Yaswanthkumar Aturi

Drama

4.5  

Yaswanthkumar Aturi

Drama

రాచపాలెం జాతర

రాచపాలెం జాతర

3 mins
254



ఏ రాజ్యానికైనా ఒకే రాజుంటాడు. కాని మా ఊరిలో అందరూ రాజులే…. రాజుల ఊరే రాచపాలెం.మా ఊరిలో విధికొక్క గంగమ్మ ఉండదు.ఊరికి ఒకే గంగమ్మ…ఊరిని కాపాడేమ్మా...మా తల్లి… 

ఈ జాతరలో అందరము,ఆనందము,అందము, సంప్రదాయాలు, కళలు,హింసతో పాటు ఊరిపై అధికారం సంపాదించడానికి, పెత్తనం చూపించేవారికి పోట్లాడుకోవడానికి కలిసొస్తాది.

మా ఊరి ఆడవాళ్లు గంగమ్మకు అంబిళ్ళు పోయడానికి, ఆ అంబిళ్ళ కడవలు నెత్తిమీద పెట్టుకొని పలకలోళ్లతో నడుస్తూ,గంగమ్మ గుడికి వస్తున్నపుడు ఆ పలకల నుంచి వస్తున్నా తీవ్రమైన పలకల ధ్వనులతో, శక్తి స్వరూపాలైన మా ఊరి ఆడవాళ్ల మువ్వల రవళితో ఏకమైనప్పుడు… 

మా ఊరిలో ప్రతి ప్రకృతి అణువులో గంగమ్మ నృత్యం చేస్తుంది.

 నేను కొత్తచొక్కా, ప్యాంటు వేసుకుని

అంబిళ్ళు పోస్తున్నా చోట నుంచి పరిగెత్తుకుంటూ బొమ్మల అంగడికి వెళ్లి, ‘నాకు ఆ బొమ్మ కావాలని ‘అడిగితే.. అంగడామా డబ్బులు అడిగితే, లేవని చెప్పాను. ఆమె డబ్బులు తీసుకురా అని కోప్పడింది.. నేను ఆ బొమ్మతో ఆడుకొనే ఆనందము పొందలేదు. అక్కడి నుంచి పక్షిలా ఎగురుకుంటూ అంకాలమ్మ గుడి దగ్గర మేకపోతులు పొట్టేళ్లు బలిస్తున్నా చోటకు వచ్చాను. మేకపోతుల పొట్టేళ్ల తలలు నరకడం చూస్తూ..మొండం నుంచి వస్తున్నా రక్తాన్ని చూస్తూ… నాకు తెలియకుండా ఆనందాన్ని, అయ్యో !పాపం అనే భావాన్ని నాలో పుట్టాయి. 

ఎందుకంటే మనిషి మెదడు హింసని కోరుకుంటుందట...

అంకాలమ్మ ముందుండే నేలపై నెత్తురుతో తడిసి...

హింసకి నుదిట బొట్టులాగుంది. ఆ ఎర్రటి రక్తమును చూసి 

ఊరిలో వీధిదారులకు కట్టిన వేపాకుల దండలు గాలితో కలసి ఆ హింసను చూసి తట్టుకోలేక విలవిలాడుతుంటే… అక్కడనున్న వాళ్ళు ఆ బలిచ్చిన జీవులను భుజాలమీద వేసుకుని పోతున్నారు. ఊరికి రక్ష కల్గించే గంగమ్మ కోసం నీలి రంగుల కనులతో ఎదురుచూస్తుంది.నీలంరంగు నుంచి వర్షం పడినప్పుడు వాననీళ్ళు చిన్న చిన్న కాలువలుగా విడివిడిగా ఎలా ప్రవహిస్తాయో మాఊరోళ్లు వాళ్ళ భావాలతో పనులతో ప్రయాణంచేస్తున్నారు. 

*****

ఊరులో వెలుతురు వెళ్ళిపోయి చీకటి వచ్చేసింది. 

గండు దీపాలతో చీకటిలో వున్నా ఊరికి స్త్రీలు జ్వలించే కాంతుల దారాలకు పువ్వులు చుట్టి గ్రామ దేవతకు సమర్పిస్తున్నారు.నిశిలో గంగమ్మ దివ్యకాంతులతో చిమ్ముతూ ఊరేగింపుగా వచ్చింది. ఈ ఊరేగింపులో పలకలు,కేకలు,కోకల చూపులు, హోరెత్తే శబ్దాలు,రేకెత్తించే సంగీతంతో మద్యంలో యువకులు ,యవ్వనంలో అమ్మాయిలు.. కొందరు తన్మయత్వంతో ఎగురుతుంటే.. మరికొందరు సిగ్గుతో వాళ్ళ లోపల ఎగురుతున్నారు… 

ఆ పలకల నుంచి వచ్చే అద్భుతమైన సంగీతానికి… ఆ సంగీతానికి ఎగిరే మాఊరోళ్లను చూసి గంగమ్మ కనులలో ఆనందం పసుపు-పచ్చ రంగులో మెరుస్తుంది. మొక్కులతో మాఊరోడు ఆమెను నెత్తి మీద ఆనందబరువు మోస్తున్నాడు.

