Ravi Teja Boppudi

Tragedy

4.7  

Ravi Teja Boppudi

Tragedy

సన్నాసితో పెళ్ళి

సన్నాసితో పెళ్ళి

4 mins
642


ఇది నిజంగా జరిగిన సంఘటన. పేర్లు మార్చబడినవి.


శివకి కాలేజీలో క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వచ్చింది. కాలేజీ అయిపోయాక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ట్రైనింగ్ అయిపోయాక, చెన్నైలో పోస్టింగ్ వేశారు. అతని ప్రాజెక్టులో అందరూ తమిళ వాళ్ళే ఉన్నారు.


ఒక ఆరు నెలల పాటు అలానే సాగింది. పెద్దగా ఎవరూ స్నేహితులు అవ్వలేదు.


ఇంతలో ఓ రోజు, తన పక్క క్యూబికల్ లో ఉన్న టీం వాళ్ళ ఆన్-సైట్ కో-ఆర్డినేటర్ సీత అమెరికా నుండీ తిరిగి వచ్చింది. 


సీత శివ కన్నా మూడేళ్ళు పెద్దది. ఎప్పుడూ చక్కగా నవ్వుతూ ఉండేది.


"అలా ఉండటం చాలా కష్టం. అసలు అలా ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఉండటం ఎలా సాధ్యం", అని మనసులో అనుకున్నాడు శివ. మెల్లగా పరిచయం ఏర్పడ్డది. సీతకి లక్ష్మి అనే ఇంకో ఫ్రెండ్ ఉంది. శివకి ఆడవారితో పెద్దగా పరిచయం లేదు. అందులోనూ సీత, లక్ష్మి ల బాష కూడా వేరు. వయసులో పెద్దవారు. మెల్లగా, రోజులు గడుస్తున్నా కొద్దీ, ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.


రోజూ కలిసి భోజనానికి వెళ్లేవారు. వారిద్దరిదీ చెన్నై అవ్వడంతో ఇంటి నుండే క్యారేజ్ తెచ్చుకునేవారు. వాళ్ళు తెచ్చుకున్న కూరలు శివతో షేర్ చేసుకునేవారు. 


ఇదీ అదీ అని లేకుండా ఎవరి కష్టాలు వారు చెప్పుకునేవారు. ఒక రోజు, సీతకి ఇంట్లో ఒక సంబంధం చూసారు. అబ్బాయి అదే క్యాంపస్ లో పనిచేస్తున్న మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మాట్లాడుకున్నారు. సంబంధం ఓకే అయ్యింది. కట్నకానుకలు కింద కారు కూడా. 


ఒక రోజు, శివ సీత క్యూబికల్ లో తన డెస్క్ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది (తమిళంలో) - 


"నా ఫ్రెండ్స్ కి ఎంగేజిమెంట్ అయిన సందర్భంగా పార్టీ ఇచ్చాను. బిల్ 9000 అయ్యింది. సగం నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చెయ్యి".అది చదివి మౌనంగా ఉండిపోయింది. అప్పుడు శివ, "what happened?", అని అన్నాడు. సీత జరిగిందంతా చెప్పింది. అప్పుడు శివ ఇలా అన్నాడు -


"what is this seetakka...! idiot fellow. He's not the right guy. This is a re-flag. Call off the wedding".


అయినా సీత ఎంగేజ్మెంట్ అయిపోయింది. పేరెంట్స్ బాధ పడతారు అంటూ సర్దిచెప్పుకుంది. నాలుగు రోజులు గడిచింది. సీత సైలెంట్ గా ఉండటం గమనించి -


శివ: what happened? you look so dull... are you alright?


సీత ఫోన్ తీసి మెసేజ్ చూపించింది. అది కాబోయే భర్త నుండి. ఇలా -


"so what? every woman has it. you are coming to the trip. that's it. no more discussions".


శివకి అర్థం కాక, అసలేమైంది అని అడిగితే, "ఏదో తెలిసిన వాళ్ళతో బీచ్ ప్రోగ్రామ్ ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మంటున్నాడు. నాకు పీరియడ్స్ వస్తున్నాయి, ఇబ్బందిగా ఉంటుంది. నేను రాలేను అన్నాను. దానికి రిప్లై ఇది", అని చెప్పింది. 


శివ: seeta... this is your last chance. please, call off the wedding. 


సీత: I can't. the marriage is in the next month. my parents won't be happy.


శివ: you parents will understand. they must understand. please tell them. this is your lifeసీత ఇంట్లో చెప్పింది. అయినా వాళ్ళ ఇంట్లో తననే సర్దుకోమన్నారు. పెళ్ళి జరిగిపోయింది. కానీ, తర్వాత జీవితం దారుణం. 


పిల్లలు పుట్టే వరకు, ప్రతి నెలా జీతం మొత్తం అతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయేది. 


ఇంట్లో పనిలో ఎలాంటి సహాయం ఉండేది కాదు. 


రుతుక్రమ సమయంలో కూడా. "అయితే ఏంటి? అందరి ఆడాళ్ళకి వస్తుంది. చెయ్యి", అనేవాడు. 


క్రమ క్రమంగా మొహాన నవ్వు అనే ఆనవాళ్లు లేకుండా అయిపోయింది. 


ఇంతలో పాప పుట్టింది. కొడుకు పుట్టలేదు అని కనీసం హాస్పిటల్ కి కూడా రాలేదు. పాప పుట్టిన మొదటి సంవత్సరంలో ఒక్కసారి కూడా ఆ పాప మొహం కూడా చూడలేదు. 


తర్వాత ఏదో పంచాయితీ చేసి ఒకచోట చేర్చారు. మళ్ళీ ఇబ్బందులు. ఇంకా అద్జుస్త్ అయిపోయింది. ఏది జరిగినా కూతురి కోసం అన్నీ భరిస్తోంది. 


ఇంతలో మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది. డెలివరీ అయ్యేవరకూ కూడా బాబు కాకపొతే ఎలా అని కంగారుగా ఉండేది. అదృష్టం కొద్దీ బాబు పుట్టాడు. 


కానీ, ముందు పుట్టిన పాపని, ఇప్పుడు పుట్టిన బాబుని ఒకేలా చూస్తారా? సీత కష్టాలు ఇంకా తీరలేదు. తీరవు కూడా! భవిష్యత్తు వీడితో కరెక్టు కాదు అని అర్థం అయ్యి కూడా, తల్లిదండ్రుల కారణంగా చేసుకుంది. ఇది కరెక్టా? 


తప్పెవరిది? సీత దా? ఆమె తల్లిదండ్రులదా? నేనైతే సీతదే అంటాను. వాళ్ళ అమ్మా నాన్నా వారి స్వార్థం చూసుకున్నారు. డబ్బూ-పరువు అనుకుంటూ. 


మరి సీత?


అందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు అయినంతమాత్రాన, అన్ని విషయాలు వారికి తెలుసు, అన్నీ కరెక్టే చేస్తారు అని అనుకోవద్దు. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. 


మీరు ఎంచుకున్న సంబంధం అయినా ఫెయిల్ అవ్వొచ్చు. తల్లిదండ్రులు చూసిన సంబంధమైనా ఫెయిల్ అవ్వొచ్చు. కానీ, ఇది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు, ఎవరు నొచ్చుకున్నా కూడా తల వొంచొద్దు. 


సీతకి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ముందే హింట్స్ వచ్చాయి. కానీ, ఏం ఉపయోగం?సీత లాంటి ఆడవారు, మగవారు ఎంతో మంది ఇలా బలి అవుతున్నారు. ఈ కథలోని శివను నేనే! ఇందులో ఉన్నదంతా నిజమా అని డౌట్ వద్దు. నేను ఇంకా చాలా తక్కువ రాశాను.


Rate this content
Log in

Similar telugu story from Tragedy