Gagana Gana

Drama Romance

4.7  

Gagana Gana

Drama Romance

ప్రేమ తీరం

ప్రేమ తీరం

5 mins
84



అదో పెద్ద కళ్యాణ మండపం....



ఒక బోర్డ్ పై పెళ్లికొడుకు పెళ్లికూతురి పేర్లు అందం గా డిసైన్ చేశారు....



వీరేన్ 

   వెడ్స్

     శిల్ప




పెళ్లి హడావిడి అంతా కనపడుతుంది అక్కడకి వచ్చిన ఆడవాళ్ళంత తాము కట్టుకున్న చీరలు ఇంకా నగలు గురించి మాట్లాడుకుంటు ఉంటే...



మగ బ్యాచ్ అంతా బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు....



పిల్లలు అంతా ఆటల్లో బిజీ అయితే యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఓర చూపులు చూసుకుంటూ 

ముసి ముసిగా నవ్వుతూ

ఆ పెళ్లి లో వాళ్ల పెల్లిల్లు కూడా సెట్ చేసుకునే పని లో బిజీ గా ఉన్నారు అన్నమాట....



ఇక పెళ్లి పందింట్లో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే పెళ్లి కొడుకు పూజ చేస్తూ ఉన్నాడు.....



పెళ్లి కొడుకు ఆరు అడుగుల ఎత్తు తో కండలు తిరిగిన దేహం తో పెళ్ళి కొడుకు గెటప్ లో రాజ కుమారుడిలా వెలిగి పోతున్నాడు....



పెళ్లి కొడుకు పంతులుగారు చెప్తుంది చేసుకుంటూ పోతున్నాడే తప్ప అతనికి అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది....



అసలు అతని మొహంలో ఓ కళ ఓ నవ్వు అనేది ఏదీ కూడా లేదు అతడు కోపాన్ని ఎంతగా బలవంతంగా ఆపుకుంటూ ఉన్నాడు అన్నది అతడి కళ్ళల్లో తెలుస్తూనే ఉంది..



అతడికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు కానీ చేసుకోవాల్సి వస్తుంది...



దవడలు బిగబట్టి తన ఆవేశాన్ని అంతా ఆపుకుంటూ పెళ్లి పీటలపై కూర్చుని ఉన్నాడు పెళ్లి కొడుకు....




పెళ్లి కొడుకు తల్లి పెళ్లికూతురు ఉన్న గదిలోకి వెళ్లి అమ్మాయి నీ ఇంకా ఎంతసేపు అలంకరిస్తారు అక్కడ ముహూర్తానికి సమయం అయిపోతుంది అంది....



పెళ్లికూతురు వెనక్కి తిరిగి ఒక్క ఐదు నిమిషాలు అత్తయ్య అయిపోయింది అని నవ్వుతూ చెప్పింది...



అలాగే తల్లి మహాలక్ష్మి లా ఉన్నావు నువ్వు అని ఆవిడ దూరం నుండే పెళ్లికూతురి కి మెటికలు విరిచి అక్కడి నుండి వెళ్లి పోయింది...



పెళ్లి కూతురు ముస్తాబు అంత అవడం తో తనను తయారు చేసిన అమ్మాయిలు అందరూ బయటకు వెళ్లిపోగా పెళ్లికూతురు ఫ్రెండ్ ఒక్కతే తనతో ఉంది....




ఎంటే శిల్ప అసలు ఏమ్ చేసావే నువ్వు వీరేన్ నీతో పెళ్లి కి ఎలా ఒప్పుకున్నాడు అంది ఆశ్చర్యంగా శిల్ప ఫ్రెండ్ రాశి...



ఈ శిల్ప తో ఏదయినా అవుతుందే అలాంటిది ఆ వీరేన్ ఓ లెక్కా నాకు అంది శిల్ప పొగరుగా....



అది కాదే అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా మరి ఎలా ఒప్పించావు వాళ్ళు ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారు కదా అలాంటిది వీరేన్ ఆ అమ్మాయిని కాదు అని నిన్ను ఎలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని అడిగింది రాశి.....



