Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kishorekumar Arige

Action Drama Thriller

4.4  

kishorekumar Arige

Action Drama Thriller

నెవెర్ జడ్జ్ ఏ విమెన్ _ 4.

నెవెర్ జడ్జ్ ఏ విమెన్ _ 4.

11 mins
763



ఈ భాగం చదివే ముందు క్రింద తెలిపిన మొదటి భాగం,రెండవ,3 భాగం తప్పక చదవండి . ఇది పార్ట్_4


Part1: https://storymirror.com/read/story/telugu/i89n8n00/never-judge-a-women-3/detail

Part2: https://storymirror.com/read/story/telugu/585jk172/aaddvaarini-veeletti-cuupddu/detail

Part3: https://storymirror.com/read/story/telugu/d1ibyqk2/never-jddj-vimen-2/detail


సూర్య ఇండియాకి వస్తుంది.


తనకి తెలియకుండా కొంతమంది తనని Airport నుంచి ఫాలో చేస్తూ ఉంటారు.


హేమంత్ సార్ మరణ వార్త తెలియని సూర్య, హేమంత్ సార్ చెప్పిన ఆ సాటిలైట్ ఫోన్ కి ఫోన్ చేస్తుంది.


సూర్య చేసిన కాల్ సుభాష్ మాట్లాడుతాడు. సూర్య కాల్ చేస్తుంది అని సుభాష్ కి ముందుగానే తెలుసు.


సుభాష్ మాటలు వినగానే, హేమంత్ సార్ కాదు అని తేలుస్తుంది సూర్యకి.  

కానీ నేను సుభాష్ ని, హేమంత్ సార్ మీతో మాట్లాడమన్నారు అంటాడు సుభాష్ .


హేమంత్ సార్ మాట్లాడకపోయే సరికి సూర్య కి అనుమానం వచ్చి కాల్ కట్ చేస్తుంది.


కానీ హేమంత్ సార్ ముందే చెప్తాడు సుభాష్ గురించి కూడా, అందుకనే మళ్లీ ఫోన్ చేస్తుంది 


సూర్య : హేమంత్ సార్ ఎక్కడ? సార్ కి ఏమైంది?


సుభాష్: సార్ ని నిన్న టెర్రరిస్ట్స్ తో జరిగిన పోరులో చనిపోయారు.


అది విన్న సూర్య కొంచెం షాక్ కి గురి అవుతుంది, కానీ వెంటనే కోలుకొని.


సూర్య: టెర్రరిస్ట్స్ ఆ ?? లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా?


సుభాష్: టెర్రరిస్ట్స్ కాదు అని మీరు ఎలా చెప్తున్నారు?


సూర్య: నీకు తెలియనివి నాకు చాలా తెలుసు.


సుభాష్: ఆర్మీ కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం మీ దగ్గర ఉంది అని చెప్పారు సార్. ఏంటి అది, మిమ్మల్ని ఎక్కడ కలవాలి?


సూర్య: నేను ఎక్కడ ఉన్నానో ఇప్పుడు చెప్పలేను, నువ్వు ఎక్కడ ఉన్నవో అది మాత్రం చెప్పు.


సుభాష్: నేను కొండాపూర్ దగ్గర ఉన్నాను


సూర్య: సరే, పక్కనే ఉన్న AMB మాల్ కి రా, నేను అక్కడ కలుస్తా నిన్ను.


కొంత అనుమానం ఉంటుంది తనకి సుభాష్ మీద.


తరువాత సుభాష్ అక్కడికి వెళ్తాడు, సుభాష్ కి తెలవకుండా సూర్య అతన్ని వెంబడిస్తుంది . 


సూర్య కి తెలియకుండా ఇంకొంత మంది తనని గమనిస్తూ ఉంటారు (వాళ్ళు సుభాష్ మనుషులు కాదు.)

 

ఎవరికీ అనుమానము రాకుండా "బురాఖా" వేసుకుంటుంది.


