STORYMIRROR

Ganga bhavani Pulipati

Horror Thriller

3.4  

Ganga bhavani Pulipati

Horror Thriller

దయ్యాల‌ కోన

దయ్యాల‌ కోన

1 min
2



అది ఒక భయంకరమైన అడవి. ఎత్తయిన చెట్లు, చిక్కుగా అల్లుకొనిన తీగలు, గుడ్లగూబలకు నిలయమైన మర్రిమాన్లు, భయంకర సర్పములకు నిలయమైన పొదలుకల్గి, ఎటువైపు నరసంచారము లేని అడవి మధ్యభాగములో పురాతన దేవాలయము ఒకటి కలదు. 


అది ఈశ్వర దేవాలయమైనప్పటికీ అక్కడ పూజారి లేడు, పూజలు జరుగవు. కానీ శివరాత్రి రోజు మాత్రము అక్కడికి జనము చేరి పూజలు చేయుట ఆనవాయితీగా కలదు. ఆ ఒక్క దినము తప్ప మానవ సంచారము ఆ అడవిలో ఉండేదిది కాదు. 


సంవత్సరమునకు ఒక్క రోజు పూజ జరుగు ఆ దేవాలయమునకు ఆ ఒక దినము లక్షల సంఖ్యలో మనుషులు వస్తారు కావున అందరి సౌకర్యార్థము దేవాలయము వరకు అడవిలో తారు రోడ్డును ప్రభుత్వమువారు నిర్మించారు. సంవత్సరమునకు ఒకమారు ఆ రోడ్డు వెంట మనుషులు ప్రయాణించెడివారు.


అడవి ప్రారంభ మొదటి భాగము నుండి మధ్యలోగల దేవాలయమునకు అరవై మైళ్ల దూరము ఉండెడిది. అడవి మొదటి భాగములో రోడ్డు మీద పోలీస్ చెక్‌పోస్టు కూడా ఉండెడిది. 


శివరాత్రి రోజు కాకుండా విడి దినములలో ఆ రోడ్డు మీద ఎవరూ ప్రయాణించకుండా పోలీస్‌వారు చూచుకొనెడివారు. అడవిలో క్రూర మృగములు సహితము విచ్చలవిడిగా ఉండుట వలన వాటి రక్షణ నిమిత్తము కూడా పోలీస్‌వారుండెడివారు. 


శివరాత్రి రోజు తప్ప రోడ్డు వెంబడి అడవి లోనికి పోలీస్‌వారు కూడా పోయెడివారు కాదు. రోడ్డు వెంట పోవడానికి కూడా భయపడునంత భయంకరమైన అడవి అది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Horror