మౌనం దాటని మనసు
మౌనం దాటని మనసు
హైదరాబాద్
మార్నింగ్
అమ్మ అమ్మ అంటూ అరుస్తూ అప్పుడే లేచి హల్ లోకి వచ్చి కూర్చుని కాఫీ ప్లీస్ అంటున్నాడు
హారిక : రేయ్ గాడిద పండగ టైం లో కూడా ఆ నిద్ర ఏంట్రా
వరుణ్ : అబ్బా అమ్మ నైట్ జర్నీ చేశాం కదా సో కాస్త టైర్డ్ గా ఉంది అంతే
హారిక : ఆహా మరి నీ ఫ్రెండ్ కూడా నీతో పాటు నైట్ జర్నీ చేసాడు కదా మరి తను ఉదయాన్నే లేచి జాగింగ్ కి వెళ్ళాడు
వరుణ్ : అబ్బా వీడొకడు నా ప్రాణానికి అనుకుంటూ హి హి హి అమ్మ అది అంటూ ఉండగానే లోపలికి వస్తాడు అర్జున్
హారిక : దా అర్జున్ నువ్ వెళ్లి ఫ్రెష్ అయి ర బాబు నేను కాఫీ తెస్తా
వరుణ్ : మరి నాకు
అర్జున్ : చిన్నగా నవ్వి ఓకే ఆంటీ అని లోపలికి వెళ్తాడు
హారిక : వరుణ్ ని చూస్తూ జాగింగ్ ఎలాగో లేదు కనీసం ఫ్రెష్ అయి రా రా వెధవ అంటూ గరిటే చూపిస్తుంది
అంతే వరుణ్ ఫాస్ట్ గా లోపలికి పరిగెడతాడు
అర్జున్ వరుణ్ ఇద్దరు ఫ్రెష్ అయి హల్ లోకి వస్తారు
హారిక ఇద్దరికి కాఫీ ఇచ్చి వరుణ్ తో రేయ్ నవరాత్రులు అయ్యేదాక కాస్త బుద్దిగా ఉండు స్నానం చేయకుండా ఏమైనా తింటే తోలు తీస్తా
వరుణ్ : సరే తల్లి గారు అంటూ నమస్కారం చేస్తాడు
అర్జున్ : ఇద్దరిని చూసి నవ్వుతాడు
వరుణ్ : అమ్మ బంగారం వచ్చిందా
హారిక : నిన్న ఈవెనింగ్ ఏ వచ్చింది మీరు నైట్ లేట్ గా వచ్చారు కదా అందుకే చెప్పలేదు
వరుణ్ : మరి మన రాక్షసి ఎది కనిపించట్లేదు
హారిక : బంగారం రాక్షసి ఈ పేర్లు గానీ అది విన్నదే అనుకో నీ పని అయిపోతది
వరుణ్ : ఆ వింటే చూద్దాంలే
ఆప్పుడే ఎదురుగా ఉన్న మండపం నుండి మైక్ లో శ్రావ్యమైన గొంతుతో ఒక అమ్మాయి అమ్మవారి పైన ఒక పాట పాడుతుంది
ఓం శర్వాని ఓం రుద్రాని ఓం ఆర్యాని వందనం
ఓం కల్యాణి ఓం బ్రాహ్మణి ఓం గీర్వాని వందనం !! ఓం శర్వాని !!
వరుణ్ : రేయ్ అర్జున్ రారా అంటూ అర్జున్ ని లాక్కుని వెళ్తాడు
అర్జున్ ఆల్రెడీ ఆ వాయిస్ కి ఫ్లాట్ అయిపోయి బొమ్మలాగా నిలబడిపోయాడు వరుణ్ లాగేసరికి ఈ లోకంలోకి వస్తాడు ఇద్దరు కలిసి మండపం లోకి వెళ్తారు
పావని జీవ తరని పాప సంతాప హారని ...
మీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని ....
( ఆ అమ్మాయి ఒక్కసారిగా చుట్టూ చూస్తుంది ఎవరో తనని తీక్షణంగా చూస్తున్నారు అనే ఫీలింగ్ తో , చూస్తే మన అర్జున్ తనని రెప్పకూడా వేయకుండా చూస్తున్నాడు )
శాంభవి లోక జనని .. త్రిభువ నానంద కారిని ....
చింత రవ్వంత కనని చిర శాంతి విలసిల్లని .....
శ్రీ చక్రాన అమ్మవై ఉన్న ఆది నారాయని ....
నీ వాత్సల్యమాస్వాదించని మనసుని
ఓం కరుణాక్షి ఓం హరినాక్షి ఓం నలినాక్షి వందనం ....
ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం ......
సాంగ్ పాడేసి అందరికి చిరునవ్వుతో థాంక్స్ చెప్పి వర్శిని దగ్గరికి వస్తుంది
వర్శిని : అబ్బా వదిన నువ్ సూపర్ బంగారం అంటూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది
ఆ అమ్మాయి కి మాత్రం ఇంకా మనసులో అలజడిగా అనిపిస్తుంది
తనకి కాస్త దూరంలో అర్జున్ నిలబడి ప్రేమగా తననే చూస్తున్నాడు
ఆ అమ్మాయి : వర్శిని నాకు కాస్త తలనొప్పిగా ఉంది నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి వర్శి పిలుస్తున్న వినకుండా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది అర్జున్ ని చూస్తూ వెళ్తూ ఎదురుగా ఉన్న అబ్బాయికి డ్యాష్ ఇస్తుంది
తలెత్తి ఎదురుగా చూసేసరికి వరుణ్ కోపంగా చూస్తూ కనిపిస్తాడు
ఆ అమ్మాయి : అది నేను చూసుకోలేదు సొరి
వరుణ్ : హ హ హ ఎందుకే అంత భయం అంటూ తల పైన చేయి వేస్తాడు
అర్జున్ : 🤔🤔🤔 ఆ అమ్మాయి వరుణ్ కి తెలుసా
వరుణ్ : అయిన ఏంటి కంగారు
ఆ అమ్మాయి : అదేం లేదు బావ కాస్త తలనొప్పిగా ఉంది అందుకే బై బావ నేను తర్వాత మాట్లాడతా ప్లీస్
వరుణ్ : అయ్యో అవునా సరే వెళ్లి అమ్మ కి చెప్పి స్ట్రాంగ్ కాఫీ తాగి టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో బంగారం , మా ఫ్రెండ్స్ ని పరిచయం చేద్దాం అనుకున్న నైట్ పరిచయం చేస్తాలే నువ్ వెళ్ళు
ఆ అమ్మాయి : మా బావ బంగారం అంటూ బుగ్గలు లాగి బై చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది
వరుణ్ : అర్జున్ దగ్గరికి వచ్చి తను మా మామ కూతురు ర నీకు పరిచయం చేద్దాం అనుకున్న కాస్త తలనొప్పి గా ఉందట తర్వాత పరిచయం చేస్తా పద మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా అని చెప్పి వర్శిని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి వర్శిని ని పరిచయం చేస్తాడు ,అప్పుడే వరుణ్ గ్యాంగ్ అంత వరుణ్ ని చూసి అక్కడికి వస్తారు అందరికి అర్జున్ ని ఫ్రెండ్ గా పరిచయం చేస్తాడు అందరూ ఫాస్ట్ క్లోస్ అయిపోతారు వర్శి అయితే అన్నయ్య అంటూ వరుణ్ తో సమానంగా అర్జున్ తో ఫ్రీ గా ఉంటుంది అమ్మవారి దగ్గర అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ మొదటి రోజు శ్రీ బాలాత్రిపురసుందరి దేవి ల అమ్మవారు అందరిని దీవిస్తారు కాబట్టి వచ్చే భక్తులకు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు అర్జున్ కూడా వరుణ్ గ్యాంగ్ తో కలిసిపోయి అక్కడే ఉండిపోతాడు
