STORYMIRROR

Yashaswee Nemmani

Classics Inspirational

4  

Yashaswee Nemmani

Classics Inspirational

యశస్వీ వచన లహరి

యశస్వీ వచన లహరి

17 mins
4

 శీర్షిక: యశస్వీ వచన లహరి - ఒక పరిచయంప్రకృతి ఒడిలో పుట్టిన మనిషి, నేడు యాంత్రిక జీవనంలో పడి తన మూలాలను మర్చిపోతున్నాడు. ఆధునికత పేరుతో మనం సంపాదించుకున్న సౌకర్యాల వెనుక, కోల్పోతున్న సహజత్వం ఎంతో ఉంది. ఈ 'యశస్వీ వచన లహరి' శతకం ద్వారా నేను చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశ్యం—మళ్ళీ మన మూలాల్లోకి (Roots) వెళ్ళడం.సహజమైన జీవనశైలి, ప్రకృతితో మమేకమవ్వడం, మరియు మానవీయ విలువలను కాపాడుకోవడం వంటి అంశాలను వంద వచన కవితల రూపంలో ఇక్కడ పొందుపరిచాను. ఇది కేవలం నా భావన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తమ నిజాయితీ గల జీవితాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఒక మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. నా మొదటి సాహిత్య ప్రయత్నంగా ఈ శతకాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
శీర్షిక: యశస్వీ వచన లహరి - ఒక పరిచయంప్రకృతి ఒడిలో పుట్టిన మనిషి, నేడు యాంత్రిక జీవనంలో పడి తన మూలాలను మర్చిపోతున్నాడు. ఆధునికత పేరుతో మనం సంపాదించుకున్న సౌకర్యాల వెనుక, కోల్పోతున్న సహజత్వం ఎంతో ఉంది. ఈ 'యశస్వీ వచన లహరి' శతకం ద్వారా నేను చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశ్యం—మళ్ళీ మన మూలాల్లోకి (Roots) వెళ్ళడం.సహజమైన జీవనశైలి, ప్రకృతితో మమేకమవ్వడం, మరియు మానవీయ విలువలను కాపాడుకోవడం వంటి అంశాలను వంద వచన కవితల రూపంలో ఇక్కడ పొందుపరిచాను. ఇది కేవలం నా భావన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తమ నిజాయితీ గల జీవితాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఒక మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. నా మొదటి సాహిత్య ప్రయత్నంగా ఈ శతకాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

 మనుజ నీ నిజ సహజ జీవనము జీవించరా

  1.మూషిక వాహన మోదక ప్రియముందుండి నడిపించు పార్వతీ తనయఆటంకాలను తొలగించే ఏకదంతా ఈ సంకల్పాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించవయ్య ఓ గణేశా నిన్ను స్మరిస్తూ ఇట్లు రాస్తున్నానయ్యా ఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 2. ఈ సుభాషణం జగన్మాత శాసనం జ్ఞాన ప్రచోదనం సహజ భావ నిర్దేశనం హంసవాహిని రథసారధి నై పలికెదరఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 3. మాత వీణా భూషిణి వాద్యపు తీగలు మీటుతూ వడివడిగా మాటలు నా చెవిన వేసి అక్షరాల ఆలోచనలను ఆజ్ఞగా వేసి ఈ అజ్ఞానికి తెలిపి తివా దిశను ఆపిఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 4. శ్రీ గురు దత్తాత్రేయ స్వరూపము లైన సూచక వాచక వంశ పరమ మహా పరాపర పరమేష్ఠి  పూర్వ జగత్  గురువులందరి పాదపద్మములను మనస్సులో స్మరిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ సంకల్పాన్ని నిర్విఘ్నంగా జనరంజకంగా దిగ్విజయంగా ఘనంగా పూర్తి చేయడానికి కావలసిన ఆశీస్సులను నాపై ప్రసరింప చేయమని వేడుకుంటూ నా వచనాలను అక్షరాలుగా మారుస్తూ ఈ విధంగా మొదలు పెడుతున్నాను స్వామీఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా
5. నేను మితభాషిని మృదుభాషిని ఏ మాటతో ఏమి అవునో అని సంకోచం కలవాడిని నా చేత నా వలన ఈ వ్రాతలు ఏలనో సువాసినినాకేలన ఈ ఆలోచన కలగజేసి అనిపించేనేఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 6.  