STORYMIRROR

chittajallu narasimha

Drama Thriller

3  

chittajallu narasimha

Drama Thriller

రీవైన్డ్ అఫ్ మైండ్

రీవైన్డ్ అఫ్ మైండ్

7 mins
522

                    Intro: ఇది కథ కాదు, కథా అని అనుకునే కథ

ఒక నిశ్శబధమైన రాత్రి రోడ్ మీద ఎవరు లేరు సడన్ గ ఒక కార్ చాలా స్పీడ్ గ వెళ్తుంది, ఆ కార్ ని ఒక అమ్మాయి (హీరోయిన్) నడుపుతూ ఉంటుంది ముఖం లో చాలా టెన్షన్ తో కొంత దూరం అలావెళ్ళగా ఒక మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న కార్ తాలూకా లైట్ లౌ బీమ్ నించి హై బీమ్ చేయడంతో ఆ కాంతి తిని కళ్ళకి తాకడంతో స్టీరింగ్ పక్కకి తిప్పేస్తుంది ఆ స్పీడ్ లోనే చూసుకోకుండా ఒక అమ్మాయిని గుద్ది కార్ అదుపు తప్పడంతో పక్కన ఉన్న చెట్టుకి గుద్దెస్తాది.

కార్లో ఉన్న హీరోయిన్ స్టీరింగ్ పట్టుకొని మైండ్ అంత బ్లాంక్ అయిపోయి ఉంటది. కార్ దిగి చూదాం అనుకోని కార్ డోర్ తీయడానికి ప్రయత్నిస్తుంధీ వెంటనే ఒక వ్యక్తి తన కార్ విండో దగ్గర్కి వస్తాడు తిను చూసి బయపడుతాది, ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కొంత సేపు అయ్యాక తిను ఆక్సిడెంట్ చేసిన ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఈమే గుద్దిన ఆ అమ్మాయి అక్కడ బోర్లా పది ఉంటుంది ఇంక తిను ఆ అమ్మాయి ముఖం కూడ చూడకుండా కార్ దగ్గరకు పరిగెత్తి ఫోన్ గురించి వెతుకుతూ ఉంటాది చివరికి దొరకడం తో తన బాయ్ ఫ్రెండ్(హీరో) కి కాల్ చేస్తది ఎంతసేపటికి కాల్ కనెక్ట్ అవ్వదు ఆయన మల్లి ట్రై చేస్తూ వెనక్కి తిరిగి వెంటనే తను ఆక్సిడెంట్ చేసిన అమ్మాయి తన ముందు ఉంటాది ముఖం అంత జుట్టు తో కవర్ అయ్యి, అది చూసి హీరోయిన్ కి కళ్ళు తిరిగి పడిపోయి తల అటు ఇటు తిప్పుతూ ఉంటాది.

ఆలా తిప్పితున్నపుడు కార్ హార్న్ మోగుతాది చూస్తే తిను కార్ లో స్టీరింగ్ పట్టుకొని ఉంటాది అనుకుకోకుండా కార్ హార్న్ నొకేస్తుంది, లేగిచి అసలు ఏమిటీ అని చుటూ చూస్తాది ఎదురుగుండా తన ఫ్రెండ్స్ క్యాంపు ఫైర్ వేసుకొని పార్టీ చేసుకుంటూ ఉంటారు. తిను తన తల పట్టుకొని కార్ దిగి తన ఫ్రెండ్స్ ఉన్న చోటుకి వెళ్లి అక్కడ పక్కన ఒక దగ్గర కూర్చుంటాది, కొంత మంది ఫ్రెండ్స్ తినని చూసి తన దగ్గర్కి వచ్చి కూర్చుంటారు కానీ ఎవ్వరు మాట్లాడరు. కొంత సేపు అయ్యాక ఒక అబ్బాయి (క్యారెక్టర్-1) తిన దగ్గరకు వచ్చి.

"ఏమైంది నీకు " అని అడుగుతాడు

"ఏమి లేదు తల నొప్పిగా ఉంది " అని అంటది

"నీకు రెస్ట్ లేనట్టు ఉంది ట్రావెల్లింగ్ వళ్ళ వెళ్లి కొంత సేపు నిద్రపోతే సరిపోతాది వెళ్లి రెస్ట్ తీసుకో " అని చెపుతాడు.