ఇంటికి వెళ్లిన అమ్మాయి వాళ్ళ అత్త ఇచ్చిన కాఫీ తాగి వెళ్లి కళ్ళు ముసుకోగానే అర్జున్ కనిపిస్తాడు తనని తాను చాలా కంట్రోల్ చేసుకుని ఎలాగోలా పడుకుంటుంది
సాయంత్రం
వరుణ్ అమ్మ బంగారం ఎక్కడ లంచ్ కూడా మాతో చేయలేదు ఇంకా తలనొప్పి తగ్గలేదా
హారిక : తగ్గింది అని చెప్పింది బట్ ఎందుకో తెలియదు రూమ్ లోనే ఉంటుంది
వరుణ్ : అగు నేనెల్లి తీసుకొస్తా కాసేపట్లో దాండియా స్టార్ట్ అవుతుంది , అంతేకాదు ఆ మేడమ్ గారు కూడా వస్తారట అంటూ ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్లి ఎత్తుకుని మరీ కిందకి తీసుకొస్తాడు
హారిక : అదేంట్రా దాన్ని అలా ఎత్తుకుని తీసుకువస్తున్నావ్
అర్జున్ : సైలెంట్ గా ఉంటాడు
వరుణ్ : మరి లేకుంటే రమ్మంటే రావట్లేదు అమ్మ అంతేకాదు ఆ తాన్య ఇందాకే పూజ దగ్గరికి వచ్చి దాండియా కి దీన్ని తప్పకుండా రమ్మనమని చెప్పింది
వర్శిని : అమ్మ అన్నయ్య హడావిడి అంత తాన్య వదిన కోసమే
వరుణ్ : రాక్షసి అనుకుంటూ ఆ అమ్మాయి ని చూస్తూ హిమ తను అర్జున్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం కలిసే వర్క్ చేస్తాం అంటూ అర్జున్ ని చూపిస్తాడు
హిమ : అప్పటిదాకా వరుణ్ ని వర్శిని ని నవ్వుతూ చూస్తున్నది కాస్త వరుణ్ అలా పరిచయం చేయగానే అర్జున్ వైపు చూస్తోంది
అర్జున్ : నవ్వుతూ హాయ్ హిమ
హిమ : కాస్త తడబడుతు హాయ్ అని చెప్పి అత్త నేను ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతుంది
వరుణ్ : అమ్మ ఎం అయిందే దీనికి ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తుంది
హారిక : ఏమో ర అన్నయ్య కూడా అదే చెప్పాడు ఈ మధ్య చాలా డల్ గా ఉంటుంది అని , నువ్ వస్తున్నావ్ అని ఇక్కడికి పంపించాడు
వరుణ్ : ఓకే నేను చూసుకుంటాలే
వర్శిని : అన్నయ్య నాకెందుకో మన హిమ బేబీ ఎవర్ని అయిన లవ్ చేస్తుందేమో అనిపిస్తుంది ర
హారిక : తను అలా చేయడు గాని నీ వయసుకి మించిన ఆలోచనలు మానేసి నువ్ కూడా వెళ్లి రెడి అవు ఆ ఇప్పుడే చెప్తున్నా పిచ్చిపిచ్చి డ్రెస్ లు వేస్తే తాట తీస్తా పద్దతిగా రెడి అవు
వర్శిని : 🙄🙄🙄
కాసేపటికి హిమ వర్శిని ఇద్దరు లెహాంగా వేసుకుని సింపుల్ గా రెడి అయి వస్తారు
అర్జున్ హిమ ని చూస్తూ ఉండిపోతాడు
హిమ కి చాలా అలజడిగా అనిపిస్తుంది
తాన్య : హిమ హిమ ఎక్కడున్నావ్ అంటూ వస్తూ వరుణ్ ని డ్యాష్ ఇస్తుంది
వరుణ్ : అబ్బా చంపేసింది రాక్షసి అంటూ తాన్య తల పైన మొట్టికాయ వేస్తాడు
తాన్య : రేయ్ ఇలా కొడితే నిన్ను పెళ్లిచేసుకొను
వరుణ్ : నువ్ చేసుకోకే నేనే తాళి కడతా నీ మెడలో
తాన్య : ఏంట్రా బెంగుళూర్ వెళ్ళాక బాగా బలుపు పెరిగినట్లుంది
వరుణ్ : హ అవునే నీకు సరిపోవాలి కదా అందుకే నేను కూడా పెంచుకుంటున్న
హారిక : అబ్బాబ్బా ఒక్క నిమిషం కూడా గొడవ పడకుండా ఉండలేరా
హిమ : నవ్వుతూ అత్త అదంతా అబద్ధం , మనముందు జస్ట్ అలా గొడవ పడతారు అంతే , వీళ్ళు యాక్టింగ్ లో ఆస్కార్ ని మించిపోతారు
హరిక : అంతే అంటావా తల్లి
వర్శిని : అంతే అమ్మ
అర్జున్ : మాత్రం నవ్వుతున్న హిమ ని చూస్తాడు
అర్జున్ ని హిమ ని చూడకముందే తన వాయిస్ వినే ఎదో తెలియని అలజడి గా అనిపోయించి మనసులో హాయిగా ఉంటుంది , హిమ ని చూసాక తనే ఇక లైఫ్ అనే ఫీలింగ్ హార్ట్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది తన అందమైన గొంతు లాగే తన రూపం కూడా చాలా అందంగా ఉంది , అమాయకత్వం , బెదురుగా చూసే ఆ కళ్ళు అన్ని బాగా నచ్చేసాయి , వరుణ్ తో అంత క్లోస్ గా ఉంటే కాస్త జలస్ గా ఫీల్ అయిన వరుణ్ తనే హిమ అని చెప్పేసరికి హ్యాపీ గా ఫీల్ అవుతాడు.ఎందుకంటే వరుణ్ వర్శిని హిమ ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తాడు అని తన మాటలని బట్టి అర్జున్ కి అర్థం అయింది
తాన్య వర్శిని హిమ ముగ్గురు కలిసి బయటకి వచ్చి అమ్మవారి మండపం ముందు అరేంజ్ చేసిన ప్లేస్ లో అందరితో కలిసి దాండియా ఆడుతున్నారు
వాళ్ళు కనిపించేలా ఒక దగ్గర కూర్చుని వరుణ్ అర్జున్ అండ్ గ్యాంగ్ అంత కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు
వరుణ్ తాన్య కి , అర్జున్ హిమ కి సైట్ కొట్టుకుంటున్నారు
అర్జున్ చాలా హ్యాండ్సమ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వార్డ్ ఫేస్ పైన ఎప్పుడు చిరునవ్వు మెయింటెన్ చేస్తాడు బట్ కోపం వస్తే ఎదుటి వాడి పని అంతే , తనని ఆపడం ఎవరి వల్ల కాదు
హిమ కి అర్జున్ చూపులు చాలా ఎక్కడ ఉన్న తెలిసిపోతున్నాయి ఆ చూపుల్లో ఎదో తెలియని హాయి ప్రేమ అన్ని కలగలిపి ఉన్నాయి , అతని మనసులోని భావాలు హిమ కి అర్థం అవుతున్నాయి కానీ వాటిని ఒప్పుకునే పరిస్థితిలో తను లేదు