నిన్ను నవమాసాలు మోసే రా అమ్మ నిన్ను బొజ్జలోంచే ప్రేమించే రా అమ్మ నువ్వు అమ్మను చూడనేలేదే అమ్మ నిన్ను చూడనేలేదే అవునురా నిజమే ప్రేమ గుడ్డిదేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 7. అమ్మను తన్ననీ వాడెవడు రాఅవును నువ్వు విన్నది నిజమే అమ్మను తన్ననీ వాడెవడు రాగర్భంలో మొదటిసారి కాలితో తన్నగానే అమ్మ మోముపై విరిసేనే చిరు మందహాసం మెరిసేనేఅమ్మను తన్ననీ వాడెవడు రాఅవును నువ్వు విన్నది నిజమే అమ్మను తన్ననీ వాడెవడు రాబయటికొచ్చి చను పాలు తాగుతూహృదయంపై తన్ననీ వాడెవడు రాఅవును నువ్వు విన్నది నిజమే అమ్మను తన్ననీ వాడెవడు రామాతలకె మాత అందరినీ మోసే మాత ఈ భూమాతను తన్ననీ వాడెవడు రా అమ్మ అమ్మే అమ్మ అమ్మే అమ్మ తదుపరి ఏ ఎవరైనా అది ఎవరికైనాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 8.. వడివడి అడుగులు వేసిన బాల్యం తడబడి బాలుడు పడిన జడియక అడుగడుగునా నాడు ముందడుగు వేసిన వాడు నడివయసున నిట్టనిలువునా నేడు నిలబెట్టి నడిపించ లేదా బుడిబుడి అడుగులు వేయవలె పడవలే నడవవలే ముందడుగే వేయవలెఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 9. మమకారం అమ్మ పేగు నుంచి పుట్టిందేమోఅనురాగం నాన్న చిటికెనవేలు పట్టు నుండి పుట్టిందేమో వారు ఈ లోకాన లేకున్నా ఆకాశాన ఎక్కడో ఉన్నా నొప్పి లేస్తే అమ్మ అని కష్టం వస్తే నాన్నని ఎందుకో మరి అనగానే ఉపశమనం కలుగుతుంది కాబోలు ఆ మమకారం అనురాగం దూరాన ఉన్న వారికి కూడా మనలాగే ఇంకా ఉందేమోఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 10. నీ పుట్టినరోజు నీది మాత్రమే కాదురా జనన మరణాల మధ్య పోరాట సమయాన నీకు తోడుగా ఆనాడు అమ్మ కూడా పుట్టే మరలానీ పుట్టినరోజు నీది మాత్రమే కాదు రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 11. అమ్మ అడుగు అడుగు ముందుకు వేస్తూఎత్తుపల్లాలు అన్నీ చూస్తూ నవమాసాల గర్భంతో నేలకేసి చూస్తూ ముందుచూపుతో ప్రతి అడుగు పదిలంగా ముందుకు వేస్తూ నిన్ను ఇష్టించి తనను కష్టించి మోసుకొచ్చి తీసుకొచ్చి చూపించే కదరా పోరాడే సందేశం నాటి నుంచే ఆనాటి నుంచేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 12. అమ్మ లేదు అని కన్నుల నీరు కార్చకుఅమ్మలోని అంతర్భాగమే నువ్వు నడుస్తుంది నువ్వు కాదు నడుస్తుంది నీలోని అమ్మే అమ్మ నడుస్తూనే ఉంటుంది అమ్మ ప్రకృతై నడుస్తూనే ఉంటుంది అమ్మ లేదు అని కన్నుల నీరు కార్చకుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 13. నీకు నేడు మాట వచ్చెను నడక వచ్చెను బలము వచ్చెను పేరు వచ్చెను బలగము వచ్చెను ప్రతిష్ఠ పెరిగెను తల్లిదండ్రుల విలువ నేడు తెలిసేటిది కాదు నీకు మాట రాని నాడు నడక రాని నాడు నొప్పి చెప్పలేని నాడు నిద్రపట్టని నాడు నీ మలమూత్రములు నీవు విసర్జించేలేని నాడునాడు నువ్వు పుట్టిన నాడు వారు నిన్ను సంరక్షించుకున్న నాడు వారు నిన్ను పదిలంగా చూసుకున్న నాడు నిన్ను లాలించి ఆడించి పాలించిన నాడు నీవు జ్ఞప్తి చేసుకున్న నాడు తెలుసునురా ఆ తల్లిదండ్రుల విలువఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 14. తోడబుట్టిన వాడు తమ్ముడు అన్న తోడుగా పుట్టిన వాడు తమ్ముడు జీవితాన బంధములు ఎన్నెన్ని ఉన్నా ఈ బంధము కన్నా ఏదీకాదు మిన్న రాముడికి లక్ష్మణుడు తోడు లక్ష్మణుడికి రాముడు తోడు అది సౌఖ్యంతో కూడిన సామ్రాజ్యమైన కష్టాలతో కూడిన కీకారణ్యమైనఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 15. దొంగ రా దేవుడు అవును దొంగ రా దేవుడు ఆపదలను ఎత్తుకెళ్తాడు రా సంపదలను కలిగిస్తాడు రా కనిపించక టెంకాయలో స్వచ్ఛమైన నీరు నింపుతాడు రా కనిపించక కోయిలకి వసంతం వచ్చింది పాట పాడు మంటాడు రా దొంగ రా దేవుడు అవును దొంగ రా దేవుడునెమలికి నాట్యం నేర్పినవాడు ఎవడు రా ఈ నేలకి సారం ఇచ్చినవాడు ఎవడురాసూర్యుడిని రమ్మన్న వాడు ఎవడురా పొమ్మన్న వాడు ఎవడురా చంద్రుడిని చల్లగా మసక చీకటిలో కనపడమన్నవాడు ఎవడురా పెరుగుతూ  తరగమన్నవాడు ఎవడు రా దొంగ రా దేవుడు అవును దొంగ రా దేవుడు గలగల పారమని ఈ జలపాతాలకు చెప్పిన వాడెవడు రా తీయతీయని ఫలాలు ఇమ్మని ఈ చెట్లకి చెప్పిన వాడెవడు రా సమస్త ప్రాణికోటికి జీవము ఇచ్చిన వాడు ఎవడు రా ఈ జీవాలు అన్నిటికీ జీవించే మార్గం తెలిపినవాడు ఎవడు రా దొంగ రా దేవుడు అవును దొంగ రా దేవుడుదాక్కొని దోబూచులాటలాడుతున్నవాడుకనిపిస్తే వాడిని పట్టుకురా పట్టుకొని తప్పక అడగరా ఇది అంతా నీవే చేశావు కదరా అనిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 16. శ్రీవారు శయనించే ఆదిశేషుడిపైన అచట శ్రీదేవి చేయుచుండె నారాయణుడి పాద సేవ దీన భక్తుడి మొరలు వినినంతనే హఠాత్తుగా ఆ శ్రీనివాసుడు పరిగెత్తేనేభర్త అడుగున అడుగులు వేసి తోడుగా