కొంచెంసేపు అతన్ని గమనించిన తరువాత, అతనితో ఎవరు రాలేదు అని నమ్ముతుంది. సూర్య మళ్ళి ఫోన్ చేసి పక్కనే ఉన్న Botanical Garden రమ్మని చెప్తుంది


సుభాష్ కి అర్ధం అవుతుంది సూర్య కి ఇంకా నమ్మకం కుదరలేదు అందుకనే ఇలా చేస్తుంది అని. తను చెప్పినట్టుగానే సుభాష్ అక్కడికి వెళ్తాడు


మళ్ళి ఫోన్ చేసిన సూర్య సుభాష్ ని, దగ్గర లో ఉన్న చెత్త కుండీ లో ఫోన్ పడేయమని చెప్తుంది. పడేసిన తరువాత 200 మీటర్లు ముందుకు రమ్మని చెప్తుంది.


అది Satelliteఫోన్ అని మర్చిపోతుంది తను. తను చెప్పినట్టుగానే చేస్తాడు సుభాష్.


అక్కడికి వెళ్ళిన తర్వాత సుభాష్ సూర్య ని చూస్తాడు తనని చూడగానే ఆశ్చర్యానికి గురి అవుతాడు, కానీ చాలా తొందరగా కోలుకుంటాడు.

తనని ఆశ్చర్యపరిచిన 2 విషయాలు ఏమిటంటే??


 1 సూర్య ఎవరో కాదు మౌనికనే.

 2 తను అచ్చం చూడటానికి మానస లాగానే ఉంది.


వెంటనే కోలుకున్న సుభాష్. సుభాష్: ఇంత జాగ్రత్త అవసరం లేదు, ఇది Satellite phone ఎవరు కనిపెట్టరు.

సూర్య: మరచిపోయాను. నా జాగ్రత్త నాకుంటుంది కదా.


సుభాష్: ఇక్కడే మాట్లాడాలా?? లేదా మా ఇంటికి వెళ్లి మాట్లాడు కోవచ్చు! ఇక్కడ ఉండడం మనకి అంతా safe కాదు మౌనిక.


సూర్య: నా పేరు నీకు ఎలా తెలుసు.


సుభాష్: ఇంతకీ సూర్య ఎంటి?


సూర్య: అది నా రిపోర్టింగ్ పేరు పేపర్ లో. అందరికీ అలగానే తెలుసు. ఇంతకీ నీకు ఎలా తెలుసు?


సుభాష్: నీకు తెలియని విషయాలు నాకు బాగా తెలుసు..


వెంటనే సుభాష్ మానస కి ఫోన్ చేస్తాడు. నీకు బాగా కావలసిన వారు ఉన్నారు మాట్లాడు అని ఫోన్ సూర్య కి ఇస్తాడు.


కొంచెం అనుమానంతో మాట్లాడుతుంది మౌనిక. ఎవరు అని అడుగుతుంది?.


మౌనిక గొంతు మానస గుర్తు పడుతుంది వెంటనే.


మానస: మౌనిక, నువ్వా?? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?? ఏమి చేస్తున్నావు?


మౌనిక: నువ్వు? సుభాష్ ఎవరు అసలు? అతని ఇంట్లో నువ్వు ఏమి చేస్తున్నావు?


మానస: ముందు ఇంటికి రా మాట్లాడుకుందాం.


అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది..


ఇంతకీ ఎవరు నువ్వు? మా అక్క నీ దగ్గరా ఎందుకు ఉంది? అని మౌనిక సుభాష్ నీ అడుగుతుంది.


అవన్నీ ఇక్కడ మాట్లాడడం కష్టం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని తనని తీసుకొని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు తను పడేసిన ఫోన్ నీ కూడా తీసుకుంటాడు.


వెళ్లే మార్గంలో: సుభాష్ మానస ఎందుకు మౌనిక తోపాటు రాలేదో, తన కోసం ఎన్ని కష్టాలు పడిందో, తను ఎది చేసిన మౌనిక కోసమే అని సుభాష్ అసలు జరిగింది అంతా వివరిస్తాడు.


ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అక్కడే ఉన్న హేమంత్, మౌనిక నీ చూసి ఆశ్చర్యపోతాడు, కొద్ది సేపు ఏమి అర్ధం కాదు. అలానే మౌనికను చూస్తూ ఉంటాడు.