అర్జున్ కి హిమ బిహేవియర్ చూస్తుంటే తన పైన హిమ కి ఫీలింగ్స్ ఉన్నాయి అని అర్థం అవుతుంది , తనలాగే హిమ కూడా చూడగానే తనపైన ఇష్టం పెంచుకుంది అని తెలుస్తున్న , తను ఎందుకో భయపడుతుంది తన నుండి తప్పించుకోవాలి అని చూస్తుంది అని అర్జున్ కి బాగా అర్థం అవుతుంది
హిమ అందరితో కలిసి చాలాసేపు దాండియా ఆడి అలసిపోయి నైట్ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు
డైలీ ఇంతే అర్జున్ చూపులతోనే తన భావాలను హిమ కి తెలియజేస్తూ ఉండడం.హిమ కి అంత అర్థం అయిన సైలెంట్ గా ఉండడం
ఒకరోజు హిమ ఇంట్లో ఒక్కతే ఉంది ఆ రోజు అందరూ మండపం దగ్గర అన్నదానం ఉంటే అక్కడే ఉండిపోయారు , హిమ కాస్త టైర్డ్ గా ఉందని ఇంటికి వచ్చేస్తుంది
హిమ వెళ్ళాక అర్జున్ కూడా వరుణ్ కి అర్జెంట్ మెయిల్ చేయాలి అని చెప్పి ఇంటికి వస్తాడు
రూమ్ లో అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కబోర్డు ఓపెన్ చేస్తున్న హిమ ని వెనక నుండి హూగ్ చేసుకుంటాడు
హిమ అర్జున్ అలా సడెన్ గా రావడం హూగ్ చేసుకోవడం వల్ల షాక్ అవుతుంది అర్జున్ కౌగిలిలో చాలా హాయిగా ఉన్న , ఇంకాసేపు అలానే ఎక్కడ తనకి సొంతం అవుతానో అని భయంతో బలవంతంగా అర్జున్ నుండి విడిపించుకోవాలి అని చూస్తుంది
హిమ ఎంత ట్రై చేస్తుంటే అర్జున్ అంత గట్టిగా హత్తుకుంటున్నాడు
హిమ : ప్లీస్ వదలండి
అర్జున్ : నో
హిమ : మీరు ఇలా చేయటం ఎం బాలేదు , ఎవరైనా వస్తారు వదలండి
అర్జున్ : ఎవరు చూడకపోతే ఓకే నా బంగారం
హిమ : సైలెంట్
అర్జున్ : రోజు నా పేరు మీద అమ్మవారికి స్పెషల్ గా పూజ ఎందుకు చేయిస్తున్నావ్ , నేను కనిపించేదాక నాకోసం వెతికే నీ కళ్ళు , నేను కనపడగానే పక్కకి ఎందుకు చూస్తాయి.నన్ను చూసి నా కళ్ళల్లోకి చూసి ఎందుకు మాట్లాడలేకపోతున్నావ్.నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావ్
హిమ : సైలెంట్
అర్జున్ : ఈ మౌనం తో నన్ను టార్చర్ చేయకు , నీ కళ్ళల్లో నా పైన అమితమైన ప్రేమ కనిపిస్తుంది , దాన్ని దాచాలని నువ్ నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావ్ , నిన్ను చూసినప్పుడు నా మనసుకి ఎలాంటి ఫీలింగ్ కలిగిందో , నీక్కూడా అలానే అనిపించింది అని నాకు తెలుసు
హిమ : సైలెంట్
అర్జున్ : ఇప్పటికి నోరు తెరవవా , నీ మౌనం దాటి నీ మనసు లో నాపై దాగి ఉన్న ప్రేమ బయటకి రాదా
హిమ : చాలా కంట్రోల్ చేసుకుంటుంది , ఒక్కసారి భయటపడితే అర్జున్ తనని వదలడు అని తన ప్రేమ ని నిస్సహాయత ని బయటకి కనిపించకుండా ఆ మౌనం లోనే తన మనసుని అణిచేస్తుంది
అర్జున్ : హిమ ని తన వైపుకి తిప్పుకుని ఓకే ఫైన్ ఎంత అడిగిన నువ్ నిజం చెప్పవ్ కదా బట్ నాకు తెలుసు నీకు నేనంటే చాలా ప్రేమ ఉందని
హిమ : అర్జున్ వైపు చూస్తోంది
అర్జున్ : ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకోకు నీ మొబైల్ లో నా ఫిక్స్ తీయడం నేను చూసా , నీకు తెలియకుండా చెక్ చేసా , నా ఫొటోస్ తీయడమే కాదు వాటితో నీ ఫొటోస్ యాడ్ చేసి చాలా సేఫ్ గా దాచుకున్నావ్ కదా
హిమ : మనసులో ఫుల్ గా తిట్టుకుంటుంది కేర్ఫుల్ గా ఉండనందుకు
అర్జున్ : తిత్తుకివడం ఆపు బుజ్జి ప్లీస్ ఏ నీ నోటితో చెప్తే వినాలని ఉంది , నువ్ నన్ను లవ్ చేస్తున్నావ్ కదా , నేను చెప్పేస్తున్న ఐ లవ్ యూ బంగారం నిన్ను చూడకముందే నీ వాయిస్ వినగానే నేను ఔట్ అయిపోయా ఇక నిన్ను చూసాక నువ్వే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యా , ఈ అర్జున్ కాస్త హిమార్జున్ అయిపోయాడు బంగారం అంటూ నవ్వుతూ హిమ పెదవులను అందుకుంటాడు
హిమ అర్జున్ చేసిన పని షాక్ లో ఉండి తేరుకున్న వెంటనే అర్జున్ ని తోసేస్తూ ఉంటుంది బట్ అర్జున్ ఇంకా దగ్గరికి లాక్కుంటూ తన ప్రేమని తెలుపుతూ ఉంటాడు , హిమ ఇక కంట్రోల్ చేసుకోలేక అర్జున్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుని కిస్ చేస్తూ ఉంటుంది ఎంతలా అంటే అర్జున్ ఆపిన హిమ ఆపట్లేదు , అర్జున్ కి చాలా హ్యాపీ గా ఉంటుంది హిమ కి తనపైన చాలా ప్రేమ ఉందని తెలిసాక , హిమ కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూనే ఉంటాయి ఊపిరి ఆడకున్న అర్జున్ ని వదలట్లేదు వదిలితే ఇంకెప్పుడు ఇలా ఇంత దగ్గరగా తనని చూడలేను అని భయం
అర్జున్ : బలవంతంగా హిమ ని విడిపించి హూగ్ చేసుకుని ఎందుకే ఇంత ప్రేమ పెట్టుకుని ఇలా చేస్తున్నావ్ నిన్ను చూసిన మొదటి క్షణమే నాకు అర్థం అయింది మనం ఒకరికోసం ఒకరం పుట్టాం అని , నువ్ కూడా అలానే ఫీల్ అయ్యావ్ అని , అయిన నువ్ ఒప్పుకోవట్లేదు కావాలనే నీ ఫీలింగ్స్ ని నీలో నువ్వే దాచేస్తున్నావ్ , ప్రాబ్లమ్ ఏంటి బంగారం , నాతో చెప్పు అది ఎవరైనా సరే నేను చూసుకుంటా
