vinaykumar patakala

Drama Romance Action

4  

vinaykumar patakala

Drama Romance Action

నా మనసు మనువాడింది నిన్ను

నా మనసు మనువాడింది నిన్ను

7 mins
183



హాస్పిటల్ మంచం మీద గత ఐదు రోజులుగా స్పృహ లేకుండా కోమాలో ఉండిపోయిన వినయ్ ఉన్నట్లుండి ఒక్కసారిగ పిడుగు వేగంతో లేచి కూర్చున్నాడు....

గట్టిగ శ్వాస తీసుకుంటూ ఉన్నాడు కానీ తను శ్వాశ తీసుకున్నపుడళ్ళ తన మొఖానికి ఎదో గట్టిగ ముసుగు వేసుకున్నట్లు అనుభూతి కలుగుతుంది అది ఎంటా అని తన చేతితో తన మొఖని స్పర్శించి చూసాడు, తన మొఖం అంతా పట్టిలతో కటి ఉంది.

వినయ్ నెమ్మదిగా నిదానంగా మంచం నుండి కిందకి దిగడానికి అడుగు వేశాడు కానీ వినయ్ పాదానికి నేల యొక్క స్పర్శ తగలగానే ఎక్కడ లేని నొప్పి ఉన్నపాటుగ జర్రిగొడు పాకినట్లు నొప్పి తన పాదం నుండి మెదడుకి చేరడంతో భరించలేకపోయాడు ఆ నొప్పిని, కానీ అయినా సరే వెన్ను తిరగకుండా తన కుడి పాదాన్ని కూడా నేల మీద పెట్టాడు అప్పుడు మరింత నొప్పి రావడం తో వినయ్ తన నడక యొక్క అదుపు తప్పి కింద పడిపోయాడు ఆదే సమయంలో వినయ్ ఆ పక్కనే ఉన్న టేబుల్ నీ పట్టుకొని దాని సహాయంతో నెమ్మదిగా పైకి లేచి రూం డోర్ వైపుకి తన అడుగులను వేయసాగాడు అలా అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ముందు కు వేస్తూ కొద్ది దూరం చేరుకున్న తరవాత అలసటతో కింద పడిపోయాడు అలా పడుతున్న సమయంలో వినయ్ పట్టుకొని ఉన్న టేబుల్ ఒక్కసారిగ కింద పడిపోయింది దాంతో ఒక్కసారిగ చుట్టూ పెద్ద శబ్దం వినిపించింది ఆ శబ్దం ఏంటో అని అటుగా వెళ్తున్న ఒక సిస్టర్ వచ్చి చూస్తే వినయ్ నేల మీద స్పృహతప్పి కింద పడి ఉన్నాడు. అది చూసిన సిస్టర్ మరో క్షణం ఆలస్యం చేయకుండ వెంటనే డాక్టర్ గారికి సమాచారం తెలియచేసింది.

సిస్టర్: డాక్టర్....డాక్టర్ సార్ ఆ ఐ.సి.యూ లో కోమా లో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి నేల మీద పడిపోయాడు సార్.

డాక్టర్ చంద్రకుమార్: వాట్ ఏంటి సిస్టర్ మీరు మాట్లాడేది ఆతను స్పృహలోకి ఎలా వస్తాడు అతను గత ఐదు రోజులుగా కోమా లో ఉన్నాడు అలాంటి వ్యక్తి ఇంత త్వరగా ఎలా కోమా లో నుండి బయట పడ్డాడు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది.

సిస్టర్: నాకు తెలియదు సార్ అది కానీ అతను మాత్రం స్పృహలోకి వచ్చాడు ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజం సార్.

డాక్టర్ చంద్రకుమార్: సరే పద అతను ఎలా ఉన్నాడో చూద్దాం అని చెప్పి అక్కడ నుండి వినయ్ ఉన్న రూమ్ లో కి వెళ్ళారు.

డాక్టర్ చంద్రకుమార్ వినయ్ పరిస్తితి నీ చూసి ఆశ్చర్య పోయారు.

అతని బీపీ కంట్రోల్ తప్పి కిందకి తగ్గుతుంది అతని బ్రెయిన్ సెన్సెస్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది హార్ట్ బీట్ మానిటర్ లో అతని గుండె కొట్టుకోవడం తగ్గుతూ వస్తోంది. ఇది ఇలాగే ఉంటే ఇతను కచ్చితంగా మరణిస్తాడు వెంటనే ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఇతని ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి సిస్టర్ వెంటనే డీఫిబ్రిలేషన్ తీసుకురా మనకు ఎక్కువ సమయం లేదు అని చెప్పాడు.

