స్థానం..
స్థానం..


స్థానం.....
చాలా విచిత్రమైనది....
రాజుని ఫకీర్ చేస్తుంది ఫకీరు ని రాజు చేస్తుంది
ఎవరు ఎక్కడ ఉండాలో వారి స్థానమే చెబుతుంది.
ఎవరు ఉండాల్సిన స్థానంలో వాళ్ళు ఉంటే వాళ్లకు దక్కాల్సిన గౌరవం కచ్చితంగా దొరుకుతుంది.
అలా కాకుండా ఆ స్థానానికి తగ్గ వారు కాక మరి ఎవరైనా ఉంటే ఆ స్థానం విలువ పోతుంది అలాగే ఆ మనిషికి ఉన్న విలువ కూడా దిగజారిపోతుంది.
ఎవరైనా సరే వారి వారి స్థానానికి తగ్గట్టుగా వారి ప్రవర్తన ఉండాలి... వారి స్థానాన్ని ఎరిగి ప్రవర్తించాలి....కాస్త ఎక్కువైనా తక్కువైనా తేడా కొట్టేస్తుంది.
నిజంగానే...
దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది.
సింహం అడవికి రారాజు.
వేట లో తనకు తిరుగు లేదు....
అడవిలో ఉన్నంతకాలం సింహానికి ఉండే విలువే వేరు... అలాగే ఎలాంటి జంతువు అయినా సరే సింహం వస్తుంది అంటే నే దాని కంటికి కనిపించకుండా ప్రాణభయంతో పారిపోతాయి.
అదే సింహం ని మనుషుల వల్ల బంధింపబడి సర్కస్లో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేయిస్తారు.
అక్కడ తన ప్రతాపాన్ని చూపించలేదు.. ఎ
ందుకంటే అది తను ఉండాల్సిన స్థానం కాదు కాబట్టి.
అదే సర్కస్ లో సింహాన్ని తీసుకెళ్లి తిరిగి అడవిలో వదిలి పెడితే...
వేట కుక్కలు వేటాడి వెంటాడి మరీ చీల్చి చంపేస్తాయి.
అంటే దాని అర్థం ఒకసారి అది తన స్థానాన్ని కోల్పోయింది.. తిరిగి దాని స్థానానికి అది వచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు.
అలాగే మనిషి కూడా తను ఉన్న పరిస్థితులని తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అలాగే తన స్థానాన్ని ఎరిగి ప్రవర్తించాలి.
అంతేకానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు గొప్పలకుపోవడమో... లేక మరేదైనా ఎక్స్ట్రా కార్యక్రమాలు చేయడం చేస్తే....
దానికి తగ్గ మూల్యాన్ని కచ్చితంగా చేల్లించుకోవాలి.
అలాగే ఒకరి ప్రవర్తనకి బుద్ధి కి తగ్గ స్థానం కాక మించిన స్థానంలో కూడా వారిని ఉంచకూడదు.
ఎందుకంటే కుక్కను తీసుకు పోయే సింహాసనం మీద కూర్చోపెట్టి నా అది తిరిగి వెళ్లి చెప్పు నే తింటుంది కానీ పంచభక్ష పరమాన్నాలు వైపు కన్నెత్తి కూడా చూడదు.
కాబట్టి ఎవరైనా సరే తమ స్థానాన్ని గుర్తుపెట్టుకుని ప్రవర్తించాలి అలా కాదంటే...
కచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది...