Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Inspirational


5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Inspirational


కష్టం వెతికిన సమాధానం

కష్టం వెతికిన సమాధానం

5 mins 180 5 mins 180

చిన్నారి జాగ్రత...నేను సాయంత్రం వస్తాను...చక్కగా పాలు తాగి...హాయిగా బజ్జో బంగారం...నువ్వు నవ్వే చిరునవ్వు నీ చూస్తే అసలు వెళ్లాలని లేదు బంగారు అని ముద్దు లు పెడుతూ మాట్లాడుతుంది...స్వర...తన 6 నెలల కూతురితో....


తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వుండాలని ఆశతో...బాగా చదివి ఒక పెద్ద కంపెనీలో సీఈవో పదవి లో వుంది స్వర....ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళు సంబంధం చూడటం ..పెళ్లి అవ్వటం...ప్రెగ్నెన్సీ రావడం అన్ని వెంట వెంట నే అయిపోయాయి....9నెలలు పడే వరకు ఆఫీస్ కి వెళ్తూనే వుంది...పాప కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకుంది...విలు అయినప్పుడు నెలకో సారి పాప నీ కూడా తోడు బెట్టుకొని ఒక గంట వెళ్లి వస్తుంది...కానీ చాలా పనులు మిగిలి ఉన్నాయి.... ఒక ప్రాజెక్ట్ విషయం అయి తను తప్పక వెళ్ళవలసిన అవసరం....పాపని వదిలి వెళ్ళాలి అని లేకున్నా తప్పక...తన కొలీగ్ ఇచ్చిన సలహా తో ...తన పాప నీ చూసుకొనే టేక్ కేరరే ల తనకు ఒకరిని చూసి పెట్ట మంది....మరో రోజే తీసుకువచ్చింది కొలీగ్....


నమస్కారం అమ్మ...


నమస్తే ...


నా పేరు మల్లిక...మీ పాప నీ చూసుకోవడానికి మనిషి కావాలి అని అన్నారు కదా...మీ కొలీగ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె నాకు చెప్పింది...


ఓ....నువ్వే నా...సరే రా అంటూ డోర్ తీసింది....

మల్లికా...మాకు అంటూ వుంది ఈ ఒక్క పాపే....మా ప్రాణం....మేము పొద్దున 10 గంటలకు వెళ్లి సాయంత్రం 8 గంటలకు వస్తాం...ట్రాఫిక్ ఎక్కువ వుంటే ఇంకో గంట కావచ్చు...నీకు నెలకు 10 వేలు యిస్తం....మా పాప నీ మాత్రం జాగ్రత గా చూసుకోవాలి...

ఎక్కడ వుంటారు...ఎం చేస్తూ వుంటారు....అన్ని అడిగి తెలుసుకుంది....ఒక రోజు మొత్తం ఇంట్లో వుండి ఎలా చూసుకుంటుంది చూశాకే పని వెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది.... స్వరూపా....


తన బంగారం నీ వదిలి వెళ్ళాలి అని లేకపోయినా ...తప్పదు కదా అని బయల్ దేరింది....డోర్ వరకు వెళ్ళగానే బాధ తట్టుకోలేక ...మళ్లీ రెండు అడుగులు వేసి తన బిడ్డ నీ గుండకు హత్తుకుంది....తన ప్రేమ నీ చూసి అవినాష్ ముందుకు వచ్చి స్వర భుజాలపై చేతులు వేసి.... స్వర అత్తారింటికి పంపినట్లు ఇంత బాధ పడితే ఎలా చెప్పు....సాయంత్రం అయితే వచ్చేస్తం కథ...ఓన్లీ ఫ్యు డేస్ ఏ కదా....పదా...


వెళ్ళండి అమ్మ...మీ పాప నీ నా పాప ల చూసుకొని జాగ్రత గా చూసుకుంటా... నా బంగారు తల్లి అమ్మ కి బాయ్ చెప్పు అని స్వర చేతుల్లో నుంచి పాప నీ తీసుకొని బుజాన వేసుకొని జో కొడుతూ పాట పాడుతుంది.... మల్లీ...


వెళ్లాలని లేకున్నా తప్పక వెళుతుంది స్వర....


😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈


ఎం అదృష్టమే నీది నెలకు పది వెలు అంటే...రాజ బతుకు బతకవచ్చు ఇక...హాయిగా ఏసీ గదుల్లో కూర్చొని పగలంతా వుండవచ్చు....అని మల్లీ అనుకుంటూ వుండగానే పాప ఏడుపు వినిపిస్తుంది...


అబ్బా వచ్చే వరకు వుండరాదు నీకు....ఇంత వున్నావు....అంత నోరు వేసుకొని ఎడుస్తవు ఎందుకు ....అంటూ వెళుతుంది...