" సరే" అని హీరోయిన్ అక్కడ నుంచి రూమ్ దగ్గరకు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంటాది సలహా ఇచ్చిన ఆ అబ్బాయి (క్యారెక్టర్ -1) తిరిగి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతాడు, తను లోపలికి వెళ్లి కళ్ళు మూసుకుంటది అప్పుడే ఒక ఉరుములు ఉరిమిన శబ్దం వస్తది వెంటనే కళ్ళు తెరుస్తాది హీరోయిన్.

ఈ సారి కళ్ళు తెరిచి చూస్తే తను ఆక్సిడెంట్ చేసిన స్థలంలో ఎక్కడ పడి ఉంటుంది అక్కడ ఉంటాది, వెంటనే లేగిచి జరిగిందంతా (తను ఎలా ఇక్కడ పడి ఉందొ అని) గుర్తు తెచ్చుకొని మళ్ళి తను ఆక్సిడెంట్ చేసిన ఆ బాడీ దగ్గర్కి వెళ్లి తను నిజంగా ఆక్సిడెంట్ చేసిందా అని చూడడానికి వెళ్తాది ఆ బాడీ అక్కడే ఉంటాది. తను మళ్ళి ఫోన్ పడిపోయిన ప్లేస్ కి వచ్చి మళ్ళి కాల్ ట్రై చేస్తది ఈ సారి కనెక్ట్ అవుతాది హీరో కి హీరో కాల్ లిఫ్ట్ చేయగానే తను ఏడుస్తూ జరిగిందంతా చెపుతాది టెన్షన్ టెన్షన్ తో.

"ఏమి కంగారు పడకు నేను వస్తున్నా" అని అంటాడు

తను కాల్ కట్ చేసి తిరిగి మళ్ళి బాడీ దగరకు వెళ్తాది, చూస్తే బాడీ అక్కడ ఉండదు అటు ఇటు టెన్షన్ తో చూస్తూ ఉంటాది, ఆ పక్కన ఉన్న పోదలోంచి ఏదో శబ్దం రావడం తో తిను అక్కడ నుంచి పరుగెడుతాది, కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర సడన్ గ ఆగిపోతాది.ఎదురుగ చూస్తే ఏదో వస్తున్నట్టు అనిపిస్తది చూస్తే ఒక నీడ అది ఒక కుక్క ది, అపుడు వరకు షాక్ లో ఉన్న ఆమే తేరుకొని మెల్లగా నడవడం మొదలు పెడుతాది, చూస్తే ఆ కుక్క కి ఒక తాడు కట్టి ఒక మనిషి పట్టుకు ఉంటాడు, అప్పుడు వరకు అరవని కుక్క అరవడం స్టార్ట్ చేస్తది, భయం తో తిను మళ్ళి ఆక్సిడెంట్ ఆయన ప్లేస్ కి తిరిగి వెళ్తాది తీరా చూస్తే బాడీ అక్కడే రోడ్ మీద ఉంటాది అది చూసి హీరోయిన్ ఇంక ఎక్కువ టెన్షన్ పడుతాది, కుక్క అరుపు వినపడడం తో ఆ పొదలోకు పరిగెడుతాది కాలకి అక్కడ చెట్టు కొమ్మ తగిలి కిందకు పడుతాది తల రాయికి తగులుతాది.