అక్కని చూసి మౌనిక కంటతడి పెడుతుంది, మానస కూడా. 


మానస: కనీసం నేను బాగానే ఉన్నాను అని ఒక ఫోన్ చేయవచ్చు కదా, నేను ఎంత కంగారుపడుతున్నానో నీకు ఏమి తెలుసు? 


అక్క దగ్గరికి వెళ్లి నన్ను క్షమించు అక్క అని అంటుంది, నిన్ను నేను ఎప్పుడు అర్థం చేసుకోలేదు అని అంటుంది

.

మానస: "నువ్వు నన్ను బాధపెట్టడం ఏంటి రా, నేను బతికి ఉన్నదే నీకోసం" .


తరువాత హేమంత్ నీ పరిచయం చేస్తాడు మౌనిక కి..


ఇద్దరు అక్క చెల్లి వేరే గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటారు.

అసలు సుభాష్ ఎవరు, అతను తన జీవితంలోకి ఎలా వచ్చాడు అనేది అంతా వివరిస్తుంది మానస.


మానస: అంటే హేమంత్ sir చెప్పిన సూర్య నువ్వే అనమాట? ఇంతా పెద్ద ప్రమాదంలోకి నువ్వు ఎలా వచ్చావ్, నీకు ఏమైనా ఐతే ? అయినా నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు? అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. 


మౌనిక: నా గురించి ఏమి బాధపడకు అక్క, నా వెనుక ఎలాగో సుభాష్ ఉన్నాడు కదా.


అప్పుడే హేమంత్ & సుభాష్ కూడా వస్తారు!!


హేమంత్: మేము కూడా ఉన్నాం!!


మౌనిక హేమంత్ ని వింతగా చూస్తుంది, కొంచెం కోపంగా.


వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చూసి సుభాష్


సుభాష్: మీ ఇద్దరిని చూస్తుంటే అక్క, చెల్లి లాగా లేరు. ఆమ్మ ,కూతురులాగా కనిపిస్తున్నారు


కానీ ఇప్పుడు "తనకి అమ్మ పంచె అనురాగం ఎంత అవసరమో!!

నీ వెనుక నేను ఉన్నాను అని అండగా నిలిచి ధైర్యం చెప్పే ఒక మంచి స్నేహితురాలు అంత కన్నా ఎక్కువ అవసరం"


సరే అని , లోపల కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది మానస.


సుభాష్: హేమంత్ సార్ ఏ విషయం గురించి నిన్ను కలిసారు, అసలు ఏమి జరిగింది???


మౌనిక కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో చెప్తుంది:


ఒకరోజు నా స్నేహితుడు అబ్దుల్ చాలా కంగారుగా నన్ను కలిసాడు. ఒక ముఖ్యమైన విషయం గురించి నా సహాయం కావాలి అన్నాడు.

అతను కూడా హేమంత్ Sir టీంలో పని చేస్తూ ఉండేవాడు.


ఒకరోజు తను షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూవుంటే అతనికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ క్వాలిటీ మీద అనుమానం వచ్చింది. 


3 రోజులు వాటి మీద పరీక్షలు జరిపాడు కానీ బాగానే ఉన్నాయి.


కానీ ఒకరోజు తను జరిపిన టెస్టులో ఒక జాకెట్ క్వాలిటీ బాగాలేదు అని కనిపెట్టాడు.


కానీ మరొకటి మాత్రం బాగానే ఉంది. అది అర్ధం కానీ నా స్నేహితుడి బాగాలేని జాకెట్ ని ఎవరికీ తెలియకుండా బయటకి తీసుకొని వచ్చాడు.


తరువాత నాకు చెప్పాడు, దాన్ని బయట ఎక్కడైనా టెస్ట్ చేద్దామా అని? అతను తనతో పాటు ఆ జాకెట్ కూడా తీసుకొని వచ్చాడు.

నాకు బాగా తెలిసిన ఒక గన్ షాప్ కి వెళ్ళాం. అతను నాకు బాగా తెలుసు.