ఎం కావలె నీకు ....ఆకలి అయి చస్తుంది ఏమో....అని డబ్బా కలిపి నోట్లో పెడుతుంది...అయిన ఏడుపు అపటం లేదు పాప...ఆ ఏడుపు కి చిరాకు వచ్చిన మల్లీ పాప నీ విపు లో కొడుతుంది.......పాప ఇంకా ఎడవడం ఆపకుండా ఏడుస్తూనే వుంది...ఈ సారి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది....పైకి లేపి మంచం మీద పడేసింది....

ఒసేయ్ అపవే ముందే నాకు కోపం ఎక్కువ.... పీక పిసికి పడెస్త ఎం అనుకుంటున్నావు....మళ్లీ ఏడుపు పెంచేసరికి ...ఆ పసి ప్రాణం నీ నోటి చప్పుడు రాకుండా నోటికి గుడ్డ కట్టి...టీవీ సౌండ్ పెంచి సోఫా లో కూర్చుని ఆపిల్ తింటూ కూర్చుంది....


పాప ఏడిచి ఏడిచి అలసి పోయి ఎప్పుడు పడుకుంది అసలు తేలియదు....


టైమ్ చూసి ... అమ్మో వాళ్ళు వచ్చే టైం అయ్యింది అని పాపకి పాలు తాగించి...పొద్దున్న నుంచి అలానే వున్న పంపెర్ తీసి నా ఒళ్లు తుడిచి శుభ్రం గా తయారు చేస్తుంది... పొద్ధ టీ నుంచి ఆకలితో ఉన్న పాప పాలు పట్ట గానే గబగబా తాగేసి...పడుకుంది....


బంగారం అంటూ వచ్చిన స్వర...పాప నిద్ర నీ పాడు చేయలేక....ఉండిపోతుంది....నిద్రలో వున్న ...చాలా సేపు ఎత్తుకొని ముద్దాడి...హత్తుకొని సంబర పడిపోయి సంతోషిస్తుంది....


మల్లి.... ఎం ఇబ్బంది అయితే లేదు గా..మా చిన్నారి ఎం ఎడవలేదు గా...


లేదు అమ్మగారు.,అంత బాగానే వుంది...ఇంత సేపు ఆడుకొని ఆడుకొని ఇదిగో యిప్పుడే పడుకుంది...


అవునా...కాసేపు ఆదుకోవాలి పాప తో అని త్వర గా వచ్చా...పర్లేదు లే....సరే లే ఇక నువ్వు వెళ్ళు...


బంగారు తల్లి కాసేపు లేరా ...నీతో అడుకోవలి....

అని తన చిన్ని చేతులను ముద్దాడి తన మొహం నీ చూస్తూ అలానే పడుకుంది...


మళ్లీ లేవడం...ఆఫీస్ కి వెళ్ళటం...రాగానే పాప నీ కాస్త ముద్దాడి... పడుకుండి పోవటం...


ఆఫీస్ బాధ్యతలు...తల్లి మనసు ...రెండింటి మధ్య నలిగిపోతుంది స్వర....తనను నమ్ముకున్న కంపెనీ నీ వదల లేక...పాపని వదిలి వుండలేక...దిగులుగా కూర్చున్న స్వర నీ చూసి తన కొలీగ్ వచ్చి ఎం జరిగింది అని అడిగింది....


అమ్మ నాన్న వాళ్ళు....అత్తమా మామ వాళ్ళు పల్లెటూరిలో వుంటారు....మేము వర్క్ వలన ఇక్కడ....పాప నీ చూసుకోవడానికి ఒక అమ్మాయి నీ పెట్టం....బాగానే చూసుకుంటుంది కానీ....పాప ఇంతక ముందు ల ఆక్టివ్ గా వుండటం లేదు....చాలా డల్ గా వుంటుంది...వెళ్ళే సరికి పడుకుంటుంది....ఇంతక ముందు ల నవ్వటం...కేరింతలు కొట్టడం చేయటం లేదు....మనసులో కొండంత బరవు మోస్తున్న ఫీలింగ్ అందుకే నేను జాబ్ కి రీజ్యేన్ చేద్దాం అనుకుంటున్న....నాకు నా కంటే నా పాపే ముఖ్యం. .


స్వర...నీ బాధ నేను అర్థం చేసుకోగలను...ఒక సైకాలజిస్ట్ గా మాత్రమే కాదు...ఒక తల్లిగా చెప్తున్న....పాప నీ ప్రేమ నీ మిస్స్ అవుతుంది కావచ్చు....కానీ అదే కారణం అని కూడా చెప్పలేం కదా... నువ్వు నీ కెరియర్ నీ ఇంతటితో ముగించెద్ధం అని అనుకోవడం...మాత్రం సరి కాదు....అసలు పాప ఎందుకు అలా వుందో తెలుసుకో....నువ్వు పాప నీ చూసుకోవడానికి పెట్టిన అమ్మాయి పాప నీ నీ ముందు చూసుకున్న విధంగా చూసుకుంటుంద లేదా తెలుసుకో ఒక పని చెయ్యి ..నైట్ ఇంటికి వెళ్ళాక తను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరువాత...ఇంట్లో సి సి కమెర లు సెట్ చెయ్యి....ఇప్పుడే ఆన్లైన్ లో ఆర్డర్ చేసి వెళ్ళక పని ముగుంచుకో....తను బాగా చుసుకొక పాప అల వుంది అని అంటే అప్పుడు వర్క్ మనేయు...లేదంటే మంచి హిస్పిటల్ లో చూపిద్దాం....నువ్వు మాత్రం ఇలా బాధ పడకు...


