aparna

Drama

4.9  

aparna

Drama

అమ్మ ప్రేమ అంతులేనిది

అమ్మ ప్రేమ అంతులేనిది

3 mins
1.8K


ఈ రోజు మ న జీవితం లో చాలా ముఖ్య మై న రోజు ఎందుకో చెప్పుకొండి చూద్దాం! అని తన హస్బెండ్ ని అడిగింది సిగ్గు పడుతూ.


ఎందుకో అంత ముఖ్యమైన రోజు, ఈ రోజు ఏ మీ మన పెళ్ళి రోజు కాదు కద సుమా? అని ప్రశ్నించాడు నవ్వుతూ

మీకు అన్నీ సరదా లే కాని, చెప్పింది వినండి ఇంక మన ఇం ట్లో కూడా చిన్న పిల్లల కేరింతలు మొదలవుతాయి.


నువ్వు ఏమి పనులు చె య్యి ద్దు, బరువులు కూడ ఎ త్తొద్దు. ఈ టైమ్ లో నువ్వు చాలా జాగ్రత్త గా ఉండాలి .


నాకు చాలా ఆనందం దానితో పాటు భయం కూడా మొదలయింది. నెలలు గడుస్తున్న కొలది బిడ్డ మీద చాలా ప్రేమ ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న తపన ఇద్దరిలో. లోపల తన్ను తున్నప్పుడు ఎప్పుడు బయటకు వచ్చి నాతో ఆడుకుంటుందా అన్న ఆలోచనల లో రోజులు గడిచాయి.


9 నెలలు మోసి అన్ని నొప్పులు బరించి ఇంకొక జీవితానికి ఆయువు పోసి తను మరో పాత్రను పోషించడానికి సిద్ధం అయ్యింది.


డాక్టరు వచ్చి మీకు ఆడ బిడ్డ పుట్టింది అండి అనగనే ఇద్దరూ చాలా ఆనంద పడి పాపను ముద్దాడి గుండెకు హత్తుకున్నారు.


పాప ను కంటికి రెప్పలా చూసు కుంటు వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాన్ని మరిచి, పాప లో వాళ్ళ ఆనందం మరియు జీవితాన్ని చూసు కుంటున్నారు. పాప కు వాళ్ళు స్వేచ్చ అని పేరు పెట్టారు. తను తన జీవితం లో స్వేచ్చగా జీవించాలని, తను అనుకున్న వన్ని సాధించి తన కాళ్ళ మీద తాను నిలబడాలని ఆ పేరు పెట్టారు.


స్వేచ్చ ఆనందం కోసం వాళ్ళ సరదాలని ప్రక్క న పెట్టి తను అడుగుక ముందే అన్ని సమకూర్చే వారు.


అమ్మ అయితే ఎప్పుడు ఏమి అడిగినా కాదు అనదు. తను తన జీవితం లో అనుభవించలేని ఆనందం తన కూతురు అనుభవించాలని, నేను ఏమి అడిగినా ఎక్కడ కు వెళ్ళాలి అన్నా నాన్నను అడిగి ఒప్పించి తన కర్చులలో కొంచెం డబ్బులు తీసి ఇచ్చేది. ఇంట్లో ఆ మిగతా డబ్బు ల తో నే సరుకులు అవి సమకూర్చేది మాకు లోటు లేకుండా. అమ్మ నా మీద అంతు లేని ప్రేమ ను చూపించేది.


కాని నేను అమ్మ ప్రేమను అర్ధం చేసుకోలేదు. ఎప్పుడు ఫోన్‌ లో ఉండే దానిని అమ్మ తో సరిగ్గా మాట్లాడేదానిని కాదు. అమ్మ నా కోసం ఏమైతే కళలు కనిందో దానికి విరుద్దంగా ఉండడం మొదలు పెట్టాను. అమ్మ నాతో చాలా సార్లు అనేది ఇలా వచ్చి నా తో మాట్లాడుతూ సాయం చేయెచ్చుగా అని కాని నేను ఎప్పుడూ వె ళ్ళే దానిని కాదు.


నా చదువు పూర్తి అయ్యింది. నాన్న ఇక్కడే ఏ మైనా ఉద్యోగం చూసుకో అని చెప్పారు కాని, నా కు బయటకు వెళ్ళి మంచి ఉద్యగం చెయ్యలి అన్న కోరిక. ఆమ్మ మాత్రం ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తు నే ఉండేది. ఈ విషయం లో కూడా నాన్న ను ఒప్పించి నన్ను బయటకు పంపింది. తన నేను లేకుండా ఉండలేదు కాని నా భవిష్యత్తు కోసం తను అన్ని వదులుకుంది.


