STORYMIRROR

Tejaswani Kirankumar

Tragedy Inspirational

4  

Tejaswani Kirankumar

Tragedy Inspirational

ప్రేమే జీవితం కాదు కదా.....!

ప్రేమే జీవితం కాదు కదా.....!

5 mins
324

ఆ రోజు తెలీదు

నువు నా రాత లో లేవు అని

ఈ రోజు తెలిసిన నీతో అందుకున్న జ్ఞాపకాల పొదరిల్లు నన్ను నిలువునా కప్పేస్తుంది

నీకు గుర్తు ఉందో లేదో

ఆ రోజు నేను నీ కోసమే నువు వెళ్లే దారిలో పదే పదే నడిచేదాన్ని

అదేం విచిత్రమే

నీ ఇంటి ముందుకు రాగానే నాకు తెలియకుండానే నా కాలి మువ్వలు గల గలా మోగేవి

అవి అలా మొగుతుంటే నా మనసు మాట వాటికి అర్థమయి నిన్ను పిలుస్తున్నాయి ఏమో అని అనిపించేది

కుసుమ కుసుమ

ఎం చేస్తున్నావు

ఎం లేదు అమ్మ ఏంటి అని పలికింది గదిలో తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని తన డైరీ లో పెన్ అలానే వదిలేసి డైరీ మూసేస్తూ

కుసుమ కాస్త బజారు వరకు వెళ్లి రా

ఎందుకు అమ్మ

ఎగ్స్ అయిపోయాయి ర

అబ్బా ఇప్పుడు ఎందుకు అంట ఎగ్స్

మీ నాన్న డాబా ఎక్కారు గోపాల్ అంకుల్ తో

మరి ముందే చూసుకుని ఉంటే నాన్న నే తెచ్చేవారు కదా అని అన్నది కుసుమ వంట గదిలో తల్లి చేతిలోని ఎగ్స్ ట్రే ఇంకా డబ్బులు తీసుకుంటూ

చూసుకోలేదు బంగారం నా తల్లి వీ కదా వెళ్లి ర

హ్మ్ సరే అనుకుంటూ హల్ లో ఓ పక్కకి ఉన్న చెప్పులు వేసుకొని బయటకు నడిచింది కుసుమ

తనకి అప్పుడు ఆ క్షణం లో బయటకు రావడం ఇష్టం లేదు

అప్పుడు అనే కాదు కాని గత నాలుగు రోజుల నుంచి బయటకు రావాలి అంటేనే బాధగా ఉంది

ఆ వీధి అంత క్రిస్టియన్స్ అవ్వటం తో ప్రతి ఇంటి పై ఓ స్టార్ ఇంకా రంగురంగుల లైట్స్ తో కళ గా ఉన్నాయి

కాస్త చలిగా ఉండటం తో చేతులు రెండు ముడుచుకొని ముందుకు నడవసాగింది

మరో ఇరవై అడుగులు వేస్తే ఆ ఇల్లు వస్తుంది

ఆ ఇంటిని చూడటం కోసమే కదా కాదు కాదు ఆ ఇంటిలోని ఓ వ్యక్తి నీ చూడటం కోసం తను ఈ రోడ్ ద్వారా కాలేజ్ కి వెళ్తూ ఎంత ఆరటపడేది

ఈ రోజు ఆ ఇంటి వైపు చూడాలి అంటే తనకి భయంగా ఉంది

ఆ ఇల్లు మొత్తం విద్యుత్ దీపాలతో ధగధగా మెరుస్తుంది

ఆ ఇల్లు దగ్గర కు వెళ్ళగానే పెళ్లి ఇంటి వాసన గుబాలించింది

ఆ ఇంటిని చూడకూడదు చూడకూడదు అనుకుంటుంనే ముందుకు సాగింది కుసుమ

ఎలానో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది

కానీ ఆమె గుండెల్లో గుబులు అలానే ఉంది

షాప్ లో ఎగ్స్ తీసుకొని ఇంటికి వెనుతిరిగింది

ఆ వీధిలో ఏదో జ్ఞాపకం ఆమె మదిలో మెదిలేసరికి అనుకోకుండానే ఆ ఇంటిని చూసింది

ఆ ఇంటిని చూడగానే గుండెలో బాధ రెట్టింపు అయింది

ఆ ఇంటి మెడ పైన బాల్కనీ లో ఓ అమ్మాయి గ్రిల్స్ కి అనుకోని నవ్వుతూ ఉంది

ఆ అమ్మాయి కొత్త పెళ్ళి కూతురు అనటానికి సూచనగా చక్కని పట్టు చీర మెడలో నగలు ఆ నగల మధ్యలో ప్రత్యేకంగా పచ్చని పసుపు తాడు కనిపించింది

ఆమె ఎదురుగా అబ్బాయి ఆమెని ఎలా నవ్వించాల అని కొత్త కొత్త జోక్స్ వెతుకుతున్నాడు అచ్చమ్ తనని నవ్వించటానికి చేసిన ప్రయత్నం గా

