కిరణ్ హత్య
కిరణ్ హత్య
ఉదయం త్వరగా ఆఫీస్ కు వెళ్ళాలి అని అలారం సెట్ చేసి పడుకున్నాడు కిరణ్ 35సంవత్సరాలు ఇతను ప్రైవేట్ కంపనీలో వర్క్ చేస్తాడు. ఉదయం 8 గంటలు అవుతుంది అలారం ఇప్పటికే 5 టైంస్ మోగినది అయినా లేవలేదు. అప్పుడే తన తమ్ముడికి రాఖీ కట్టెందుకు వెళ్ళిన తన భార్య ఇంటికి వచ్చింది. తన భార్య ఇంకా పడుకున్నారా లేవండి ఆఫీస్ కు టైం అవుతుంది అంటూ బెడ్ రూమ్ లోకి వస్తుంది కిరణ్ భార్య పేరు రమ్య 33సంవత్సరాలు సూపర్ మార్కెట్ లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేస్తుంది. (కిరణ్, రమ్య వీళ్ళది ప్రేమ వివాహం).
రమ్య ఎంత పిలుస్తున్న కిరణ్ పలకడం లేదు దాంతో రమ్యకు భయం వేసీ కిరణ్ దగ్గరకి వెళ్ళింది. రమ్య తన చేయితో నెడుతూ లేవండి అంటూ పిలుస్తుంది. అయినా కిరణ్ లేవకపోవడంతో గట్టీగా అరుస్తూ ఏడుస్తుంది. ఆ అరుపుకి అక్కడి ఇరుగు పొరుగు వారు అందరు వచ్చరూ అక్కడికి వచ్చిన వారి అందరకు కిరణ్ చనిపోయాడు అని అర్థం అయ్యింది. కాని అక్కడ వున్న ఉదయ్ అనే ఒక వ్యక్తి మాత్రం కిరణ్ చనిపోలేదూ చంపేసారు అంటూ దగ్గరకు వచ్చాడు అది విన్న వారందరు ఆచర్యపోయారూ. అక్కడ వున్న వారందరు నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావ్ అని ఉదయ్ ని అడిగారూ. నేను అలా అనుకోవడం కాదు అదే నిజం అన్నాడు ఉదయ్ అప్పటికే కిరణ్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు.
ఉదయ్ మాటలు విన్న కిరణ్ కుటుంబ సభ్యుల్లో ఒకరు పోలీస్ లకు కాల్ చేసారు. కిరణ్ మెడను ఒక తాడుతో బిగించినట్లు ఉదయ్ గమనించాడు అదె కిరణ్ ఆత్మహత్య చేసుకుంటే అలాంటి మరకలు కనిపిస్తాయి కాని కిరణ్ ఏదో ఒక తాడుకి వేలాడుతూ వుండాలి కదా కాని అతను బెడ్ పైనే పడుకున్నాడూ అని ఆలోచించాడు ఉదయ్ అంతలోనే అక్కడికీ పోలీస్ లు వచ్చేసారు. అక్కడికీ వచ్చిన్న పొలీస్ వారిని కలిసి తను గమనించిన వాటిని వివరించసాగాడు ఉదయ్. ఉదయ్ వివరిచిన వాటి ప్రకారం అక్కడ మొత్తం పరిశీలించారు కాని అక్కడి పరిసరాలలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాని కిరణ్ ని హత్యచేసారు అని పోలీస్ వారు కూడ అర్థం చేసుకున్నారు. పోలీస్ వారు ఆ కుటుంబ సభ్యులతో కంప్లైంట్ తీసుకుని ఫోస్మర్టానికి కిరణ్ బాడీ నీ పంపిచారు. అక్కడికి పంపిన కిరణ్ బాడీ నీ ఫోస్మర్టం చేయడం పూర్తి అయింది. ఫోస్మర్టం రెఫోర్ట్సు ని పరిచీలించి కిరణ్ ని హత్య చేసారు అని నిర్దారిచారు.
ఇంక పోలీస్ వారు F.IR ఫైల్ చేసి కిరణ్ బాడీ ని దాన సంస్కారం చేయడం కోసం వారి కుటుంబ సభ్యులకు బాడీని అందించారు. కిరణ్ కుటుంబ సభ్యులు కిరన్ బాడీ ని తీసుకుని స్మశానానికి వెళ్ళి కిరణ్ దాన సంస్కారాలు పూర్తి చేసారు. ఆ రోజు రాత్రి కిరణ్ కుటుంబ సభ్యులు అందరు బాధలో వున్నరు అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు కిరన్ ని తలుచుకుంటు ఇంట్లోనే బాధ పడుతు వుండిపోయారు. ఆ సంఘటన జరిగిన రెండవ రోజు పోలీస్ వారు కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చారు ఆ కుటుంబ సభ్యలతో సమావేశం అయ్యి కిరణ్ గురించి పూర్తి సమాచారం తీసుకున్నారు. కిరణ్ హత్య కేసు పైన విచారణ చేయడం మొదలుపెట్టారు ఆ ఇరుగు పొరుగు వారిని అందరిని విచారించిన పోలీస్ వారికి తెలిసింది ఒక్కటే కిరణ్ ఎటువంటి గొడవలకు వెళ్ళేవాడు కాదు , అందరితో సానిహిత్యంగా వుండేవాడు, ఇతరులని బాధపెట్టే గుణం కిరణ్ ది కాదు అని తెలుసుకున్నారు. మరి కిరణ్ ని హత్య చేసే అవసరం ఎవరికి వుంది అని పోలీస్ వారు ఆంధోలన చెందుతున్నారు.