హిమ : అర్జున్ ని తోసేసి వెళ్లిపో ప్లీస్ అని చెప్పి దండం పెట్టి బ్రతిమిలాడుతుంది
అర్జున్ : హిమ ప్లీస్ అసలు నీ ప్రాబ్లమ్ ఏంట్రా నాతో చెపొచ్చు కదా
హిమ : మాట్లాడేలోపు మొబైల్ రింగ్ అవుతుంది చూస్తే వాళ్ళ అమ్మ
పద్మ : హలో హిమ
హిమ : హ అమ్మ ఎలా ఉన్నావ్
పద్మ : మేము బాగానే ఉన్నాం నువ్ ఎలా ఉన్నావ్
హిమ : హ బాగున్నా అమ్మ
పద్మ : జాగ్రత్తగా ఉండు , నేను చెప్పిన విషయాలు మైండ్ లో పెట్టుకుని అక్కడ ఉన్నన్ని రోజులు మాట తీసుకురాకుండా నడుచుకో
హిమ : హ సరే అమ్మ
పద్మ : సరే బై
హిమ : బై అమ్మ
హిమ : అర్జున్ ని చూసి మీరు వెళ్తే నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి ప్లీస్
అర్జున్ : కోపం అసహనం బాధ అన్ని ఫీలింగ్స్ వస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోతాడు
హిమ డోర్ వేసేసి అక్కడే డోర్ కి ఆనుకుని కూర్చుని మోకాళ్లపైన తల పెట్టుకుని ఏడుస్తుంది అలానే తనకే తెలియకుండా అక్కడే కింద పడుకుండిపోతుంది
ఈవెనింగ్ వర్శిని వచ్చి డోర్ కొడితే మెలకువవచ్చి డోర్ తీస్తుంది
వర్శిని : వదిన డ్రెస్ అయి వచ్చెయ్ దాండియా స్టార్ట్ చేస్తున్నారు
హిమ : లేదు ర నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఆడండి
వర్శిని : అదేం కుదరదు నువ్ వస్తేనే మేము వెళ్తాము , ఆల్రెడీ తాన్య వెయిటింగ్ నువ్ ఫాస్ట్ గ రెడీ అవ్వు ప్లీస్
హిమ : ఇక వర్శిని వినదు అని తప్పక వెళ్లి ఫ్రెష్ అయి డ్రెస్ చెంజ్ చేసుకుని వస్తుంది
దాండియా ఆడుతున్న హిమ ఫేస్ లో కాస్త కూడా నవ్వు లేదు ఒక బొమ్మ లాగా ఆడుతుంది
అర్జున్ మాత్రం హిమ ని చూస్తూ ఉంటాడు
నైట్ ఎదో కాస్త తినేసి వెళ్తుంటే వరుణ్ ఆపి అందరం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని హిమ వద్దు అంటున్న తనని కూడా టెర్రస్ పైకి లాక్కుని వెళ్తాడు
పైన వర్శిని హిమ అర్జున్ తాన్య వరుణ్ ఉంటారు , తాన్య ఆ రోజు అక్కడే ఉంటా అని ఇంట్లో చెప్పేసి వస్తుంది
వర్శిని : అబ్బా ఎన్ని రోజులు అయింది అన్నయ్య మనం ఇలా హ్యాపీ గా కబుర్లు చెప్పుకుని , టైం స్పెండ్ చేసి , నువ్ వచ్చినప్పుడు మనం ముగ్గురం కలుస్తున్న హిమ వదిన నే ఈ మధ్య మనతో సరిగ్గా ఉండట్లేదు
తాన్య : అవును చాలా ఇయర్స్ అయింది హిమ మనతో సరదాగా ఉండి
వరుణ్ : హిమ ఏమైనా ప్రాబ్లమ్ ఆ ర , నాతో కూడా చెప్పవా
హిమ : అబ్బా బావ నాకేం ప్రాబ్లమ్ ఉంటది చెప్పు ఆమ్ సో హ్యాపీ అంటుంది
హిమ అలా అనగానే అర్జున్ హిమ ని చూస్తాడు
హిమ అర్జున్ చూపు ని తట్టుకోలేక ఫేస్ తిప్పేస్తుంది
వర్శిని : అబ్బా వెధర్ ఎంత సూపర్ గా ఉంది హిమ వదిన ఒక మంచి సాంగ్ పాడవా ప్లీస్
హిమ : ఇప్పుడా వద్దు ర
వర్శిని : ప్లీస్ ప్లీస్ రేయ్ అన్నయ్య నువ్ అయిన అడుగు తాన్య వదిన అర్జున్ అన్నయ్య అడగండి
తాన్య : పాడు బుజ్జి ప్లీస్
వరుణ్ : నువ్ ఎవరినైనా లవ్ చేశావ్ అనుకో అతనికోసం ఎంత ప్రేమగా పాడతావో అలా ఒక మంచి సాంగ్ పాడు ర
హిమ : షాక్ అయి చూస్తుంది
వరుణ్ : ఈ వెధర్ లో అలాంటి సాంగ్ వినడానికి బాగుంటాయి ర ప్లీస్ నాకోసం
హిమ : అర్జున్ వైపు చూస్తుంది అదే ప్రేమ ఆ కళ్ళల్లో తనపైన అంతులేని ప్రేమ , తను దూరంగా ఉంటుందని బాధ కనిపిస్తున్నాయి
ఉండిపోతారా,
గుండె నీదేరా
హత్తుకుంటారా,
నిన్ను మనసారా
కలతై కనులేవెతికేరా నీకై
ఒదిగే తనువేజత లేక తోడై
చుట్టూ నావెంటేఎంతో మంది ఉన్నా
నా నువ్వే లేవని యాతనా
కరిగే కన్నీరే
పడుతూనే ఉందే
అర్థం కాలేని వేదన
చూస్తూ చూస్తూనే మాయగా
నువ్వే మారావు శ్వసగా
మది నిను మరువనని
మాటే ఇచ్చేనులే
మరువక కడదాకా ఉండరా
మౌనం చేసే గాయం
మార్చలేదా సాగే కాలం
నన్నేమన్నా ఏమనుకున్న
నువ్ లేకుంటే చీకటే
ఉండిపోతారా, గుండె నీదేరాహత్తుకుంటారా, నిన్ను మనసారా
అంటూ పాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది
అర్జున్ కళ్ళలో నీళ్ళు
వరుణ్ : ఏంట్రా ఇది
అర్జున్ : ఎం లేదు ఎదో పడింది అంతే
వరుణ్ : నేను అంత విన్నాను ర
అర్జున్ : వరుణ్ ని హూగ్ చేసుకుని నాకు అదంటే ప్రాణం ర అసలు ఇంత తక్కువ టైం లో ఇంత ప్రేమలో పడిపోతా అని ఎప్పుడు అనుకోలేదు , తను నాకు దూరం అయితే నేను తట్టుకోలేను ర
తాన్య : అర్జున్ ప్లీస్ కంట్రోల్ అవ్వు మేమంతా ఉన్నాం కదా అంటూ అర్జున్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు
హిమ : రూమ్ లోకి వెళ్లి డైరెక్ట్ గా బాత్రూం లోకి వెళ్లి షవర్ ఆన్ చేసి దాని కింద కూర్చుని ఫుల్ గా ఏడుస్తుంది
అలా ఆ రోజు అందరికి భారంగా గడుస్తుంది
నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ వరుణ్ జాగింగ్ కి వెళ్తుంటారు
వరుణ్ : నీకు హిమ గురించి కొన్ని చెప్పాలి ర
అర్జున్ : వరుణ్ ని చూస్తూ ఏంట్రా
