STORYMIRROR

Dinakar Reddy

Inspirational

4  

Dinakar Reddy

Inspirational

భాగ్యరేఖ

భాగ్యరేఖ

1 min
469

ఏదయినా సరే.నువ్వు ఈ పరీక్ష వ్రాయాలి సావిత్రీ!

నా స్నేహితురాలు సుమతి మరీ మరీ చెప్పింది.చిన్నప్పటి నుంచీ ఎవ్వరు ఏమన్నా తను మాత్రం నాకెప్పుడూ సపోర్ట్ చేసేది.

నేను చదవలేను అనుకున్న ప్రతీ సారీ నన్ను చాలా ఎంకరేజ్ చేసింది.


ఇవాళ నేను సివిల్స్ పరీక్షలు బాగా వ్రాశాను.సుమతి మా అమ్మా వాళ్ళని తీసుకొని వచ్చి పరీక్షా కేంద్రం బయట ఎదురు చూస్తోంది.

నేను బయటికి రాగానే తను నా దగ్గరికి వచ్చి ఎలా వ్రాశావ్ అని అడిగింది.నేను బాగా వ్రాశానని చెప్పాను.

హేయ్ నా ఫ్రెండ్ కలెక్టర్ అయిపోతుందోచ్ అంటూ నా చక్రాల కుర్చీ పట్టుకొని అటూ ఇటూ తిప్పింది.


అమ్మా నాన్నలు నా భుజం తట్టారు.

నాకెందుకో ఈ స్నేహం నా వైకల్యాన్ని జయించే శక్తిని ఇచ్చింది అనిపిస్తుంది.


అమ్మానాన్నల ఆశీర్వాదం ఇంకా నేను గొప్ప విజయాల్ని సాధించగలనని ప్రోత్సహించే స్నేహమే నా భాగ్యరేఖ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Inspirational