సిస్టర్ వెటనే డీఫిబ్రిలేషన్ నీ తీసుకొచ్చి సిద్దం చేసింది ఈ లోపు వినయ్ నీ బెడ్ మీద నుండి లేపి కింద నేల మీద పడుకోబెట్టారు డాక్టర్ చంద్రకుమార్ తన సాయ శక్తుల ఉపయోగించి వినయ్ కి

డీఫిబ్రిలేషన్ ఉపయోగించి అతని ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించారు కానీ వినయ్ బ్రెయిన్ సెన్సెస్ ఎంత వేగంగా కొట్టుకుంటునాయో అంతకంటే నెమ్మదిగా వినయ్ గుండె కొట్టుకోవడం ఆపుతుంది.

డాక్టర్ చంద్రకుమార్ మరియు ఇతర డాక్టర్స్ మరియు సిస్టర్స్ వాళ్ళందరూ వారి సాయ శక్తుల ప్రయత్నించారు కానీ వినయ్ తన చివరి గుండె చప్పుడు తో తన ప్రాణాలను విడిచాడు కానీ ఎవ్వరూ గమనించని విషయం ఎంటి అంటే వినయ్ యొక్క బ్రెయిన్ సెన్సెస్ ఇంకా కొట్టుకుంటున్నాయి. ఇంతలో వినయ్ వాల తల్లి మరియు అతని అన్నయ్య వచ్చారు.

శంకర్ కుమార్: డాక్టర్..డాక్టర్ మా తమ్ముడుకి ఏం అయింది స్పృహలోకి వచ్చాడు అంట నిజమే నా సార్ మేము వెళ్లి చూడచ్చు అతనిని అని ఎంతో సంతోషంతో అడిగాడు.

డాక్టర్ చంద్రకుమార్: ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఒక డాక్టర్ గా ఇలా చెప్పల్సి వస్తుంది అని నా నలభై ఎండ్ల సర్వీస్ లో ఊహించలేదు, మి తమ్ముడికి స్పృహ వచ్చింది కానీ ఆ స్పృహ అతని ప్రాణాలను తీసుకెళ్ళింది అని భాద పడుతు చెప్పారు..

ఆ విషాదకరమైన వార్త వినగానే వినయ్ అన్నయ్య మరియు తన తల్లి ఇద్దరు ఒక్కసారిగ ఉన్నచోటే కుప్పకూలిపోయారు తన తల్లి ఏడుస్తూ ఆ భగవంతుడ్ని మరియు డాక్టర్స్ నీ అర్డించుకుంటుంది కాపాడమని కానీ డాక్టర్స్ చెప్పిన మాటలు విన్న వినయ్ వాల అన్నయ్య నమ్మలేక పోయారు.

ఇంతలో లోపల ఒక్క సిస్టర్ డీఫిబ్రిలేషన్ మెషీన్ నీ సరి చేస్తుండగా తనకి ఒక్క వింత శబ్దం వినిపించింది అది వినడానికి ఒక్క గుండె కొట్టుకునే శబ్దం లా ఉంది అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఆ శబ్దం ఎక్కడ నుండి వస్తుంది అని పరిశీలిస్తుండగా వినయ్ గుండె కి అంటించబడ్డ సెన్సార్ మానిటర్ లో వినయ్ గుండె కొట్టుకోవడం కనిపించింది అది చూసిన సిస్టర్ కి ఒక్క సారిగా భయం

ఒక్కసారిగ భయం వేసి అతని వైపుకు తిరిగి చూసింది అతని గుండె నిదానంగా నెమ్మది నెమ్మదిగా గట్టిగ కొట్టుకోవడం మొదలు పెట్టింది కొద్ది క్షణాల్లోనే గుండె కొట్టుకోవడం పెరిగింది అలా నెమ్మదిగా వేగం పెంచుకుంటూ వచ్చింది కొద్ది క్షణాల్లోనే దొని వేగం ఎన్నో రెట్లు వేగంగా పెరిగింది సాధారణంగా మనిషి గుండె ఎ వేగంతో అయితే కొట్టుకుంటుందో దానికి పదిహేను రేట్ల వేగం తో కొట్టుకుంటుంది అది గమనించిన సిస్టర్ భయంతో వెంటనే డాక్టర్ చంద్రకుమార్ గారికి సమాచారం తెలియచేసింది.