అక్కడ దాన్ని పరిక్షించి చూసాం, దాని ఫలితం చాలా దారుణంగా ఉంది, ఆ జాకెట్ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం లేదు. గన్ తో కాల్చి చూసాం, బుల్లెట్ లోపలికి వెళ్తుంది!!!!


కానీ మిగతా అన్ని ఎందుకు పాస్ అవుతున్నయి???. అదే మాకు అర్ధం కానీ అతి పెద్ద ప్రశ్న?


దీని వెనుక ఎవరో పెద్ద వారి కుట్ర ఉంది అనిపించింది మా ఇద్దరికి, తను టెస్ట్ చేసేటప్పుడు నేను వీడియో కూడా తీసాను. అలాగే CC Footage అంత డిలీట్ చేశా. ఒక కాపీ మాత్రం నేను తీసుకున్నాను.


అప్పుడే అబ్దుల్, హేమంత్ సార్ గురించి చెప్పాడు. ఈ విషయంలో అతను కాకుండా ఇంకా ఎవరు మనకి సహాయం చేయలేరు, మనం ఎవరిని నమ్మలేము అన్నాడు.


అనుకున్నట్టుగానే అతను హేమంత్ సార్ కి కాల్ చేసి వెళ్ళిపోయాడు, తనతో పాటు జాకెట్ కూడా తీసుకువెళ్లాడు,  నేను నా రూమ్ కి వెళ్ళాను.

తరువాత రోజే తెలిసింది హేమంత్ సార్ ని కలవకముందే తను చనిపోయాడు అని. మద్యం సేవించి రోడ్ ఆక్సిడెంట్ లో అని, కానీ నాకు నమ్మకం కుదరలేదు. తనని చంపినా వారే నన్ను కూడా చంపడానికి వస్తారు అని గమనించి నేను నా రూమ్ నుంచి వెళ్ళిపోయాను

వారు నా గురించి కూడా వెతకడం మొదలు పెట్టారు. తరువాత కొన్ని రోజులు నేను ఎవరికీ కనిపించలేదు.



ఇది ఇలా ఉండగా మరో పక్క: 


అబ్దుల్ చనిపోయిన తరువాత రోజు నుంచి, హేమంత్ సార్ అసలు అబ్దుల్ ఎందుకు కాల్ చేసాడు అని వెతకడం మొదలు పెట్టాడు, ఏమి చెప్పాలి అని చూసాడు అని ?


వెంటనే అతను చివరగా వెళ్లిన స్థలానికి వెళ్ళాడు, ప్రాక్టీస్ జోన్ దగ్గర జాకెట్ లేదు, అంటే అతను జాకెట్స్ గురించి నాకు ఏదో చెప్పాలి అనుకున్నాడు అని అర్ధమవుతుంది!


కానీ ఏమి చెప్పాలి అని అనుకున్నాడు, అని ఆలోచిస్తాడు, కానీ ఏదో తప్పు మాత్రం జరిగింది అని బలంగా నమ్ముతాడు.

తరువాత రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడి CI Komalను కలుస్తాడు.


CI Komal: సార్, అతను కచ్చితంగా Accident వల్లనే చనిపోయాడు. అందులో మద్యం సేవించి ఉన్నాడు.


హేమంత్: అతనికి మద్యం తాగే అలవాటు లేదు.!!!


CI: ఐతే దీని వెనుక ఎవరైనా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా?


హేమంత్: అవును. ఒకటి అతనికి మద్యం తాగే అలవాటు లేదు. రెండు తనతో పాటు ఉండాల్సిన జాకెట్ కూడా లేదు.


సీఐ Komal: కానీ మాకు దొరికిన సాక్ష్యాలు బట్టి అది ఆక్సిడెంట్ అని అనిపిస్తుంది.


"ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుంటే, హంతకులు చాలా తెలివిగల వాళ్ళు, ఎందుకంటే Finger Prints దొరకలేదు. ఆ ఏరియా లో సీసీ Footage లేదు, పోలీస్ డాగ్స్ కూడా ఏమి కనిపెట్టలేదు."


ఏమైనా Lead ఉంటె చెప్తా అని CI చెప్తాడు. అక్కడి నుంచి హేమంత్ సార్ వెళ్ళిపోతాడు.