వెంట ముల్లోకములు దాటి దీన భక్తుల మొరలు బాపేనే ఆ శ్రీ యును శ్రీనివాసుడును అనుసరించిన శ్రీదేవి ఉండునది కాదు శ్రీవారి పాదముల చెంతఅనుసరించిన శ్రీదేవి ఉండునది ఎల్లవేళలాశ్రీవారి హృదయము చెంతఅనుసరించటం ఎప్పుడూ తప్పు కాదుఅనుసరించటం ఎప్పుడూ తప్పు కాదుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 17. సృష్టి కార్య ఆరంభము నందు తండ్రికి ఆనందము సృష్టికార్యం సమాప్తము నందు తల్లికి బహు దుఃఖము ప్రసవ వేదనతో నెత్తురు ఏరులై పారును నొప్పులు తట్టుకుంటూ తల్లి బిడ్డకి జన్మనిచ్చును  సుఖదుఃఖములు సృష్టియందు ఇమిడి ఉన్నాయి రా అవి మన జీవన పయనాన భాగమైనయిరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 18. గురువు బరువు శిష్యుడు లఘువుశ్రద్ధ కలిగిన వాడే అసలైన శిష్యుడు మిగిలిన వారు కేవలం శ్రోతలు మాత్రమే కేవలం శ్రోతలు మాత్రమేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 19. చెట్టుని పెట్టరా నువ్వు అండగా ఉంటది తరతరాలకు వెలకట్టలేని ప్రేమను ఆస్వాదించ రా నువ్వు కొమ్మ కాయ పండు నీడ గాలి ఆకు గూడు మందు ఎన్నో ఇంకెన్నో ఇచ్చునురా తరతరాలకు అది నువ్వు ఉన్న లేకపోయినా చెట్టును పెట్టరా నువ్వు అది తోడుగా వచ్చును రా కాటి వరకుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా
20. కన్నులు చిన్నవి ప్రపంచం మాత్రం పెద్దది మనుష్యుడు చిన్నవాడేప్రయాణం మాత్రం పెద్దది సంకల్పం గొప్పది అయితే ఏదీ కాదు రా చిన్నది ఏది కాదు రా చిన్నదిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 21.  నువ్వు అన్నది నువ్వు కాదు నీ లోనిది అసలు నువ్వు ముందున్నది కాదు జగమునీలోన జగము ఉన్నది అరె వారి నీ సవారీ కాకూడదు పెడదారిఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 22. ఎవరురా అనాథ ఎవరురా అనాధ జన్మించిన వాడి జననీ జనకులు ఎవరు ఆ జననీ జనకులు ఎవరు వారి జననానికి కారణం ఎవరు అరె నరుడా పార్వతీపరమేశ్వరులు ఈ జగతికి జననీ జనకులు కాగా ఎవరురా అనాథ ఎవరురా అనాధఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 23.  తల వంచుకు బ్రతకడం తప్పు కాదువెనకడుగు ఎప్పుడూ వెనకడుగు కాదుసమయోచితమౌ వేట ప్రతి పులి గ్రద్ద ఆటఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 24. బాహ్య అంతర రణం అభ్యంతర క్రోధం #వర్తతే సమానం స్థితప్రజ్ఞతే ప్రమాణంఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 25.  నీరుగారి పోకు నిరాశ నీవు చెందకు నిరంతరం ప్రయత్నించరా  నిజాయితీగా జీవించరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 26. కదం తొక్కుతూ సాగరాకథకుడివై నడవరా కదిలే ప్రపంచమే నీదిరా కలత వలదురాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 27.  జీవన పయనాన ప్రతి మెట్టు ఒక పట్టు ఒక విడుపు ఎంతవరకూ పట్టవలె ఎప్పుడు ఏది విడవవలె కలిసొచ్చే కాలాన్ని ఒడిసి చేతిలోన పట్టు భగ భగ మండే నిప్పును తక్షణమే విడిచిపెట్టుపట్టువిడుపు నీవు విచక్షణతో చేపట్టుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 28. సమరం ఎన్నడైనా ఎక్కడైనా ఎప్పుడైనా అది ఎవరితోనైనా సమయం సందర్భం ఉచితంగా ఉండాలి సంకల్పం గొప్పగా ఉండాలి సాధనం సరైనది అయి ఉండాలిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 29.  పోరాటం ఎందుకొరకు సాధించు మంచి కొరకు తపన పడు వృద్ధి కొరకు తల దించే పనులు చేయకుఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 30. నువ్వు చేయవలసిన పని నీ చేత అవ్వ వలసినదే దాని ఫలితం ఏదైనా నువ్వు పూర్తి చేయవలసినదే కర్తవ్యం ఒక ధార్మికమైన క్రియ నీవు పూజనీయుడవు అవుతూ తరించెదవుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 31. ఏ పని ఎప్పుడు చేయాలోఅప్పుడే చేయాలికనపడే దేవుడు సూరీడు వచ్చాడు సంజ్ఞగా చూడు రా వాయిదా తగదు రా సంకోచం వదలరా స్థితిగతులు మారకముందే ముందడుగు వేయరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 32. సమయమునందు ధర్మము కాలమునందు ధర్మము దేశమునందు ధర్మము ధర్మపాలనే నీ ప్రధమ కర్తవ్యము ధర్మానుసారం జీవించి ధన్యజీవిగా నిలిచిపోరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 33. హంసలు తాగును క్షీరమువరాహము భక్షించును అశుద్ధము నీ ముందర ఉన్నది ఏది నువ్వు స్వీకరిస్తున్నదేది ఓయి గుర్తు ఎరుగు నీ మార్గమునీ ఎంపిక జీవన మూలము ఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 34. సందర్భం ఏదైనా సమస్య ఏదైనా వాదన ఏదైనా సత్యం మాత్రం ఒకటే సత్యం మాత్రం ఒక్కటేఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 35.