సిస్టర్: డాక్టర్ పెద్ద సమస్య వచ్చింది లోపలో ఉన్న వ్యక్తికి.

డాక్టర్ చంద్రకుమార్: హా లోపల ఉన్న వ్యక్తికి ఏం అయింది.

సిస్టర్: అతనికి స్పృహ వచ్చింది డాక్టర్ అతను బ్రతికే ఉన్నాడు.

డాక్టర్ చంద్రకుమార్: వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్ చనిపోయిన వ్యక్తి బ్రతకడం ఎంటి నీకేమైనా పిచ్చా సరిగ్గ చూసే చెప్తున్నావా నువ్వు అసలు.

సిస్టర్: సార్ నేను నిజంగా నిజం చెప్తున్నాను అతను బ్రతికే ఉన్నాడు పైగా ఈ విషయంలో అబద్దం చేపల్సిన అవసరం నాకేం ఉంది సార్ అతను బ్రతికితే మనకే గా సార్ చాలా సంతోషం. పైగా మరొకటి ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

డాక్టర్ చంద్రకుమార్: ఇంతకంటే ముఖ్యమైన ఆశ్చర్యపరిచే విషయం ఇంకేం ఉంటుంది.

సిస్టర్: ఉంది సార్ అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది.

డాక్టర్ చంద్రకుమార్: ఎంటి వేగంగా కొట్టుకుంటుంద అంటే..!

సిస్టర్: సాధారణంగా ఒక్క మనిషి గుండె ఎంత వేగంగా అయితే కొట్టుకుంటుందో దానికి పదిహేను రేట్ల వేగం తో కొట్టుకుంటుంది అతని గుండె.

డాక్టర్ చంద్రకుమార్: వాట్ ఆర్ యూ జోకింగ్ విత్ మి హా

డాక్టర్ చంద్రకుమార్: నీకేమైనా మతి తప్పిందా నికు తెలుసుగా ఈ భూమి మీద అతి వేగంగా గుండె కొట్టుకునే ప్రాని ఏదైనా ఉంది అంటే అది ఒక్కే ఒకటి అది పీగమి ష్రీవ్ ఈ జీవి తప్ప ఇంకే జీవికి అంత వేగంగా గుండె కొట్టుకునే చాన్స్స్ లేవు అలాంటిది దీనికంటే ఎక్కువ కొట్టుకుంటుందా అతని గుండె దానికంటే వెంగంగా కొట్టుకుంటుంది అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చోడి నా .

సిస్టర్: అయ్యో సార్ నేను చెప్పేది మికే కాదు విన్న ఎవ్వరికీ నమ్మశక్యంగా ఉండదు మికెంటి చూసిన మాకే నమ్మశక్యంగా లేదు సార్ అందుకే భయంతో మి దగ్గరికి వచ్చి చేప్పాం.

డాక్టర్ చంద్రకుమార్: సార్ పద చూద్దాం అది ఎంటో అని వినయ్ రూమ్ లోకి వెళ్లి వినయ్ నీ చెక్ చేసి చూసాడు.

సిస్టర్ చెపినట్లే వినయ్ గుండె మనిషి గుండె కంటే పదిహేను రేట్ల వేగం తో కొట్టుకుంటుంది అది చూసిన డాక్టర్ ఆశ్చర్యం తో అయోమయంలో ఉండిపోయాడు ఎంటి అసలు ఇలా జరుగుతుంది అసలు ఇతను మనిషేన లేక రాక్షసుడ ఇలా ఉన్నాడు ఎంటి ...ఇతను అని అంటున సమయంలో ఒక్కసారిగ ఎదో పెద్ద ఉరుము పిడుగు పడినట్లు ఒక్కసారిగ ఆకలితో ఉన్న వంద సింహాలు ఒక్క లేడీ జింక పిల్ల మీద పడ్డట్లు పైకి లేచి వాల మీద పడి తన కోపాని చూపించాడు.

