మనసా తుళ్ళి పడకే
మనసా తుళ్ళి పడకే
ప్రోమో....
భూమి...!!
భూమి...ఆగు...అంటూ పరుగులాంటి నడకతో ఆమె ముందుకు వచ్చి నుంచొని...,
భూమి...!!నా కళ్ళల్లోకి చూసి చెప్పు... నిజంగా నీకు నేనంటే ఇష్టం లేదా...?? నువ్వు నన్ను ప్రేమించడం లేదా...??
లేదు....
నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు భూమి... అప్పుడు నువ్వు చెప్తున్నది నిజమని నేను నమ్ముతాను...
లేదు...లేదు...లేదు...నేను మిమ్మల్ని ప్రేమించలేదు...
నా మనసులో మీమీద మీరు అనుకునే ఇష్టం లేదు...
అయితే నీ కళ్ళల్లో నుంచి ఆ కన్నీళ్ళెందుకు వస్తున్నాయి...హా...చెప్పు భూమి...
..............
ఏ... చెప్పలేవా...?? ఆ కన్నీళ్లెందుకు వస్తున్నాయో చెప్పలేవా............నేను చెప్పనా భూమి... నామీద నీకున్న అనంతమైన ప్రేమని...,బలవంతంగా అంతం చేస్తున్నావు కదా...!! అందుకు...!! కానీ నేను అలా జరగనివ్వను... నిన్ను నేను ఎప్పటికీ దూరం చేసుకోను...నువ్వు అవునన్నా...,కాదన్నా..., నాకు నువ్వు కావాలి... నీ స్వచ్ఛమైన ప్రేమ కావాలి... అని కోపంగా చెప్పి...,ఆమె చేతిని పట్టుకొని తనతో తీసుకొని వెళ్తున్నాడు అతను...
తన చేతిని పట్టుకొని తీసుకువెళ్తున్న అతని వెంట నడుస్తూ...,అతన్నే కనురెప్ప వేయకుండా ప్రేమ..., ఆరాధన నిండిన భావంతో చూస్తున్న ఆమెకు దూరం నుంచి.......
మనసా....!! తుళ్ళి పడకే...
అతిగా......ఆశ పడకే....
అంటూ రేడియో లోనుంచి పాట వినిపిస్తుంటే..., అతని వైపు నుంచి చూపు తిప్పుకొని..., మౌనంగా ఏవేవో ఆలోచనలతో అతని వెనుక వెళ్తుంది...
@@@@@@@@@@@@
ఇంకా వుంది...
మీ
❤️ఆరుషి ❤️