బాల్యం నుంచి కౌమారానికి కౌమారం నుంచి యవ్వనానికి యవ్వనం నుంచి వార్ధక్యానికి మారినది నువ్వే సాక్ష్యం నీలోని నువ్వే రేపు దేహపు మార్పు మంచికే రాఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 36. మనలోని మలినాన్ని  మంచి అనే దుప్పటితో కప్పేయి చందమామలోని మచ్చలు ఆ తెల్లదనంలో ఇమిడిపోవాచల్లగా అమ్మ పిలువగా చీకటి చాటున రాదా  ఓయ్ చందమామ ఏది ఏమైనాఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 37. శోకం ఎందుకురా శోకించ అవసరం ఏలరాసమాధానం లేని సమస్య ఇలను లేదురా సంకోచానికి శోకానికి సంకటానికి స్వస్తి పలికి నీ కర్తవ్య పాలనతో ముందడుగు వేయరాఓ మనుజ నీ నిజ సహజ  జీవనముతో జీవించరా 38. ప్రాణం ఉన్నది సోయి లేదు ఆకలిగా ఉన్నది కూడు లేదు ఎండ ఉన్నది గూడు లేదు భూమి మీద జాడ ఉన్నది బ్రతకడానికి దారి లేదు నూకలు ఉన్నాయి ఈ నేల మీద నరుడా నడవరా ముందుకు తొణకక బెణకకఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా
 39. అనుమానపు వ్యక్తికి ఆమడ దూరమే  నయమువిషం ఉన్న పాము కన్న వీడు ఎంతో అపాయముఈ దుర్జనుడు కి దూరంగా ఉన్న వాడే ధన్యజీవిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 40. కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఆరోగ్యమైన పెయ్యి ఇవి ఉంటే చాలు రోయిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 41.  నీది కానిది నీది కాదు పరవస్తువు ప్రతిది రాయే పోతావుంటే తోవలోన తీసుకెళ్ళవు కదరా రాయి  రాయి రాయే నీది కాదు నీది కానిది రాయి రాయేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 42. ప్రతి వాడిలో భగవంతుడు ఉన్నాడు నీలోన ఉన్నాడు నాలోన ఉన్నాడు జన్మించి మరణించి మరల మరల జన్మించినవాడునీలోన ఉన్నాడు నాలోన ఉన్నాడు దశావతారాలు ఎత్తిన వాడు నీలోన ఉన్నాడు నాలోన ఉన్నాడు ఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 43.మానవ జీవితం ఎప్పుడు ఒక్కలాగా ఉండదు ఏమి తినలేం అన్నీ ఉన్నప్పుడు రోగపీడ దేహం వెంట ఉన్నప్పుడు  అదే ఆరోగ్యం నీ చెంత ఉన్నప్పుడు తినడానికి కావలసింది ఉండదు దొరకదు రాదు తినబుద్ధి కాదుమానవ జీవితం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 44. నాకు వీడు దగ్గర నాకు వాడు దగ్గర అని మురిసిపోకు రా ఎవడు దగ్గర ఎట్ల దగ్గర మృత్యువు ముక్కు మీదనే ఉన్నది రా నీకు అతి దగ్గరగా ఉన్నది రా పీల్చే గాలిగాని వదిలే గాలిగాని ఆగిపోతే మృత్యువు వచ్చినట్టే కదరామనిషికి మృత్యువే అతి దగ్గరగా ఉన్నది రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 45. నీకు ఎన్ని భోగాలు ఇచ్చాడు రా భగవంతుడుఈ కంటితో చూడు జలపాతాన్ని ఈ ముక్కుతో పిలువు సువాసనలని ఈ జిహ్వాతో ఆస్వాదించు షడ్రుచులని దేహమే ఒక భోగ స్థలంగా నీవు కోటీశ్వరుడితో సమానంగా భాగ్యవంతుడివి కాక మరి ఇంకేమి రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 46.  ఎంత కావాలి అంతవరకే వాడుకో రా ఈ విచక్షణ లేని వాడు మనుజుడు ఒక్కడే సకల ప్రాణికోటి అపరిగ్రహం పాటించు రా వద్దురా అత్యాశ వద్దురా అత్యాశఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 47. ప్రతి హృదయానికి వేయరా భావ సారూప్యత వారధి రాదా ప్రతీ ప్రాణినీ దరిచేరి నీ స్నేహం కోరి అరే మిత్రుడెవడు శత్రుడెవడు అందరూ మనుషులే రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 48. తాడుని తిప్పటం చాలా తేలిక దానిని కుడిగా తిప్పితే ముడి ఎడమగా తిప్పితే విడి తిప్పటం కాదు ముఖ్యం దానిని ఎలా తిప్పటం అనేది ముఖ్యంఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 49. ఒక్కసారి మాట ఇచ్చాక ఆ మాట పైన నిలబడ రా నీ నేర్పరితనం తో ఆ మాట నుంచి తప్పించు కోక ఆ ఇచ్చిన మాట