తీరా కళ్ళు తెరిచి చూస్తేయ్ తన పడుకున్న రూమ్ లో పైన నుంచి చక్క ముక్క తన తలపై పడుతాది, కళ్ళు మూసుకొని తలకు తగిలిన చోట రుద్దుకుంటూ కళ్ళు తెరిచినా వెంటనే ఒకడు దెయ్యం మాస్క్ వేసుకొని తన ముఖం దగ్గర ఉంటాడు అది చూసి ఈమే గటిగ అరుస్తాది, ఆ అరుపు కి అతను వెనక్కి జరుగుతాడు అనుకోకుండా జారీ పడిపోతాడు ఇంక కదలడు, అది చూసిన ఈమే భయం తో పార్టీ జరుగుతున్న ప్లేస్ కి పరుగుగెడుతాది. కానీ రూమ్ వైపు ఈమె ఫ్రెండ్ ఒక ఆమె వస్తుంటాది, ఆమెకి హీరోయిన్ రూమ్ దగ్గర జరిగిందంతా చెపుతాది, ఇద్దరు కలిసి రూమ్ దగ్గరుకు వెళ్తారు కానీ అక్కడ ఏది జరగనట్టు ఉంటాది. తీరా రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక కుక్క ఎదురుగా ఉంటాది పక్కన లోపల ఉండవలసిన బాడీ బయట ఉంటాది. ఆ కుక్క అరవటం మొదలు పెట్టదం తో ఇద్దరు పరుగు తీస్తారు ఆలా పరుగుతీస్తున్న వాళ్లకి అనుకోకుండా ఒక వ్యక్తి ఎదురు అవుతాడు తీరా చూస్తే అతను క్యారెక్టర్-1 వీళ్లిద్దరు కలిసి మొత్తం జరిగిందంతా చెపుతారు వీలు ముగ్గురు కలిసి రూమ్ దగ్గరకు వెళ్తారు అక్కడ ఉన్న బాడీ దగరకు వెళ్లి మాస్క్ తీసిన వెంటనే "భూ..."అని అరుస్తాడు ఆ మాస్క్ లో ఉన్న తను (హీరో) ఆ అరుపుకి హీరోయిన్ స్పృహ కొలిపోతాది వెంటనే హీరో తనని లేపడానికి ట్రై చేస్తాడు.

తను చివరికి కళ్ళు తెరుస్తాది చూస్తే ఆక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఉంటాది హీరో ని హాగ్ చేసుకొని ఏడుస్తూ టెన్షన్ గ మాట్లాడుతూ చెపుతాది.

"ఏడవకు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం " అని తనని కార్లో ఏకించుకొని బయలుదారుతాడు. కార్ లో కూడ ఇంక ఏడుస్తూనే ఉంటాది. హీరో తనని ఉరుకోపెడుతాడు కొంత సేపు అయ్యాక తను కామ్ అయ్యి హీరో బుజం మీద వాలి కళ్ళు మూసుకుని.

" నువ్వు రాకపోయి ఉంటె కాల్ ఎత్తక పోయి ఉంటెయ్ ఏమిఅవునో" అని అంటాది.

ఫ్లాష్ బ్యాక్ వేళ్ళ ఇద్దరి రిలేషన్ గురించి ఒక చిన్న లవ్ స్టోరీ సాంగ్. ఆ సాంగ్ చివర్లో వీలుఇద్దరు నీటి తో ఆడుకుంటూ ఉంటారు దాన్లో లాస్ట్ కి హీరో నీళ్లు చేతులో తీసుకొని హీరోయిన్ ముఖం పై వేస్తాడు చూస్తే రూమ్ దగ్గర పడి ఉన్న ప్లేస్ లో హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తాది లేగిచిన వెంటనే హీరో ని చూసి

"ఎందుకు జడిపించావ్, ఎంత బయపడనో " అని అంటది. అపుడు హీరో "నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని ని ఫ్రెండ్ కి అడిగాను నిను తీసుకువెళదాం అని వచ్చాను, పద వెళదాం" అని చెప్పి హీరో హీరోయిన్ ఇంటి దగ్గర దింపి.

"ఫ్రెష్ అయ్యి, ఏమైనా తిని పనుకో " అని చెప్పి వెళ్లిపోతాడు.