పోలీస్ వారు కిరణ్ కుటుంబ సభ్యులని విచారించడం ప్రారంభించారు మొదటగా కిరణ్ తండ్రి గారిని విచారించారు. వారికి ఎటువంటి సమాచారం లభించలేదు. అలాగే కిరణ్ కుటుంబ సభ్యులందరినీ విచారించారు అయిన వారికి ఎటువంటి సమాచారం లభించలేదు. ఇంక పోలీస్ వారికి ఏమి తోచడం లేదు వారు తిరిగివెళ్ళిపోయారు. కిరణ్ ని ఎవరు హత్య చేసి వుంటారో వారి కుటుంబ సభ్యులకి అర్థం అవ్వడం లేదు రోజులు గడిచిపోతున్నాయి కానీ కిరణ్ న్ని ఎవరు హత్య చేసారో ఎవరికి అంతు చిక్కడం లేదు. అలా గంటలు, రోజులు, నెలలు గడిచిపోయాయి పోలీస్ వారు కూడా ఇంక ఆ కేసుని పట్టించుకోవడం మానేసారు.
ఇంక కిరణ్ కుటుంబ సభ్యులు కూడా మెల్ల మెల్లగా మరిచిపోతున్నరు. అందరూ కిరణ్ మరిచిపోయి ఎదావిదిగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు కిరణ్ భార్య సూపర్ మార్కెట్ కి వెళ్లి వచ్చేది. కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న ఊరిలో పొలం పనులు చూసుకుంటున్నరు తన తమ్ముడు ప్రైవేట్ బడిలో టీచ్చర్ గా కొనసాగిస్తున్నడు. ఇలా కొనసాగుతున్న జీవితాల్లో ఒక రోజు సూపర్ మార్కెట్ లో వర్క్ పూర్తి చేసుకుని వస్తున్న రమ్య ఒక 32సం|| వున్న వ్యక్తితో రోడ్డు పై గొడవ పడుతూ కిరణ్ హత్య కేసును విచారించిన ఒక పోలీస్ అధికారికి కనిపించింది కిరణ్ భార్య ఏదో ఆపదలో ఉంది అని ఆ అధికారి తన దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళినా ఆ అధికారి ఏమిటి అమ్మ ప్రాబ్లం ఎవరు ఇతను అని అడిగాడు. ఏమి లేదండి ఇతను నాకు కాబోయే భర్త మేము మరి కొద్ది రోజుల్లో పెళ్ళి చేసుకోబోతున్నాం అని చెప్పింది. రమ్య ఆ పోలీస్ అధికారిని గుర్తు పట్టలేదు ఆ అధికారి కూడ పోలీస్ డ్రేస్ వేసుకోలేదు. కిరణ్ న్ని తన భార్య రమ్య చంపేసిందేమో అని ఆ పోలీస్ అధికారికి మెల్ల మెల్లగా అనుమానం మొదలయ్యింది. సరే అని ఆ అధికారి అక్కడి నుండి వెళ్ళడు అక్కడి నుండి వెళ్ళె దారి లో ( కిరణ్, రమ్య వీళ్ళది ప్రేమ వివాహం కదా రమ్య కిరణ్ ని అప్పుడే ఎలా మరిచి పోయింది మళ్ళి ఎలా పెళ్ళి చేసుకోబోతుంది.) అని అలోచిస్తు వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఆ పోలీస్ అధికారి డ్యూటికీ వెల్లాడు అక్కడి SI అధికారికి రమ్య ను మళ్ళీ విచారించాలి అని కోరాడు అక్కడ జరిగిన సంఘటన గురించి మొత్తం వివరించాడు. అందుకే రమ్య మీద అనుమానం వున్నది అంటు చెప్పాడు. SI సార్ గారు రమ్యను మళ్ళి విచారించేన్దుకు అనుమతి ఇచ్చారు. మరుసటి రోజు విచారణ ప్రారంభించారు రమ్యను పోలీస్ అధికారి కిరణ్ ని చంపింది ఎవరో తెలిసింది నిజం ఒప్పుకొని లొంగిపోన్డి అంటు చెప్పారు.
ఇంక రమ్య నిజం ఒప్పుకుని కిరణ్ ను తన బావ అయిన సూర్య చంపాడు, అతను నేను కలిసి వుండాలి అని కిరణ్ ని చంపాడు అని చెప్పింది. దానితో సూర్యను అరెస్ట్ చేసి కోర్టు లో హాజర్ పరిచారు.
ఈ కథ మీకు నచ్చితే నన్ను సపోర్టు చేయండి.
