు వుంది..ఈత నేర్చుకుంటే నే కదరా!! సముద్రాన్ని ఈదగలవు..

సాగర్: అసలు నాకు ఈతే వద్దు అంటే..మళ్లీ సముద్రం అంటావెంటి..??

అమ్మ: రేయ్,నీతో వాదించి నేను గెలవలేని గాని,ముందు నువ్వు ఆఫీస్ కి వెళ్లి రా!!పో..

అంటూ ..

రేయి.. పుట్టిన ప్రతి జీవికి " సాగరం అనే జీవితంలోకి సంసారం అనే నావ రావడం తప్పని సరి రా!! " అంటుంది..

సాగర్: ఆఫీస్ కి వెళ్ళిపోతాడు..

ఆ ఆఫీస్ లో సాగర్ ఒక్కడే టైమ్ కి వచ్చేది..మేనేజర్ తో సహా అందరూ లేట్ గానే వస్తారు..అడిగితే ఇంట్లో లేట్ అయ్యింది అంటారు..నాకు ఎందుకు లేట్ అవ్వలేదు అని సాగర్ అడిగితే.. నీకూ పెళ్లి కాని, అప్పుడు నీకే తెలుస్తుంది అంటారు..

సుబ్బు: రేయ్,మావ!! నాకు ఒక 5 తౌజెండు అప్పు ఇవ్వరా??

సాగర్: అదేంటి రా!! మొన్నే గా జీతం తీసుకున్నావు.. ఈ లోగానే అప్పా??

సుబ్బు: నీకు ఏం తెలుస్తాయి రా!! మా పెళ్లి అయిన వాళ్ళ కష్టాలు..జీతం రాళ్లు జీతం వచ్చిన మూడు రోజులకే చెట్నీలో వేసిన పప్పులా కనపడకుండా పోతాయి అంటాడు..

సాగర్: సరే లేరా ఇస్తా!!చస్థానా!!

అందుకే ఈ పెళ్లిళ్లు అంటే భయం..సంసారం ఒక చదరంగం అని ఎవరన్నారో, గాని చక్కగా చెప్పారు..గెలవాలి అంటే చాలా కష్టం..అడుగడుగునా ఆటంకాలు అనుకుంటాడు మనసులో..

ఎన్ని చెప్పినా,ఎన్ని చేసినా.. అమ్మ మాట ప్రకారం సాగర్ పెళ్లి చూపులకి వెళ్ళడం..అక్కడ అల ( అలివేలు మంగ తాయారు) నచ్చడం..పెళ్లి జరిగి పోవడం అన్ని అయిపోయాయి..

కానీ,సాగర్ కల్లో వచ్చినట్టు తన జీవితం లేదు..ఎందుకంటే అల మొదటి రాత్రే భర్తతో తనకి ఉద్యోగం చేయడం ఇష్టము అని చెప్పి, ఉద్యోగంలో జాయిన్ అయ్యింది..

అలా సాగర్,అల ఇద్దరూ డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళకి, నెల చివరి అవుతున్నా కూడా.. చేతిలో డబ్బులు వుంటూ వచ్చాయి..

ఎప్పుడూ కూడా సాగర్ ఎవ్వరి దగ్గర అప్పు అడగలేదు..పిల్లలు పుట్టి, పెరిగి, పెద్దవాళ్ళు అవుతున్నా.. వారు ఇరువురు సంపాదిస్తున్న డబ్బుని ఒక ప్రణాళిక ప్రకారం కర్చు పెట్టుకుంటు..వారి సంసారాన్ని చక్కగా సాగిస్తున్నారు..

ఆ విధంగా " సాగర్ జీవితం లోకి సంసారం అనే నావ వచ్చినా.. అల అనే తన భార్య తెడ్డులా సహాయ పడుతూ.. ఆ నావని చుక్కాని చేరడానికి తన వంతు సాయం చేసింది "...

కథ సమాప్తం..

జీవితం లోకి కష్టాలు వస్తాయి, అనీ జీవితమే వద్దు అంటే ఎలా..అలాగే సంసారంలో ఆటుపోట్లు వుంటాయి అని పెళ్లి అనేది వద్దు అనడం కంటే..

ఆలూ, మగలు ఇద్దరూ కష్ట పడి సంపాదించి ఆ జీవితాన్ని ఆనందంగా గడప వచ్చు కదా..అంతే గాని ఇంకా పాత కాలం లాగే భార్య ఇంటికే పరిమితం అంటే ఎలా..

ఎవర్ని కించపరచాలని అని కాదు..ఎవర్ని బాధ పెట్టాలి అని కాదు..

నేటి కాలంలో భార్య,భర్త ఇద్దరూ సంపాదించాలి అనేది నా ఉద్ధేశ్యం అంతే..


Rate this content
Log in

Similar telugu story from Drama