నెగ్గించుకోరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 50. నిజాయితీగా త్రికరణశుద్ధిగా నీ కర్తవ్య పాలన చేయరా పరమేశ్వరుడున్నాడు పరమేశ్వరుడున్నాడుపైనుంచి నిన్ను తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 51. ఇష్టాలే జీవితం గురించి వ్యక్తీకరిస్తాయిరా నీ ఇష్టాలు సాధ్యం కాకపోతేమృగానికి కాకురావాటిని విడిచి నడవరా నరవరా ముందుకు సాగరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 52. ఆశించింది పొందిన తర్వాత వచ్చే సాఫల్యత ఆశించింది పొందినప్పుడు వచ్చే వైఫల్యత  ఈ రెంటి నడుమే నీ అస్తిత్వం కదరా మానవ మేలుకోర మేలుకొని మార్చుకోరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 53. ఇచ్చలను చంపుకోలేని వాడులోలోన కుమిలి పోవును రా  కుమిలి కుమిలి క్రుంగి కృశించును రా ఓరీ కోటిలోన ఒక జీవి బయటపడు రా ఈ బంధనము నుంచిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 54. మామిడి వృక్షానికి పిందె గా మొదలై క్రమంగా కాయగా రూపాంతరం చెంది పండుగా మారగానే ఆ మామిడి వృక్షమే ఆ పండుని భూమికి  జారవిడుస్తూ ఉంది రా ఇదే కదరా ప్రకృతి ధర్మం ఇదే కదరా ప్రకృతి ధర్మంఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 55. ఎంత సంపాదించావు అన్నది కాదురా ముఖ్యం ఎలా సంపాదించావు అన్నదిరా ప్రధానం ఏమి అనుభవించావు అన్నది కాదురా ముఖ్యం ఎలా అనుభవించావు అన్నది ప్రధానం ధర్మ వ్యతిరేకత వద్దురా ధర్మ వ్యతిరేకత వద్దురాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 56. నీ ఊపిరి నీ పిలుస్తూ మాట్లాడలేవు రా అదే ఊపిరిని వదులుతూ మాట్లాడగలరానీ ఊపిరే నీ వాక్కుగా మారెను కదరా  ఆ విధమైన మైత్రి జీవితాన అవసరము రా జీవితాన ఆ విధమైన మైత్రి అవసరము రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 57. జీవుడు ఉండేను నీలోన నీవు ఉండేవు ఇంటిలోన ఆ ఇంటి చెత్తుకి చిల్లుపడిన నీ ఇల్లు మారదా నీ జాడ మారదా నీవు ఎంతో ఆ జీవుడు అంతేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 58. మారనిది సత్యం మారిపోయేది ధర్మం మారిపోయే ధర్మముని పట్టినవాడు మారని సత్యమునందు ఒక్కటై పోవును రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 59. ఇచ్చలు అసంపూర్ణంగా ఉన్న #అవి నెరవేరకున్న జ్ఞాన కిరణం ఉత్పన్నం అక్కడే అగును రాజీవన ధర్మం తెలుసుకో రా ధర్మ పాలన చేయరా మానవఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 60. నీ జీవనపు ప్రయాణం గమ్యం చేరినప్పుడు నీ జీవుడు నీ దేహం వదిలినప్పుడు నీ సహధర్మచారిణి నీ కేసి చూస్తూ చెప్పునురా నీ జీవన తీర్పుచెప్పునురా నీ జీవన తీర్పుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 61. బలహీనుడు బలవంతుడు సమరం చేస్తే అధర్మ పాలనలో  బలవంతుడు ఉంటే ధర్మ పాలనలో బలహీనుడు ఉంటే గెలిచేవాడు బలహీనుడు వాడే భగవత్ అనుగ్రహం కలవాడుశ్రీరామచంద్రుడి అడుగున నడిచేవాడుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 62. పాండవ విజయం కురుక్షేత్ర యుద్ధమునకేవలం అది శ్రీకృష్ణుని అనుగ్రహాన ఆయన అనుగ్రహం వీరి చెంత కేవలం వారి ధర్మ పాలన వలన మానవ జీవితం నిత్యం ఒక కురుక్షేత్ర యుద్ధమేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 63.  భయం మంచిదే ఆరోగ్యకరమైన భయం ఎప్పుడూ మంచిదే నిన్ను నువ్వు సక్రమమైన మార్గంలో నడిపించడం లేదేమో అన్న భయం ఎప్పుడూ మంచిదే సన్మార్గాన నడిచేవాడిదే ప్రాథమిక ఆలోచన ఈ భయం ఆరోగ్యకరమైన భయం ఎప్పుడూ మంచిదేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 64. అధర్మం ఆవహించిన మనిషి ఊహకందని ప్రమాదకారి అవ్వచ్చు అది నీకైనా అవ్వచ్చు నాకైనా అవ్వచ్చు ఊరికైనా అవ్వచ్చు వాడకైనా అవ్వచ్చు దేశానికైనా అవ్వచ్చు  లోకానికైనా అవ్వచ్చుతులసి వనంలో గంజాయి మొక్క వలె మన మధ్యే వాడు కలిసి ఉండును రా జాగ్రత్తగా మెలగవలెను రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 65. సత్సాంగత్యము జీవన మూలము సత్సాంగత్యమే జీవన మూలము నీ తల్లిదండ్రులు నీ ఎంపిక కాదు నీ తోబుట్టువులు నీ ఎంపిక కాదు నీ జీవన మరణం నీ ఎంపిక కాదు సప్త జన్మ రుణాల వలన దొరికే