Bairi Tejashwini

Drama

4.7  

Bairi Tejashwini

Drama

ఎప్పుడు వస్తుందో స్వాతంత్రం?

ఎప్పుడు వస్తుందో స్వాతంత్రం?

3 mins
480


మనకు స్వాతంత్రం అనుగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆగష్టు 15. కానీ కొందరి ఆడవారికి మాత్రం గుర్తుకు వచ్చేది స్నేహితులతో కలిసి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పోయిన టూర్ లు. 21st సెంచరీ లో కూడా కొందరు ఆడవాళ్ళు వాళ్ల వాళ్ల స్వతంత్రం కోసం ఎంతో తాపత్రయ పడుతున్నారు. గాంధీ గారు చెప్పినట్టు రాత్రి సమ యాన స్వాతంత్య్రంగా ఎప్పుడైతే ఆడవారు తిరగగల రో అప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టు అన్నారు. కానీ ఈ 21 వ శతాబ్దంలో కూడా జరుగుతున్న దుర్మార్గాల వల్ల ఒక ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే, ఏ తండ్రి మాత్రం ప్రశాంతంగా తన కూతురు కోసం ఎదురు చూడకుండా ఉండగలడు, ఏ అన్న మాత్రం నిశ్చింతగా తన చెల్లి గురించి ఆలోచించకుండా ఉండగలడు, ఏ భర్త మాత్రం తన భార్య గురించి భయపడకుండా ఉండగలడు. అందుకే ఒక ఆడపిల్ల బయటకు వెళుతుంటే తోడు లేకుండా వెళ్ళనివ్వరు. అందులోనూ ఎవరితో వెళ్లుతున్నావు? ఎక్కడికి వెళ్లుతున్నావు అని తెలుసుకొని వాళ్ళు తెలిసిన వారైతేనే వాళ్లతో పంపిస్తారు. అది కూడా చాలా దూరం పంపించారు. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? నాకు తెలీదు. ఇలా తన డైరీలో రాసుకుని క్లోజ్ చేసి, లైట్ అఫ్ చేసి మంచం మీద పడుకుని, నిట్టూర్చింది సుమన. 

మరుసటి రోజు ఉదయం సుమన ఆలోచిస్తోంది, కేరళ ట్రిప్ కి వెళ్ళడానికి తల్లిదండ్రుల అంగీకారాన్ని ఎలా పొందాలనీ? అమ్మ ప్లేట్‌లో పెట్టు కొచ్చిన వేడి వేడి ఇడ్లీలు తింటూ. ఇలా అడిగింది-”అమ్మ నేను కేరళ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నా స్నేహితులందరూ ప్లాన్ చేశారు. నువ్వే మంటావు." అమ్మ తన పని తను చేసుకుంటు-" ఏం నన్ను అడగకు తల్లి మీ నాన్న గారు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నాన్న ఒప్పుకుంటారా అంటావా.” అమ్మ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది. తన ప్లేట్ లో ఉన్న ఇడ్లీలను ముగించుకొని. నాన్న గారు అడిగిన న్యూస్ పేపర్ ని చేతికి అందిస్తూ-”నాన్న స్నేహితులంతా కలిసి కేరళ కి వెళ్దాం అనుకుంటున్నాం ఐదు రోజులు, నేను వెళ్ళనా వాళ్లతో?" నాన్న న్యూస్ పేపర్ నుండి తల తిప్పి-”ఏంటి? కేరళ అంత దూరం! అది కూడా మీ స్నేహితులు మాత్రమేనా? ఏమీ వద్దు” అన్నారు. ఎందుకు నాన్న నేను రెట్టించాలి అనుకుంది, కానీ ఇక చేసేదేమీ లేక తన గదిలోకి వెళ్లి వెన్నెలకి కాల్ చేసింది. వెన్నెల అటునుంచి-”ఏమైంది?ఏం అన్నారు మీ వాళ్ళు." సుమన-"ఇంకేం అంటారే వద్దు అన్నారు” అంది నిరుత్సాహంగా. “చెప్పాను గా మొదలే మా ఇంట్లోవాళ్లు నన్ను ఎక్కడికి పంపించరని"అంది సుమన. వెన్నెల అటునుంచి- "పోనీ నేను మాట్లాడి చూడనా." సుమన బదులిస్తూ “వద్దు లేవే మా డాడీ ఒక్కసారి చెప్పారంటే నిర్ణయాన్ని మార్చుకోరూ. దిగులుగా ఉన్న సుమనను చూసి అమ్మ దగ్గరి కి వచ్చి-”పెళ్లైన తర్వాత నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెల్దువులే అంది. కానీ అప్పుడు తెలియలేదు కట్టి పడేసే బంధాలు ఇంకా పెరుగుతాయని.


