నేనే
నేనే
1 min
206
తీసుకున్నది నేనే
ప్రకృతి ఒడినీ..
ప్రాణవాయువునీ..!
ఆహారాన్నీ..
ఆనందాన్నీ..!!
నశింపజేసినది నేనే
విహంగాన్నీ..
వృక్షాన్నీ..!
జలాన్నీ..
జీవజాలాన్నీ..!!
కాపాడవలసినదీ నేనే
పర్యావరణాన్నీ..
ప్రాణుల్నీ..!
పుడమితల్లినీ..
పుట్టబోవువారినీ..!!