ఒక కానుక జీవన సాఫల్యతకు ఒక మార్గ నిర్దేశిక నీవు ముందు అడుగులు వేసే ఆలోచనలకు దీపిక సత్సాంగత్యమే సత్సాంగత్యముఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 66. ధర్మమే శాంతికి ధర్మమే ఉన్నతికి ధర్మమే మోక్షానికి ధర్మమే కీర్తికి ధర్మమే తను తరించటానికి ధర్మమే తన ముందున్న వాళ్ళు తరించడానికిధర్మమే భగవత్ అనుగ్రహానికి ధర్మమే దేశ ప్రతిష్టకికారణం అవుతుంది రా ధర్మ పాలన తప్పక చేయరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 67. దాచుకోవడం కాదురా పంచడంలోన ఉందిరా మంచిని పంచు ప్రేమను పంచు సుఖాన్ని పంచు బాధని పంచు డబ్బుని పంచు ఆనందాన్ని పంచు అందరికీ పంచు నవ్వుని పంచు నిన్ను నువ్వు పంచు పంచడం ప్రకృతి ధర్మం లోనే ఉంది కదరాదాచుకొని బ్రతకటం తప్పురాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 68. సమస్త జీవన విధానానికి శాంతికి అభ్యున్నతికి ధర్మము వినా లేదు వేరొకటి ఎప్పుడు అయితే ధర్మపాలన క్షీణించును అప్పుడే భూమిపైన రుతుక్రమం తప్పును ధర్మాన్ని రక్షించరా అది నిన్ను రక్షించును రా ఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 69. సమస్త భూతాల పట్ల మైత్రి భావం కలిగిన వారు ఎల్లప్పుడూ మనశ్శాంతితో ఉండగలరు నీవు ఇతరులకు శత్రుడివి లేదా మిత్రుడివి అయి ఉండవచ్చు కానీ వారి పట్ల నీకు మైత్రీ భావం మాత్రమే కలిగి ఉండాలి మైత్రీ భావం మాత్రమే కలిగి ఉండాలిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 70. ప్రతివాడిలో మంచి ఉండును ప్రతివాడిలో చెడు ఉండును ప్రతివాడిలోని ఉపకారమును నిత్యం స్మృతి చేసుకుంటూ గులకరాళ్ళలో సాలిగ్రామాలు వేరి నట్టుగాఎల్లప్పుడూ నీవు ఉండుశాంతిగా సుఖంగాఆనందంగా ఆరోగ్యంగాఉపకారమును మాత్రమే స్మరించుకుంటూఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 71. రాజ్యాలను ఏలిన వారు రాజ్యాలను గెలిచినవారు ఎందరో వచ్చారు ఎందరో పోయారు మనసులు గెలిచినవారు మనుషుల గెలిచినవారు చిరస్థాయిగా ఉందురు ఏది పొందాలో ఏది అసలైన ద్రవ్యమొ గ్రహించి గుర్తు ఎరిగి సాగరాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 72. నేను అనే నేను నువ్వు అనే నువ్వు ఈ రెండింటి ఏర్పాటు వలన ద్వేషం అనే ద్వేషం ప్రేమ అనే ప్రేమ రెండూ పుట్టెను నేను అనే నేను నువ్వు అనే నువ్వు తొడుక్కున్న దేహం వలనే ఈ భావం పుట్టెనుఇద్దరం భిన్నం అనే భావన తీసివేస్తే అంతా ఒక్కటే అంతయు ప్రేమేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 73.ఏనుగు దంతం నమలడానికి పనికి రాకపోవచ్చు కానీ అందునే దాని సౌందర్యము కలదు కొలనులో చేప ఈదే టప్పుడు కన్నులు కొట్టక పోవచ్చు కానీ అందునే దాని సౌందర్యము కలదు నీ బలము నీ వివేకము ప్రస్తుతానికి ఉపయోగపడక పోవచ్చు నిరాశ చెందకు నరుడా సందేహము లేదు సందేహము లేదు  అందునే దాని సౌందర్యం కలదు ఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 74. పెంచుకున్న స్పర్ధ వ్యక్తి స్థాయిలోనైనా దేశస్థాయిలో నైనా వినాశానికే కారణం అది నీ వినాశనం కావచ్చు అది ఇతరుల వినాశనం కావచ్చు కావున విడవరా స్పర్ధలు కలపరా మైత్రి భావననుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 75. చెట్టు పాదాలచెంత వచ్చినంత మాత్రాన నీవు ఎవరు అని అడగక నీవు నిలబడినంతమాత్రాన నీడ నివ్వడం పండు నివ్వడం ఆకలి తీర్చడం సేద తీర్చడం చెట్టు లక్షణం చెట్టు ప్రకృతే నీవు ప్రకృతే అది చెట్టు ధర్మము అయితే  అది నీ ధర్మము కదాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 76. జీవుడు నిన్ను వదిలి వెళ్ళినప్పుడు నీవు దాచిన ఏది నీ వెంట రాదు నీవు ఇచ్చినది మాత్రమే నీ వెంట వచ్చును నీ భవతత్వాన్ని అప్పుడు అక్కడ వెంట వచ్చినది నిర్దేశించు రా దానం చేసి దత్తం చేసి అవ్వరా నీవు ధన్యజీవిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 77. క్రమశిక్షణ పాటించరా క్రమము తప్పక వ్యతిరేక పవనం వచ్చిన వ్యక్తిత్వం వదలకురా నీకు శక్తి ఉన్నా సామర్థ్యం ఉన్నా అతిక్రమించు రా క్రమశిక్షణ అది ఏ సందర్భంలో అయినా సముద్రపు కెరటాలు వలె క్రమము తప్పకురా క్రమశిక్షణఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 