వరుణ్ : హిమ వాళ్ళ డాడ్ మా అమ్మ అన్నాచెల్లెళ్ళు , మామయ్య కాలేజ్ లో ఉన్నప్పుడే పద్మ అత్తయ్య ని లవ్ చేసి అందరిని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు.మామయ్య కి అమ్మ అంటే చాలా ఇష్టం అందుకే ఇద్దరు పక్క పక్క ఇళ్ళల్లోనే ఉండేవాళ్ళు.మామయ్య కి కోపం ఎక్కువ బట్ నమ్మిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అవి నచ్చే అత్తయ్య మామయ్య ని లవ్ చేసింది , బట్ పెళ్లి అయ్యి హిమ పుట్టాక అవే అత్తయ్య కి నచ్చలేదు.ఆ విషయంలో ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళు , వాళ్ళని గోడవల్ని చూస్తూనే హిమ పెరిగింది చిన్న వయస్సులో అవన్నీ తనకి తెలియలేదు ఎప్పుడు మాతో కలిసి మా ఇంట్లో సరదాగా ఉండేది.నేను హిమ తాన్య ముగ్గురం బాగా క్లోస్ గా ఉండేవాళ్ళం , సడెన్ గా ఒకరోజు మామయ్య వేరే ఇల్లు తీసుకున్నాం అక్కడికి వెళ్తున్నాం అన్నారు పాపం హిమ చాలా ఏడ్చింది.వాళ్ళు వెళ్ళాక మాకు అర్థం అయింది మామయ్య అత్తయ్య మధ్య గొడవలు మాకు తెలిసి మేము బాధపడకూడదు అని మామయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని , బట్ ప్రతి హాలిడేస్ కి హిమ మా దగ్గరికి వచ్చేది మాతో ఉన్నన్ని రోజులు కాస్త హ్యాపీ గా ఉండేది. అలాంటి టైం లోనే మాకు వర్శిత రోడ్ పైన ఏడుస్తూ కనిపించింది ఎవరు అని అడిగితే తనకి ఎవరు లేరని తన పేరెంట్స్ చనిపోతే బంధువులు ఈ ఊరు తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు అని ఎక్కడికి వెళ్లాలో తెలియదు అని ఏడుస్తూ చెప్పింది , అప్పుడు తన వయసు 10ఇయర్స్.హిమ ని వర్శిని ని మాతో మా ఇంటికి తీసుకువచ్చి అమ్మ నాన్న ల ముందు నిలబెట్టి మీకు కూతురు లేదు అని ఎప్పుడు బాధపడేవాళ్ళు కదా అత్త , ఈ రోజు నుండి తనే మీ కూతురు అని చెప్పింది.ఆ క్షణం నుండి వర్శిని మా ఇంటి బిడ్డ గా మారిపోయింది. మా పేరెంట్స్ కి హిమ కూడా కూతురితో సమానం , మేము వరసకి బావమారదళ్లము మాత్రమే అన్నాచెల్లెళ్ళ ఉంటాం , మా అమ్మ వాళ్ళు కూడా అలానే చూసేవాళ్ళు. మా మామయ్యా ఈ మధ్య అమ్మ కి కాల్ చేసి హిమ చాలా డల్ గా ఉంటుంది అని చెప్పారట నేను కూడా పండగ కి ఇక్కడికి వస్తున్న అని హిమ ని ఇక్కడికి పంపించమని అమ్మ మామయ్య ని అడిగింది.హిమ వచ్చినప్పటి నుండి తనని నేను గమణిస్తునే ఉన్నా తను ముబడు ఉన్న హిమ కాదు చాలా మారిపోయింది ర , అదేంటో మనం తెలుసుకోవాలి అది నిన్ను చాలా ప్రేమిస్తుంది ర ఆ విషయం నాకు ముందే అర్థం అయింది , ఎం జరిగిన నువ్ మా హిమ చేయి వదిలిపెట్టవు కదా , పాపం ర అది పిచ్చిది అందరి గురించి ఆలోచిస్తుంది తన గురించి తప్ప నువ్వే తనకి జీవుతాంతం తోడుగా ఉంటూ నీ ప్రేమని తనకి పంచాలి తను బాధపడకుండా చూసుకోవాలి
అర్జున్ : నువ్ అంతలా చెప్పాలా అది నన్ను వదిలేసిన నేను దాన్ని అసలు వదలను నువ్ వర్రీ అవకు
వరుణ్ : థాంక్స్ ర అంటూ హూగ్ చేసుకుంటాడు
అర్జున్ : మనలో మనకి థాంక్స్ ఏంట్రా ఇడియట్
ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు
హారిక : రేయ్ రేపు హిమ వెళ్లిపోతుందట ర , అసలు ఏమైనా కనుకున్నావా
వరుణ్ : అవునా నేను చూసుకుంటాలే అని అర్జున్ హిమ ల గురించి చెప్తాడు , అది విన్నాక హారిక చాలా హ్యాపీ గా ఫీల్ అవుతుంది అర్జుజ్ ని హూగ్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా హిమ కి నీలాంటి వాడు భర్తగా వస్తాడు అంటే నాకు అంత కంటే ఇంకేం కావాలి , ఇక హిమ గురించి నాకు ఎలాంటి టెన్షన్ లేదు అంటుంది
అర్జున్ వరుణ్ నవ్వుకుంటారు
మార్నింగ్ అందరూ కలిసి టిఫిన్ చేసి అమ్మవారి మండపం దగ్గరికి వెళ్తారు , ఆ రోజే నవరాత్రులలో చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం లో అందరికి తన ఆశిస్సులు అందిస్తుంది
పూజలు ఊరేగింపు అన్ని కార్యక్రమాలు అయేసరికి చీకటి పడుతుంది
హిమ : నేను వర్శిని తాన్య ఈ రోజు పక్కింట్లో పడుకుంటాము ప్లీస్
హారిక : ఇష్టం లేకపోయినా సరే అంటుంది
నిమజ్జనం అంత ఐపోయాక అర్జున్ వరుణ్ ఇంటికి వస్తారు , హిమ కోసం అర్జున్ కళ్ళు వెతుకుతూ ఉంటే హారిక ఇద్దరికి విషయం చెప్తుంది
అర్జున్ వరుణ్ ఇద్దరు హిమ వాళ్ళ పాత ఇంటికి వెళ్తారు
తాన్య డోర్ తీస్తుంది హిమ గురించి అడిగితే టెర్రస్ పైన ఉంది అని చూపిస్తుంది
వరుణ్ : అర్జున్ నువ్ సైలెంట్ గా కాస్త దూరంగా ఉండు నేను హిమ తో మాట్లాడతా అని చెప్పి పైకి వెళ్తారు తాన్య కూడా వాళ్ళతో వెళ్తుంది , తాన్య అర్జున్ హిమ కి కనపడకుండా చాటుగా నిలబడి ఎం మాట్లాడతారా అని వింటూ ఉంటారు
వరుణ్ : హిమ
హిమ : హాయ్ బావ నిమజ్జనం అయిపోయిందా , బాగా జరిగిందా
వరుణ్ : హ అంత బాగా జరిగింది నువ్ ఏంటి ఇక్కడ అయిన ఈ ఇంటికి వచ్చావు ఏంట్రా
హిమ : ఎందుకో రావాలి అనిపించింది బావ , మళ్ళీ వస్తానో లేదో కదా
వరుణ్ : ఏంటి
హిమ : ఎం లేదు బావ
వరుణ్ : నిన్ను ఒక విషయం అడుగుతా నిజం చెప్తావా
హిమ : నా దగ్గర పర్మిషన్ అడగడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశావ్ బావ , హ్మ్ ఓకే అడుగు నీకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఇప్పుడు కూడా నిజమే చెప్తా