నాకు మంచి ఉద్యోగం వచ్చింది అనగానే అమ్మ నాన్న అందరికి స్వీట్స్ పంచి పెట్టారు. నాకన్న వాళ్ళే చాలా ఆనందం గా ఉన్నారు. ఇలా చాలా ఏళ్ళు గడిచాయి, అందులో చాలా సార్లు ఇంటికి వెళ్ళాను. అమ్మ నాతో చాలా సార్లు మాట్లాడదాం అనుకుంది మనసు విప్పి కాని నేను అమ్మ తో అంత మాట్లాడే దానిని కాదు. అమ్మ ముఖం లో ఏదో ఆ వేదన , బాధ కనిపించేవి కాని పై కి మాత్రం చిరునవ్వుతో దానిని మూసేసేది.


ఇంతలో ఒక రోజు నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ నాన్న అమ్మకి బాగోలేదు ఆసుపత్రి కి తీసుకొని వచ్చాం. నువ్వు వెంటనే ఇక్కడికి రా అని చెప్పారు. నేను త్వరగా ఇంటికి బయలు దేరాను. నేను ఇంటికి చేరుకున్నాను. ఇంటి చుట్టూ జనం నాలో భయం అమ్మ కు ఏమయ్యిందో ఆ దేవుడికి ప్రార్ధి స్తున్నా మనసు లో మా అమ్మ కు ఏమీ కాకూడదు అని. ఇంతలో నాన్న చాలా దైర్యం తెచ్చుకొని బాధ ను అను చు కుంటూ చిట్టి తండ్రి రా ఇలా నవ్వు ఇలాంటి సమయం లో చాలా దైర్యం గా ఉండాలి అని నా కు నచ్చ చెప్పు తున్నారు. నేను అడిగా నాన్న అమ్మకు ఏమయ్యింది మీరు ఎందుకు ఇలా నా తో మాట్లాడు తున్నారు. నాన్న నన్ను అలా ముందికి తీసుకుని వెళ్ళారు. అక్కడ అమ్మ అలా పడుకుని ఉంది అందరూ ఏడుస్తున్నారు. నాన్న అమ్మకు ఏమయ్యింది అని అడిగా ఏడుస్తూ అమ్మ మనకు ఇంక లేదు అని నాన్న అక్కడే కుప్ప కూలి పోయి ఏడుస్తున్నారు. నాకు ఇంక ఏమి చెయ్యలో అర్ధం కాలేదు. అక్కడే అలా అమ్మ ను చూసు కుంటూ ఉండి పోయా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమ గా పెంచిందో ఆ జ్ఞాపకాలన్ని ఒక దాని తరువాత మరొకటి నా కళ్ళ ముందు కు వస్తున్నాయి అమ్మ నాతో మాట్లాడాలనుకునే ప్రతి సారి నేను మాట్లాడక పోతే ఎంత బాధ పడేదో. ఆ బాధ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు అమ్మకి గుండె పోటు రావడానికి. అమ్మ లేని లోటు ఎవరు తీర్చ లేనిది. ఈ లోకం లో అమ్మ ప్రేమ కు మించింది ఏమి లేదు.


అమ్మ ను పోగొట్టుకున్నా నాన్న ను జాగ్రత్తగా చూసుకోవాలని నాతో తీసుకొని వెళ్ళాను. నాన్న నేను జీవితంలో సంతోషం గా ఉన్నాము. ఒకే ఒక్క లోటు అమ్మ ఉంటే ఇంకా సంతోషంగా ఉండే వాళ్ళం అని. ప్రతి సంవత్సరం ఇంటికి వెళ్ళి అమ్మ జ్ఞాపకాలతో గడిపి ఆనందం గా ఉంటున్నాం.


ఈ కధ ను చదివి న వాళ్ళు అందరూ అర్థం చేసుకొండి మీ అమ్మ ప్రేమను వాళ్ళ జీవితం అంతా మీ కోసమే త్యాగం చేసి మిమ్మల్ని అపురూపంగా చూసు కుంటారు.


ఇది రాయడానికి మా అమ్మ నాకు రోల్ మోడల్ నాలో ఉన్న ఒక కళ ను నేను బయటకు తీసుకొని రావాలి అన్నదే తన కోరిక.


ధ్యాంక్యూ నా కథ ను చదివినందుకు.


Rate this content
Log in

Similar telugu story from Drama