78. అవ్వాలి అందరికీ ఆత్మబంధువు చేయరా ఎప్పుడు ఆనంద క్రతువు కయ్యాలకు స్వస్తి పలికి అవ్వరా అజాతశత్రువు బతకరా ప్రేమను పంచి జీవించరా ఆప్యాయతను పెంచిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 79. ధర్మ మైన జీవితం జీవించిన వాడు అధర్మము జోలికి వెళ్లని వాడు దానం దత్తం చేసినవాడు కర్తవ్య పాలన పాలించినవాడు కాటికి వెళ్లేడి నాడు నాడు జీవుడు వదిలిన నాడు ఈ జీవన పరీక్ష నందు ప్రథమ శ్రేణి నందు ఉత్తీర్ణుడై ఉత్తర లోకాలకు వెళ్లేడి వాడు వాడే చిద్విలాసంతో చితికి వెళ్ళ గలిగినవాడుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 80. ప్రపంచం అనే తెరమీద కదులుతున్న కళాకారుడా కథలోని కథానాయకుడా నీ కథా ముగియగానే మరొకరి కథ మొదలు అగునురా అదే తెరమీద అదే తెరమీదఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 81. పాముకు కప్ప ఆహారము కప్పకు కీటకాలు ఆహారము కీటకాలకు క్రీములు ఆహారము క్రిములకు ప్రకృతే ఫలహారము ఇది జీవన క్రియ చక్రము ఎక్కడ తప్పిన క్రమము తప్పనే తప్పదు ముప్పును ఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 82. ప్రతి దాని యందు మానవ ఒక ఆంతర్యం ఉండు మానవ అది జరగలేదని నువ్వు మానవ శోకించకురా మానవ ఇది జరిగినది అని నువ్వు మానవ సంతసించకురా మానవ జరిగేది జరుగును రా మానవ జరిగేదే జరుగును రా మానవఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 83. సమాధానం లేని ప్రశ్న ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు ప్రశ్నకు సమాధానం సమస్యకి పరిష్కారం సమయ సందర్భ స్థితిగతుల అనుసారం తప్పక గోచరించునుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 84. ఆకలితో అలమటించి దానిని అనుభవించిన వాడికి తెలుసు ఆ బాధ మండుటెండలో నీటి చుక్క కోసం వెతికిన వాడికి తెలుసు రా ఆ దాహం క్షోభనీ కడుపు నిండగానే సరిపోదు రా ఆకలితో అలమటించే వారికి నీటి కోసం వెతికే వాడికి కూడు పెట్టి నీళ్లు ఇచ్చి అవ్వరా వారి చిరునవ్వుకు కారణంఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 85. నీ సుఖం ఉన్నది వాయువులో నీ హాయి ఉన్నది వాయువులో వాయువు లేక నీవు లేవు వాయువు లేక జగత్తు లేదు ఆ వాయువే నీ ఉచ్ఛ్వాస ఆ వాయువే నీ నిశ్వాస అది నువ్వు తీసుకో లేనప్పుడు తల్లడిల్లుతున్నప్పుడు వైద్యుడు వాయువు గొట్టాలు పెట్టినప్పుడుసొంతంగా వాయువు తీసుకో లేనప్పుడు తెలుసునురా వాయువే సర్వం అని సర్వం వాయుమయం అని చేయకురా కలుషితం వాయువే సర్వం సర్వం వాయు మయంఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 86. ఇచ్చి పుచ్చుకొనుట ప్రకృతి ధర్మమున ఉన్నదిరా బ్రహ్మాండము నుంచి పిండాండము పుట్టే బ్రహ్మాండపు వాయువు పిండాండము పీల్చే పిండాండపు నిశ్వాస బ్రహ్మాండము తీసుకునే బ్రహ్మాండపు జలమును పిండాండము స్వీకరించే పిండాండపు జలము బ్రహ్మాండమున కలిసే చిట్టచివరికి చితిన కాలిన దేహము భస్మమై మరల బ్రహ్మాండమున కలిసే రా ఇచ్చిపుచ్చుకొనుట ప్రకృతి ధర్మమున ఉన్నది రాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 87. ముఖాన్ని బట్టి సౌందర్యము కాదు అంతరాన్ని బట్టి సౌందర్యము కలదు బాహ్యాన నేడు అందముగా ఉన్నదిమరునాడు అలా ఉండదు అది కనిపించేడిది ఎప్పుడు వాస్తవము కాదుకనిపించనిది లోన ఉన్నది వాస్తవము ఎప్పుడుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 88. నీ దగ్గర ఉన్నది పదిమందికి పంచునీకొచ్చినది పదిమందికి నేర్పు నీ దగ్గర ఉన్నది నీళ్లే అయితే ఆ నీటినే పదిమందికి ఇవ్వు నీ దగ్గర ఉన్నది తెలివే అయితే ఆ తెలివినే పదిమందికి అందించు నీ శరీరంలో శక్తి ఉన్నట్టు అయితే వయోవృద్ధుల ఆసరా కర్రగా నిలబడు ఆపదలో ఉన్నవారికి నీ చేత అయినంత చేయూతనివ్వు నువ్వు సేవా భావంతో స్వచ్ఛమైన మనసుతో చేయరా తోచిన సేవ మంచి పనులకు సమాధానముగా భగవంతుడి ఆశీస్సులు నీ వెంట ఎక్కడున్నా రావాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 89. ప్రతిఫలాపేక్ష లేనిదే ప్రేమ ఎంతో ఉత్కృష్టమైనది తల్లి ప్రేమ భక్తి కూడా ప్రేమే వాత్సల్యము కూడా ప్రేమే సందర్భాన్ని బట్టి ప్రేమ పేరు మారును కానీ దాన్ని పొందేటప్పుడు