Changalvala Kameswari

Inspirational

4.7  

Changalvala Kameswari

Inspirational

రంగుల జీవితం

రంగుల జీవితం

3 mins
466



  "రంగుల జీవితం!

"ఇవాళ మెహందీ ఫంక్షన్ కదాఎంతమందొస్తారు?

అనడిగిన తండ్రి రఘురామ్ మాటలకు

నా ఫ్రెండ్స్ పదిహేను మన కాలని వాళ్లు ఇరవైమంది మనవాళ్లొక ఏభయి మంది అంతే నాన్నా అంది దివ్య.


కూతురి మాటలకు "సరే! ఆ బ్యూటీషియన్ బ్యాచ్ కు మన లొకేషన్ పంపించు వాళ్లొక పదిమందుంటారు. అన్న తండ్రి మాటలకు సరే అన్న కూతురిని మురిపెంగా చూసుకుంటూ " మా పెద్దాళ్లమందరం మామయ్య తెచ్చిన గోరింటాకే పెట్టుకుంటాము. మీ కుర్రగ్యాంగ్ కే మెహందీ! అన్న తల్లి గిరిజ మాటలకు నవ్వేస్తూ


తెలుసమ్మా తెలుసు ! మీ బ్యాచ్ పక్కా సనాతనం కాటుకలు తిలకాలు కుంకాలు మట్టిగాజులు గోరింటాకులు ఇవేగా ఇష్టం ఆ ఆరంజి బిళ్లలు తినిపించు కనీసం లిప్ స్టిక్ వేసుకోకపోయినా ఫొటోల లో అందంగా ఉంటారు. అన్న దివ్య మాటలకు


దివ్య మేనత్త "మేమెలా ఉన్నా పర్వాలేదే!

మీ అందరి మెరుపుల ముందు మేమెంత ! అనగానే అక్కడున్న మిగతా అందరూ నవ్వేసుకున్నారు.


సాయంకాలం అయిదవుతుండగానే వచ్చిన బ్యూటీషియన్ బ్యాచ్ అందరికీ కాఫీలు టిఫిన్ లు ఇచ్చేసరికి ఒకరొకరుగా రకరకాల రంగుల దుస్తులతో ఒకరినిమించి మరొకరు పోటీ పడుతూ వచ్చిన అమ్మాయిలందరి నవ్బులు కబుర్లలతో ఆ పెళ్లి ప్రాంగణం రంగుల వెలుగులతో కళకళలాడుతోంది.

ముందుగా పెళ్లికూతురు దివ్య కు రెండు చేతులకు అందం గా గోరింటాకు కోన్ లతో డిజైన్ లు పెట్టి అందరిమద్య లో వేసిన కుర్చీలో కూర్చోపెట్టారు.

కిందా పైనా గా కూర్చున్న వాళ్లు కొందరు రుబ్బిన గోరింటాకు పెట్టుకుంటున్నారు మరికొందరు బ్యూటీషియన్ తో వచ్చిన అమ్మాయిల చుట్టూ చేరి మాకు ముందంటే మాకు ముందంటూ చేతులు చాస్తున్నారు.

మరి కొందరు మారుతున్న మ్యూజిక్‌ లకు పాటలకు అనుగుణంగా స్టెప్ లు వేస్తున్నారు.

అందరినీ చూస్తూ నిర్లిప్తంగా ఒక పక్కగా కూర్చుని ఉన్న నీరజ ను చూసిన బ్యూటీషియన్ రాధిక నొసలు ముడివడింది.

ఎక్జడో చూసినట్లుంది అనుకోగానే గుర్తొచ్చింది. పెళ్లికూతురు కి పిన్ని వరసావిడ అని "ఆవిడేమిటి మెహందీ పెట్టుకోదా! అనడిగిన రాధిక మాటలకు ఒకావిడ సాగదీసుకుంటూ "ఆవిడ పెట్టుకోదు పెట్టుకున్నా చూడటానికి మురియడానికి ఎవరున్నారని అతను పోయాడుగా! అందుకే పెట్టుకోదు. అనగానే రాధిక తృళ్లిపడింది.


అయ్యో దానికి దీనికి సంబంధం ఏముందీ! చిన్నప్పటినుండీ పెట్టుకునేదేగా! మీరెవరూ చెప్పరా? అనడిగింది.