వరుణ్ : అర్జున్ పైన నీ ఒపీనియన్ ఏంట్రా
హిమ : బావ
వరుణ్ : ప్లీస్ నీకు అనిపించింది చెప్పు అర్జున్ ని నాకు బాగా తెలిసిన ఒక అమ్మాయి పాపం చాలా డీప్ గా లవ్ చేస్తుంది
హిమ : కళ్ళల్లో నీళ్ళు
వరుణ్ : చెప్పు హిమ నువ్ కూడా ఒక అమ్మాయివి కదా అర్జున్ ని చూస్తే నీకు ఎం అనిపించింది మంచివాడేనా
హిమ : అయ్యో బావ అర్జున్ లాంటి పర్సన్ రావాలి అంటే ఆ అమ్మాయి చాలా పుణ్యం చేసుకుని ఉండాలి బావ , చాలా మంచివాడు బంధాలకి స్నేహానికి చాలా విలువ ఇస్తాడు , పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తాడు , తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్తాడు , తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు , మా నాన్న లో నేను చూసిన చాలా లక్షణాలు అర్జుజ్ లో కూడా చూసా బావ అందుకే తనంటే నాకు
వరుణ్ : హా నీకు
హిమ : మంచి ఒపీనియన్ ఉంది బావ
వరుణ్ : అంతే నా
హిమ : హ అంతే బావ ఇంకేం లేదు
వరుణ్ : నిజంగా అంతేనా , ఏది ఆ మాట నన్ను చూస్తూ చెప్పు అంటూ తన తల పైన హిమ చేయి పెట్టి ఇప్పుడు చెప్పు
హిమ : బావ ఎం చేస్తున్నావ్
వరుణ్ : నాకు నిజం కావాలి హిమ నీకు అర్జున్ అంటే ఇష్టం కదా
హిమ : కళ్ళ నిండా నీళ్లతో వరుణ్ ని హూగ్ చేసుకుని చాలా ఇష్టం బావ, వాడంటే పిచ్చి
వరుణ్ : మరి ఎందుకే వాడికి చెప్పట్లేదు
హిమ : సైలెంట్
వరుణ్ : చెప్పు మా , మా బంగారం కదా
హిమ : ముందు నువ్ నాకు ప్రామిస్ చెయ్
వరుణ్ : ఏంటి
హిమ : ముందు చెయ్
ఓకే అంటూ హిమ చేతిలో చేయి వేస్తాడు
హిమ : ఒకటి ఇప్పుడునేను చెప్పే విషయం మన మధ్య నే ఉండాలి అండ్ నేను ఎం చెప్పిన నువ్ అసలు కోపం తెచ్చుకోకూడదు ఎవర్ని ఎం అనకూడదు
వరుణ్ ఒకసారి అర్జున్ ని చూసి ఓకే అంటాడు
హిమ : బావ నేను అర్జున్ ని చూడగానే ఇష్టపడ్డా ఆ రోజు కళ్ళు మూసుకుని సాంగ్ పాడుతుంటే అర్జున్ చూపులు నన్ను చాలా డిస్టర్బ్ చేసాయి , అప్పుడు చూసా అర్జున్ ని , చూడగానే అతడి కళ్ళల్లో ప్రేమ కనిపించింది , నా మనసు అతనికి దగ్గరగా వెళ్ళమని నాకు చెప్పినట్లుగా అనిపించింది , నాకే తెలియకుండా అర్జుజ్ ని లవ్ చేసా , ఎంత అంటే తను లేకపోతే ఉండలేనేమో అనెంతగా
వరుణ్ : మరి ఇంత మంచి న్యూస్ ఎందుకు నీలోనే దాచుకున్నావ్ , వాడికి చెప్తే చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యేవాడు కదా
హిమ : నాకు ఆ అదృష్టం లేదు అన్నయ్య అంటూ తన మొబైల్ తీసి ఏవో ఓపెన్ చేసి వరుణ్ చేతికి ఇచ్చి , కోప్పడను అని నాకు మాట ఇచ్చావ్ అని వాటిని చూడమని చెప్తుంది
వరుణ్ : మొబైల్ ని చూస్తూ ఉండగా తన ఫేస్ అంత కోపంగా ఎర్రగా మారిపోతుంది
అర్జున్ : వరుణ్ కి సైగ చేస్తాడు
వరుణ్ హిమ చూడకుండా అర్జున్ కి అవి షేర్ చేస్తాడు
అవి చూసి అర్జున్ కి కూడా చాలా కోపం వస్తుంది
తాన్య అర్జున్ చేయి పట్టుకుని ఆపుతుంది
వరుణ్ : కోపంగా వాడికి ఎంత ధైర్యం ఉంటే నీకు ఇలాంటి చెత్త మెసేజ్ లు ఫొటోస్ పంపిస్తాడు
హిమ : ఎందుకంటే వాడు నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు
వరుణ్ : వాట్ అని గట్టిగా అరుస్తాడు
అర్జున్ తాన్య షాక్ అయి చూస్తారు
హిమ కింద కూలబడి ఏడుస్తుంది
వరుణ్ : హిమ అలా ఏడవడం చూసి కోపం కంట్రోల్ చేసుకుంటూ పక్కన కూర్చుని ఎం అయింది ర వాడు నిన్ను పెళ్లి చేసుకోబోవడం ఏంటి , మామయ్య ఎలా ఒప్పుకున్నాడు , అసలు ముందు నువ్ ఎలా ఒప్పుకున్నావ్ , వాడు ఏమైనా బెదిరించాడా
హిమ : నాన్న కి ఇంకా తెలియదు
వరుణ్ : వాట్ మామయ్య కి తెలియదా , మరి పెళ్లి ఏంటి ఎవరు డిసైడ్ చేశారు
హిమ : అమ్మ
వరుణ్ : అత్త న
హిమ : హ అవును బావ అమ్మ నే , సడెన్ గా ఒకరోజు డాడ్ లేనపుడు నా దగ్గరికి వచ్చింది
పద్మ : నీకు ప్రకాష్ కి పెళ్లి ఫిక్స్ చేసా , నువ్ ప్రకాష్ ని పెళ్లి చేసుకోవాలి కాదు అంటే నా శవాన్ని చూస్తావ్
హిమ : అమ్మ వాడు మంచివాడు కాదు , నేను వాడిని పెళ్లి చేసుకోను అమ్మ ప్లీస్
పద్మ : నువ్ ఎన్ని చెప్పిన నేను వాళ్ళకి ప్రామిస్ చేసా , ఈ విషయం మీ నాన్న కే కాదు ఎవరికి చెప్పిన , నువ్ ఈ పెళ్లి చేసుకోకపోయిన నేను చావడం ఖాయం
హిమ : అమ్మ 😭😭😭
పద్మ : అంతే కాదు నువ్ ఈ పెళ్లి చేసుకుంటే నేను మీ నాన్న తో ఎప్పుడు గొడవ పడకుండా ప్రేమగా ఉంటాను , మేము ఇద్దరం కలవాలి అన్నా , నేను ప్రాణాలతో ఉండాలి అన్నా అది నీ చేతిలోనే ఉంది , నీ ఎక్సామ్స్ అయ్యాక మంచి రోజు చూసుకుని మీ డాడ్ కి నేనే విషయం చెప్తా అప్పటిదాకా నువ్ సైలెంట్ గా ఉండు , నీకు ముందుగా ఎందుజు చెప్తున్నా అంటే పెళ్లి కి నువ్ మెంటల్ గా ప్రిపేర్ అవుతావు అని చెప్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది
హిమ : ఏడుస్తూనే కూలబడిపోతుంది
జరిగింది చెప్పి వరుణ్ ని పట్టుకుని ఏడుస్తుంది