ఇచ్చేటప్పుడు అనుభవించే హృదయపు పొంగు మాత్రము ఎన్నటికీ మారదు ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగింప కలిగేదే ప్రేమ ప్రతిఫలాపేక్ష లేనిదే ప్రేమఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 90. చెప్పిన మాట వినడం ఒక గొప్ప లక్షణం నాకే అన్ని తెలుసు అని అనుకోవడం ఒక మూర్ఖత్వం మాట వినడం రానివాడు పతనమై పోతాడు రావణుడి వలె మాట వినడం తెలిసిన వాడు దేవుడు అయిపోతాడు రాముడి వలె మాట వినడం ఒక గొప్ప లక్షణంఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 91. కనపడని వేరు చెట్టు నిలబెడుతుందికనపడని గాలి చెమటని పోగొడుతుంది కనపడని శక్తి నిన్ను నిలబెడుతుంది కనపడని ఆనందం నిన్ను నవ్విస్తోంది  కనపడనివే కదా మరి నిజమైనవి కనపడని దేవుడిని ఏమంటావ్ మరిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 92. వంటింటిలో ఆహారము చేయుటకు దోహదపడే అగ్ని అరణ్యంలో చెట్లను బూడిద చేయునది అగ్ని ఎగసి పడే అగ్నిని మోతాదుగా వాడితే ఆహారము ఎగసిపడే అగ్నిని పరిధులు దాటి వాడితే ప్రమాదము మనిషి తనలోని ఆగ్రహాన్ని అగ్నివలె పరిధులు దాటక ప్రమాదము తెచ్చుకోక తగిన మోతాదున ఉంచవలె జాగ్రత్తగాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 93. ప్రీతిగా తలచుకో ఎవరినైనా ప్రేమగా పలకరించు ఎవరినైనా ద్వేషంతో ఊగి పోకు ఎవరిపైనా దోపిడీ దారుణం నిన్ను ఎవరు చేసినాదగా ద్రోహాలకు గురి నీవు అయినా పెంచుకున్న ద్వేషంతో పోవును మిగిలినది ఏదైనా ప్రీతిగా తలచుకో ఎవరినైనా తప్పక పొందగలవు గొప్పగా పోయినది అది ఏదైనా తప్పక పొందగలవు గొప్పగా పోయినది అది ఏదైనాఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 94. సాధించినప్పుడు నేను చేశాను అనుచుండు వాడవు నీవు సాధించినప్పుడు ఇతరులను నిందించ కూడదు కార్యమునందు విజయము సాధించినాకార్యమునందు అపజయము సాధించినావిజయానికి కారణం తోటివారని అపజయానికి కారణం తను మాత్రమే అని చెప్పగలిగిన వాడే అసలుసిసలైన గొప్ప సారధిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 95. తప్పు చేసినప్పుడు సమర్థించు కోకూడదునువ్వు తప్పు చేసావు అని నీకు తెలిసినప్పుడు ఆ తప్పుని నువ్వు చేసినప్పుడు తప్పక క్షమించమని అడుగు నీ తప్పు చేత ఎందరికో తిప్పలు వచ్చును లోకం అంతా ఏకమై నీ తప్పుకేసి చూపి నిన్ను తిట్టు కొందురు నీ తప్పును ఒప్పుకొని ఒప్పుగా చేసుకొని గొప్పగా ఉండిపోరా ధన్యజీవిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 96. మనసు కి వేగం ఎక్కువ మనిషికి వేగం తక్కువ ప్రయాణ వేగంలో వ్యత్యాసాలు ఉన్నామనసులోని ఆలోచనల వలన మనిషి చేసే కార్యాలవలన ఈ రెండిటితో భూమి పైన ఉన్న అన్నింటినీ ఒక జీవిత కాలంలో చుట్టేయవచ్చుపాపపుణ్యాలు మూట కట్టుకోవచ్చు వాటితో కాలంలో అడుగులు ముందుకు వేయవచ్చుఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 97. విద్య నేర్చుకోవాలి అనుకునేవాడు దూరం పెట్టవలసినవి ముఖ్యమైనవి నిద్ర సౌఖ్యం అశ్రద్ధ అలసత్వంవిద్య నేర్చుకోవాలి అనుకునేవాడు దరి చేర్చుకో వలసినవి ముఖ్యమైనవి గురుభక్తి శ్రద్ధ నియమం నిష్ఠ నీ వెంట ఎక్కడున్నా వచ్చునది నిన్ను నిలబెట్టి నడిపించునది నీ విద్య మాత్రమే నీ విద్య మాత్రమేఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 98. నీవు దాతవు కా విజేతవు కా  నీవు దీపము కా దిక్సూచివి కా  నీవు విధాతవు కా సంస్కర్తవు కా నీవు విద్యార్థివి కా విజ్ఞానివి కా ఇది కాదు అంట అది కానిది అంట అంటూ ఏవి లేవు ఇలనా సాధింపనిది ఏదీ లేదు  సత్ ప్రయత్నము వలనఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా 99. చదువుకి సంస్కారం తోడైనప్పుడు చిరు జ్వాలకి నేతి తోడైనప్పుడు దాతృత్వానికి ధనం తోడైనప్పుడు క్లిష్ట సమయానికి దైవం తోడైనప్పుడు ఎటువంటి ఉన్నతి అయితే లభిస్తుందో మనిషికి ఇటువంటి వచనం తోడైనప్పుడు గొప్ప యశస్సు తప్పక లభిస్తుందిఓ మనుజ నీ నిజ సహజ జీవనముతో జీవించరా
100. గద్యమయములైన పద్య జాలములన్నిహృద్యములుగ మలచు సద్యశమ్ముఅద్యతనమునందు ఆద్యమై వెలుగొందువిద్య పెంచి మనుమ I విద్యబాపి



Rate this content
Log in

Similar telugu poem from Classics