డాక్టర్స్ వార్డ్ బాయ్స్ వీళ్లంతా కలిసి అతనిని గట్టిగ పటుకోవడనికి ప్రయత్నించారు కాని వినయ్ వాళ్ళందరిని తోసేసి అడ్డు ఎవ్వరూ వచ్చిన వాళ్ళను కొట్టి పక్కకి పడేస్తున్నాడు ఇలా జరుగుతున్న సమయంలో వినయ్ వాళ్ళ తల్లి మధ్యలోకి వచ్చి వినయ్ నీ అదుపు చేయడానికి ప్రయత్నించింది కాని వినయ్ ఎంత ఆవేశంలో ఉన్నాడు అంటే అతనికి ఏమీ కనిపించట్లేదు అతనికి తలలో ఉన్న నొప్పి తప్ప.....అది అతన్ని చిత్రహింసలు పెడుతుంది లోపల నుండి ఆ నొప్పి వినయ్ నీ తినేస్తుంది ఎన్నో కొన్ని లక్షల సూదులు తన మెదడులో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది అది భరించలేకపోతున్నాడు డాక్టర్స్ కి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్తితిలో ఉన్నారు అప్పుడే డాక్టర్ కీర్తి కి దివ్య కి కాల్ చేసి రమ్మనండి అని ఒక్క ఉపాయం చేప్పింది దానికి అంగీకరించలేదు డాక్టర్ చంద్రకుమార్ ఎందుకంటే ఈరోజు వాళ్ళింట్లో దివ్య పేరు మీద ఒక మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు అందుకు దివ్య వాళ్ళ పెద్దమ్మ గారు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి ఈరోజు దివ్య హాస్పిటల్ కి రాదు తను సెలవు తీసుకుంటుంది అని ఆజ్ఞ వేశారు ఆవిడ మాటలకి భయపడి అలాగే మేడం మి ఇష్టం ఇక్కడ ఏం అయిన సరే మేం చూసుకుంటాం దివ్య దగ్గరకు రానివ్వను అని మాట ఇచ్చాను ఇప్పుడు ఇతని కోసం నేను అవిడగారికి ఇచ్చిన మాటను తప్ప మంటావా అని అడిగాడు.

డాక్టర్ కీర్తి: కాని డాక్టర్ ఇలాగే ఉంటే పరిస్తితి చాలా భయంకరంగా మారుతుంది అప్పుడు మనం ఏం చేయలేం అని చెప్పి వెంటనే కీర్తి దివ్య కి కాల్ చేసింది.

కాల్ రింగ్ అవ్తుంది కానీ కాల్ ఆన్సర్ అవ్వలేదు అందుకు కీర్తి మళ్ళీ దివ్య కి కాల్ చేసింది..

కాల్ రింగ్ అవ్తుంది కాని దివ్య బాత్రూం లో రాజ్య స్నానం చేస్తుంది ఇంతలో కాల్ రింగ్ దివ్య కి వినపడటం తో తన సేవకులకు ఫోన్ ఎవ్వరూ చేశారో అని కనుక్కోమంది ఆ ప్రయత్నంలో సేవకురాలు దివ్య ఫోన్ తీసి మాట్లాడే లోపు కాల్ కట్ అయింది.

సేవకురాలు: మేడం కాల్ కట్ అయింది మేడం.

దివ్య తను మరెవ్వరూ కాదు మన ఈ కథ కి తను మొదటి హీరోయిన్ తను వన్ అండ్ ఓన్లీ ది గ్రేటెస్ట్ ప్రముఖ వ్యాపారవేత్త గా నిలిచిన బిజినెస్స్ టైకూన్ శ్రీ శ్రీ శ్రీ రాజ జగదీష్ భద్ర వర్మ ఎన్నో కొన్ని లక్షల కోట్ల రూపాయల గల ధనవంతుడు ఎంత ధన సంపాదనలు ఉన్నాయో వాటికి మించిన నీతీ నిజాయితీ గల ధాన దర్మాత్ముడు వారికి మరియు వారి భార్య శ్రీమతి గాయత్రి దేవి వర్మ గారి ఏకైక పుత్రికా శ్రీ శ్రీ శ్రీ దివ్య ప్రసన్న లక్ష్మి దేవి వర్మ అమెరికా లో మెడిసిన్ పూర్తి చేసి అందులో ఎం. డి, ఎం. ఎస్ చేసి పట్ట పుచ్చుకుంది తన తాతయ్యా గారు స్వర్గీయ శ్రీ శ్రీ శ్రీ రాజ చంద్రశేఖర్ వర్మ గారు నియమించిన హాస్పిటల్ లో డాక్టర్ గా చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా చేస్తుంది తన హస్తావస్తం చాలా గొప్పది అని చాలా మంది దగ్గర నుండి చాలా మంచి పేరు పొందింది డాక్టర్ వృత్తి కేవలం సహాయం చేయడానికి ప్రాణాలను కాపాడటానికి మాత్రమే అని తను నమ్మిన సిద్ధాంతం అది అందుకే డాక్టర్ గా పట్ట పుచ్చుకున్న అతి కొద్ది కాలంలోనే వరల్డ్ లో అతి చిన్న వయసులో అతి పెద్ద డాక్టర్ గా పేరు కొంది గొప్ప కీర్తి పేరు కొంది.