మాకెందుకూ తీరా అడిగాక చిన్న బుచ్చుకుంటే ఏడిస్తే మమ్మల్నంటారు!

అంటూ వెళ్లిందావిడ .

తాను పెడుతున్న ఆవిడ చేతిని తన అసిస్టెంట్ గోపిక కు ఇచ్చి పెట్టమని తిన్నగా నీరజ దగ్గరకు వెళ్లింది రాధిక .

చిరునవ్వుతో పలకరించిన నీరజ చేయి పట్టుకుని "చనువుగా రండి నేను గోరింటాకు పెడతాను మీ చేతికి " అంది నీరజ.

ఆ మాటకు కాస్త తొట్రువడి "వాళ్లందరికీ అవనీండి !చివరన చూద్దాము" అంది నీరజ.

అదేంకాదు. రండి! అని గోరింటాకు ముద్ద ను చేతులకు అలంకరించుకుంటున్న ఆడాళ్ల దగ్గరకు వెళ్లి ఒక కప్ లో గోరింటాకు ముద్ద తెచ్చి నీరజ చేతికి పెట్టడం ప్రారంభించింది. రాధిక.

అది చూసి "వద్దమ్మా! మా వాళ్లకు ఇష్టం ఉండదు. అనంటున్న నీరజ బెదురు చూపులను చూసి దేనికి అంటూ చూస్తున్న రాధిక చేతిలో గిన్నె లాక్కుంది ఒకావిడ అక్కడ సుమంగుళందరుండగా ఈవిడకి తొందరొచ్చిందా! అయినా అలా కూర్చోకపోతే ఎవరికైనా పెట్టొచ్చు కదా నీరజా! అనంటున్న ఆవిడ మాటలకి రాధిక ఆవేశం గా 'తప్పు మేడమ్! మనం ఆడవాళ్లం

అందం అలంకరణ మన సొంతం ! అన్నీ మనకి అన్నం పెట్టిన అమ్మే నేర్పిస్తుంది. అందుకే ఆడవాళ్లకి అందంగా అలంకరించుకోవడం అలవాటవుతుంది.

అన్నిరంగుల సమన్వయంతో పెరిగిన స్త్రీలను ఆ రంగులకు దూరం చేయకూడదు.


తెల్లని ముగ్గు వేసినా గడపకు పసుపు రాసినా గుమ్మానికి ఆకుపచ్చ తోరణం కట్టినా, నుదుట ఎర్రని బొట్టు పెట్టుకున్నా చేతిన గోరింటాకు, తలలో రంగురంగుల పూలు పెట్టుకున్నా ఆడవాళ్లకి అన్ని రంగులూ ముఖ్యమే! వాటిని ఏదో కారణాలు చూపి, వారిని చిన్నబుచ్చడం ఆ రంగులకు , ఆ అందాలకు, ఆ అలంకరణల కు, దూరం చేయడం చాలా తప్పు! నాతో వచ్చిన పదిమందిలో నలుగురు నీరజ గారిలా సింగిల్ గా మిగిలిపోయినవారే !వారు అలా మామూలుగా అందరిలా ఉన్నారంటే వారింటివాళ్ల గొప్ప !మనసే! మనం కూడా స్త్రీ లను గౌరవించాలి. కేవలం పురుషులే కాదు.

ఇలా భర్త లేని స్త్రీలను మూర్ఖత్వంగా అడుగడుగునా కించపరిచే జాతి మన స్త్రీ జాతే ! వారి చేతి తో అందుకోరాదనుకోవడం, వారికేది ఇవ్వకూడదు అనుకోవడం సంకుచితం! కాలానుగుణం గా అందరూ సంస్కారవంతంగా మారాలి". అని అన్న రాధిక మాటలకు అందరూ చప్పట్లు కొట్టేసరికి గోరింటాకు గిన్నె లాక్కున్నావిడ ఆ గిన్నె అందించి మౌనంగా వెళ్లిపోయింది.

తన చేతులకు గోరింటాకు చకచకా పెట్టేస్తున్న రాధిక ను చూసి "ధాంక్స్ " అని అంటున్న దివ్యను దివ్య తల్లి గిరిజను చూసి సంతోషంగా నవ్వింది నీరజ.

చెంగల్వల కామేశ్వరి9849327469



Rate this content
Log in

Similar telugu story from Inspirational