సుమనా ఏదో ఆలోచిస్తూ బట్టలు మడత పెడుతోంది. ఇటుగా ప్రమోద్ (సుమన కొడుకు) కాశ్మీర్ యాత్ర అని చదవటం విని తన పూర్వ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు రాత్రి చేతన్య (సుమన భర్త) ఏదో లెక్కలు రాసుకుంటున్నాడు. తన దగ్గరి కి వెళ్లి-”ఏవండీ నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు కాశ్మీర యాత్రా అని ఒక కథ ఉండేది, అది వినినప్పుడు నేను అనుకునేదాన్ని, నేనొక్కదాన్నే కొన్ని రోజులు చాలా దూరం గా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ కొన్నికొత్త అనుభూతుల్ని పొంది రావాలని, మా నాన్న గారు నన్ను స్నేహితులతో కూడా పంపించేవారు కారు అంత దూరం. నేను ఒక్కదాన్నే ఐదు రోజులు టూర్ కి వెళ్తా ను అని అడిగితే మీరేమంటారు?” అటునుండి చైతన్య-”ఏం అంటాను పిచ్చి ఆలోచనలు మానుకుని, పని చూసుకో అంటాను.” సుమన తలెత్తి-“అయ్యో అదేంటండి అలా అంటారూ నాకు లైఫ్ లో కొన్ని అనుభూతిని పొందాలని ఉందండి, కొత్త పరిచయాలవుతాయి, కొత్త మనిషుల్ని కలిసి వాళ్లతో మాట్లాడుతుంటే కొత్త ఆలోచనలు వస్తుంటాయి." చైతన్య తన పని చేసుకుంటూనే ” నువ్వు ఆ పరిచయాలు ఆ కొత్త ఆలోచనలతో ఏం చేస్తావు? వెళ్లి పనిచూసుకో నాకు పనుంది.” బుంగమూతి పెట్టుకొని సుమన అక్కడ నుండి వెళ్లిపోయింది.


ఈరోజు డ్రైవర్ సెలవు పెట్టాడని ప్రమోద్ చెప్పే సరికి సుమన ఒక్కతే కాలినడకన గుడికి వెళ్లి వచ్చింది అప్పటి నుండి కాళ్లు నొప్పి అని కూర్చొంది. ఇక భగవద్గీత చదివే సమయం వచ్చేసరికి శక్తినంతా కూడగట్టుకుని లేచి భగవద్గీత తీసుకుని వెళ్తుండగా. తన మనవరాలు సింధు ఏదో పుస్తకాలు సదురుతూ-”నానమ్మ ఇది నీ పుస్తకం ఉన్నట్లుంది చూడు” అని సుమన చేతికిచ్చింది. అది సుమన డైరీ అందులో తను తెరిచిన పేజీ లో తను రాసుకున్న అక్షరాలు తనని నిరుత్సాహపరిచాయి. తను రాసుకున్న డైరీ తిరగేస్తూ ఉండగా సింధు దగ్గరి కి వచ్చి-”నానమ్మ ఒక సహాయం చేయవు, ఫ్రెండ్స్ అంతా గోవా ట్రిప్ కి వెళ్తున్నారు నాన్నని ఒప్పించవు.?” సుమన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. 



Rate this content
Log in

Similar telugu story from Drama