నన్ను గెలిపించిన ప్రేమ
నన్ను గెలిపించిన ప్రేమ


ఆకాశం ఎంతో నిర్మలంగా ఉంది. మనోహర్ మనసులో మాత్రం చాలా గుబులుగా ఉంది. లత ఏమంటుందో ఏం చెబుతుందో అని మనసు మనసులో లేదు. తను మాట కోసం ఎదురు చూస్తున్నాను తను వచ్చింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది నోరు తెరిచి నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పాను.
నీ ప్రేమను నేను ఒప్పుకుంటాను కానీ తాను చదువు ముఖ్యం మన భవిష్యత్తు ముఖ్యం మన కోసం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు ప్రేమ ప్రేమ అంటూ నా కోసం చదువుని నిర్లక్ష్యం చేయడం నాకు ఇష్టం లేదు. నాకోసం నువ్వు మీ అమ్మానాన్నలు సంతోషపెట్టు పెంచుకున్న ప్రేమకు అర్థం. జీవితంలో జీవితంలో మీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చి నా ప్రేమని అందుకో నీకోసం ఎదురు చూస్తాను. తను వెళ్ళి పోతుంది.
మనోహర్ చదువుని నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రుల కలలు నిజం చేసి తనలో స్ఫూర్తిని నింపిన అమ్మాయి ప్రేమని పొంది ఇరువైపులా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో ఒక్కటయ్యారు.