దయ్యాల కోన పార్ట్ 1
దయ్యాల కోన పార్ట్ 1
రాత్రి 11:45. వైజాగ్ నుండి అరకు వెళ్లే దారి.
సురేష్ బైక్ ఆపేశాడు. ముందు రోడ్డంతా
పొగమంచుతో నిండిపోయి ఉంది. గూగుల్ మ్యాప్
లో ఆ దారి పేరు కూడా లేదు.
లోకల్ డ్రైవర్ చెప్పాడు -
"ఈ దారిలో వెళ్లొద్దు, మళ్ళీ రావు" అని.
కానీ సురేష్ వినలేదు.
బైక్ ముందుకు వెళ్లగానే, ఒక చిన్న బోర్డు
కనిపించింది - "దయ్యాల కోన - 1KM".
అక్షరాలు ఎర్రగా మెరుస్తున్నాయి.
1 KM తరువాత...
రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి నిల్చుని ఉంది.
తెల్ల చీర కాదు, ఎర్ర చీర. వెనక్కి తిరిగి ఉంది.
సురేష్ హారన్ కొట్టాడు. కానీ ఆమె కదలలేదు.
భయంతో బైక్ ఆపి "ఎవరు నువ్వు?" అని అరిచాడు.
అప్పుడే... చుట్టూ చెట్లలో నుండి చాలా
కళ్ళు వెలుగుతున్నాయి. అన్నీ సురేష్ నే
చూస్తున్నాయి.
ఆ అమ్మాయి మెల్లగా నడుచుకుంటూ
అడవిలోకి వెళ్లిపోయింది. సురేష్ తనకు
తెలియకుండానే ఆమె వెనకే వెళ్ళాడు.
ఆ అడవిలోకి వెళ్లగానే...
సురేష్ కి ఏమి కనిపించిందంటే...