తన కొలీగ్ ఇచ్చిన సలహా తో...ఇంటికి వెళ్ళగానే ఆ పని చేసి...మరునాడు...పని ముగించుకొని వచ్చిన తరువాత...పాప నీ ఒడిలో పడుకో బెట్టుకొని బెడ్ మీద కూర్చొని లాప్ టాప్ లో చూస్తుంది....కాసేపు అయ్యాక తను చూసిన సంఘటన కి తన బిడ్డ నీ గట్టిగా హత్తుకొని ఎడవడం మెదలు పెట్టింది...


స్వర ఎడవకు ఎం అయింది అని అడిగిన తనకు లాప్ టాప్ లో స్వర చూపింది చూసి కోపం తో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి మళ్లీ నీ అరెస్ట్ చేపిస్తాడు....


కొన్ని కష్టాలు కొన్ని ప్రశ్నలకు సమాధానం వేతుకుతయి....


మరుసటి రోజు అఫీస్ బోర్డ్ మీటింగ్....


గుడ్ మార్నింగ్ ఎవరీ వన్....

ఈ రోజు స్పెషల్ గా మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం వుంది....మన ఆఫీస్ లో మంచి టాలెంట్ వున్న అమ్మాయిలు ....అమ్మ లు కొన్ని ప్రాబ్లమ్స్ వలన జాబ్ మానేస్తున్నారు....ఆ ప్రాబ్లమ్స్ ను మనం కొంచం తగ్గించ గలిగితే వాళ్ళు జాబ్ మనేయవల్సిన అవసరం లేదు....దాని వలన మన సేల్స్ కూడా పెరిగి మంచి ప్రాఫిట్ వస్తుంది....


ఒకే ...లాభం వస్తుంది అంటే మాకు ప్రబ్లం లేదు....అని అందరూ అంటూ అసలు ఎం చేయాలి అని అనుకుంటున్నారు....అని అడుగుతారు...


యంగ్ అమ్మాయిలు లేట్ నైట్ అవుతుంది అని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి....అల ఇబ్బంది వున్న వారికి 10 కి కాకుండా 7 కి వచ్చేలా చర్యలు తీసుకుంటే వాళ్ళు ఈవినింగ్ 4 కి వెళ్ళి పోవచ్చు...ఈవినింగ్ లేట్ అయిన పర్లేదు మార్నింగ్ ఇంట్లో పనులు చుస్కొని కాస్త లేట్ గా వస్తాం అని అనుకొనే వారికోసం ఈవినింగ్ షిఫ్ట్ పెట్టాలి...అప్పుడు వాళ్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆహ్లాద కరమైన వాతావరణం లో పని చేస్తారు....దానితో పని నాణ్యత పెరిగి సంస్థ కు లాభాలు రావడం కాయం...

అందరూ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు..


మరో విషయం....పిల్లల నీ వదిలి ఆఫీస్ కి వచ్చి వర్క్ చేయలేక చాలా మంది జాబ్ మానేస్తున్నారు...ఆఫీస్ లో ఒక రూం లో పిల్లల్ని చూసుకోవడానికి ఇద్దరు మనుషులను పెట్టీ చూసుకుంటే...వాళ్ళ తల్లులు ప్రశాంత గా పని చేసుకుంటారు...దాని వలన వచ్చే నష్టం అయ్యే సమయం వృధా మనకు వచ్చే లాభాల తో పోలిస్తే చాలా తక్కువ....అని తడబడుతూ చెప్పింది....


అందరిలో మౌనం చూసి...తను ఆశించింది అయ్యే పని కాదు అని ...ఇక నేను పని మనేయటమే మంచిది....నా లాంటి వాళ్ళకి నేను ఎం సహాయం చేయలేను...ఇక నేను పని మనేద్ధం అని అనుకుంటున్న అని చెప్ప బోయే సమయం లో...

అందరూ నవ్వుతూ ఛైర్ లో నుంచి లేచి క్లాప్ స్ కొట్టారు...


స్వర. .ఎన్నో విజయాలు సాధించిన... తనలాంటి తల్లులకు సంతోషం అందించే ఈ విజయం ఎక్కువ సంతృప్తి నీ ఇచ్చింది....విజయ ఆనందం తో కోటి దీపాల వెలుగు తో స్వర మొహం ప్రకాశించింది....తను అనుకున్నది అయినందుకు కాదు...తన లాంటి తల్లుల కు ఆనందం లభిస్తుంది అని...Rate this content
Log in

More telugu story from బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Similar telugu story from Inspirational