 ఫ్రెష్ అయ్యాక నిద్రపోవడనికి తన బెడ్ వైపు వస్తుంటాది మద్యలో తన బెడ్ పక్కన టేబుల్ ఫై ఒక బుక్ ని చూస్తాది, ఏంటి ఇది అని ఆ బుక్ ని చదవడం మొదలు పెడుతాది (ఆ బుక్ లో స్టార్టింగ్ లో జరిగిన కార్ ఆక్సిడెంట్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ బుజం మీద పనుకోవడం వరకు )అక్కడ వరకు చదివి నిద్ర రావడం వల్ల నిద్ర పోతాది, అపుడు కార్ ఆగుతాది.తన కళ్ళు తెరిచి చూస్తే హీరోయిన్ ఇల్లు వస్తాది అప్పుడు హీరో హీరోయిన్ కి

" జరిగిందంతా మరచిపో, ఇంట్లో ఎం చెప్పకు, రేపు చూసుకుందాం, ఫ్రెష్ అయ్యి పనుకో " అని చెప్పి వెళ్ళిపోతాడు.

హీరోయిన్ ఇంటికి వెళ్లిన వెంటనే అందరూ అడుగుతారు.

"ఏంటి ఏమైనది నీకు ఎన్ని సార్లు కాల్ చేసిన కనెక్ట్ అవ్వడం లేదు" అని ఇంట్లో వాళూ అడుగుతూ ఉంటారు.

హీరోయిన్ " ఏమి లేదు " అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి పనుకుందాం అని ట్రై చేస్తూ ఉంటాది కానీ నిద్ర పట్టదు కాసేపు టీవీ చూదాం అని ఆన్ చేసి చానెల్స్ మారుస్తూ ఉంటాది ఆలా ఒక ఛానల్ దగ్గర ఆపి ఇంట్రెస్టింగ్ గ చూస్తాది.

"ఆ ఛానల్ లో రూమ్ దగ్గర జరిగిన అమ్మాయి గురించి చూపిస్తూ ఉంటారు, తను కార్ హార్న్ దగ్గర నుంచి తన పుస్తకం చదువుతున్నంత వరకు” కానీ ఆ పుస్తకం లో చదువు తున్నది ఈమెకి ఇప్పుడు వరకు జరిగిన విషయాలు కాబట్టి అవి కూడ టీవీ లో చూపించడం తో మళ్ళి టెన్షన్ మొదలు అవుతాది.

వెంటనే హీరో కి కాల్ చేస్తూ ఉంటాది కానీ ఈ సారి మళ్ళి కాల్ కనెక్ట్ అవ్వదు, అనుకోకుండా వెనక్కి తిరిగి చూస్తే తన ఆక్సిడెంట్ చేసిన అమ్మాయి తన ముందు ఉంటాది. హీరోయిన్ షాక్ లో ఉండిపోతాది ఇంతలో అలారమ్ సౌండ్ మోగడం తో తిను బెడ్ మీద నుంచి షాక్ లో లెగుస్తాది, బెడ్ దిగి అసలు ఇదంతా ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తూ ఉంటాది, అపుడు ఆ పుస్తకం గురించి గుర్తు వస్తాది వెంటనే వెతకడం మొదలు పెడుతుంది కానీ అది ఎక్కడ దొరకదు ఆలా వెతుకుతున్న సమయంలో అన్ని విసిరేస్తుంటది ఆ విసరడంలో టీవీ రిమోట్ నొక్కుకొని టీవీ ఆన్ అవుతాది .ఆ ఛానల్ లో కాంటీనుషన్ అఫ్ ఎస్టర్డే ఎపిసోడ్ అని వాయిస్ రావడం తో ఏంటి ఇది అని చూస్తూ ఉంటాది.ఆ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వక ముందు రీక్యాప్ వేశారు దాన్లో రాత్రి జరిగిన ఆక్సిడెంట్ తాలూకా స్టోరీ గురించి వేస్తారు. ఆ స్టోరీ లో తను కాల్ కట్ చేసి వెన్నకి తిరిగిన తరువాత ఆక్సిడెంట్ చేసిన అమ్మాయిని రివీల్ చేస్తారు చూస్తే ఆ అమ్మయి ఎవరో కాదు హీరోయిన్ ది వెంటనే తిను చేతిలో ఉన్న రిమోట్ కింద పడేసి భయపడుతూ ఉంటాది అప్పుడే కరెంటు కూడ పోతాది వెంటనే తన ఫ్రెండ్ కి కాల్ చేసి తన ఉన్న ప్లేస్ కి తిను బయలు ధారుతూ ఉంటాది.