కొన్ని రోజులు హేమంత్ ఆ జాకెట్స్ మీద Tests చేసాడు కానీ అంత సరిగ్గానే ఉంటాయి.


ఆ తరువాత రోజు హేమంత్ సార్ టెర్రరిస్టుల కోసం ఒక మిషన్ మీద వెళ్తాడు. అక్కడే సుభాష్ గాయపడుతాడు


ఆ విషయంలోనే హేమంత్ సార్ ని సస్పెండ్ చేస్తారు కొన్ని రోజులు. ఎందుకంటే అప్పుడు హేమంత్ సార్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోరు.


సస్పెండ్ అయినా తరువాత:


కాలీగా ఇంట్లో ఉండడం పెద్దగా ఇష్టం లేని హేమంత్ ఒకరోజు ఆలా బయటకి వెళ్తాడు తన బండి మీద, తోడుగా తన కుక్క Rambo ని కూడా తీసుకువెళ్తాడు.

ఆ రోజు కొంతమంది రౌడీలు డబ్బుకోసం ఒక అమ్మాయిని Kidnap చేస్తారు, అది గమనించిన హేమంత్ సార్ వాళ్ళని వెంబడిస్తాడు.


వాళ్ళు అక్కడి లోకల్ Gang "శర్మ"  మనుషులు. డబ్బుల కోసం ఆలా చేస్తారు. ఆ అమ్మాయి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురు.

అమ్మాయిని దగ్గరలో ఉన్న ఒక Construction బిల్డింగ్ లోపలికి తీసుకొని వెళ్తారు.


అక్కడికి హేమంత్ సార్ కూడా వెళ్తాడు. వారికీ తెలియకుండా.


లోపలి వెళ్లేముందు పోలీసుకి Inform చేసి వెళ్తాడు హేమంత్


హేమంత్(తనలో తనే ): "ఎలాగో వీళ్ళు వచ్చే సరికి చాలా సమయం పట్టుతుంది, అంతలోపు మనం ఒక ఆట ఆడుకుందాం".


లోపలికి హేమంత్ సార్ ని వాళ్ళు బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు, Sir గురించి సరిగ్గా తెలియక.


హేమంత్: "డబ్బుల కోసం ఆడ పిల్లని తీసుకురావడం చాలా తప్పురా, మీరు వదలకపోతే??. "మీకు నేను వదిలిస్తా తలలో జేజమ్మని" .


అది విన్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది. సార్ మీదకి గన్ పెట్టి బెదిరిస్తారు. అదే గన్ తీసుకొని హేమంత్ సార్ వాళ్ళందరి కాళ్ళ మీద కలుస్తారు.  


హేమంత్ : "మీ అందరికి ప్రాణ భిక్ష పెడుతున్నా ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తూ కనపడితే, ఆతరువాత మీరు ఎవరికీ కనపడరు".


అప్పుడే పోలీస్ వారు కూడా వస్తారు. వాళ్ళందరిని తీసుకొని వెళ్తారు. కాపాడినందుకు ఆ అమ్మాయి థాంక్స్ చెపుతుంది. ఇంటికి రమ్మని పిలుస్తుంది కానీ హేమంత్ వెళ్ళాడు, నాకు కొంచెం పని ఉంది అని చెప్తాడు.


అయినా మీకు ఇక్కడ పని ఏంటి అని అడుగుతాడు CI Komal.


హేమంత్: నా Rambo బయటకి వెళ్తా అంటే తీసుకొని వచ్చా. బయటే ఉంది చుడండి అని చూపిస్తాడు. (నవ్వుతు)


సీఐ: చాలా థాంక్స్, స్టేషన్ కి వచ్చి Statement ఇచ్చి వెళ్ళండి.


హేమంత్: రావచ్చు కానీ మా రాంబో ని ఇంట్లో వదలాలి, ఎక్కువ సేపు బయట ఉండటం తనకి ఇష్టం ఉండదు

 

సీఐ: ప్లీజ్ Sir 10 నిమిషాల పని.


హేమంత్: సరే పదండి.


స్టేషన్ కి వెళ్లి Statement ఇస్తాడు హేమంత్.


