veesam akhil

Drama Classics Fantasy

3  

veesam akhil

Drama Classics Fantasy

D.I.A(దేశం. ఇళ్లు.ఆధ్య)

D.I.A(దేశం. ఇళ్లు.ఆధ్య)

4 mins
4


దేశం మీద భక్తి, తండ్రి కన్న కలలు, కాలం కలిపిన ప్రేమ వీటి ఆధారంగా నడిచే కథ. సమాజం లో మంచి పేరు ఉన్న వ్యక్తి కొడుకుని ఎంతో గారంగ పెంచుకుంటాడు. చదువుతో పాటు ఎన్నో విలువలు నేర్పి ,అన్ని సౌకర్యాలు అందించి ఎంతో ప్రేమ గా పెంచుకుంటాడు.పెద్ద కళాశాలలో చదివించి అమెరిక పంపించాలి అనుకుంటాడు.తన కొడుకు అని అందరికీ గర్వంగా చెప్పుకునే స్థాయికి కొడుకు ఎదగాలి అని కలలు కంటారు. ఈ కళ తన జీవిత ఆశయం గా భావించి కొడుకుని ఎంతో ప్రోత్సహిస్తారు. కొడుకుని ఉన్నత విద్య కోసం అమెరికా పంపిస్తాడు.రెండు సంవత్సరాల తర్వాత భారత జెండా కప్పి ఉన్న తన కొడుకు శవం తన ఇంటి ముందుకు వస్తుంది. నిజానికి తన కొడుకు అమెరికా వెళ్ళలేదు. చిన్నప్పటి నుండి కల కన్న ఆర్మీ లో చేరతాడు.


సూర్య కాలేజ్ లో చదువుతున్న వయసు నుండి ఆద్యా ను ప్రేమిస్తాడు కానీ ఎప్పుడూ తనకి చెప్పలేదు.ఆద్య కి కూడా సూర్య అంటే చాలా ప్రేమ. అది సూర్య కి చెప్పిన నాకు ప్రేమ గురించి అవగాహన లేదు అంటు చెప్పుకొచ్చాడు. ఆద్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్మీ లో తనకి ఏదైనా అయితే ఆద్య ఒంటరిగా మిగిపిలిపొతుంది అనే భయంతో ఇష్టం లేనట్టు నటిస్తాడు.సూర్య అమెరికా వెళ్ళిపోతాడు, వెళ్లి రెండు సంవత్సరాలు అయిన తన నుండి ఎటువంటి సమాచారం ఆద్యకి అందదు.అయిన సరే ఓపికగా ఎదురుచూస్తుంది.అమెరికా లో ఉన్నాడు అనుకుని ఎలా అయిన కష్టపడి చదివి అమెరికా వెళ్ళాలి అని కలలు కంటుంది.ఇంట్లో వాళ్ళతో పోరాడి ఎన్నో ఇబ్బందులు అధిగమించి సూర్య కోసం ఎదురుచూస్తుంది.ఎంతో కష్టపడి IIT కాశ్మీర్ లో సీట్ సంపాదిస్తుంది.ఇక్కడ చదివి ఉద్యోగము సాధించి సూర్య కోసం అమెరికా వెళ్ళాలి అని ఆశపడుతుంది.ఒక రోజు FIELD TRIP లో భాగంగా సరిహద్దు ప్రాంతానికి వెళ్తారు అకస్మాత్తు గా ఉగ్ర దాడి జరుగుతుంది.తను వచ్చిన బస్ ఆద్యకి కనిపించదు.చుట్టూ యుధ్ధ వాతావరణం.తను చాలా భయపడిపోయింది.ఉన్నపాటిగా సూర్య కనిపిస్తాడు.గాయాలతో పడి ఉన్న సూర్య దగ్గరకు ఎదురోస్తూన్న బల్లెట్లను కూడా పట్టించుకోకుండా పరుగులు తీస్తుంది.ఇక్కడ ఎందుకు ఉన్నావ్ ఎంటి అరుస్తూ బోరున ఏడుస్తుంది. .తన మీద పడి ఏడుస్తుండగ సూర్య ఛాతీ పై 

(దేశం

ఇల్లు

ఆద్య)

అని రాసి ఉన్న పచ్చబొట్టు కనిపిస్తుంది. దాని బట్టి సూర్య కూడా తనని ప్రేమించాడు అని తెలుసుకుంటుంది.తన జ్ఞాపకాలు అన్ని రాసి భద్రపరిచిన ఒక పుస్తకాన్ని సూర్య చేతిలో పెడుతుంది.గాలికి తెరుచుకున్న పుస్తక ఆఖరి పేజీలో "నా నడక ఒంటరిగా మొదలు పెట్టిన,ఒంటరిగా ఎంత దూరం నడిచిన, ముగింపు మాత్రం నీ చేయి పట్టుకునేచేస్తాను" అని రాసి ఉంటుంది.ఆద్య సూర్య చేయి పట్టకుంటుండంగా సూర్య ప్రాణం పోతుంది. పోగానే ఆద్య కి కూడా బుల్లెట్ తగిలి చనిపోతుంది.



సూర్య ఇక్కడ ఉంటాడు అని కలలో కూడా ఊహించి ఉండదు ఆద్య. ఆద్యని గుండెల్లో దాచుకున్న సూర్యని , సుర్యనే తన గుండెగా బ్రతికిన ఆద్యని విధి కలిసేలా చేసింది. అదే వింత నాటకానికి విధి వాళ్ళని బలి చేసింది.





