vaishnavi yenisetti

Drama Romance

4  

vaishnavi yenisetti

Drama Romance

ప్రేమ - బాధ్యత

ప్రేమ - బాధ్యత

3 mins
318



అందరికీ నమస్కారం . ఇది నా మొదటి రచన . మీ అందరూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను . మీరు మీ అభి ప్రాయాలని కామెంట్స్, రేటింగ్స్ రూపం లో  తెలియ చేస్తూ నాకు ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను .🙏🙏🙏🙏🙏🙏🙏🙏




ప్రోమో:


    ఒక గదిలో 20ఏళ్ల అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది . తన బాధ ఎవరితో పంచుకోవాలి తెలియటం లేదు . ఒక వేల చెప్పినా ఎవరు ఆ అమ్మాయి మాట వినరు . 


     అప్పుడే అక్కడకు ఒక 65 సంవత్సరాల వయసు కల ఒక ఆవిడ వచ్చి బంగారం ఈ చీర కట్టుకొని తయ్యారు అవ్వు అని చెపుతుంది . 


     అప్పుడే అక్కడకు ఒక అతను వచ్చి ఇంకా ఎంతసేపు నీ ఏడుపు ఆపి తయ్యారు అవ్వు అని చెయ్యి ఎత్త గానే ఆవిడ వెంటనే శేఖర్ నువ్వు గానీ బంగారాన్ని కొడితే నా కన్న చెడ్డ వారు వుండరు అని అంటుంది .


    అప్పుడు శేఖర్ ఆవిడ వైపు చూసి అత్తయ్య నేను కావాలి అని చెయ్యి ఎత్తలేదు . తండ్రి గా నా బాధ్యత గా కూతురికి పెల్లి చేస్తున్నాను . కానీ ఇది నేనేదో దీని జీవితం నాశనం చెస్తున్నట్టు ఏడుస్తుంది. 


     పెళ్ళికొడుకు చదువుకున్న వాడు . కోట్ల ఆస్తులు వున్నాయి . ఎదురు కట్నం ఇచ్చి దీనిని పెళ్లి చేసుకుంటున్నాడు .దీనికన్నా ఏమి కావాలి దీనికి . నోరుమూసుకుని పెళ్లి పీటల మీద కూర్చోమని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు .


    పెళ్ళికూతురు వాల్ల అమ్ముమ్మను హత్తుకొని అమ్మమ్మ నాకు పెళ్లి ఇష్టం లేదు . తను మంచోడు కాదు అని చెప్తుంటే ముసలి ఆవిడ నేను ఎదో ఒకటి చేస్తాను నువ్వు మాట్లాడకు అని అంటుంది.


   అప్పుడే గదిలో కి 5 గురు అమ్మాయిలు తనను రెఢీ చెయ్యడానికి వస్తారు . ఇక ఆవిడ బయటకు వెళ్తుంది . అప్పుడే 80 సంవత్సరాల ముసలి ఆయన తన దగ్గరకు వచ్చి ఏమి చేస్తావు రమణి అని అడుగుతారు . 


    అప్పుడు అక్కడనుండి పక్కకు వెళ్లి ఒక ఫోన్ కాల్ 30 నిమిషాలు మాట్లాడుతుంది . అటునుండి ఏమి చెప్పారో తెలియదు కానీ ఫోన్ పెట్టేసాక సంతృప్తికర మైన చిన్న నవ్వు నవ్వుతుంది . తన భర్త తో మీరే చూడoది అని చెప్పి పనులు చెయ్యడానికి వెళ్తుంది .


   పెళ్ళికొడుకు పీటల మీద కూర్చోని పూజ చేస్తుంటాడు . తన మొహం ఏదో సాధించా అన్న గర్వం కనపడుతుంది . అప్పుడు పంతులు గారు అమ్మ పెల్లికుమార్తెను తీసుకు రండి అని చెప్పగానే కొంతమంది కలిసి ఆమెను తీసుకు వస్తారు . 


    అప్పుడు తను తన అమ్మమ్మ వైపు చూడగా తను కళ్ళు ఆర్పుతుంది . ఇక ఆ అమ్మాయి రమణి గారు ఏదో చెయ్య బోతున్నారు అని కొంచెం ప్రశాంతం గా కుర్చుంటుంది . 

    

    పెళ్ళికొడుకు ఆమె వైపు చూసి నిన్ను ఎవరు ఇప్పుడు నా నుండీ కాపాడ లేరు అని చూస్తుంటాడు. తాళి కట్టే సమయానికి ఒక పెద్ద కారు కళ్యాణ మండపం లోకి వస్తుంది . ఇక అక్కడ అంతా కోలాహలం గా వుంది .


    అప్పుడే అక్కడకు 26 సంవత్సరాలు వున్న ఒక అబ్బాయి గంభీరమైన మొహం తో , కోపం తో ఎర్రగా వున్న కళ్ళ తో లోపలకు అడుగు పెడతాడు . తనతో పాటు 60 సంవత్సరాలు వున్న ఒక ఆవిడ చూడటానికి అతనికి తల్లి అనుకుంటా తను కూడా వస్తుంది .


    తను లోపలికి వెళ్ళగానే అందరూ వారినే చూస్తున్నారు . తను ఎరుపెక్కిన కల్ల తో పెళ్ళికొడుకుని చూస్తున్నాడు . తల దించుకొని ఇక్కడ జరిగే వాటికి తనకు సంబంధం లేదు అన్నట్టు కుర్చఉన్న పెళ్లికూతురుని చూసి చిన్ని అని పిలవగానే అప్పుడు దాకా లోకం తో సంబంధం లేదు అన్నట్టు వున్న తను ఒక్క సారిగా తల పైకి ఎత్తి ఆ వ్యక్తిని చూస్తుంది . 


    తన కళ్ళ ముందు వున్న వ్యక్తిని ఆచర్యం గా , సంతోషం గా చూస్తుంది . అప్పుడు రమణి గారు వల్లి  అని కదపగానే ఇది కల కాదు అని గ్రహించి వెంటనే పీటల మీద నుండి లేస్తుంది .


    పెళ్ళికొడుకు వెంటనే తన చెయ్యి పట్టుకోవడానికి చూస్తే తన చెయ్యి విదిలిచ్చు కొని మామయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్లి తనను వాటేసుకుంది . 


   తను వచ్చి వాటేసుకోగానే ఆమె వేగానికి ఒక అడుగు వెనక్కు వేశాడు .


   🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


   కొనసాగుతుంది ....


    


Rate this content
Log in

Similar telugu story from Drama