కాంక్ష
కాంక్ష


చలికాలం చలితో పాటు పొగ మంచు... అక్కడక్కడ జనాలు చలి కచుకుంటు ముసుగు లు వేసుకొని కూర్చున్నారు...మహనగరపు రోడ్లే అయిన చలికి బయపడి బయటకు రావడానికి భయపడుతూ దాక్కున్నారు...
కాంక్ష ఒంటరిగా నడుస్తూ...గాలికి వుగుతున్న తన జుట్టు నీ సవరించు కుంటు...తన పొడవాటి హిల్స్ నుంచి వచ్చే శబ్దం వస్తూ వుంటే తన చేతి వాచీ చుస్కుంటూ ఆటో వుందా అని దిక్కులు చూస్తూ వెళ్తుంది....తన షూస్ చప్పుడు కాకుండా వెనకే అనుకరిస్తూ న్నట్లు మరో ఒకరి చెప్పుల శబ్ధం ....ఒక అబ్బాయి సిగరెట్ తాగుతూ తన వెంటే వచ్చి...తను ఆటో ఎక్కేవరకు అక్కడే వుండి తననే చూస్తున్నాడు...
మరో రోజు....
అదే వరస...
మరో రోజు....
ఈరోజు మరొక వ్యక్తి కూడా అతనికి తోడు అయ్యాడు...కాంక్ష కి బయం వేసింది...
సాయంత్రం తిరిగి వెళ్ళే అప్పుడు....ఆ వ్యక్తులు ఈ సారి ఇంకా ధైర్యం చేసి వెనకే బైక్ పై హాస్టల్ వరకు వచ్చారు....
రాత్రి....ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ వున్న కాంక్ష ఆ విషయం తన ఫ్రెండ్ హన్సి కి చెపుతుంది....
ఎందుకు అయిన మంచిది ముందే రోజులు బాగాలేవు .. నా బుర్కా వేసుకొని వేళ్ళు అని ఇచ్చింది....
మరుసటి రోజు ఉదయం...
ఆ బూర్కా నీ చాలా సేపు చూస్తూ ...వేసుకోవాలా వద్ద అని ఆలోచిస్తుంది....వేసుకోకుండా నే హాస్టల్ బయటకి వస్తుంది....బయట ఆ వ్యక్తులు వుండటం చూసి మళ్లీ లోపలికి వెళ్ళి బూర్క వేసుకొని బయటికి వస్తుంది....
ఆ వ్యక్తులు....బురఖా లో వున్న తనను గమనించకుండా హాస్టల్ నుంచి వస్తుంది అనుకొనే కాంక్ష కోసం వేచి చూస్తూ వున్నారు...
అది గమనించిన కాంక్ష సంతోష పడుతుంది...
సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వస్తుంది...వచ్చేటప్పుడు తన చిన్ననాటి ఫ్రెండ్ కనపడుతుంది ..తనను పలకరిద్ధం అని వెళ్ళే లోపు ఆ వ్యక్తులు అక్కడే వున్నారు...తన గురించి తెలిసి పోతుంది అని అక్కడే వుండి పోయింది....తన మనసులో కొండంత బాధ మిగిలి పోయింది....
మరుసటి రోజు....
మళ్లీ బుర్క నే చూస్తూ వుంది....
ఈ రోజు బురుక వేసుకోలేదు.... బయటకి వెళ్ళింది....బయట ఆ వ్యక్తులు అక్కడే వున్నారు...తన్నే చూస్తూ వెంబడి వస్తున్నారు ..వెనక్కి చూడకుండా వస్తున్న కాంక్ష కు గుండెల్లో బయం మొదలు అయ్యింది... కాళ్ళ చప్పుడు ఇంకా ఎక్కువ అయింది....లేని ధైర్యం కూడ తెచ్చికొని...వెనక్కి తిరిగింది....
కాంక్ష కళ్ళలో కనపడిన కోపం కి ధైర్యం కి ఆ వ్యక్తులు బయపడి ఒక అడుగు వెనక్కి వేశారు....కాంక్ష కి ఇంకా ధైర్యం వచ్చింది...
ఎంటి రోజు చూస్తూ వున్న....మీకు బయపడల...ఒంటరి గా అమ్మాయి కనపడితే చాలు... చీ.....ఎలా ఆలోచిస్తారు ఇంత చెత్తగా....నువ్వు మాత్రమే కాక నికు ఒక తోడు....చేసే గొప్ప పనికి.... మీకు బయపడి....మా ఉనికి నీ కొల్పోవలా....మమ్మల్ని మేము దాచుకొని దొంగ ల భయపడుతూ బ్రతకాల....ఒక నిమిషం ఆగండి....మీరు రోజూ నా వెంట పడేది మొత్తం వీడియొ రికార్డ్ అయ్యింది.... అది షి టీమ్ కి వాట్స్ యాప్ చేసా...రెండు నిమిషాల్లో వుంటారు...మీరు జీవితాంతం జైల్లో వుండ వలసిందే...మీలాంటి వాళ్లకు భూమిపై వుండే హక్కు లేదు...
అది విని ఆ వ్యక్తితో వచ్చిన మరో వ్యక్తి కి బయం వేసి వెనక్కి పరిగెత్తాడు....వాడిని చూసి అసలు వ్యక్తి కూడా పరుగు తీశాడు...
కాంక్ష విజయ ఆనందం తో....ఆకాశం వైపు చూస్తూ స్వేచ్చ గా ఎగురుతూ వున్న పక్షులని చూస్తుంది....