జీవితాలను వెలిగించే దీపం!
జీవితాలను వెలిగించే దీపం!
రీలు తుపాకీలు..టపాకుల రీళ్లూ..
తాళ్లు.. తారాజువ్వలూ..
కాకరపుల్లలు..పాము బిళ్ళలూ..
థౌజండ్ వాలాలు..టైగర్ సరాలు
మతాబుల మోతలు.. పిండి వంటలూ..
అందరిలో ఆనందాలు..దీపావళి తెచ్చిన దీప్తులు!
రోజూ నేను దర్జాగా నడిచే రోడ్డుపై తిరగను
ఏ తారాజువ్వో నా చొక్కాలో చొచ్చుకొనిపోతుందని!
రోజూ నేను ఎగతాళి చేసే మా వీధి పిల్లల జోలికిపోను
ఎక్కడ నా మీద వెలిగించిన వంకాయ బాంబు వేస్తారో అని!!
ఈ రోజు ఎంతో ఆనందిస్తాను
చెడుపై మంచి గెలిచిందని
ఈ రోజు ఎంతో ఆలోచించాను
నాలోని చెడు చీకట్లను మంచి చేత పారద్రోలాలని
ఈ రోజు నుండి ఆచరిస్తాను
నా మంచితనం చేత పదిమంది జీవితాలను వెలిగిస్తానని