అప్పటికే విషయం తెలుసుకున్న అభిరామ్ సార్ పోలీస్ స్టేషన్ కి వచ్చి హేమంత్ సార్ ని తీసుకొని వెళ్తాడు. తన బండి కానిస్టేబుల్ కి ఇచ్చి Hemanth ఇంటి దగ్గర పెట్టమంటారు. 


ఇద్దరు కలిసి బయట ఒక restaurant లో కూర్చుంటారు.


అభిరామ్: నీకు ఎన్ని సార్లు చెప్పాలి, ఎప్పుడు ఏదో ఒక విషయంలో తల దూర్చుతావు , అక్కడ ఉంటేనేమో టెర్రరిస్ట్స్, ఇప్పుడేమో రౌడీస్, కాలీగా ఉండలేవా ?

హేమంత్: "నేను ఖాళీగానే ఉందాం అనుకున్నా కానీ ఈ పాడు లోకం ఉండనివ్వట్లే. (సరదాగా)" నేను కానీ వెళ్లకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి?


అభిరామ్ : సరే మంచి పని చేసావు. Congratulations. కానీ దానికి పోలీస్ వారు ఉన్నారు. కొంచెం నీ గురించి కూడా ఆలోచించు రా??


హేమంత్ సార్ : మీరు ఏ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నారో నాకు తెలుసు. అది కాకుండా ఇంకా ఏమైనా చెప్పండి వింటా

అభిరామ్ : నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు, వింటా అంటా !!! నీ ప్రేమ గురించి సుభాష్ కి కూడా తెలియదా?


హేమంత్: చెప్పలేదు, చెప్తే మీలాగానే ఏదోకటి చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి చూస్తాడు.


అభిరామ్ : సరే, కనీసం సుభాష్ పెళ్లి విషయంలో అయినా కొంచెం అన్నలా పెద్దరికం తీసుకో. 


హేమంత్: చూస్తారు కదా. 



ఆతరువాత అక్కడినుంచి ఇద్దరు వెళ్ళిపోతారు.


మౌనిక తరువాత ఏమి జరిగిందో వివరిస్తుంది:


కొన్ని రోజుల తరువాత హేమంత్ సార్ ని కలవాలి అనుకున్నాను.


2 రోజులు కలవాలి అని ప్రయతించా కానీ కుదరలేదు ఎందుకంటే సార్ ఇంటి దగ్గర ఇద్దరు మనుషులు నాకు అనుమానంగా కనిపించారు.

ఇంకా 3వ రోజు ఎలాగైనా కలవాలి అని వెళ్ళాను. ఆరోజు సార్ ఒక పెట్ షాప్ కి వెళ్లారు. 


హేమంత్ T-shirt మీద "I LOVE PETS, One of the Reason is Humans are occupied there space also"


నేను లోపలికి వెళ్లే సమయంలో ఆ ఇద్దరు నన్ను చూసి నా దగ్గరికి వచ్చారు, నేను భయపడి పారిపోయాను. నన్ను వాళ్ళు వెంబడించారు. 

అది గమనించిన హేమంత్ తనని కాపాడానికి వెళ్తాడు. ఒక Dead-Endరోడ్ కి చేరుకుంటారు. అప్పటికే మౌనిక వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తుంది.

వాళ్ళతో ఫైట్ కూడా చేస్తుంది. కానీ ఒక్కతే ఉండటంతో ఎదురించలేకపోతుంది.హేమంత్ సార్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. వాళ్ళు పారిపోతారు.


హేమంత్: రెండు రోజుల నుంచి నా వెనుక తిరుగుతున్న వాళ్ళు, ఎందుకు నీ వెనుక పడ్డారు, ఎవరు నువ్వు ??


మౌనిక: అంటే వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉన్నారు అని తెలిసి కూడా వారిని ఏమి అనలేదా? 


హేమంత్: చూస్తున్న, ఎన్ని రోజులు ఇలా ఉంటారో అని, అయినా నాకు కూడా ఫాలోయింగ్ అంటే కొంచెం ఇష్టమే.