వరుణ్ : కూడా బాధపడుతాడు , అసలు ఆ ప్రకాష్ గాడు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నాడు
హిమ : అది గీత అక్క పెళ్లి లో వాడు బాగా తాగి నాతో తప్పుగా బిహేవ్ చేయబోయాడు నన్ను నేను సేవ్ చేసుకోవడానికి వాడిని కొట్టాను అందుకే వాడు నన్ను పెళ్లి చేసుకుని నా పైన రివెంజ్ తీర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు , ఈ విషయం వాడే చెప్పాడు , అప్పటి నుండి నా గురించి ఇలా చెత్తగా కామెంట్ చేస్తూ , అసభ్యంగా ఉండే ఫొటోస్ పంపిస్తూ మన పెళ్లి అయ్యాక నీ లైఫ్ ఇలానే ఉంటుంది అంటూ పిచ్చి పిచ్చి గా వాగుతున్నాడు
వరుణ్ : ఫుల్ కోపం వస్తుంది హిమ ని హూగ్ చేసుకుని ఎందుకే నాకు చెప్పకుండా ఒక్కదానివే బాధపడుతున్నావ్
హిమ : నీకు చెప్పాలి అని ఒకసారి ట్రై చేసా బావ అది అమ్మ కి తెలిసి నా ముందే హ్యాండ్ కట్ చేసుకుంది , అందుకే ఎవరికి ఎం చెప్పకుండా మౌనంగా ఉండిపోయా
వరుణ్ : అంటే వాడిని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యావా
హిమ : నో , అసలు నాలో ఊపిరి ఉంటే కదా బావ వాడు నన్ను పెళ్లి చేసుకునేది అంటూ కళ్ళు తిరుగుతూ వరుణ్ భుజం పైన పడిపోతుంది
వరుణ్ : హిమ హిమ లేవే ఎం అయింది అంటూ చెంపల పైన కొడుతుంటాడు
అర్జున్ : పరిగెత్తుకుంటూ వస్తాడు
హిమ : మెల్లగా చూస్తూ బావ రేపు ఇక్కడి నుబడి వెళ్ళాక వాడు నన్ను తన సొంతం చేసుకోవాలి అని ప్లాన్ వేసాడు అందుకే ఈ రోజే నేను పుట్టిన ఈ ఇంట్లోనే నా ప్రాణం పోవాలి అని ఇలా చేసా బావ ( నోటి నుండి బ్లడ్ వస్తుంది )
అర్జున్ : హిమ ని తన ఒడిలోకి తీసుకుని ఒసేయ్ మెంటల్ ఎం చేసావే అంటూ ఏడుస్తాడు
తాన్య : వరుణ్ ఫాస్ట్ గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి పదండి
అర్జున్ హిమ ని ఎత్తుకుని కిందకి పరిగెత్తుతాడు
వరుణ్ ఫాస్ట్ గా అర్జున్ కంటే ముందే వెళ్లి కార్ తీస్తాడు
తాన్య వర్శిని ని లేపి ఇంటికి వెళ్ళమని చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్తుంది
అర్జున్ హిమ ని పడుకోపెట్టి తను కూర్చుని హిమ తల ని తన ఒడిలో పెట్టుకుంటాడు
వరుణ్ డ్రైవ్ చేస్తుంటే తాన్య వరుణ్ పక్కన కూర్చుంటుంది
అర్జున్ : ఏడుస్తూ హిమ హిమ అంటూ పిలుస్తాడు
హిమ : అర్జున్ ఐ లవ్ యూ ర , నా మనసులో ఉన్నది నువ్వే , నన్ను టచ్ చేసే రైట్ నీకు మాత్రమే ఉంది , అందుకే నువ్ ఆ రోజు నన్ను కిస్ చేసిన నిన్ను ఎం అనలేదు
అర్జున్ : హిమ ప్లీస్ మాట్లాడకు ర బ్లడ్ వస్తుంది
హిమ : ప్లీస్ ర నన్ను చెప్పనివ్వు , నువ్ అంటే నాకు చాలా ఇష్టం ర , నిన్ను చూసాక నువ్వే నా లైఫ్ పార్ట్నర్ వి స్ని నా మనసు బలంగా నమ్మింది , నీతో అందమైన జీవితాన్ని ఉహించుకున్న కానీ అవన్నీ నిజం చేసుకునే అదృష్టం నాకు లేదు , నీకు తెలుసా నాకు ఊహ తెలిసాక అమ్మ నాన్న ఇద్దరు కలిసి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి అని ఎన్నో కలలు కన్నాను కానీ అవి కలలు గానే మిగిలిపోయాయి , అలానే నీతో ఉహించుకున్న జీవితం కూడా ఒక అందమైన కల గానే మిగిలిపోతుంది అంటూ ఐ లవ్ యూ అర్జున్ అంటూ అర్జున్ లిప్స్ పైన చిన్నగా కిస్ చేసి స్పృహ కోల్పోతుంది
అర్జున్ : హిమ ని తడుతూ లే హిమ నువ్ అన్నవి అన్ని నిజం అవుతాయి , మనం పెళ్లి చేసుకుందాం హ్యాపీ గా పిల్లల్ని కూడా కందాం ,వాళ్లతో కలిసి నేను అల్లరి చేస్తూ నిన్ను బాగా ఎడిపిస్తుంటా , నువ్ నన్ను బాగా కొడుతూ కంట్రోల్ లో పెట్టు , ప్లీస్ ర కళ్ళు తెరువు అంటూ ఏడుస్తూ వరుణ్ ఫాస్ట్ అంటూ అరుస్తాడు
వరుణ్ : ఫుల్ స్పీడ్ లో కార్ ని హాస్పిటల్ ముందు ఆపుతాడు
ఆల్రెడీ తాన్య కాల్ చేయడం వల్ల తాన్య వాళ్ళ డాడ్ ఇంకొందరు డాక్టర్స్ హాస్పిటల్ బయటే రెడి గా ఉంటారు
తాన్య డాడ్ ఎలా అయినా హిమ ని మీరు కాపాడాలి
తాన్య ఫాదర్ : డోంట్ వర్రీ బేబీ హిమ తల్లి ని కచ్చితంగా కాపాడతాము మా ప్రయత్నాలు అన్ని మేము చేస్తాము మీరు టెన్షన్ పడకండి అంటూ ఫాస్ట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తారు
లోపలికి వెళ్లి ముందు అర్జున్ హిమ చేతిని గట్టిగా పట్టుకుని నుదుటి మీద ముద్దుపెట్టుకుని నువ్ లేకపోతే ఈ అర్జున్ కూడా ఉండడు అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఏడుస్తూ హిమ చేతిని వదిలిపెడతాడు
వర్శిని ఇంటికి రావడం వల్ల హారిక ఎం అయిందో అని వరుణ్ కి కాల్ చేస్తుంది
తాన్య : జరిగింది మొత్తం హారిక కి చెప్తుంది
హారిక వాళ్ళ అన్నయ్య కి కాల్ చేసి ఫాస్ట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్పి వాళ్ళు కూడా హాస్పిటల్ కి వెళ్తారు
సురేష్ గారు హారిక కాల్ చేసి హాస్పిటల్కి రమ్మనడం వల్ల టెన్షన్ పడుతూనే పద్మ ని పిలిచి ఫాస్ట్ గా హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు
అందరూ హాస్పిటల్కి చేరుకున్నాక జరిగింది మొత్తం సురేష్ గారికి చెప్పడం వల్ల సురేష్ గారు కోపంగా పద్మ గారి పైన చేయి చేసుకుంటారు
పద్మ గారు ఏడుస్తూ ప్రకాష్ కి హిమ అంటే ప్రాణం అని తనని పెళ్లిచేసుకోకపోతే చచ్చిపోత అని సూసైడ్ అటెంప్ట్ చేసాడు అని అన్నయ్య ఏడుస్తూ నన్ను మాటివ్వమని అడిగాడు , అంతగా ప్రేమించే మనిషి భర్తగా వస్తే హిమ లైఫ్ బాగుంటుంది అని ఆశతో దానికి ఇష్టం లేదు అని బెదిరించా , అలా చేయమని కూడా ఆ ప్రకాష్ ఏ చెప్పాడు , వాడికి హిమ మీద ఉన్న పుచ్చి ప్రేమతో అలా చెప్పాడు అనుకున్న కానీ పగ తో ఇలా చేసాడు అనుకోలేదు అంటూ ఏడుస్తూ ఉంటారు
సురేష్ గారు పద్మ గారు అలా ఏడుస్తుంటే చూడలేక తనని దగ్గరికి తీసుకుంటారు
ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్ల కింద అహంకారం కోపాలతో దూరం అయిన ప్రేమ ఇప్పుడు కూతురికి ఎం అవుతుందో అనే బాధ భయం వల్ల మళ్ళీ పుట్టింది
చాలాసేపు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ బయటకి వచ్చి కాస్త లేట్ అయిన హోప్స్ వదులుకోవలసి వచ్చేది , నౌ షి ఇస్ అల్రైట్ బట్ తను చాలా డిప్రెస్ గా ఉంది , సో కేర్ఫుల్ గా చూసుకోండి అని చెప్పి తను ఇంకా స్పృహలోకి రాలేదు , సో ఒక్కొక్కరు వెళ్లి తనని డిస్టర్బ్ చేయకుండా చూసి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు
ముందు పద్మ సురేష్ వెళ్లి కన్నీళ్ళతో హిమ ని చూసి బయటకి వస్తారు
తర్వాత వరుణ్ పేరెంట్స్ వర్శిని వెళ్తారు
నెక్స్ట్ వరుణ్ తాన్య వెళ్తారు
లాస్ట్ లో అర్జున్ వెళ్తాడు
బెడ్ పైన స్పృహ లేకుండా అలా పడి ఉన్న హిమ ని చూడగానే అర్జున్ కి కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి , హిమ పక్కన కూర్చుని తన చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుని ఇంత పిచ్చి పని ఎందుకు చేసావే , నువ్ లేకపోతే ఈ అర్జున్ ఎలా ఉంటాడు అనుకున్నావ్ అంటూ హిమ నుదుటి మీద ముద్దు పెడతాడు
అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచి ఐ లవ్ యూ అర్జున్ అని చెప్తుంది
అర్జున్ : ఐ లవ్ యూ టూ ర బట్ నువ్ ఇలా చేసినందుకు నాకు నీ మీద చాలా కోపంగా ఉంది
హిమ : నీ కోపం పోయేదాక నన్ను కొట్టు
అర్జున్ : నిన్ను కొట్టి నేను తట్టుకోగలనా బంగారం అంటూ హకన భుజం పైన తల పెట్టి అప్పటివరకు తను పడ్డ టెన్షన్ అంత పోయేదాక అలానే ఉండిపోయాడు
హిమ అర్జున్ తల నిమురుతూ ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతుంది
కాసేపటికి డాక్టర్ చెక్ చేసి ఇప్పుడిక నో ప్రాబ్లమ్ రెండు రోజుల్లో ఇంటికి తీసుకువెల్లచ్చు అని చెప్తాడు
పద్మ గారు హిమ కి సొరి చెప్తారు
హిమ : పద్మ సురేష్ ఇద్దరిని హూగ్ చేసుకుంటుంది
హారిక గారు ఏడుస్తూ హిమ ని హూగ్ చేసుకుంటుంది
ఆనంద్ గారు హిమ తల నిమిరి ఏడుస్తారు
వరుణ్ తాన్య వర్శిని కూడా హ్యాపీ గా కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉంటారు
వరుణ్ అర్జున్ హిమ ల గురించి సురేష్ గారికి చెప్పడం వల్ల అందరూ హ్యాపీ గా వాళ్ళ ప్రేమకి ఒప్పుకుంటారు
ఆఫ్టర్ సిక్స్ మంత్స్
అర్జున్ శ్రీవాత్సవ్ వెడ్స్ హిమశ్రీ
వరుణ్ వెడ్స్ తాన్య
అనే రెండు పెళ్లిళ్ల కి సంబందించిన పెద్ద పెద్ద బోర్డింగ్స్ తో ఫంక్షన్ హల్ సరౌండింగ్స్ అంత ఫుల్ డెకరేషన్ తో రెడి అయి ఉంటుంది
ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ప్రసాద్ శ్రీవాత్సవ్ గారి ఏకైక కుమారుడు అర్జున్ శ్రీవాత్సవ్ గారి పెళ్లి వేడుకలు మీకోసం అంటూ ప్రెస్ వాళ్ళు లైవ్ ఇస్తూ ఉంటారు
అందరి సమక్షంలో సంప్రదాయబద్దంగా రెండు జంటల పెళ్లిళ్లు చాలా గ్రాండ్ గా జరుగుతాయి
ఆ తర్వాత జరగవలసిన కార్యకమాలు కూడా అన్ని చేసాక రెండు జంటలు అత్తవారింటికి బయల్దేరుతారు
అదే రోజు సాయంత్రం వరుణ్ తాన్య లతో , నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ హిమ లతో వ్రతం రెండు ఇళ్లల్లో వ్రతం చేయించి రెండు జంటలకి ఒజె రోజు శోభనానికి ముహూర్తం పెడతారు
ఫస్ట్ నైట్ రూమ్ లో
హిమ : అర్జున్ మీరు ఇంత గొప్పవాళ్లని నాకెప్పుడూ చెప్పనేలేదు బావ కూడా ఎవరికి చెప్పలేదు , ఇంత ఆస్తి ఉండి అంత బిజినెస్ రన్ చేస్తూ కూడా అందరితో బాగా కలిసిపోయారు మీరు
అర్జున్ : నవ్వుతూ మనిషికి ఆస్తి కాదు బంగారం మనసు ముఖ్యం , స్వచ్ఛమైన ప్రేమ ముఖ్యం
హిమ : హ్మ్ నాకొక డౌబ్ట్ ప్రకాష్ ని ఎం చేసావు
అర్జున్ : నవ్వుతూ ఇంకెప్పుడు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడడు అలా ట్రీట్మెంట్ చేయించాలే పోలీస్ మామలతో
హిమ : అవునా
అర్జున్ : అబ్బా ఇంకా టైం వేస్ట్ ఏంటి అంటూ లైట్ ఆఫ్ చేసి ఇద్దరు ఒక్కటిగా మారిపోతారు
వరుణ్ తాన్య కూడా వాళ్ళ భార్యాభర్తల బంధాన్ని పరిపూర్ణం చేసుకుని ఇద్దరు ఒకటిగా మారి వారి జీవితాల్ని మొదలు పెడతారు
ప్రకాష్ కనీసం లేవడానికి కూడా శక్తి లేక బెడ్ పై పడిపోయి ఉంటాడు
💕💕💕 శుభం 💕💕💕