వీరేన్ దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేకే కదే 

వీరేన్ నీ నాతో పెళ్లికి ఒప్పించాను..



వీరేన్ దానికి దక్కక అది కుల్లి కుళ్ళి ఎడవాలి ఇటు వీరేన్ అటు అది ఇద్దరి ప్రేమ విఫలం అయినందుకు ఇద్దరు జీవితాంతం ఆ బాధ లోనే మునిగి పోవాలి అంది శిల్ప కక్ష్య గా.....



అదేంటే నువ్వు వీరేన్ మీద ప్రేమ తో ఈ పెళ్లి చేసుకోవడం లేదా అంది రాశి...



ప్రేమా నాకా వీరేన్ మీదనా అంత లేదే వాడి వల్ల నేను ఏమ్ కోల్పోయానో వాడికి తెలియదే అని ఆమె కళ్లల్లో నిప్పులు కక్కుతూ వాడి వళ్ళ నా లైఫ్ నే మారిపోయింది....



నాకు లైఫే లేకుండా చేసిన వాడు మాత్రం

వాడు ప్రేమించిన ప్రేయసితో రాసుకు పూసుకుంటూ తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నాడా...



నేను కూడా వాడికి లైఫ్ లేకుండా చేస్తాను వాడి ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేస్తాను...



వాడి జీవితంలో సంతోషం అనే పదం కూడా ఉండకూడదు వాడు నన్ను పెళ్లి చేసుకుని రోజు చస్తూ బతకాలి...



ఇప్పుడు ఎలా అయినా నాతో పెళ్లి అయ్యాక దాన్ని కలవడం కాదు కనీసం చూడడం కూడా కుదరనివ్వను నేను...



అక్కడ అది ఏడుస్తూ ఇక్కడ వీడు ఏడుస్తూ ఉండాల్సిందే వాళ్ళ జీవితాంతం....



అని చాలా పగ తో అంది శిల్ప అలా అంటున్నప్పుడు శిల్పని చూస్తే రాశికి కూడా భయం వేసింది...



అప్పుడే కొందరు అమ్మాయిలు వచ్చి పంతులు గారు పెళ్లికూతురుని రమ్మంటున్నారు అని పిలిచే సరికి...



శిల్ప తన ఆవేశాన్ని తగ్గించుకుని మొహం మీద కాస్త చిరునవ్వు పులుముకుని వెళ్దామా అని రాశికి సైగ చేసింది...




పదవే అని రాశి శిల్పని పెళ్లి మండపం లోకి తీసుకు వెళ్లి పెళ్లి కొడుకు పక్కన పెళ్లి పీటలపై కూర్చోబెట్టింది....




శిల్ప అతడి పక్కన కూర్చోగానే వీరేన్ కి ఎక్కడ లేని కోపం అంతా వస్తుంది అప్పటికప్పుడే అక్కడ జరిగేదంతా ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఉంది అతడికి కానీ అతడు ఏమీ చేయలేని పరిస్థితి అది.....



అతడి లోపల ఓ అగ్ని పర్వతం బద్దలు అవుతుంది...



ప్రేమించిన అమ్మాయిని కాదు అని ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకోవడం అతని వల్ల కావడం లేదు అసలు .....



పంతులు గారు చెప్పేది చేసుకుంటూ పోతున్న వీరేన్ కి ఎవరో తననే పట్టి పట్టి చూస్తున్నారు అనిపించి తల పైకెత్తి ముందుకి చూశాడు....



ఫంక్షన్ హాల్ మధ్యలో నిలబడి ఒక అమ్మాయి వీరేన్ నే బాధ నిండిన కళ్ళతో చూస్తూ ఉంది....



వీరేన్ నోటి నుండి అప్రయత్నంగా నందిని అన్న పేరు బయటికి వచ్చింది...



వీరేన్ ఆ పేరు పలకడం విన్న శిల్ప కూడా తల పైకెత్తి నందిని వైపు చూసింది...