ఆ సీన్ ఏ స్టార్టింగ్ లో కంగారు గ డ్రైవ్ చేస్తున్న సీన్ కరెక్ట్ గ అర్ధం మీద ఆ లైట్ పడినప్పుడు రూమ్ లో హీరో కర్టెన్ ఓపెన్ చేస్తాడు. తిను అదే టెన్షన్ తో లేచి తల పట్టుకు కూర్చుంటాది .హీరో హీరోయిన్ ని ఆలా చూస్తూ ఉంటాడు కెమెరా హీరోయిన్ కంటికి జూమ్ చేసి దాని నుంచి బ్రెయిన్ కి చూపిస్తాం ,జూమ్ అవుట్ ఆయన తర్వాత బ్రెయిన్ తాలూకా ఎక్సరే ఉంటాది దానిని డాక్టర్ ఒబ్సెర్వె చేస్తూ ఉంటాడు.డాక్టర్ ఎదురుగా హీరో కూర్చొని ఉంటారు.

డాక్టర్ అడుగుతాడు

" అసలు ఏమైనది " అని

హీరో

"ఏమో తెలియదు డాక్టర్ పొద్దున్న అంత బానే ఉంటాది కానీ రాత్రి పనుకుని పొద్దున్న లేచినప్పుడు చాలా టెన్షన్ తో లెగుస్తాది ఏంటి ఏమైనది అని అడిగితే ఏమి లేదు అని అంటుంది"అని చెపుతాడు. అప్పుడు డాక్టర్ ఎక్సప్లయిన్ చేస్తాడు.

"మనుషులలో ఇదంతా సహజం ఒక వ్యక్తికి ఒక రోజులో కానీ, ఒక సమయం లో కానీ ముఖ్యం గ తనకి బాగా నచ్చినవి ఆయన నచ్చనివి ఆయన సంఘటనలు వాళా మెదడులో రిజిస్టర్ అయ్యి ఉంటాయి. అవని వాళ్ళు నిద్రురించేటపుడు ఆ సంఘటనలు రీవైన్డ్ అవుతూ ఉంటాయి. ఆ సంఘటనలలో వేరే పాత్రలలో రావచ్చు లేకపోతే వాలనే ఆ పాత్రలలో ఊహించుకోవచ్చు, దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటేయ్ సరిపోతాది కంగారు ఎం పడక్కర్లేదు "అని డాక్టర్ చెపుతాడు.

ఇంక హీరో ఆ రిపోర్ట్స్ తీసుకొని అక్కడ నుంచి బయలు ధారుతాడు అసలు హీరోయిన్ కి ఏమైనది అని ఆలోచించుకుంటూ ఉంటాడు.

అసలు జరిగిన విషయం ఏంటంటే హీరో ఒక రైటర్ కం డైరెక్టర్ తను ఒక కథ రాసుకుంటాడు ఆ పుస్తకాన్ని టేబుల్ మీద వదిలి వీలిపోతాడు. ఆ పుస్తకం హీరోయిన్ కి కనపడతాది హీరో కి తెలియకుండా చదువుతాది ఎంతంటే ఆ పాత్రలో లీనమైపోయినంత అసలు అంత ఇంట్రెస్టింగ్ గ హీరోయిన్ చదవడానికి కారణం హీరో ఆ క్యారెక్టర్ కి పెట్టిన పేరు అది ఎవరిదో కాదు హీరోయిన్ ది.

ఇంతలో హీరో కి కాల్ వస్తాది తన ప్రొడ్యూసర్ నుంచి

"ఎంత వరకు అయింది రాయడం" అని ప్రొడ్యూసర్ అడుగుతాడు

"టోటల్ గ రాసేశా సాయంత్రం మీ దగరకు తీసుకు వస్తా " అని అంటాడు

"అసలు టైటిల్ ఎం అనుకున్నవి మూవీ ది " అని ప్రొడ్యూసర్ అడుగుతాడగు

దానికి హీరో


R.O.M

  రీవైన్డ్ అఫ్ మైండ్


-------------------------------------THE END------------------------------------


Rate this content
Log in

More telugu story from chittajallu narasimha

Similar telugu story from Drama