స్నేహబంధమూ ఎంతమధురమూ!
స్నేహబంధమూ ఎంతమధురమూ!


మేము హిండన్ లో ఉన్నప్పుడు సన్నజల్లులు మొదలవుతున్నప్పుడు మా ఫ్రెండ్ విజయలక్ష్మి మా ఇంటికి వచ్చింది.
మేమిద్దరం ఒకటే వయసు కావటాన మా భావస్వారూప్యం కలవడం వలన ఒకరి సమక్షం మరొకరికి ఎంతో సంతోషంగా ఉండేది.
ఇద్దరికీ పుస్తకాలు, సంగీతంఇష్టం వర్షం వెన్బెల ఇష్టం
అందుకని వర్షమొస్తే డల్ గా ఇంటిలో ఉండకూడదన్నమాట! అందుకే తనొచ్చాక వర్షం పడుతున్బా ఇద్దరం కలిసి ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఉన్న క్వార్టర్స్ దాటి పచ్చని చెట్లు ఉన్న రోడ్ లో నడుస్తున్నాము. ఆ మధ్యాహ్నం ఆ వర్షంలో నిలువెల్లా తడిసిపోయి, వానపాటలు గట్టిగా పాడేసుకుంటూ మేమిద్దరమే ఆ రోడ్ లో నడవడం గిరగిర తిరగడం ఎప్పటికీ మర్చిపోలేము.
తాళ్ సినిమాలో "తాల్ సే తాల్ మిలా! సాంగ్ లోలా అన్నమాట! తర్వాత ఆసినిమాలో ఆపాట చూస్తే మా స్నేహం గుర్తొస్తుంది.
పక్కనే చిన్నకాల్వ ఈ లోగా సైకిల్ మీద మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా కోసం కొన్న స్నాక్స్ ఇచ్చి మా ఆనందాన్ని భంగపర్చకుండా వెళ్లిన మా శ్రీవారు.
ఇంకేంకావాలి?
అలాగే వెన్నెల.రాత్రిళ్లు వెన్బెలపాటలలో పరవశించేవాళ్లం. ఇద్దరికీ ఒకే ఇష్టాలున్న జంటలే కాదు స్నేహితులు కూడా అంతే అదృష్టవంతులు.