ఒక్కడు ఎగిరేటప్పుడు వేరేవాడిని వెయ్యనియ్యకుండా చెయ్యడం.బాగా డబ్బునోళ్లు,పెద్దోళ్ళు ఎగిరేటప్పుడు వాళ్ళగుంపు చుట్టూ చేరడం. డబ్బు నోట్లు చూపిస్తూ..ఆ డబ్బును పలకకొటేవాళ్లకి ఇచ్చేయడము. ఎగురేటప్పుడు వేరేవాడు వస్తే వాడిని తోసెయ్యడము.. ఇలా ఎగరడము, వేషాలతో ఊరంతా తిరిగి గంగమ్మ గుడిలోకి వచ్చింది. మళ్ళీ రక్తపు నేల ఆమె ముందు… 

ఇళ్లలో ఏటను ముక్కలు ముక్కలుగా కుందుతుంటే.. 

కూరలు నోరుఊరేలా గుమగుమలాడే వంటలు చేస్తున్నారు.

వేషాలు వేసుకుని ట్రాక్టర్లో పాటలకు చిందులేస్తూ తిరగడం. జాతర చివరిరోజున ఊరిలో వేషాలు ఇంక వెయ్యకుండా బాసిరాజువాళ్ళు కడవలో పసుపు నీళ్లు ఊరినడివీధిలో చల్లడం. 

ముండ్లపాటోళ్లు మాత్రమే నగిరికంభం గంగమ్మకు నైవేద్యంగా ఇవ్వడం దానితో ఆకేటోళ్లు జీవిరక్తం కలిపి బలికూడు చల్లడం.

బలికూడు చల్లేసిన తరువాత.. గంగమ్మ పంబాలోళ్ళతో లంజముండాలాంటి బూతుల పాట పాడుకుంటూ కృష్ణంరాజు తోటలో జంజిలో కలిపేయడం.చివరిన మైదానంలో పేలే టపాసుల మోత చూడడానికి ఊరంతా వచ్చి చూడడం. ఆనందించడం.

****

ఈ జాతరలో ఆనందంగా అందంగా అందరూ కలిసి జరుపుకోవడానికి వెనకాల కాలానికి కన్పించని మనుసుల శ్రమ కష్టం ఉంది. ఇప్పుడు చెప్పేది వాళ్ళ కథ… 

వేపమండలు తెచ్చి, దానిని తోరణాలుగా ఊరులో ప్రతి వీధికి ఉండే కరెంటుస్తంబాలు ఎక్కి కట్టేవాళ్ళు వున్నారు. 

గంగమ్మ తల్లి విగ్రహన్ని తయారు చేసే.. ఆమెను ఆడబిడ్డగా భావించే కుమ్మరి వాళ్ళ ప్రేమ కళ ఉంది. 

పుట్టినిల్లు నుంచి అత్తగారిల్లు అయినా సాకల వాళ్ళ ఇంట్లో ఆమెను అలంకరణచేసి… ముస్తబించే వాళ్ళ ప్రాణం ఉంది. 

నమ్మకాలతో కనపడని శక్తుల నుంచి రక్షణ కల్గించడానికి వాళ్ళ ప్రాణాన్ని బలిగాపెట్టి, సతీమణులు వాళ్ళ ప్రాణాలు చేతులతో పట్టుకొని జాతరను జరిపే మాలవాళ్ళ త్యాగం, నమ్మకం ఉంది. 

కొంత సమయానికి టపాకాయలతో ఊరంతా వెలుగుల ఆనందం పంచిన… ఆ టపాసులు తయారుచేసే చీకటి బతుకుల శ్రమ ఉంది. 

పలకలోళ్లు,పంబలోళ్లు… ఇలా ఎందరో వాళ్ళ శ్రమ, పనుల ద్వారా అధికారాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు లేకపోతే జాతరకి ప్రాణం ఉండదు.ఊరికి అందం ఉండదు.మనకి ఆనందం కల్గదు. 

****

  • అధికారం కోసం ప్రయత్నంచడం మానవుడి సహజ లక్షణం.
  • ఒక్కరిపైనైనా పెత్తనం చూపించకుండా భూమిపైనా మనిషిగా బతకడం కష్టం. 
  • నీ రోజును ఆనందంగా గడపడం వెనకాల చీకటి గడపల మనుషుల శ్రమ ఉంది. 





Rate this content
Log in

More telugu story from Yaswanthkumar Aturi

Similar telugu story from Drama