వాళ్ళు ఎందుకు నీ వెనుక పడ్డారు, అసలు ఎవరు నువ్వు.?


మౌనిక: మీరు గ్రేట్ సార్... నేను అబ్దుల్ ఫ్రెండ్ ని, మిమల్ని కలవమన్నాడు చనిపోయేముందు.


హేమంత్: అంటే అబ్దుల్ చావు వెనుక ఎవరు ఉన్నారో వీళ్ళకి కచ్చితంగా తెలుసు.


వెంటనే వాళ్ళ కోసం పరిగెత్తుతాడు. కానీ వాళ్ళు ఎక్కడ దొరకరు. కొంచెం సేపు గాలించినా తరువాత వాళ్ళు కనపడతారు శవాలుగా.


ఎవరో వాళ్ళని చంపేసి రైలు పట్టాల మీద పడేస్తారు.

సీఐ Komal సహాయంతో వారి గురించి కనుక్కోమని చెప్తాడు .


మౌనిక ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ మాట్లాడుకుంటారు.


మౌనిక: వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు అని తెలిసి కూడా ఎందుకు ఏమి అనలేదు. 


హేమంత్: ఆ ఇద్దరు నాకు తెలియదు. కానీ రెండు రోజుల ముందు వాళ్ళని శర్మ మనుషులతో చూసా, ఇదంతా వాడే చేపిస్తున్నాడు అనుకోని వాళ్ళని పట్టించుకోలేదు. అంతకు ముందు ఒక విషయంలో వాడిని కొట్టాను.


అబ్దుల్ చావు వెనుక ఉన్నవారు కచ్చితంగా వీళ్ళకి తెలిసి ఉండాలి, శర్మ కి దానికి సంబంధం ఏమిటి?


హేమంత్ సార్ కి ఆ జాకెట్ ఫొటోస్, వీడియో చుపిస్తుంది. 


హేమంత్: ఆర్మీ లో ఏదో పెద్ద స్కాం జరగబోతుంది అనిపిస్తుంది. దాన్ని ఎలాగైనా ఆపాలి.


ఈ ఒక్క వీడియోతో మనం ఏమి చేయలేము, మనకి ఇంకా సాక్ష్యాలు కావాలి. కచ్చితంగా దీని వెనుక ఆ రష్యాన్ మాఫియా కి చెందిన వారు ఉండవచ్చు.


మౌనిక: మీరు కరెక్ట్ సార్, నేను దీని గురించి study చేశా. ఈ ఒప్పందం ఒక రష్యన్ కంపెనీతో కుదుర్చుకున్నారు. కానీ దాని వెనుక చాలా పెద్ద కధ ఉంది, అది బయటి వారి ఎవరికీ తెలియదు.


"రష్యన్ మాఫియా డాన్ బలవంతంగా ఈ ఒప్పందాన్ని దగ్గర ఉండి చేపిస్తునాడు అది ఎవరికీ తెలియదు. ఆ కంపెనీ MDని బెదిరించి ఈ పని చేస్తున్నారు.


రష్యన్ స్నేహితురాలు నాకు ఆ సమాచారం అందించింది. మనం ఇప్పుడు ఏమి చేద్దాం.?


హేమంత్ సార్ కి ఫోన్ వస్తుంది CI Komal దగ్గర నుంచి.


CI: వాళ్ళు శర్మ మనుషులే సార్, కానీ వాళ్ళు ఇక్కడ వారు కాదు. వేరే రాష్ట్రం నుంచి పిలిపించారు అనుకుంటా.


శర్మ ప్రస్తుతం ఊరు వదిలి పారిపోయాడు సార్. దొరికితే మీకు చెప్తాను. 


హేమంత్ సార్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా 


హేమంత్ సార్ రూమ్ లో ఉన్న డ్రాయింగ్ చూస్తుంది మౌనిక. అందులో కేసు గురించి హేమంత్ నోట్ చేస్తాడు.


అబ్దుల్, బులెట్ ప్రూఫ్ జాకెట్స్, చంపినవాడు ? మినిస్టర్? రష్యన్ మాఫియా? అని ఉంటుంది. 


