STORYMIRROR

Sneha Sneha

Drama Romance Inspirational

4  

Sneha Sneha

Drama Romance Inspirational

సీత కళ్యాణం......

సీత కళ్యాణం......

1 min
2

గుండె గాయాల్ని లేపుతూ  కన్నీటి చుక్కలు ఆవేదనై కళ్ల అంచులకే అంటుకున్నాయి 

  ఆ చిన్న గదిలో నిశ్శబ్దం కూడా సీత పక్కనే కూర్చొని మౌనం  గా ఏడుస్తున్నట్టే అనిపించింది......

 పగిలిన అద్దం ముక్కలాగ సీత  హృదయం ప్రతి దానికి జవాబు  కోసం  ఎదురు చూస్తుంది 

 కానీ ఎవరూ మాట్లాడటం  లేదు  జవాబు ఇచ్చే వాళ్ళేరి గోడలూ నిశ్శబ్దం… 

 కిటికీ   తలుపు మెల్లగా ఊగుతూ సీత ఒంటరితనాన్ని మరింత బట్టబయలు చేస్తోంది.....

 చేతుల్లో వణకుతున్న పాత డైరీని ఆమె మోకాలిపై ఉంచుకుని 

ఒక పేజీ‌ని నెమ్మదిగా వేలితో  తిప్పింది.

 ఆ పేజీపై ఎండిపోయిన నీలిరంగు ఇంక్ అవి సీత  రాసిన మాటలు కాదు ఆమె అనుభవించి  తట్టుకున్న అనుభవాలా గాయాల గుర్తులు.....

 ఒక్కో అక్షరం  ఒక్కో చుక్క కన్నీటి  బొట్టు .....

 ఎందుకు జీవితం  నన్ను  ఇంతగా పరీక్షిస్తుంది.....

 సీత మనసు లోపల తనని తనే  నలిగిపోతు ప్రశ్నించుకున్న  ప్రశ్న   జవాబు మాత్రం  గది మూలల్లో పోగై ఉన్న జ్ఞాపకాలేగాని   జీవితం కాదు.....

 అయినా ఆ రోదన మధ్య 

ఒక శ్వాస…

ఒక ఆశ…

ఆమె మనసులో నెమ్మదిగా తలెత్తుతోంది.....

 ఇక్కడ నుంచి సీత  కథ తిరగబోతుంది…

గాయం నుండి శక్తి పుడుతుంది 

 అంటే

 మనం సీత ని చూసి తెలుసుకోవాల్సిందే 

సీత తిరిగి తన ఆశలకు చిగుర్లు వేసుకొని  మళ్ళీ  తన జీవితాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.....

 **********

కథ కొనసాగుతుంది..... 


Rate this content
Log in

Similar telugu story from Drama