శిల్ప నందిని నీ చూసి ఒక క్రూరమైన నవ్వు నవ్వింది....



నందిని మాత్రం వీరేన్ నీ ఆమె కంటి నిండా నింపుకుంటూ ఉంది మళ్లీ అతడిని చూస్తానో లేదో అని....



అప్పుడే పంతులు గారు బాబు ముహూర్త సమయమైంది అమ్మాయి మెడలో తాళికట్టు అని చెప్పారు....



వీరేన్ పంతులు గారి మాట వినిపించుకోక పోవడం తో వీరేన్ తల్లి పద్మ గారు వీరేన్ దగ్గరికి వచ్చి బాబు వీరేన్ అమ్మాయి మెడలో తాళికట్టు అని చెప్పారు గట్టిగా....



వాళ్ల అమ్మ మాటలు విన్న వీరేన్ అతడి మనసు చంపుకుని శిల్ప మెడలో మూడు ముళ్ళు వేసేశాడు....



అది చూసిన నందిని కి తన మనసు ముక్కలు అయిపోయింది....



ఇక తను అక్కడ ఉండలేక గుండె నిండా దుఃఖాన్ని నింపుకుని వెను తిరిగి చూడకుండా వెళ్లిపోయింది బయటికి...



తను వచ్చిన ఆటో అక్కడే ఉండడం తో మున్న ఆటో తీయి వెళ్దాం అంది. జీర బోయిన గొంతు తో....



మున్నా కి కూడా చాలా బాధగా అనిపించింది నందిని నీ అలా చూసి అలాగే వీరేన్ పై కూడా అంతే కోపం వచ్చింది.....



నందిని ఆటోలో వెళుతుంటే తనకి ఎంతకీ దుఃఖం ఆగడం లేదు తను వీరేన్ తో ఉన్న సంఘటనలు అన్ని నందిని ముందు సజీవంగా మెదులుతున్నాయి....



అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే ఆమెకు ఒక్క సరిగా కళ్ళు తిరగడం మొదలై ఆమె ఒళ్ళంతా నీరసం ఆవహించేసింది....



ఇక ఆమెకు ఓపిక లేకపోవడంతో మున్నా అని మెల్లిగా పిలిచింది...



హా అక్క అని మున్నా వెనక్కి తిరిగి చూసాడు నందిని నీ...



మున్నా కళ్ళు తిరుగుతున్నాయి రా ఆటో కాస్త పక్కకి ఆపు అంది నందిని...



అయ్యో అక్క మనం ఇంటి దగ్గరికి వచ్చేసాం అక్క ఒక రెండు నిమిషాలు అని మున్న ఆటో స్పీడ్ పెంచి ఇంటి దగ్గర ఆటో ఆపాడు....



ఆటో ఆగడం తోనే నందినికి ఒళ్లంతా తూలినట్టు అయి కళ్ళు తిరగడం తో ఆటో దిగి వాంటింగ్ చేసేసుకుంది....



అయ్యో అక్క ఏమైంది అని మున్నా నందిని వెనుక వచ్చి ఆమె చెవులు మూసి గట్టిగా పట్టుకున్నాడు...



కళ్ళు తిరుగుతున్నాయి మున్నా అంది నందిని నీరసం గా...



అక్క ముందు నువ్వు ఇంట్లోకి పదా నేను వెళ్లి డాక్టర్ నీ తీసుకొస్తాను అని నందిని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లి తనని హాల్ లో ఉన్న బెడ్ పై కూర్చోబెట్టాడు మున్నా...



అయ్యో డాక్టర్ ఎం వద్దు మున్నా కాసేపు పడుకుంటే సెట్ అయిపోతానులే అంది నందిని..



నువ్వు అలాగే అంటావు నువ్వు కొద్ది రోజులు గా అసలు నీరసం గా ఉంటున్నావు ముందు డాక్టర్ నీ వచ్చి చూడనివ్వు అని మళ్లీ మున్నా వెంటనే ఆటో తీసుకొని వెళ్లి లేడీ డాక్టర్ నీ ఇంటికి తీసుకు వచ్చాడు...