తనకి మొదటి రష్యన్ మాఫియా, మినిస్టర్ మీద అనుమానం ఉంది కానీ సాక్ష్యాలు దొరకలే. శర్మ వాళ్ళ ఇప్పుడు సాక్ష్యం

దొరుకుంతుంధీ అనుకుంటాడు.


మళ్ళి ఫోన్ చేసిన CI కోమల్, శర్మ చనిపోయాడు, అతని డెడ్ బాడీ దొరికింది అని చెప్తాడు. అతని కాల్ రికార్డింగ్ చెక్ చేస్తాం!! ఏమైనా ఇంట్రెస్టింగ్ గ ఉంటె మీకు చెప్తం అంటాడు. 



ఉన్న దారులు అన్ని మూసుకొని పోతున్నాయి, మనం ఎంత తొందరగా దీని వెనుక ఉన్న వారి గురించి కనుక్కుంటే అంతా మంచిది అని అనుకుంటాడు హేమంత్  


హేమంత్: మనకి ఏమి జరుగుతుందో తెలియాలి అంటే మనం కచ్చితంగా రష్యా వెళ్ళాలి. ఇంకో వారంలో మన మంత్రి దివాకర్ కి వాళ్లతో మీటింగ్ ఉంది, కచ్చితంగా వాడు కూడా ఉండే ఉంటాడు ఈ స్కాములో.


నేను హైదరాబాద్ కచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ కొన్ని టెర్రరిస్ట్స్ గ్రూప్స్ గురించి మాకు సమాచారం వచ్చింది, వాళ్ళు అక్కడ పెద్ద బ్లాస్టింగ్స్ కి ప్లాన్ చేస్తున్నారు అని. 


మౌనిక: అయినా మీరు రష్యాకి వెళ్ళడం అంత మంచిది కాదు, వాళ్ళ గ్యాంగ్ మీద కన్నువేసి ఉండచ్చు. మీరు ఇక్కడ లేకపోతే వాళ్ళు అక్కడ జాగ్రత్త పాడుతారు.


కచ్చితంగా నేనే వెళ్ళాలి. కానీ నా Passport, Visaతో వెళ్తే వాళ్ళు కచ్చితంగా గుర్తుపట్టేస్తారు, నన్ను చంపేస్తారు.


హేమంత్: కానీ నిన్ను ఒక్కదాన్ని అక్కడికి పంపడానికి నేను ఒప్పుకోను.


మౌనిక: మనకి అంత కన్నా బెటర్ ఐడియా లేదు సార్. ఉంటె చెప్పండి.


నా స్నేహితుడు ఒకడు దొంగ పాస్పోర్ట్, వీసా చేస్తాడు వాడి సహాయంతో నేను వెళ్ళగలను 

నా గురించి బాధ పడకండి 


హేమంత్: నువ్వు ఆల్రెడీ అంతా ప్లాన్ చేసినట్టు ఉన్నావు వెళ్ళడానికి.


మౌనిక: తప్పదు సార్, నా గురించి బాధ పడకండి ఎలాగో అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను సార్.


హేమంత్: But be Careful


తను ఒక కొత్త లుక్ తో ఉన్న Passport And Visa చేపిస్తాడు అదే రోజు. హేమంత్ కూడా సహాయం చేస్తాడు తన పాస్పోర్ట్ విషయంలో .


హేమంత్ :ఇది నా number, నీకు తప్ప ఎవరికీ తెలియదు, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా!!


నువ్వు రష్యా వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకో . నాకు ఎప్పటికప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో చెపుతూఉండు .


నేను నువ్వు వచ్చే సరికి హైదరాబాద్ లో ఉండవచ్చు, నువ్వు కూడా అక్కడికే వచ్చెయ్ .


ఒకవేళ నాకు ఏమైనా అయితే? సుభాష్ అని నాతో పనిచేసే ఒక కెప్టెన్ ఉంటాడు అతన్ని కలవు.

అతడు నాకు తమ్ముడు లాంటి వాడు . అతని దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావ్.


ఆ తరువాత నేను రష్యా వెళ్ళిపోయాను.



It's Just Begun!!!




Rate this content
Log in

Similar telugu story from Action