ఆ దృశ్యం చూసిన కుసుమ వడివడిగా నడుస్తూ ఇల్లు చేరింది

తల్లి కి ఎగ్స్ ట్రే ఇచ్చేసి తన గదిలోకి వెళ్ళింది

ఆమెకి దుఃఖం ఆగటం లేదు

గత నాలుగు సంవత్సరాల క్రితం తను డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు ప్రపోస్ చేసాడు రాఘవ

ఒక వీధిలో ఉంటారు అప్పుడప్పుడు చూడటం ఒకటి రెండు సార్లు మాట్లాడటం తప్ప పెద్ద పరిచయం లేదు 

అలాంటిది ఒక రోజు హెల్త్ బాగోక కాలేజ్ నుంచి మధ్యాహ్నం వస్తుంటే వెనుక వచ్చి హాయ్ అన్నాడు

నేను చికాకు లో ఉన్న కూడా హెలో అన్నాను

నేను నిన్ను లవ్ చేస్తున్న అన్నాడు

భయం వేసి గబగబా ఇంట్లోకి పరుగు తీసాను

అది మొదలు ఒక రెండు మూడు ఇలాంటి మీటింగ్స్ లోనే నేను ఒకే చెప్పే రేంజ్ కి వచ్చాను

అలా ఆ రోజు నుంచి గడిచిన నాలుగు సంవత్సరాలు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నెన్నో ఆనందాలు

ఇలానే చీకటి పడ్డాక షాప్ కి వెళ్తే వాళ్ళ ఇంటి సందులో చాలా సేపు ముచ్చట్లు పెట్టిన రోజులు ఉన్నాయి

అప్పుడు కూడా ఇలానే నన్ను నవ్వించటానికి ఏవేవో జోక్స్ చెప్పేవాడు

తనకి జాబ్ వచ్చి వెళ్ళినప్పుడు నేను ఎంతలా ఏడ్చానో అప్పుడే అతనితో ఒంటరిగా గడిపాను నన్ను నేను ఇచ్చేసాను

సరిగా సంవత్సరం అయింది తనకి జాబ్ వచ్చి

ఈ సంవత్సరం లో అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు 

వచ్చినప్పుడు కలిసేదాన్ని

ఒక నెల రోజుల క్రితం ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి కి ఒప్పుకోలేదు అని

అందుకు కారణం మన కులమతాలు అని

నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు అని

మరి మన మధ్య జరిగినవి అని అడిగితే

ఇద్దరం ఇష్టపడ్డాము ఇద్దరికి నచ్చింది ఇద్దరం సుకపడ్డాము ఇద్దరం మర్చిపోయి మరో పెళ్లి చేసుకోవటమే అన్నాడు

నేను ఎం చెయ్యాలి

తనని నమ్మే కదా నన్ను నేను ఇచ్చింది

అవును ఇద్దరం ఇష్టపడి సుకపడ్డాము కానీ జీవుతాంతం తోడు ఉంటాను అనే నమ్మకం ఇవ్వబట్టే కదా

ఇక నాకు ఎం చెయ్యాలో అర్థం కాలేదు

అమ్మ నాన్న కి చెప్తే

చెప్తే ఎం అవుతుంది మహా అయితే నన్ను కొడతారు వాళ్ళ పైన కేస్ పెడతారు నన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు

ఒక మోసగాడు అని తెలియక నన్ను నేను ఇచ్చాను నేను అతని చేతిలో మోసపోయాను

అతను మోసగాడు అని తెలిసి ఫైట్ చేసి నా తల వంచి తాళి కట్టించుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్లే వద్దు నేను కావాలి అనుకుంటే ఎలా అయినా పెళ్లి చేసుకునేవాడు అనుకున్న వదిలేసాను

కానీ నాలుగు రోజుల కింద అయిన తన పెళ్లి ఆ సంబరాలు తన భార్య తో ఇవన్నీ చూసిన నాకు ఆ జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తున్నాయి

ఇంకెన్నిరోజులో ఈ జ్ఞాపకాలు

ఇలా ఆలోచనలలో మునిగిపోయింది కుసుమ

*************

సంవత్సరం గడిచిపోయింది

సుమ ఎంబిఎ అయిపోయింది

జాబ్ కోసం ట్ర్య్ చేస్తున్నది

ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చెయ్యటం కోసం ట్ర్య్ చేస్తున్నారు

తనకి బాధగా ఉంటుంది

పెళ్లి చేసుకునే వ్యక్తి నీ మోసం చెయ్యాలా అని

తాను పదిమంది తో తిరిగిన కానీ పెళ్లి చేసుకునే భార్య మాత్రం ముత్యపుచీప్ప నుంచి అప్పుడే తీసిన ముత్యం అంత స్వచ్ఛమైనది అయి ఉండాలి అని అనుకునే జనాల మధ్య

నిజం తెలిసి నన్ను పెళ్లి చేసుకునే పుణ్యాత్ములు ఎవరు లేరు కనుక తప్పదు నిజం దాయాల్సిందే అని అనుకుంది