డాక్టర్ని ఇంట్లోకి తీసుకువచ్చి మేడమ్ తినే మా అక్క కొద్దిరోజులుగా నీరసంగా ఉంటుంది కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది అలాగే ఇప్పుడు వాంథింగ్స్ కూడా చేసుకుంది డాక్టర్ అని చెప్పాడు మున్నా...



ఓకే చిన్నా నువ్వు కాస్త బయటికి వెళ్తావా నేను మీ అక్కని టెస్ట్ చేస్తాను అంది డాక్టర్..



అలాగే మేడం అని మున్నా బయటికి వెళ్లిపోయాడు....



డాక్టర్ రావడం తో నందిని కి లేవడానికి ఓపిక లేక పోయినా మెల్లిగా లేచి కూర్చుంది...



మీ పేరు అని అడిగింది డాక్టర్..



నందిని మేడం..



చెప్పండి నందిని ఏమైంది అని అడిగింది డాక్టర్...



కొన్ని రోజులుగా నీరసం గా ఉంటుంది మేడం కళ్ళు తిరుగుతున్నాయి అలాగే కడుపులో తిప్పినట్టు అవుతుంది వాంతులు కూడా అవుతున్నాయి అప్పుడప్పుడు కొన్ని స్మెల్స్ కూడా పడట్లేదు అని చెప్పింది నందిని...



అవునా అని డాక్టర్ నందిని చెక్ చేసి ఆమె నాడీ ని పట్టుకొని చూసి నీకు ఈ మంత్ పీరియడ్స్ వచ్చాయా అని అడిగింది డాక్టర్...



అంతే అప్పుడు గుర్తొచ్చింది నందిని కి అసలు తనకి టూ మంత్స్ గా పీరియడ్స్ రాలేదు అని...



లేదు మేడం టూ మంత్స్ అవుతుంది నాకు పీరియడ్స్ రాక అని మెల్లిగా చెప్పింది....



ఇదిగో ఒకసారి వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్ తో టెస్ట్ చేసుకో అమ్మ అని చెప్పి నందిని వాష్ రూమ్ కి పంపింది....



నందిని వాష్ రూమ్ కి వెళ్లి పది నిమిషాల తర్వాత బయటికి వచ్చి ఆ కిట్ నీ డాక్టర్ చేతిలో పెట్టింది...



అప్పటికే నందిని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి....




డాక్టర్ కూడా ఆ కిట్ నీ చూసి నువ్వు ప్రెగ్నెంట్ నందిని ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఇలాగే ఉంటాయి ఒకసారి హాస్పిటల్ కి రా నీకు చేయాల్సిన అన్ని టెస్టులు చేస్తాను అని చెప్పి ఆవిడ ఇక అక్కడ నుండి వెళ్లిపోయారు....



మున్నా ఆవిడకి ఫీజు ఇచేసి ఆవిడని దిగబెట్టి మళ్లీ ఇంటికి వచ్చాడు...



మున్నా వచ్చే వరకు నందిని ఓ ప్రాణం లేని బొమ్మలా కూర్చుని ఎటో చూస్తూ ఉంది కానీ తన కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి ఆమె ఒక చేయి ఆమె కడుపుపై ఉంది....



మున్నా నందిని నీ అలా చూసి వెంటనే ఆమె దగ్గరికి వచ్చి అక్క అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ డాక్టర్ గారు ఏమని చెప్పారు అని కంగారుగా అడిగాడు మున్నా....



వీర మన బేబీ వీర ఇప్పుడు నా కడుపులో పెరుగుతుంది అని తనలో తనే చెప్పుకుంటూ ఉంది నందిని.....



ఇంకా ఉంది.....


నచ్చితే చెప్పండి డైలీ ఇస్తా...




Rate this content
Log in

More telugu story from Gagana Gana

Similar telugu story from Drama