సూర్య శవాన్ని చూసిన వల్ల నాన్న. ఒక్కసారిగ కుప్పకూలి పోతారు.సూర్య వస్తువులతో తన తండ్రి కి రాసిన ఉత్తరం కూడా ఆర్మీ తన తండ్రి కి ఇచ్చేస్తుంది.దాన్ని సూర్య తండ్రి ఏడుస్తూ బయటకి చదివి వినిపిస్తాడు. అది వింటున్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతారు.ఆఖరి లైన్ లో ఒక వాక్యం " నేను గొప్ప స్థాయికి చేరుకుని నా కొడుకు అని గర్వంగా చెప్పుకోవాలి అని కలలు కన్నావు కదా నాన్న , నేను చనిపోయిన రోజు నీ చుట్టూ ఉన్న వాల్లే కాదు యావత్ భారత దేశం నీ కొడుకునీ అని గర్వంగా చెప్పుకుంటుంది" అని రాసి ఉంటుంది. అది వినగానే చుట్టూ ఉన్న జనమే కాకుండా T.V లో చూస్తున్నా వారితో సహా దేశం మొత్తం నిలబడి సలాం కొడుతుంది.భారత్ మాతా కి జై,సూర్య గారి తండ్రి కి జై అంటు నినాదాలు మధ్య సూర్య అంత్యక్రియలు ముగుస్తాయి.







నా నాన్నకు,

       మాటలు రాని సందర్భంలో నా కలాన్ని బ్రతిమలాడి రాయిస్తున్న ఉత్తరం ఇది.2 సంవత్సరాల వయసు లో నాకు నడక నేర్పావు. నా చేయి పట్టుకుని నాతో పాటు నడుస్తూ ప్రపంచం లో ఉన్న అన్ని రంగులని పరిచయం చేశావు. నేను స్కూలు కి వెళ్ళిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు నీ నుండి చాలా తీసుకున్నాను, నీ నుండి తిట్లు, ని చేతి దెబ్బలు ఇలా ఎన్నో తీసుకున్నాను. ఈ యుధ్ధ వాతావరణం లో ఇవి కూడా నాకు ఆయుధాలు గా మారాయి. నీ చేయి నేను ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వెన్నుపూస గా మారింది. నీ చిన్న చిరునవ్వు వెనుక ఉన్న కన్నిలని చూస్తూ పెరిగాను, ఏ కష్టం నా వరకు రాకుండ అడ్డు గోడలా నిలిచావు.మమ్మల్ని తల ఎత్తుకునేలా చేయడానికి ప్రతి రోజు నువ్వు బుజాలు వంచి పనిచేశావు.కాళ్ళకి విశ్రాంతిని ఇవ్వకుండా పరిగెత్తి , మా ఆకలి ను పరీక్షించకుండ చేశావు.


నా జీవితం మొత్తం నీ వెలుగు కింద మెరిసాను,ఎలా అయితే నీడ కొన్ని సార్లు మన ముందు కొన్ని సార్లు మన వెనుక నడుస్తుందో అలానే నా నీడలా నీలిచావు.నీ మెదడు అణువుఅణువును నా ఆలోచనలతో నింపేసావు.నువ్వు సర్వం వదిలేసి నన్ను అమెరికా లో చదివించాలి అని కలలు కన్నావు.యుధ్ధ ప్రాంతంలో కూడా నీ చేయి పట్టుకుని నడుస్తూ చీకటిలో వెలుతురు వెతుకుతున్నట్టు అనిపిస్తుంది.నేను నడిచే దారిలో ఉన్న ముళ్ళను తీయడానికి నువ్వెన్నో రాళ్ల కింద నలిగిన సరే నవ్వుతూ లేచి నిలబడి నా తర్వాత అడుగుకు నా చేయి పట్టుకున్నావు.


చిన్నప్పటి నుండి నేను ఓడిపోయిన ప్రతీ సారి అందరూ కిందకి పడిపోయాను అనుకునేవారు, నిజానికి నేను కింద పడిపోలేదు,నేరుగా మా నాన్న వొడిలో పడ్డాను అని వాళ్ళకి తెలీదు. నా నిజమైన విజయం అప్పుడే మొదలైంది అని వాళ్ళకి తెలీదు.నవ్వు వచ్చినప్పుడు ముందుండి, కన్నీళ్లు వచ్చినప్పుడు నాకు కనిపించకూడదు అని నా వెనక్కి వెల్పోయావు.జీవితం లో ఎన్ని సాధించిన నీ కొడుకు గా బ్రతకడం అనేది నాకు అతి పెద్ద గౌరవంగా భావిస్తాను.


నేను అమెరికా వెళ్లకుండా ఆర్మీ లో చేరి నిన్ను మోసం చెయ్యాలి అనుకోలేదు.చెబితే నువ్వు ఒప్పుకోవు అన్న భయం కన్నా , నేను ఆర్మీ లో ఉన్న ప్రతి క్షణం నువ్వు భయంతో గడుపుతావేమో అన్న ఆందోళన ఎక్కువ.ఎక్కడ ఉన్న నీ కొడుకు లాగే బ్రతికాను , నీ కొడుకు లాగే జీవితాన్ని ముగిస్తాను.నాకు బ్రతుకు నేర్పిన నీకు , నేను బ్రతికినంత కాలం రుణపడి ఉంటాను. నా విజయాలను చూసి నీ చుట్టూ ఉన్నవాళ్లు అంత నీ కొడుకు అని చెప్పుకోవాలి అని కలలు కన్నావు కదా నాన్న, నేను చనిపోయిన రోజు నీ చుట్టూ ఉన్న జనమే కాదు యావత్ భారత దేశం నేను నీ కొడుకునీ అని గర్వంగా చెప్పుకొంటూ నీకు సలాం చేస్తుంది.



                          ఇట్లు,

                    కృష్ణ గారి అబ్బాయి సూర్య


Rate this content
Log in

More telugu story from veesam akhil

Similar telugu story from Drama