మరువనుగా
మరువనుగా


ప౹౹
కలలో కూడా మరువనుగా ఆ సంగతులునే
చెలిలో చూసి మనుసునే మార్చిన గతులనే ౹2౹
చ౹౹
అంబరమంతా సంబరమే చేసే హరివిల్లులా
రంభ రమణీయం ఉందే ఎక్కుపెట్టే విల్లులా ౹2౹
కనువిందు చేసేవు కనికట్టు వేసి ఆ కళ్ళతో
మునుముందు ముచ్చటై చేర్చేసి పోకళ్ళతో ౹ప౹
చ౹౹
కలిగించే హాయిలో కలిపేసి హొయలన్నీను
గెలిపించే రేయిలో గెంతేసి ఒలకబోసన్నీను ౹2౹
కదలాడి మదిలో కలవరించేవూ పులకించి
మొదలిడి ఎదలో పలకరించేవూ తిలకించి ౹ప౹
చ౹౹
తీరైన రూపం తీగలా అల్లినే తీరికనే లేకనే
సరైన సరసం సాగినే సాంగత్యము కోరకనే ౹2౹
కలలోని కమనీయం కరిగించే కథ సాంతం
చెలిలోని చైతన్యం చేరే చెక్కిలితో సొంతం ౹ప౹