నీ ప్రేమకై
నీ ప్రేమకై
దేహమే నీవు అయితే ప్రాణమే నేను అవుతా..
మాటయే నీవు అయితే పలుకు నేను అవుతా..
కోపమే నీవు అయితే మౌనమే నేను అవుతా..
సంతోషమే నీది అయితే చిరునవ్వు నేను అవుతా..
గాయమే నీవు అయితే దానికి మందు నేను అవుతా..
ఏది ఏమైనా నీ తోడుగా జీవితాంతం ఉంటా
ఒక్క అవకాశం ఇచ్చి చూడు ప్రియా
నీ పిలుపు కోసం ఎన్నాళ్ళు అయినా నిరీక్షించగలను..!!
ఎందుకంటే "నీ ప్రేమనే నా జీవితం" అనుకుని జీవిస్తున్నా కాబట్టి..
నవ్వులు కురిపిస్తావో, కన్నీటిని కరిగిస్తావో నీ చేతికే అధికారం ఇచ్చేసా..!!
చూసే కన్నులవై..
పలికే పెదవులవై..
మన్నించే మనసువై..
ప్రేమించే హృదయమువై..
నా ఆనందానికి కారణమువై..
నా జీవితానికి అర్థమువై..
నా జీవిత అర్థాంగివై..
మన ప్రయాణాన్ని..
మరింత అందంగా మలిచిన నీకు.. ప్రేమాబివందనం