ఈ సంవత్సరం లో రాఘవ జీవితం లోఎం జరిగిందో తెలీదు

కానీ అతని భార్య నుండి విడాకులు కొరకు కోర్ట్ మెట్లు ఎక్కాడు

అతను ఆమెను మోసం చేసిన అతను నాశనం కావాలి ఆమెలా ఎడవాలి అని మాత్రం ఎప్పుడు కోరుకోలేదు తను

వదిలేసింది

వదిలెయ్యటం అయితే అతనిని వదిలేసింది కానీ అతనితో ఉన్న జ్ఞాపకలను మాత్రం వదిలెయ్యలేదు

అవి ఆమె జీవితం లో అందమైన మజిలీ

ప్రేమ అనేది జీవితంలో ఎప్పటికి ఓ అందమైన జ్ఞాపకం ఇక్కడ రాఘవ మోసం చేసాడు అలా అని ప్రేమ నీ నింధిస్తే ఎలా

అలా అని అతనితో అతనిపై ఆమెకు ఏ ఫీలింగ్స్ లేవు

తల్లి తండ్రి ఓ సంబంధం చూసారు

అబ్బాయికి అమ్మాయి నచ్చింది

అమ్మాయికి ఆప్షన్ లేదు అనుకుంది

పెళ్లి కి ఒప్పుకుంది

వారం రోజులలో ఎంగేజ్మెంట్

మూడు వారాలలో పెళ్లి

రెండు రోజులలో ఎంగేజ్మెంట్ అనగా రాఘవ ఫోన్ చేసాడు

లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని ఓ అరనిమిషం ఆలోచించింది

వెంటనే లిఫ్ట్ చేసింది

హెలో

సుమ

చెప్పు రాఘవ

ఎలా ఉన్నావు

చాలా బాగున్నాను

నేను నీతో మాట్లాడాలి

దేని గురించి

మన గురించి

ఇప్పుడు మన లేదు నీ.... లేదా నా.....గురించి అని మాత్రం అనాలి ఎం మాట్లాడలో చెప్పు

ఒకసారి కలుద్దాం

కుదరదు ఫోన్ లో చెప్పు

ప్లీజ్ సుమ

కుదరదు

సరే మనం పెళ్లి చేసుకుందాం

ఏంటి

మనం పెళ్లి చేసుకుందాం సుమ

హో మరి మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా

ఒప్పిస్తాను

ఒప్పుకోకపోతే

ఒప్పుకుంటారు

ఆ రోజు కులం మతం అన్నావు

నేను ఒప్పించటానికి ట్ర్య్ చేస్తాను సుమ

ఒప్పుకోకపోతే

ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం

మీ వాళ్ళు ఒప్పుకోకపోతే మా వాళ్ళకి ఎందుకు శిక్ష

నీకు నా మీద ప్రేమ లేదా

లేదు కదా

సుమ ......

చూడు రాఘవ నన్ను చస్తావ రాఘవ నీ పెళ్లి చేసుకుంటావా అంటే చస్తాను అనే అంటాను సో నీ పని నువు చూసుకోవచ్చు

మన మధ్య జరిగినవి మర్చిపోయావ సుమ

గుర్తు ఉంచుకునే గొప్ప కార్యాలు ఎం జరగలేదు కదా

ఆ విషయాలు నీ భర్త కి తెలిస్తే .....

ఒక క్షణం కుసుమ కి భయం వేసింది

కానీ వెంటనే తేరుకొని నువు వెధవ అని తెలిసే నేను పెళ్లి చేసుకునే వ్యక్తి కి అన్ని చెప్పాను అన్ని పీడకల అని మర్చిపో అనే అబద్ధం చెప్పింది

సుమ నువు లేకుండా నేను ఉండలేను .......

అయితే పోయి ఏ గంగలో అయిన దుకు లేకుంటే ఏ రెల్య్ ట్రాక్ పైన తల పెట్టు నన్ను డిస్టప్ చెయ్యకు అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేసింది కుసుమ

అటు తరువాత తన పెళ్లి తల్లితండ్రి తెచ్చిన రాజ్ తో అంగరంగవైభవంగా జరిగింది

ఆ రోజు కుసుమ ఎలా అయితే రాఘవ అతని భార్యనీ చూసిందో ఈ రోజు అలానే రాఘవ కుసుమ రాజ్ లను బాధతో చూస్తూ వెళ్తున్నాడు

ఒక్కసారి పొగరు తో చేయి జార్చుకున్నది ఏది కూడా మళ్ళీ కావాలి అంటే రాదు

జీవితం లో ఎన్నో మజిలీలు ఉంటాయి

కొన్ని అద్బుతమైనవి

మరికొన్ని బాధకారమైనవి

అన్నిటినీ అంగీకరించి ముందుకు పోవటమే జీవితం

చిన్న కథ

కొన్ని నిజజీవితం సంఘటనల ఆధారంగా రాసాను


ఇది స్టోరీ మిర్రర్ లో నా మొదటి కథ ఆదారిస్తే మరిన్ని మంచి కథలతో మీ ముందు ఉంటాను

మీ అభిప్రాయాలను తెలియచేయండి

అందరికి ధన్యవాదాలు


మీ

కిరణ్ తేజ



Rate this content
Log in

Similar telugu story from Tragedy