దివ్య అందానికే అసూయ కలిగించే అంత అందంగా ఉంటుంది తను అచ్చుం తన తల్లి పోలిక .

దివ్య రాజ్య మంగళ స్నానం చేసి అందంగా ముస్తాబు గా తయ్యారు అయ్యి కాల్ ఎవ్వరూ అని చూడటానికి ఫోన్ తీసుకుంది ఇంతలో దివ్య వాల పిన్ని పద్మ లత దేవి గారు వచ్చి.

పద్మ లత దేవి: అమ్మా స్వీటీ ఏమైంది అమ్మ ఇంకా రెఢీ ఆవలేదా ఎంటి ఆవతల యుగ్న హోమం కి ఆలస్యం అవ్తుంది తల్లి త్వరగా.. అని చెప్తూ లొనకి వచ్చింది.

దివ్య నీ చూసిన పద్మ లత దేవి గారు ఆనందంతో మురిసిపోయారు.

పద్మ లత దేవి: ఎంత అందంగా ఉన్నావో నికు నా దిష్టే తగిలేలా ఉంది అని అంటూ తన కంటికి పెట్టుకున్న కాటుకతో దివ్య కి దిష్టి చుక్క పెడుతూ అచ్చం మి అమ్మా లాగే ఉన్నావ్ తల్లి🥲🙂 అని అంటూ ఆనందబాష్పాల తో తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

దివ్య: నిజంగా నా పిన్ని .

పద్మ లత దేవి: అవునమ్మా నిజం అని అంటూ నిన్ను చేసుకోడానికి రాజకుమారుడు వస్తాడు నిన్ను మా అందరికంటే ఎక్కువగా చూసుకునే వాడు వస్తాడు.

దివ్య: రాజకుమారుడే కావాలని కోరుకోవడం లేదు పిన్ని వచ్చే వాడు నా అందాన్నీ నా చదువుని నా అస్తి అంతస్తు నీ చూసి వచ్చేవాడు అయితే నేను అస్సలు చేసుకోను.

పద్మ లత దేవి: మరి ఎలాంటి వాడు కావాలి ఎంటి మా బుల్లి యువరణిగారికి. అని సరదాగా అడిగింది.

దివ్య: నన్ను నాల ప్రేమించాలి నేను ఒక్క రాజ కుమారి అని కాకుండా మల్టీ బిలియనీర్ కూతురిగా కాకుండా ఒక్క సాధారణ అమ్మాయి లా చూడాలి నన్ను నేను చేసే చిన్న చిన్న అల్లర్లు చూసి సంతోషపడాలి ఒక్క స్నేహితుడిలాగ నా చిలిపి చేష్టలను చూసి కోపం తెచ్చుకొని నా మీద కోప్పడాలి..... అమ్మా లాగ భయం వేస్తే నన్ను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పాలి నాన్న లాగ ఎ కష్టం వచ్చిన తోడుగా నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలి అన్నయ్యా లాగ ఇలాంటి వ్యక్తి కావాలి నాకు భర్తగా పిన్ని.

పద్మ లత దేవి: అబ్బో అమ్మగారికి కోరికలు బాగానే ఉన్నాయే అని నవ్వుతూ అంది.

దివ్య: ఒక్కటే లైఫ్ పిన్ని అది కూడా అడ్జస్ట్ అయిపోతే ఎలా అందుకే ఇలా కోరుకుంటున్నాను ఇలాంటి వ్యక్తి నాకు దొరికితే మాత్రం నా ప్రాణాలను అయిన వదులుతాను కానీ అతన్ని మాత్రం అస్సలు వదులుకోను.

పద్మ లత దేవి: చాచ్చా ఎంటమ్మ అది ఇలా మాట్లాడుతున్నావ్ తప్పు అలా మాట్లాడకూడదు నికేం రా బంగారానివి నిన్ను చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి ఆ వ్యక్తే నీకోసం వెతుక్కుంటూ వస్తాడు చూడు అని చెప్పి త్వరగా రెఢీ అయ్యి కిందకి వచ్చేయి....కింద నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది.




                  నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలో




   



Rate this content
Log in

Similar telugu story from Drama